Sunday, 10 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని బిజెపికి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలి

:- న్యూస్ 24 తెలుగు ఆగస్టు 24 కాట్రేను కోన తాళ్ళరేవు మండలం మండల పరిధిలోని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ అండ్ అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి గ్రామంలో సామాన్య ప్రజానీకంతో బిజెపి నాయకత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత గురించి, మోడీ అందిస్తున్న అనేకనేక సంక్షేమ పథకాలు గురించి దేశం పట్ల మోడీకి ఉన్న దేశభక్తి అంకితభావం గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా నియమించబడ్డ పివిఎన్ మాధవ్ సారధ్యం పేరుతో తొలిసారిగా ఈ నెల ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు కోనసీమ జిల్లాకు విచ్చేసి అమలాపురంలో జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని వారికి, బిజెపి పార్టీకి, ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని గ్రామస్థులను నానాజీ వెంకటరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మకాయ ఈశ్వరరావు , విజయ్ అజయ్ శ్రీను గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

బిజెపి సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ ల వర్క్ షాప్ నందు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర ప్రశంగం

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ : తెలంగాణ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృస్ట్యా బైరామల్ గూడా లో బిజెపి రాష్ట్ర స్థాయి మీడియా, ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్ లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు బిజెపి రాష్ట్ర, జాతీయ నేతలతో కలిసి ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. ఈ సం దర్భముగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ 👉సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే. 👉సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులు. 👉సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదు. 👉సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. 👉అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు — ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. 👉రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. 👉కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదు. 👉రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. 👉ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ చౌరస్తాలో ఉన్నారు. వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా, మీడియా మీదే ఉంది. 👉గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయి. 👉కానీ “సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయి. 👉స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. 👉అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నాను. 👉ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్బి, జెపి జాతీయ అధికార ప్రతినిధి శ్రీ ప్రేమ్ శుక్ల, గోవా బిజెపి ఐటీ ఇంచార్జి శ్రీ గిరిరాజ్ మాలూ పాయ్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి డా. కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్. ప్రకాష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జి శ్రీ ఎన్.వీ.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాట్సాప్ లొ పెన్షన్ పై ఫిర్యాదు

ఆగస్టు 24 పున్నమి ప్రతినిధి @ ఇకపై పింఛన్ సమస్యల పరిష్కారం కోసం ఒక్క WhatsApp మెసేజ్ చాలు – 95523 00009 నంబర్‌కి “మన మిత్ర” ద్వారా సందేశం పంపాలి పింఛన్ దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ సమస్యలను WhatsApp‌లో మెసేజ్‌ ద్వారా పంపించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. ఈ డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకి చేరతాయి. తర్వాత జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs) లాగిన్‌లో చూసి సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదు పరిష్కారం అయిన వెంటనే సంబంధిత నిర్ధారణ పత్రాలను తిరిగి సిస్టమ్‌లో అప్లోడ్ చేస్తారు. అవి మళ్లీ అభ్యర్థుల WhatsApp‌కి వస్తాయి. దీంతో పింఛన్ దారులు తమ ఫిర్యాదు స్థితి, పరిష్కారం వివరాలు ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. అందువల్ల అధికారులు అన్ని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కొత్త డిజిటల్ సదుపాయం వల్ల పారదర్శకత, వేగవంతమైన సేవలు, ప్రజలకు సౌకర్యం కలుగుతున్నాయి.

అన్నమయ్య

దాదివారిపల్లిలో భారీ చేరికలు – వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి 200 కుటుంబాలు

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని దాదివాండ్లపల్లి గ్రామం ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో లో టీడీపీలోకి భారీ చేరికలు.పసుపుమయం అయిన దాదివారిపల్లి రూపానంద రెడ్డి నేతృత్వంలో టీడీపీలోకి చేరిన 200 కుటుంబాలవైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పిన బొజ్జవారిపల్లి పంచాయతీ దాదివారి పల్లి మరియు వడ్డిపల్లి హరిజనవాడ పలు గ్రామాల ప్రజలు … రూపన్న సారధ్యంలో టీడీపీతో కొత్త రాజకీయ పయనందాదివారిపల్లి టీడీపీకి ఊపందించిన భారీ చేరికలు… రూపానంద రెడ్డి గారి పిలుపునకు స్పందించిన వందలాది కుటుంబాలుబొజ్జవారిపల్లి పంచాయతీ లొ పసుపు పండుగ… రూపన్న పిలుపుతో వైసీపీని వీడి టీడీపీ బాట పట్టిన 200 కుటుంబాలుదాదివారిపల్లి లొ ముక్కా రూపానంద రెడ్డి గారికి గజ మాల వేసి అభిమానం చాటుకున్న ప్రజలు మండలంలోని బొజ్జవారిపల్లి పంచాయతీ,దాదివారిపల్లి గ్రామం నందు నిర్వహించిన విశేషమైన కార్యక్రమంలో 200కు పైగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని టీడీపీలో చేరారు.ఈ కార్యక్రమం రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ శ్రీ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డిఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ముక్కా రూపానంద రెడ్డి గారికి గజమాలవేసి ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు*. పార్టీలోకి చేరిన వారికి పసుపు కండువా కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలు వైఎస్సార్‌సీపీ పాలనపై విసుగెత్తి, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా, ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీనే సరైన వేదికగా గుర్తించి భారీగా ప్రజలు చేరిక అవుతున్నారని.. రాబోయే రోజుల్లో మరెందరో వైసీపీ ను వీడి టీడీపీ లోకి చేరే అవకాశం ఉందని” ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించినముక్కా రూపానంద రెడ్డి గారికి జనం అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.పార్టీ లొ చేరిన వారి వివరాలునందలూరు సుబ్రమణ్యం రెడ్డి అలియాస్ చిట్టి గారి ఆధ్వర్యంలో నందలూరు శ్రీనివాసులరెడ్డి గారు,సింగమాల వెంకట్ రెడ్డి, సింగమాల రామసుబ్బారెడ్డి, సింగమాల సుబ్రహ్మణ్యం రెడ్డి. చిన్నపోలు జయరామిరెడ్డి గారు,నందలూరు నరసింహ రెడ్డి గారు, నందలూరు సుబ్రమణ్యం రెడ్డి గారు, నందలూరు సుబ్బరామిరెడ్డి గారు, నందలూరు వెంకటసుబ్బరెడ్డి గారు, నందలూరు వెంకట రెడ్డి గారు, నంద్యాల వెంకట రెడ్డి గారు, దేశీ నరసింహ రెడ్డి గారు, నందలూరు రాజమోహన్ రెడ్డి గారు నందలూరు సుమంత్ రెడ్డి గారు మరియు ఉప్పులేటి బాల గారు, రాఘవాపురం యాగ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఓబులువారిపల్లి మండలం, బెస్తపల్లి ముక్కా సుబ్రహ్మణ్యం రెడ్డి కార్యక్రమంలో ఇక స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఖమ్మం

అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భముగా..

