Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ప్రెగ్నెన్సీ రోబో!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో చైనా మరో అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీసింది. కృత్రిమ గర్భాశయంతో కూడిన హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను 2026 నాటికి విడుదల చేయనున్నట్లు కైవా టెక్నాలజీ సంస్థ ప్రకటించి, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రెగ్నెన్సీ రోబో అంటే ఏమిటి? ఈ ప్రెగ్నెన్సీ రోబో ఒక హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో, దీనిలో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ గర్భాశయం మనిషి గర్భాశయం మాదిరిగానే పనిచేస్తుంది. దీనిలో ఒక పిండాన్ని ప్రవేశపెట్టి, నవమాసాలు బిడ్డ ఎదిగేందుకు అవసరమైన పోషకాలను, వాతావరణాన్ని అందిస్తుంది. ఇది గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు మొత్తం ప్రక్రియను స్వయంచాలకంగా నిర్వహిస్తుంది. ఎందుకు ఈ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఒక కొత్త ఆశను అందిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సరోగసి (అద్దె గర్భం) చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు కొన్ని దేశాల్లో చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ రోబోతో ఆ సమస్యలు ఉండవు. కైవా టెక్నాలజీ ఈ రోబో ధరను సుమారు 1 లక్ష యువాన్లు (సుమారు రూ. 12 లక్షలు) ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్

లోకేష్ మాటతో నిరుద్యోగులకు ఏటా పండుగే!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి (విద్య) శాఖ మంత్రి అటు రాజకీయాలతో పాటు ఇటు పాలనలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తనదైన శైలి ప్రతిభతో కేంద్రం నుంచి ఏపీకి లెక్కలేనన్ని నిధులు విడుదలయ్యేలా చేయడంతో పాటుగా తన పరిధిలోని శాఖలకు అదనపు నిధులు కూడా రాబట్టారు. ఏపీ విద్యా శాఖను దేశానికి రోల్ మోడల్ చేసే దిశగా సాగుతున్న లోకేష్… శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ ప్రకటించిన లోకేశ్… ఆ ప్రక్రియను త్వరలోనే ముగించనున్నారు. అంటే అతి త్వరలో ఏపీ విద్యా శాఖకు అదనంగా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏటా రిటైరయ్యే ఉపాధ్యాయుల కారణంగా ఏర్పడే ఖాళీలు, కొత్తగా ఉత్పన్నమయ్యే పోస్టులతో కలిపి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు. ఏటా డీఎస్సీ విడుదలకు గల కారణాలను కూడా లోకేష్ విస్పష్టంగా చెప్పారు. ఏపీ విద్యా వ్యవస్థను దేశానికే తలమానికంగా నిలబెట్టేలా చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే విద్యా శాఖలో సంస్కరణలను మొదలుపెట్టామని లోకేష్ చెప్పారు. సంస్కరణలు ముందుకు సాగాలంటే మానవ వనరుల తోడ్పాటు, వాటికి మరింతగా పెంపొందించుకోకపోతే ఎలా సాధ్యపడుతుందని కూడా ఆయన ప్రశ్నించారు. సర్కారీ విద్యలో మౌలిక వసతులను మెరుగుపరుస్తూనే… మరో వైపు మానవ వనరులను కూడా పెంచుతామని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా నాడు నేడు అంటూ మౌలిక వసతుల కల్పనపైనే దృష్టి సారించారు. అంతేకాకుండా ఆయా అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యతను అరకొరగా ఉన్న ఉపాధ్యాయులకే అప్పగించారు. అసలే టీచర్ల కొరత ఉంటే… బోధనతో పాటు ఈ పనులు చేసేదెలా అని నెత్తీనోరు బాదుకున్నారు. మరోవైపు ఐదేళ్లలో జగన్ ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు. మానవ వనరుల అభివృద్ధి లేకుండా సంస్కరణల అమలు సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గ్రహించలేకపోతే… లోకేష్ మాత్రం లోతైన అధ్యయనంతో పక్కా పకడ్బందీ చర్యలతో ముందుకు సాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన ఏపీకి చెందిన డీఎస్పీ హర్షిత

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ఏపీకి చెందిన డీఎస్పీ హర్షిత యూరప్ లోనే అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని (5,642 మీటర్లు) అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆమెను హోంమంత్రి అనిత అభినందించారు. డీఎస్పీ హర్షిత సాధించిన విజయం పోలీస్ యూనిఫామ్లో ఉన్న ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకమన్నారు. దృఢ సంకల్పం, నిరంతర కృషి, అసమాన పట్టుదలతో ఆమె ఈ విజయం సాధించారని అనిత అన్నారు.

తెలంగాణ

ఆర్వో వాటర్ ప్రారంభించిన :ఎంపీ, ఎమ్మెల్యే

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో రోగుల కోసం ఇప్పటివరకు కూడా పరిశుభ్రమైన వాటర్ లేక ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడ్డారు. వారికై ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కృషి చేసి, ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించి, ఈరోజు ఆర్వో వాటర్ ప్లాంట్ ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి 95% పూర్తి అయినదని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తిరుమల: శ్రీవాణి టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ▪️ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లు, ఆఫ్‌లైన్‌లో 1000 టిక్కెట్లు జారీ. ▪️ఆన్‌లైన్‌లో మూడు నెలలు ముందుగా జారీ చేస్తున్న టీటీడీ. ఆఫ్‌లైన్‌లో ఏ రోజుకు ఆ రోజే జారీ చేస్తున్న టీటీడీ. ▪️ఆఫ్‌లైన్‌ టిక్కెట్లకు డిమాండ్ ఉండటంతో గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్న భక్తులు. ▪️ఆఫ్‌లైన్‌ కోటాను కూడా ఏ రోజుకు ఆ రోజే ఆన్‌లైన్‌లో జారీ చేసే యోచనలో టీటీడీ..

E-పేపర్

శ్వాస ఉన్నంతవరకు పేదలకు సేవలోనే..

-జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు ఖారీ అబ్దుల్ సుభాన్ సిద్దవటం ఆగస్టు ( పున్నమి ప్రతినిధి ) ప్రతి మనిషి జీవితంలో భక్తి భావం పెంపొందించుకొని దానం చేసే గుణం అలవర్చుకోవాలని, దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ చైర్మన్ ఖారీ అబ్దుల్ సుబాహన్ అన్నారు.శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటపల్లి క్రాస్ రోడ్డులో వద్ద ఉన్న మదరసాలో జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ ఖారీ అబ్దుల్ సుబహాన్ మసీదుల్లో పనిచేసే ఇమాములు,మౌజన్లు, నిరుపేదలకు కులమతాలకు అతీతంగా పింఛన్లను పంపిణీ చేశారు. తన శ్వాస ఉన్నంతవరకు సంస్థ తరఫున పేదలకు సాయం అందిస్తూనే ఉంటామని అబ్దుల్ సుబాహాన్ తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకే ఆయుర్వేద వైద్యశాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

ఖమ్మం

స్థంబాద్రి కో ఆపరేటివ్ బ్యాంకు కో అప్సన్ సభ్యునిగా గల్లా

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నియమితులు ఐయ్యారు. వీరి నియామకం పట్ల కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఎల్లా రావు గౌడ్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, డీకొండ శ్యామ్. భూక్యా శ్యామ్, చావా కిరణ్ లు హర్షం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ శాఖ తాజాగా ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ GSWS శాఖ ముందస్తు సమాచారం లేకుండా డిప్యూటేషన్ లేదా OD (Other Duty)లో పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే వారి అసలు గ్రామ/వార్డు సచివాలయాలకు తిరిగి పంపాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ శాఖ తాజాగా ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ సిబ్బందిని ప్రమోషన్లు ఇవ్వడం, ఇతర శాఖలకు డిప్యూటేషన్లు లేదా OD (Other Duty) కేటాయించడం వంటి అంశాల్లో ఇకపై తప్పనిసరిగా GSWS శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. డైరెక్టర్ ఎం.శివ ప్రసాద్, IFS జారీ చేసిన లేఖలో, అనుమతి లేకుండా డిప్యూటేషన్ లేదా ODలో ఉన్న సిబ్బందిని వెంటనే వారి అసలు సచివాలయాలకు తిరిగి పంపాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా శాఖాధిపతులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు HRMS పోర్టల్‌లో డిజిటల్ వర్క్‌ఫ్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రమోషన్‌లు, డిప్యూటేషన్‌లు, ODలు వంటి ప్రతీ అభ్యర్థన GSWS శాఖ అనుమతి పొందిన తర్వాతే అమలు చేయబడుతుంది. ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది: GSWS శాఖ అనుమతి లేకుండా ఎటువంటి మార్పులు జరగరాదు. ఇది సిబ్బంది నియామకాలు, బదిలీలు, ప్రమోషన్‌లలో పారదర్శకతను కాపాడడమే లక్ష్యంగా జారీ చేసిన ఆదేశమని తెలిపారు.

ఖమ్మం

మొదలైన వినాయక చవితి పండుగ హడావిడి

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి భాద్రపద మాసము వచ్చింది అంటే వచ్చే ప్రధాన పండుగ వినాయక చవితి. ఖమ్మం నగరం లో వినాయక చవితి హడావిడి శనివారం నుండి ప్రారంభం అయింది. వినాయక మండపలు ని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.. గణ నాధుని యొక్క విగ్రహాలు ని కూడా కొనుగోలు చేసి మండపల దగ్గర కి తరలిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం నగరం లో ఈ సారి భారీ స్థాయి లో వినాయక మండపలు ఏర్పాటు కానునున్నాయి. 27 వ ఆగష్టు బుధవారం నుండి ప్రారంభం అయ్యే చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 6 వ తేదీ శనివారం తో ముగుస్తాయి అని ఖమ్మం నగర గణేష్ ఉత్సవ కమిటి బాద్యులు లాహోటి, జైపాల్ రెడ్డి, గెంటల విద్యాసాగర్ లు తెలిపారు. అనుమతి తీసుకోవడం తప్పని సరి అని, ప్రశాంత వాతావరణం లో ఉత్సవాలు జరుపుకోవాలని నగర పోలీస్ లు కోరుతున్నారూ.

ఖమ్మం

ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి

పున్నమి Daily న్యూస్ T.Ravinder ప్రతినిథి: ఖమ్మం ఈ రోజున 23-08-2025 57వ భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ గౌడ్ ప్రజాసేవయే పరమావధిగా డివిజన్ పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల తెలుసుకుంటూ తనతోపాటు 112 వ పోలింగ్ బూత్ అధ్యక్షులు అబ్బురి సతీష్ తో కలిసి డివిజన్లోని వాటర్ పైపు లీకేజ్ చేతి బోరింగ్ పంపు మరియు సిసి రోడ్డు నిర్మాణం గురించి కార్పొరేషన్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 57వ డివిజన్ స్థానికులు పోలింగ్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.