Sunday, 10 May 2026

Blog

తిరుపతి

ఆధ్యాత్మిక తిరుపతి మహా నగరంలో ప్రాత హ్ కాల సంకీర్తన లు

తిరుపతి, తిరుచానూరు లో ప్రాత కాల సంకీర్తన లతో పుణ్య, పర్య దినాలలో ఆధ్యాత్మిక వెల్లి విరుస్తుంది… ఈ కార్యాక్రమం లో తిరుపతి భజన బృందాలు, కోలాటం, డప్పులు, వాద్యా, తప్పేట్లు తాళలా తో ఉదయం 5గంటల నుండి 7గంటల వరకు తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా వున్న శ్రీ ప్రసన్న భక్తంజనేయస్వామి గుడి నుండి బయలుదేరి.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మీదుగా , పచ్చిమ మాడ వీధి, గాంధీ రోడ్, సున్నప వీధి, బండ్ల వీధి, శ్రీ. గోవింద రాజస్వామి తెరు వీధి లలో సంకీర్తన,కోలాట, భజనలతో లతో శ్రీ గోవిందా రాజస్వామి దేవాలయ దర్శనం తో ముగుస్తున్నది.. ఈ కార్యా క్రమం ను రాయలసీమ రంగస్థలి కళాకారులబృంద సభ్యులు శ్రీ గుండాల గోపినాథ్ రెడ్డి, అత్తూరు వాసు దేవరెడ్డి, మేకల గంగయ్య, పొన్నాల జేజి రెడ్డి, నృత్య, గాన కళాకారులూ శ్రీ మునెప్పగారి మునినాద రెడ్డి, సుశీల, వాసు, తొందమనాటి సుబ్రహ్మణ్యం, శారదా, సుజాత, టాగూర్, సుజిత్, సుదర్శన్, శ్రీమన్నారాయణ, వరదారెడ్డి, సుధా, చిత్రపు మోహన్రావు, పాల్గొన్నారు

E-పేపర్

రాజంపేట టిడిపి ఇన్చార్జికి ఘన సన్మానం

– ఘనంగా సన్మానించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్దవటం ఆగస్టు 22 అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమింపబడ్డ నేపథ్యంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం జగన్మోహన్ రాజుకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రాజు అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో టిడిపి అధిష్టానం ఆయన సేవలను గుర్తించి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని రామయ్య కొనియాడారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

E-పేపర్

రాజంపేట టిడిపి ఇన్చార్జికి ఘన సన్మానం

– ఘనంగా సన్మానించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్దవటం ఆగస్టు 22 అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమింపబడ్డ నేపథ్యంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం జగన్మోహన్ రాజుకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రాజు అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో టిడిపి అధిష్టానం ఆయన సేవలను గుర్తించి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని రామయ్య కొనియాడారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు విడుదల చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ కానున్నాయి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

అన్నమయ్య

చిట్వేల్ పోలీస్ క్వార్టర్స్ వద్ద చెత్త దిబ్బలు – అధికారులు పట్టించుకోని పరిస్థితి, ప్రజలకు ఇబ్బందులు

అన్నమయ్య జిల్లా చిట్వేల్ టౌన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద చెత్త దిబ్బలు పేరుకుపోయి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పక్కనే ఆటోస్టాండ్ ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ఆ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అక్కడి చెత్త కారణంగా తీవ్రమైన దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానికులు చెబుతూ – “నిత్యం ఆటోలు అక్కడి నుండి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఈ దారిన వెళ్లాల్సి వస్తుంది. చెత్త దిబ్బల వాసన తట్టుకోలేనంతగా ఉంది. పైగా వర్షాలు పడితే నీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ – “ఇలాంటి ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతే దోమలు, ఈగలు విపరీతంగా పెరుగుతాయి. వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు, నిల్వ నీటితో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది” అని చెబుతున్నారు. చాలా రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నా పంచాయతీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రజల డిమాండ్ ఒక్కటే – వెంటనే చెత్త తొలగించి, ఆ ప్రాంతంలో క్రమం తప్పకుండా శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చివరగా ప్రజల ప్రశ్న: “పోలీస్ క్వార్టర్స్ పక్కనే ఇలా చెత్త దిబ్బలు పేరుకుపోయినా అధికారులు పట్టించుకోకపోతే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?”

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన, చల్లా అండ్ కోడూరు బ్రదర్స్,.!

వింజమూరు పున్నమి న్యూస్ ప్రతినిధి ://// ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు శుక్రవారం రాత్రి నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు, సభ్యులు, జాబితా లో వింజమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, గని శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి సహకారంతో ఎన్నికైనందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసి, శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, యారవ కృష్ణయ్య నాయుడు, చల్లా శ్రీనివాసులు యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, రామ్మోహన్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన, చల్లా అండ్ కోడూరు బ్రదర్స్,.!

వింజమూరు పున్నమి న్యూస్ ప్రతినిధి :/// ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు శుక్రవారం రాత్రి నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు, సభ్యులు, జాబితా లో వింజమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, గని శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి సహకారంతో ఎన్నికైనందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసి, శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, యారవ కృష్ణయ్య నాయుడు, చల్లా శ్రీనివాసులు యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, రామ్మోహన్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

మీ ఫోన్‌లో ఏదైనా మార్పులు కనిపించాయా?

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ మీరు గమనించారా? మీ ఫోన్‌లో ఏదైనా మార్పులు కనిపించాయా? కాల్ చేస్తే పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేస్తున్నాయా? స్క్రీన్‌పై యాడ్ కాల్, వీడియో కాల్, రికార్డ్, హోల్డ్, యాడ్ మై కెమెరా, స్పామ్, ఆల్ కాల్స్, మిస్డ్ కాల్స్ అంటూ డేటా మొత్తం వచ్చేస్తోందా? ఇదేంది అనే ఆందోళనలో ఉన్నారా? నో వర్రీస్.. ఇదంతా అప్‌డేట్‌లో భాగమంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా వన్ ప్లస్, రియల్ మీ, మోటో, ఒప్పో ఫోన్లలో ఈ మార్పులు కనిపించగా.. ఈ చేంజెస్ యూజర్ అనుభవాన్ని మరింత సింప్లిఫై చేయడం, కాలింగ్ ఇంటర్ ఫేజ్ మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. ఆపరేటింగ్ సిస్టమ్స్, గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ బేస్డ్ న్యూ ఫీచర్స్‌ను ఇంట్రడ్యూజ్ చేస్తున్నాయి పలు బ్రాండ్స్. రియల్ మీ : Realme UI 3.0, 4.0 వంటి వెర్షన్‌లలో Google Phone యాప్‌ను ఇంటిగ్రేట్ చేసింది. కొన్ని సిరీస్‌ల్లో తమ సొంత డయలర్‌లో స్పామ్ డిటెక్షన్ ఫీచర్‌ను జోడించింది. వన్‌ప్లస్ : OxygenOS 12, 13లో Google Phone యాప్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఇందులో సైడ్ స్లైడ్, స్పామ్ ఫిల్టరింగ్ ఫీచర్స్ జోడించబడ్డాయి. మోటో: Motorola స్టాక్ ఆండ్రాయిడ్‌కు దగ్గరగా ఉండే ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. కాబట్టి Google Phone యాప్‌లోని కొత్త ఫీచర్లు ఎక్స్‌పరీయన్స్ చేస్తున్నారు యూజర్స్. ఒప్పో: ColorOS 12, 13లో Google Phone యాప్ లేదా సొంత డయలర్‌లో స్పామ్ గుర్తింపు, సైడ్ స్లైడ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. స్పామ్ కాల్స్ మేనేజ్మెంట్ : స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి ఈ బ్రాండ్‌లు Truecaller లేదా Google స్పామ్ ప్రొటెక్షన్‌ను యూజ్ చేస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్స్‌లో స్పామ్ కాల్స్ బ్లాక్ చేసేందుకు డు నాట్ డిస్టర్బ్ సెట్టింగ్స్ ఆన్ చేస్తే సరిపోతుంది.