బిజెపి సీనియర్ జాతీయ నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి వేల అయన గురించి పున్నమి పాఠకులకి తెలియజేయాలనే నా చిన్న ప్రయత్నం… అరుణ్ జైట్లీ వ్యక్తిగత వివరాలు 👉పూర్తి పేరు: అరుణ్ జైట్లీ 👉జననం: 28 డిసెంబర్ 1952, ఢిల్లీ తల్లిదండ్రులు: మహారాజ్ కిషెన్ జైట్లీ (న్యాయవాది), రాణి జైట్లీ భార్య: సంజయ్ జైట్లీ (1979లో వివాహం) పిల్లలు: ఒక కొడుకు, ఒక కూతురు మరణం: 24 ఆగస్టు 2019, న్యూ ఢిల్లీ (క్యాన్సర్ కారణంగా) — 👉విద్యాభ్యాసం పాఠశాల విద్య: సెయింట్ జావియర్స్ స్కూల్, ఢిల్లీ కాలేజీ: శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC), ఢిల్లీ విశ్వవిద్యాలయం – B.Com. లాయర్‌గా: 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి LLB పూర్తి చేశారు. — 👉రాజకీయ & సామాజిక జీవితం విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) యాక్టివ్‌గా పని చేశారు. 1975లో ఏమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా ఉన్నారు; ఆ సమయంలో అరెస్టయ్యారు. — 👉 న్యాయవృత్తి సుప్రీం కోర్ట్, హైకోర్ట్‌లలో ప్రసిద్ధ న్యాయవాది. అనేక ప్రముఖ కేసులు చూసారు. 1990లో అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గా నియమితులయ్యారు. — 🟠 రాజకీయ ప్రస్థానం (BJP లో) 1991లో అధికారికంగా BJP సభ్యుడు అయ్యారు. పార్టీ లో కీలక పదవులు చేపట్టారు. రాజ్యసభకు పలు సార్లు ఎన్నికయ్యారు. — 🟠 కేంద్ర మంత్రిత్వ పదవులు 1. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం (1999–2004) సమాచార ప్రసార మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా 2. నరేంద్ర మోడి ప్రభుత్వం (2014–2019) ఆర్థిక శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి (తాత్కాలికంగా) కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి — 🟠 ముఖ్యమైన సంస్కరణలు & కృషి GST (Goods & Services Tax) ప్రవేశపెట్టడంలో ప్రధాన పాత్ర. 2016 డీమోనిటైజేషన్ సమయంలో కీలక ఆర్థిక మంత్రి. ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్సీ కోడ్ అమలు. ఆర్థిక రంగంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించారు. FDI (Foreign Direct Investment) విధానాల్లో సడలింపులు తీసుకువచ్చారు. — 🟠 వ్యక్తిగత లక్షణాలు అసాధారణ వక్త (Great Orator). BJP లో అత్యంత మేధావి నాయకుల్లో ఒకరు. అన్ని పార్టీలతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి. పార్లమెంట్ లో ప్రశ్నలకు తెలివిగా, చట్టపరమైన పరిజ్ఞానంతో సమాధానాలు చెప్పేవారు. — 🟠 మరణం మరియు గుర్తింపు 2019లో క్యాన్సర్ కారణంగా ఆయన మరణం జరిగింది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజలు ఆయనను స్మరించుకున్నారు. ఆయనను “Reformist Finance Minister” గా భావిస్తారు. — 👉 మొత్తంగా చెప్పాలంటే, అరుణ్ జైట్లీ గారు భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాల్లో శాశ్వత ముద్ర వేసిన నాయకుడు. ఆయన కృషి ముఖ్యంగా GST అమలు మరియు భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు.

సినిమా

బాలయ్య కి అరుదైన గౌరవం

పున్నమి ప్రతినిధి సినీ నటుడు, హిందూపూర్ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ కి అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమ లో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు గాను U K లోని *వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్* ఈ గుర్తింపు తో సత్కరించింది. భారత్ దేశం లో సినీ పరిశ్రమ లో ఈ అవార్డు దక్కించుకున్న మొదటి నటుడు గా బాల కృష్ణ రికార్డ్ సృష్టించారు. ఈ నేల 30 న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమం లో బాలకృష్ణ ని సత్కారించనున్నారు

