Sunday, 10 May 2026

Blog

E-పేపర్

ప్రభుత్వ ఉద్యోగికి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం*

ఇటీవల జరిగిన మెగా డియస్సీ – 2025 నందు ఉమ్మడి కడప జిల్లా స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన ఫలితాలలో పులివెందులకు చెందిన గడ్డం రాజేష్ జిల్లా వ్యాప్తంగా 9వ ర్యాంక్ సాధించి ఉద్యోగానికి అర్హత సాధించాడు.2018 లో జరిగిన డియస్సీ నందు కూడా AP Model స్కూల్ మరియు APSWREIS నందు రెండు TGT ఉద్యోగాలు సంపాదించాడు.ప్రస్తుతం పులివెందుల Dr.బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు TGT – HINDI ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.ఎలాంటి కోచింగ్ లేకుండా తన స్వయంకృషి తో శ్రమించి 2018 మరియు 2025 కలుపుకుని మొత్తంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాలనే అభ్యర్థులకు ఆదర్శంగా నిలిచాడు.

క్రైమ్

రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తి మీద హక్కు మీదే అనే గ్యారెంటీ లేదు.. సుప్రీం కోర్ట్ హెచ్చరిక

ఆగస్టు 24 పున్నమి ప్రతినిధి @ ☛రిజిస్ట్రేషన్‌ అనేది యజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా Mutation తప్పనిసరి అని స్పష్టం చేసింది. ☛రిజిస్ట్రేషన్ అనేది లీగల్ ప్రొసీజర్ మాత్రమే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రమాదం ఎప్పుడు* .➥మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి ముందే ఎవరో కేసు వేసి ఉంటే. ➥పాత యజమానులు పూర్తి పత్రాలు ఇవ్వకపోతే. ➥బ్యాంకు బకాయిలు, లోన్లు క్లియర్ చేయకపోతే ➥లేఅవుట్ అప్రూవల్ లేదా RERA అనుమతి లేకపోతే… రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మీ యజమాన్యం ఎప్పుడైనా సవాల్‌కు గురవుతుంది* . సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ చేసే పని మాత్రమే చేస్తారు. కానీ అసలు యజమాన్యం ఎవరిది అనేది వారు నిర్ణయించలేరు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది యజమాన్యం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది. కొనుగోలు దారులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి ➥టైటిల్ చైన్ (పాత సేల్ డీడ్స్) ➥ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC) ➥మ్యూటేషన్ రికార్డులు (Adangal / 1B) ➥ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేవో ➥మునిసిపల్ / పంచాయతి అనుమతులు, లేఅవుట్ క్లియరెన్స్, RERA రిజిస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ కుంకు మోహన్ రావు..!

వింజమూరు పున్నమి న్యూస్ ఆగస్టు 23 :/// ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని కొండాపురం మండలం గుడవల్లూరు సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన కుంకు మోహన్ రావు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. పదవిని వమ్ము చేయక వన్నె తెస్తానని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

అల్లిక మధు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి అభినందనలు..!

వింజమూరు ,పున్నమి న్యూస్ ఆగస్ట్ 23 :/// కొండాపురం మండలం గరిమెనపెంట సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన అల్లిక మధు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లిక మధు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యత ను వమ్ము చేయక వన్నె తెస్తానని, రైతులకు అండగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.

ప్రకాశం

అంగన్వాడికేంద్రాలను సందర్శించిన సీడీపీఓ ఆషాబేగం.

వెలిగండ్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలు అంగన్వాడి కేంద్రాలను శనివారం నాడు నూతన సిడిపిఓ షేక్ ఆషాబేగం సందర్శించడం జరిగినది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు సమయపాలన పాటించాలని లబ్ధిదారుల సమాచారమును రిజిస్టర్లో నమోదు చేయాలని ప్రతిరోజు కేంద్ర సమాచారమును ఆన్లైన్లో ,మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయవలెనని సూచించారు. ముఖ్యంగా పిల్లల యొక్క పెరుగుదల పర్యవేక్షణ పై దృష్టి సారించాలని వారి పోషణ ఆరోగ్యము ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ పై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాలల యొక్క పెరుగుదల పై దృష్టి సారించాలని ఆదేశించారు . కేంద్రంలో అంగన్వాడి కార్యకర్తలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే చర్యలు తప్పు అని హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రములు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు .

క్రైమ్

వాట్సాప్లో పెళ్లి పిలుపు.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! కొత్త స్కామ్తో జాగ్రత్త!