హైదరాబాద్

ఇండి కూటమి ఉప రాష్ట్ర పతి అభ్యర్థి మీద అమిత్ షా తీవ్ర విమర్శలు

పున్నమి ప్రతినిధి 👉ఛత్తీస్గఢ్‌లో నక్సలైట్ల హింస చెలరేగి అమాయక ప్రజలు హతమవుతున్నప్పుడు ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది..! 👉నక్సలైట్ల ప్రభావం వున్న ప్రతి గ్రామంలో ‘గ్రామీణ రక్షా దళం’ను ఏర్పాటు చేసి, వారికి తుపాకులు ఇచ్చి, యువకులకు శిక్షణ కూడా ఇచ్చింది. దీనికి సానుకూల ఫలితాలు వచ్చాయి..! 👉గ్రామస్తులు నక్సలైట్లతో పోరాడటం ప్రారంభించారు, దాడులకు ప్రతిదాడి చేయడం మొదలుపెట్టారు. పోలీసులు మాత్రమే కాకుండా గ్రామస్తుల చేతుల్లో కూడా నక్సలైట్లు చనిపోవడం మొదలైంది. ఈ గ్రామీణ రక్షా దళానికి “సల్వా జుడుమ్” అనే పేరు పెట్టారు..! 👉ఇంత జరుగుతుంటే అర్బన్ నక్సలైట్లు, వ్వస్థల్లోని వారి తొత్తులూ చూస్తూ కూర్చుంటారా..? 👉వారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వామపక్ష భావజాలం కలిగిన ఒక న్యాయమూర్తి వెంటనే ఆ పిటిషన్ స్వీకరించి, తీర్పు కూడా వెంటనే ఇచ్చి సల్వా జుడుమ్ రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించి నిషేధించారు..! 👉ఆ తర్వాత నక్సలైట్లు చేసిన నరమేధానికి మొత్తం బస్తర్ జిల్లా రక్తపాతంతో తడిసిపోయింది. ఇన్ఫార్మల్లు అనే నెపంతో అమాయక గిరిజనులను వందల మందిని చెట్లకు కట్టేసి గొడ్డళ్ళతో నరికి చంపారు. అమాయకుల రక్తం ఏరులై పారింది..! 👉ఆ తరువాత ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ను ఆధారం చేసుకుని, ఉగ్రవాదులతో, నక్సలైట్లతో పోరాడుతూ అమరులు అయిన సైనికుల పిల్లలకు సాయుధ దళాల మెడికల్ కాలేజీలో ప్రవేశం కోసం కేంద్రం ఇచ్చిన మినహాయింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు అదే సదరు న్యాయమూర్తి..! కారణం ఏమిటంటే, సైనికులు దేశ సేవ చేస్తున్నందుకు వేతనం పొందుతున్నారు కాబట్టి అదనపు అనుకూలం ఇవ్వకూడదన్నది వారి తీర్పు..! 👉ఆ న్యాయమూర్తినే రిటైర్ అయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం కులగణన సంఘం అధ్యక్షుడిగా నియమించింది. ఆ న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కులగణన సంఘమే వెనుకబడిన వర్గాలకిచ్చే సౌకర్యాలు ముస్లింలకు కూడా ఇవ్వాలని సిఫారసు చేసింది..! 👉వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్లు ముస్లింలు తన్నుకుపోతున్నారంటే అందుకు కారణం ఆ న్యాయమూర్తే..! ఆ న్యాయమూర్తి ఎవరో కాదు. ఖాంగ్రెస్ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఆయన పేరు బి. సుదర్శన్ రెడ్డి అని అమిత్ షా విమర్శలు చేశారు

ఖమ్మం

బిజెపి నాయకుల పల్లెనిద్ర కార్యక్రమం

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయం కోసం ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ప్రవాస్ యోజన పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు వైరా నియోజకవర్గం జూలూరు పాడు లో పాల్గొనగా చిలుకూరు రమేష్, సుదర్శన్ మిశ్రా ఉన్నారు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మందా సరస్వతి కారే పల్లి మండలం లో సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరావ్ కల్లూరు మండలం లో ఇంకా రాష్ట్ర నాయకులు ఈవి రమేష్, దేవకీ వాసుదేవరావు పలు మండలాల్లో పల్లె నిద్ర కార్యక్రమం లో పాల్గొన్నారు స్థానిక సమస్య లు తెల్సుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తు రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బిజెపి విజయము కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా నేతలు తెలియజేసారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.