భక్తి

సంక్రాతి పర్వదిన విశిష్టత

మకర సంక్రాంతి….. భోగి, సంక్రాంతి, కనుమ… సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు 27. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింప బడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింప బడుతుంది. ఇలా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి . సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. రాసులు… 1. మేషము, 2. వృషభము, 3. మిధునము, 4. కర్కాటకము, 5. సింహము, 6. కన్య, 7. తుల, 8. వృశ్చికము, 9. ధనుస్సు 10. మకరము, 11. కుంభము, 12. మీనము. మళ్ళీ సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు.. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు . ఉత్తరాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతి సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు . హిందువులు అంతా పెద్దల నుండి పిల్లలు వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో “సంక్రాంతి” ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్య మాసంలో సూర్యుడు “మకరరాశిలో” ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్రాంతిలో “సం” అంటే మిక్కిలి “క్రాంతి” అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని “సంక్రాంతి” గా పెద్దలు వివరణ చెబుతూ “మకరం” అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ “మకర సంక్రమణం” పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి ‘లేదు’ అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. మొదటి రోజు ‘భోగి ‘ ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, భోగి మంటలు వీసి , కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు. రెండో రోజు ‘మకర సంక్రాంతి’. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభ దినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ… సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృ దేవతలకు తర్పణాలు ఇస్తారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్ తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. మూడో రోజు ‘కనుమ ‘. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలు పంచు కోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి. ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! “సంక్రాంతి” లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు “సంక్రాంతి” నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను “తీర్ధంబిందులలో” తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది “ఇంద్ర ధనుస్సులను” ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే “సంక్రాంతి” పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం. సంక్రాంతి రోజులలొ శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు : సంక్రాంతి నెలపట్టాక కన్నెలు , ముత్తయిదువులు ఎన్నోవ్రతాలు , నోములు నోచుకుంటారు. వాటిలో 1) బొమ్మల నోము… గతం లో ఆడపిల్లలకు చిన్నవయసు లోనే వివాహము చేసేవారు . వారితో ముక్కనుమ నాడు బొమ్మలనోము పేరిట “సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు . ఈ వ్రతాన్ని వరుసగా తొమ్మిదేళ్ళు చేయాల్సివుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం . 2) గొబ్బిగౌరీవ్రతం… ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది . భోగిపండుగనాడు సాయంత్రం నట్టింట్లో ఓ వైపు మండపం కట్టి అలంకరిస్తారు . ఈ కాలము లో దొరికే పండ్లు , కూరగాయలు , చెరకు గడలతొ అలంకరిస్తారు . మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు . భోగి నుండి నాలుగో రోజు ఉద్వాసన పలికి , మండపం లో అలంకరించిన కూరగాయలఓ కూర వండుకుంటారు . దీన్నేగొబ్బి కూర అంటారు. 3) గోదాదేవి నోము… పూ ర్వము గోదాదేవి’ పూర్వఫల్గుణ నక్షత్రం లో, కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణిణ్ణి ఆరాధించినది. ఈమె నెలపెట్టిన రోజు నుండి ధనుర్మాషమంతా ఒక నెలరోజులు వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది. ఈ వ్రతకాలము లో ఆమె గోపికలతో కలిసి పూజించినారు. మనం ఈ నాడు పెట్టే ఆ గొబ్బెమ్మలే గోపికలు. జనవాడుకలో గోపీ బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలవ బడుతున్నాయి. పెళ్ళి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూపాటలు పాడుతూ , ప్రదక్షిణలు చేస్తూ, తాము గోపికలు గా ఊహించుకొని కృష్ణభగవానుణ్ణి మదిలో అర్పిస్తే మంచి భర్త లభిస్తాడనేది ఓ నమ్మకం. సంక్రాంతి దేవతకు ఏడు పేర్లు… ఒక్కో పండుగనాడు ఒక్కో దేవుడిని, దేవతను పూజించడం మన సంప్రదాయం. అలాగె సంక్రాంతి పండుగకూ ఓ అధిష్టాన దేవత వుంది . ఆ దేవి పేరు పండుగ నాటి వారం తో ముడిపడి వుంటుంది . పండుగ.. ఆదివారం వస్తే దేవత పేరు …ఘోర. సోమవారం వస్తే …ధ్వంక్షి, మంగళవారం వస్తే …మహోదరి, బుధవారం వస్తే …మందాకిని, గురువారం వస్తే …మంద, శుక్రవారం వస్తే …మిశ్ర, శనివారం వస్తే దేవత పేరు…రాక్షసి, పండుగ ప్రత్యేకతలు… ముగ్గులు… రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు

ఖమ్మం

ఎర్నెని కి శుభాకాంక్షలు తెలిపిన గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖమ్మం చైర్మన్ గా నియమితులైన ఎర్నెని రామారావు కి బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు

ఖమ్మం

తహసీల్దార్ కార్యలయం ఎదుట ధర్నా, తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత

ఖమ్మం పున్నమి ప్రతినిధి : బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బైకు ర్యాలీగా కొమరం భీం విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మరియు బిజెపి నాయకులు కలిసి ధర్నా నిర్వహించి అనంతరం స్థానిక సమస్యలపై తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్టు ద్వారా తక్షణమే కాలువలు ఏర్పాటు చేసి నీళ్ళు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసినారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా వేరే ప్రాంతాలకి నీళ్లు ఇవ్వటం ఈ అన్యాయం, ఇండ్ల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇవ్వడం వేరే పార్టీ అయితే ఇల్లు ఇవ్వము అని చెప్పటం ఇది సిగ్గుమాలిన చర్య, ఇల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నది, పార్టీల సంబంధం లేకుండా అర్హులైన పేదలందరూ కూడా పక్క గృహాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కేంద్ర ప్రభుత్వం కావలసినంత యూరియా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కూడా, ఇంకా యూరియా సరిపోర్టర్లు లేదంటే కేంద్ర ప్రభుత్వం 50 వేల మెట్రిక్ టన్నుల లో యూరియాని ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి కప్పుపుచ్చుకోవడానికి యూరియా కొరత కేంద్ర ప్రభుత్వమే నేడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం, అర్హులైన అందరికీ పక్కా గృహాలు, పెన్షన్లు రేషన్ కార్డులు వెంటనే అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెల్లూరు కోటేశ్వరరావు డిమాండ్ చేసినారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ బిజెపి జిల్లా అధ్యక్షులతో కలిసి రైతుల పొలాలకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత హామీలతో గద్దెనెక్కినది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, నున్న రమేష్, దుదుకూరు కార్తీక్, మిశ్రా సిరుపరపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, అన్నవరపు సత్యనారాయణ, నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్,భూక్య రాంబాబు, చరణ్, రవి, బిజెపి నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

హైదరాబాద్

రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణకి విశ్లేషకులు చాడ శాస్త్రి కదనం

