శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్): పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే అజెండాగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, అణగారిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జాతీయ, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు డా. జి. దశరథాచారి, యం. సుబ్బయ్యలను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు వారు ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీ పదవుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు మిన్నల్ రవి, డా. జి. దశరథాచారి, గిరిజన సలహా మండలి సభ్యులు యం. సుబ్బయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం. ఉమేష్ రావు, పార్టీ నాయకులు వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, తొగురు హరి తదితరులు పాల్గొన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి