Sunday, 10 May 2026

Blog

పల్నాడు

ఒంగోలులో జరిగే సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలకు తరలివెళ్లిన నాయకులు

సిపిఐ రాష్ట్ర మహాసభకు తరలి వెళ్లిన నాయకులు కారంపూడి,ఆగస్టు 23(పున్నమి ప్రతినిధి). ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలకు మాచర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి సిపిఐ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు కార్మికులు రైతు సంఘం నాయకులు భారీ స్థాయిలో శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు కూలీల సమస్యలు ధరల పెరుగుదల విద్యా ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ బాధ్యత మహాసభలో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం యువతను పార్టీలోకి పెద్ద ఎత్తున తీసుకురావడం వంటి అంశాలను గురించి మాట్లాడుతామన్నారు మహాసభకు వెళ్ళిన వారిలో కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా, సహాయ కార్యదర్శి మేకపోతు చినుకోటిరెడ్డి దుర్గి మండల కార్యదర్శి కాల శివయ్య, మాచల పట్టణ కార్యదర్శి మిద్దె పోగు బాబురావు, రెంటచింతల మండల కార్యదర్శి కేతావత్తు రంగనాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు రంగస్వామి శ్రీపతి సత్యనారాయణ నాగసుబ్బయ్య వెంకటాచారి బ్రహ్మచారి పార్వతయ్య, గాలం శ్రీనివాసరావు వెళ్లారు

పల్నాడు

ఒంగోలులో జరిగే సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలకు తరలివెళ్లిన నాయకులు

సిపిఐ రాష్ట్ర మహాసభకు తరలి వెళ్లిన నాయకులు కారంపూడి,ఆగస్టు 23(పున్నమి ప్రతినిధి). ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలకు మాచర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి సిపిఐ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు కార్మికులు రైతు సంఘం నాయకులు భారీ స్థాయిలో శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు కూలీల సమస్యలు ధరల పెరుగుదల విద్యా ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ బాధ్యత మహాసభలో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం యువతను పార్టీలోకి పెద్ద ఎత్తున తీసుకురావడం వంటి అంశాలను గురించి మాట్లాడుతామన్నారు మహాసభకు వెళ్ళిన వారిలో కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా, సహాయ కార్యదర్శి మేకపోతు చినుకోటిరెడ్డి దుర్గి మండల కార్యదర్శి కాల శివయ్య, మాచల పట్టణ కార్యదర్శి మిద్దె పోగు బాబురావు, రెంటచింతల మండల కార్యదర్శి కేతావత్తు రంగనాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు రంగస్వామి శ్రీపతి సత్యనారాయణ నాగసుబ్బయ్య వెంకటాచారి బ్రహ్మచారి పార్వతయ్య, గాలం శ్రీనివాసరావు వెళ్లారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ

ఈ రోజు సీతారాంపురం మండలం లో జరిగిన స్వచ్చ దివాస్ కార్యక్రమం లో MPDO, M. సాయి ప్రసాద్ గారు పాల్గొని, స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి వర్షా కాలం లో వచ్చే అనారోగ్య సమస్య లు జాగ్రత్త లు గురించి అవగాహన కల్పించారు. తరువాత డ్రైన్స్ క్లీనింగ్ ను పరిశీలన చేసి తగు సూచనలు జారీ చేశారు. Mpdo సీతారాంపురం.సీతారాంపురం మం.ప్ర.ప. కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి M. సాయి ప్రసాద్ వారి ఆధ్వర్యంలో, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు జరిగినది.

అన్నమయ్య

వికలాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు – సిఐటియు డిమాండ్

అన్నమయ్య జిల్లా, ఆగస్టు 23 : అర్హులైన వికలాంగుల పింఛన్లు రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి పి. జాన్ ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల మండల కన్వీనర్ కర్రతోటి హరి నారాయణ డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు సిఐటియు ఆఫీసులో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.నిజమైన వికలాంగులకు పింఛన్లు రద్దు చేస్తూ నోటీసులు ఇవ్వడం తీవ్ర అన్యాయమని, ఎవరూ అనర్హులు కాకపోయినా నోటీసులు అందినట్లు తెలిపారు. గ్రామ సచివాలయంలోనే నిజమైన అనర్హులను గుర్తించి వారికి మాత్రమే చర్యలు తీసుకోవాలని, తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.40 శాతం అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే కాకుండా, 30 శాతం అంగవైకల్యం కలిగిన నిరుద్యోగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పింఛన్లు కేంద్రం లేదా రాష్ట్ర దయాదక్షిణాల వల్ల రాలేదని, వికలాంగుల పోరాట ఫలితమేనని గుర్తుచేశారు. దాదాపు లక్షమందికి నోటీసులు జారీ చేయడం వల్ల వికలాంగులు భయభ్రాంతులకు గురై ఆత్మహత్యల వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన వారికి పెన్షన్ కొనసాగించాలనే విషయం ప్రభుత్వానికి గుర్తు చేశారు. సెప్టెంబర్ నుండి అన్ని అర్హులైన వికలాంగులకు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విభిన్న ప్రతిభావంతుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

క్రైమ్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @ వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష వీఆర్వో కి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గాలి పాలెంలో భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని గాలి పాలెం గ్రామంలో భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆగస్టు 22వ తేదీ శుక్రవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు మూడు రోజులపాటు ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.మొదటి రోజు శుక్రవారం శ్రీశ్రీశ్రీ సద్గురు శ్రీపాద చిన్న వెంకయ్యస్వామి వారిచే ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, మెలకోలుపు సేవలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 23న మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి భజనోత్సవం కార్యక్రమాలు ఉన్నాయి. ఆగస్టు 24న ఆదివారం ఉదయం 8 గంటలకు బ్రాహ్మణక్రాక శ్రీహరి బృందం (జలదంకి, కావలి) వారిచే కోలాటభజన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు శ్రీశ్రీశ్రీ సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్యస్వామి వారిచే అభిషేకం, పల్లకీసేవ నిర్వహించబడింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణం జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, తేరు ఉత్సవం భక్తుల సందడితో ఘనంగా నిర్వహించబడింది. రాత్రి 8 గంటలకు మరోసారి అన్నసంతర్పణం, అనంతరం నెల్లూరుకు చెందిన “శ్రీ కళాంజలి ఆర్కెస్ట్రా & ఈవెంట్స్” ఆధ్వర్యంలో సంగీత విభావరి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో యం.జి. దివ్య పావని (నవరస కూచిపూడి నాట్య కళాక్షేత్రం) నాట్య ప్రదర్శనలు, అలాగే నెల్లూరు జాదూగర్ శ్రీనివాస్ గారి మ్యాజిక్ షో ప్రదర్శన ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఖాతాల్లో రూ.18 వేలు!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ పీఎం కిసాన్ పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. 12వ విడత నుంచి ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులకు మరో అవకాశం కల్పించింది. రైతులు ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేస్తే 12వ విడత నుంచి 20వ విడత వరకు రూ.18 వేలు పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే, ఆగిపోయిన అన్ని వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్ నాథ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తగ్గు ముఖం పట్టిన గోదావరి, కృష్ణా నదులు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ భద్రాచలం వద్ద ప్రస్తుతం 39.5అడుగుల నీటిమట్టం కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు పోలవరం వద్ద 12.65 మీటర్లు ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులు కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులు పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.91 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కలు మొదటి హెచ్చరిక ఉపసంహరణ వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తు నిర్వహణ సంస్థ

బిజినెస్

భారతదేశంలోనే అత్యంత సంపన్న కలిగిన ముఖ్యమంత్రులు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ భారతదేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు… సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లు… రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు… తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా మమతాబెనర్జి ప.బెంగాల్. సీఎం మమత ఆస్తుల విలువ రూ.15 లక్షలు… దేశంలోని 31మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు… అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఇది పరిస్థితి

పున్నమి Daily న్యూస్ T.Ravinder ప్రతినిథి: ఖమ్మం ఖమ్మం జిల్లాలో ఇది పరిస్థితి * ఖమ్మం నగరం విస్తరిస్తున్న కొద్దీ గృహ సముదాయాలు తదితరాల నుంచి వెలువడే కలుషిత నీరంతా ధంసలాపురం చెరువులో కి చేరుతోంది. ఒకప్పుడు 400 ఎకరాలకు సాగు మూగజీవాలకు తాగునీరు అందించే ప్రధాన చెరువు. ఇప్పుడు మురుగు కోపంగా తయారయింది. చెరువులోకి హానికరమైన రసాయనాలు చేరడంతో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే స్థానికులు ఆ దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందుల పాలు అవుతున్నారు. అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.