పున్నమి ప్రతినిధి రాహుల్ గాంధీ బిజెపి ‘ఓట్ చోరీ’ చేసి గెలించింది అంటూ ఒక అబద్ధపు మాట పట్టుకుని తెగ ప్రచారం చేస్తున్నాడు. వేరే వేరు పోలింగ్ బూత్ లలో వేరే వేరే ఊర్లలో లేదా రాష్ట్రాల్లో ఒక ఓటర్ కే ఒకటి కంటే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పడం వరకు తప్పు కాదు, ఇలా జరుగుతోంది అని సామాన్య జనాలకు కూడా దశాబ్దాలుగా తెలుసు. కానీ, ఇది కావాలని EC మరియూ కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి కుమ్మక్కు అయి చేసిన ఫ్రాడ్ అంటూ అంతర్జాతీయ స్థాయిలో తన ముఠా ద్వారా ప్రచారం చేయడం దేశ వ్యవస్థలను అవమానించడం మరియు దేశాన్ని అస్థిర పరచాలనే అంతర్జాతీయ కుట్రలో భాగస్వామ్యం కావడమే. ఓటర్ లిస్ట్ లో తేడాలు అదేదో నిజంగా ఫ్రాడ్ అనే లెవెల్ లో నెహ్రూ కుటుంబ బానిసలు దానికి వీర ప్రచారం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నికల సంఘం పరిస్థితి చూడండి. ప్రధాని ఎవరి పేరు సూచిస్తే వారే ఎన్నికల అధికారి అయ్యేవారు. TN శేషన్ రాక ముందే 1989లో పేరి శాస్త్రి అనే ఎన్నికల కమిషనర్ వచ్చారు. అప్పుడు రాహుల్ నాన్న రాజీవ్ ప్రధాని. పేరి శాస్త్రి కూడా శేషన్ లాగే బాగా ముక్కుసూటి మనిషి. ప్రభుత్వానికి లొంగ లేదు. ఒక్క అధికారికి ప్రభుత్వాన్ని శాసించే అధికారం ఉండటం ఏమిటి? అని భావించిన రాజీవ్ ఈ ఎన్నికల కమిషనర్ అధికారాలకు చెక్ పెట్టడానికి మొదటి సారిగా ఒక ఎన్నికల కమిషనర్ స్థానంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్ పోస్ట్స్ తయారుచేశాడు. అయితే, ఎవరి బాధ్యతలు ఏమిటీ అనేది సరిగా నిర్వచించకపోవడం తో వాళ్ళల్లో వాళ్లకు అభిప్రాయ బేధాలు రావడంతో మళ్ళి 1990లో ముగ్గురు EC లు పద్దతి రద్దు చేసి, మళ్ళీ ఒకే EC గా మార్చారు. 1993లో పివి నర్సింహారావు ప్రధాని గా ఉండగా మళ్ళీ ముగ్గురు EC లను చేశారు. అంటే కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ తో ఎలా అడుకుందో చూడండి. 1990లో శేషన్ ఎన్నికల కమిషనర్ గా రావడం, ఆపై 1993లో ఓటర్ గుర్తింపు కార్డ్ లు రావడం కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ మీద పెద్ద ప్రభావం చూపించాయి. ఇక అసలు ఫోటో ఓటర్ ఐడి కార్డులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఒక ఓటర్ తన గుర్తింపు చూపించుకోడానికి, ఒక ఓటర్ ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండటానికి. ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ప్రవేశపెట్టడానికి 1958లోనే బిల్లు తెచ్చారు కానీ దానిని అమలు చేయలేదు. చివరకు 1993 లో మొదట సారిగా ఓటర్ ఐడి కార్డ్స్ ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఒక ఓటరు దేశంలో వేరే వేరే పోలింగ్ బూత్ లలో పేరు నమోదు చేయించుకుని ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉండేది. అలాగే గుర్తింపు కార్డ్ లేకపోతె ఓటర్ నిజంగా తన ఓట్ వేస్తున్నాడా లేదా ఇతరుల బదులు ఇతను ఓటు వేస్తున్నాడా అనేది కూడా గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ని తప్పు పట్టడం, ఓట్ చోరీ అంటూ రాహుల్ మాట్లాడటం… దేని కోసమో వెళ్తే…ఏదో బయట పడింది .. అని ఒక ముతక సామెత లో చెప్పినట్లుగా.. రాహుల్ బిజెపి మీద చేత్తో బురద జల్లుదామని అనుకుంటే తన నాన్న, నాయనమ్మ ముత్తాత మీద బక్కెట్ల తో పెంట పోయించుకుంటున్నాడు. ఎందుకు? ఎలా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 1993 వరకు అర్హులైన ఓటర్లను గుర్తించడానికి