శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) శ్రీనివాస్ నాయక్ కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఏడీజే కోర్టులో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఆయనకు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికింది.న్యాయవాదులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ నాయక్ తన సేవల ద్వారా మంచి పేరు సంపాదించారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

బదిలీపై ఏడీజే శ్రీనివాస్ నాయక్‌కు బార్ అసోసియేషన్ ఘన వీడ్కోలు