ఆగస్టు 24 పున్నమి ప్రతినిధి @ వాట్సాప్లో పెళ్లి పిలుపు.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! కొత్త స్కామ్తో జాగ్రత్త! ఢిల్లీ: టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పంథాల్లో రెచ్చిపోతున్నారు. వివాహ శుభలేఖ పంపినట్లు నమ్మించి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ఓ కొత్త తరహా మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి మోసంలో చిక్కుకొని ఏకంగా రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సైబర్ మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది. “ఆగస్టు 30న మా వివాహం, తప్పకుండా రండి. ఆనందం అనే గేట్లు తెరిచే తాళం ప్రేమే” అంటూ ఆకర్షణీయమైన మాటలతో పాటు ఓ ఫైల్ను జతచేశారు. దాన్ని పెళ్లి పత్రిక అనుకుని భావించిన బాధితుడు ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేశాడు. అది ప్రమాదకరమైన ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్ కావడంతో, అది ఫోన్లో ఇన్స్టాల్ అయింది. వెంటనే సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోన్లోని గ్యాలరీ, కాంటాక్టులు, బ్యాంకు యాప్ వివరాలను సేకరించి, క్షణాల్లో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.90 లక్షలను వేరే ఖాతాకు బదిలీ చేసేశారు. డబ్బులు పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే హింగోలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. గత ఏడాది నుంచి ఇలాంటి ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్లు’ ఎక్కువయ్యాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. పీడీఎఫ్ ఫైల్స్ మాదిరిగా కనిపించేలా ఏపీకే ఫైల్స్ను పంపి, వాటిని డౌన్లోడ్ చేయగానే ఫోన్ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా డబ్బులు దొంగిలించడం లేదా వ్యక్తిగత సమాచారంతో బ్లాక్మెయిల్కు పాల్పడే ప్రమాదం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫైల్సు, ముఖ్యంగా ‘.apk’ ఎక్స్టెన్షన్ తో ఉన్నవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. లి సందేశం తెలిసిన వారి నుంచి వచ్చినా, ఫైల్ డౌన్లోడ్ చేసే ముందు వారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం సురక్షితం. ఏదైనా ఫైల్ను డౌన్లోడ్ చేసేటప్పుడు ఫోన్లో “ప్రమాదకరమైన ఫైల్” అని హెచ్చరిక వస్తే, వెంటనే ఆ ప్రక్రియను ఆపేయాలి. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఖమ్మం

కేంద్రం ఇచ్చిన యూరియా ని దోచుకుంది ఎవరు….

ఖమ్మం పున్నమి ప్రతినిధి 👉రైతులు పడుతున్న యూరియా కష్టాలు మీద మండల తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చిన బిజెపి బృందం 👉పాల్గొన్న నంబూరి రామలింగేశ్వరావ్ సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణంలో యూరియా కొరతపై రైతులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.కల్లూరు మండల అధ్యక్షుడు గుమ్మా రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలవేసి బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా యూరియా కొరత లేనిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు? 2024 వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే కేంద్రం 12. 89 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వినియోగించిన యూరియా 9.66 లక్షల మెట్రిక్ టన్నులు అంటే రాష్ట్రంలో మిగులు యూరియా 3.23 లక్షల టన్నులు. 2024 డిసెంబర్ వేసంగి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 3.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత ప్రాంతల మాదిరిగానే 5.04 లక్షల టన్నుల యూరియా అందించింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిన యూరియా కేవలం 1.28 లక్షల మెట్రిక్ టన్నులు, ఏ ప్రకారం చూసిన 2024లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు యూరియా 6.99 లక్షల మెట్రిక్ టన్నులు,అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి. 2025 జనవరి నుండి మార్చి వరకు మరో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి.కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెబుతుంది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడుంది, ఎవరి వద్ద ఉంది అన్నది దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించి రైతులకు తగినంత యూరియా అందించవలసిందిగా కోరారు. లేని పక్షాన నష్టపోయిన ప్రతి ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం ప్రబారి కుమిలి శ్రీనివాస్ తుమ్మలపూడి పుల్లారావు మండల వెంకటరామిరెడ్డి చాలా అప్పారావు పసుపులేటి సుబ్బారావు గురి వెంకటరామయ్య కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆనంది నరసింహారావు రంగు రవి వంగల శ్రీనివాసరావు జరకల నాగులు కల్లేపల్లి భీమరాజు కృష్ణ రెడ్డి వినయ్ వెంకటేశ్వరరావు చాట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

పున్నమి: నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు!

TG: వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన PAC భేటీలో మెజార్టీ సభ్యులు ఎన్నికలకు వెళ్లామనే అభిప్రాయం వ్యక్తం చేయగా, CM వారి సూచనలతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే కోర్టును కోరాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీపరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని PAC భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.

అన్నమయ్య

కాంట్రాక్టర్లకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం: అరవ శ్రీధర్

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అన్నారు:“జగన్ పాలనలో కాంట్రాక్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అప్పటివరకు కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులను నిలిపివేయడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ల హక్కుల కోసం పోరాడారు, కోర్టు వరకు వెళ్లారు. అయినప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లకు నష్టం కలిగింది.కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులను విడుదల చేశారు. ఇది కాంట్రాక్టర్లకు ఊరట కలిగించిన చారిత్రక నిర్ణయం. మా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కోడూరు అభివృద్ధి కోసం, ప్రతి కాంట్రాక్టర్‌కు న్యాయం జరగడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ – “చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ వల్లే మాకు న్యాయం జరిగింది. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల కావడం మా కుటుంబాలకు ఊరట కలిగించింది” అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు

E-పేపర్

బయాలజీ సైన్స్ టీచర్ ఏర్పాటు చేయాలని హెచ్ఎమ్ కు వినతి పత్రం

ఈనెల 25న ధర్నా చేయనున్నట్లు తెలిపిన ఎస్ఎంసి సభ్యులు చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం నాగులవెల్లటూరు బి ఎస్ ఆర్ ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా బయాలజికల్ సైన్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హెచ్ ఎం, ఎమ్ ఈ ఓ,డి ఈ ఓ అధికారులకు పలు మార్లు వినతులు చేసినా చర్యలు లేకపోవడంతో తల్లిదండ్రులు, ఎస్ ఎంసి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ పెద్దల సహకారంతో పాఠశాల అభివృద్ధికి సుమారు 4 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఉపాధ్యాయ నియామకం జరగకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 25న పాఠశాలను మూసివేసి ధర్నా నిర్వహించనున్నట్లు పాఠశాల హెచ్ఎం కు ఈ రోజు వినతిపత్రం అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.