ఓటర్ గుర్తింపు కార్డులు లేవు. అంటే ఎవడి ఓటు ఎవడైనా ఎక్కడైనా వేసేయ్యవచ్చు. అంటే, 1993 వరకు అటువంటి ఓటింగ్ పరిస్థితులు ఉన్న కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ కాలం కేంద్రంలో అధికారం లో ఉన్న నెహ్రూ కుటుంబ కాంగ్రెస్ నిజంగా “ఓట్ చోరీ” లేదా బూత్ క్యాప్చరింగ్ వంటివి చేసి ఎన్నికలు గెలిచారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, 1993లో ఓటర్ ఐడీ కార్డ్స్ పెట్టి ఎన్నికలు కాస్త పద్దతి ప్రకారం జరగడం మొదలు అయిన తరువాత నుండి జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి కనీసం సాధారణ మెజార్టీ కూడా రాలేదు. కాంగ్రెస్ 7 ఎన్నికలలో మెజారిటీని గెలిచింది. తరువాత 1993లో భారతదేశంలో ఓటర్ ID కార్డులు పరిచయం చేయబడ్డాక కాంగ్రెస్ కి స్వంతం గా మెజారిటీ రాలేదు. ఈ డేటా చూడండి: 1952: 364 సీట్లు 1957: 371 సీట్లు 1962: 361 సీట్లు 1967: 283 సీట్లు 1971: 352 సీట్లు 1980: 353 సీట్లు 1984: 404 సీట్లు 1993 తరువాత జరిగిన ఏ ఎన్నికలలోనూ కాంగ్రెస్ మెజారిటీని పొందలేదు: 1996: 140 సీట్లు 1998: 141 సీట్లు 1999: 114 సీట్లు 2004: 145 సీట్లు (UPA కూటమి ద్వారా అధికారంలోకి) 2009: 206 సీట్లు (UPA కూటమి నేతృత్వం) 2014: 44 సీట్లు 2019: 52 సీట్లు 2024: 99 సీట్లు (INDIA కూటమి భాగం) వికి ప్రకారం 1993లో T.N. సేషన్ CEC గా ఓటర్ ID ని పరిచయం చేశాక కాంగ్రెస్ ఎన్నికల రాత మారిపోయింది. 1989లో ప్రాతినిధ్య హక్కుల చట్టంలో సవరణ చేసి బూత్ క్యాప్చరింగ్‌ను నేరంగా ప్రకటించబడింది, 2000 నుండి EVMs పరిచయం బూత్ కేప్చురింగ్ ని మరింత తగ్గించింది. అంటే కాంగ్రెస్ విజయం 1990లో శేషన్ వంటి గట్టి CEC రావడం, 1993 తరువాత ఓటర్ IDలు ప్రవేశపెట్టడంతో ఆగిపోయిందని, ఆపై ఈవీఎంలు పెట్టడంతో మరింత తగ్గిపోవడం వంటి పరిస్థితులు చూస్తుంటే 1993 ముందు ఎన్నికల గెలుపుకు కాంగ్రెస్ అవలంబించిన పద్దతులపై అనుమానాలు రేకెత్తిస్తాయి. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ మేం ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే EVM లను నమ్మం అని పదే పదే గోల చేస్తూ పేపర్ బాలెట్ లు మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టమంటోందో అర్ధం అయిందా? సో మొత్తం మీద రాహుల్ తమ పార్టీ కప్పెట్టెసిన పాత చరిత్ర అంతా తవ్వి బయటకు పోయడానికి ప్రత్యర్ధులకు బాగా సహకరిస్తున్నాడు. కొస మెరుపు: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం కుమ్మక్కు అని రాహుల్ ఆరోపిస్తున్నాడు. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎన్నికల సంఘం ఎప్పుడూ ప్రభుత్వ విభాగం లాగే ఉండి ప్రధాని ఎలా చెప్తే అలా నడిచేది. ఈ మాట వేరే ఎవరో చెప్పలేదు. ఎన్నికల కమిషనర్ గా ఏంతో పేరు తెచ్చుకున్న TN శేషన్ ఈ మాట చెప్పారు ఒకవిడియోలో. ఆయన మాటల్లోనే ‘ అప్పట్లో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ తొత్తుగా ఉండేది. నాకు ఇప్పటికి గుర్తు, నేను కేబినెట్ సెక్రటరీ గా ఉండగా ప్రధాని ఫోన్ చేసి (అంటే రాజీవ్ గాంధీ) ఎన్నికలు ఫలానా లాగా ఫలానా అప్పుడు పెట్టమని ఎన్నికల సంఘానికి చెప్పండి అని చెప్తే, అది పద్దతి కాదు మేం రెడీగా ఉన్నాం ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘానికి చెప్పాలి, ఎన్నికలు ఎప్పుడు ఎలా అనేది ఎన్నికల సంఘం చూసుకుంటుంది” అని చెప్పాను అని శేషన్ చెప్పారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.