*ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం*
*ఉపాధ్యాయులకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయే*
*డీఎస్సీ, పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో ఉద్యోగులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం*
*నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి*
పొదలకూరులోని అగచాట్లపురంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి
*సోమిరెడ్డి కామెంట్స్*
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ, వారి సమస్యలు, సూచనలను తెలుసుకుంటున్నాం.
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన,పిఆర్సి ఇచ్చిన అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం..
ఐదేళ్ల వైసిపి పాలనలో అంతా సున్నా, నో డిఎస్సీ, నో పిఆర్సీ,నో ఎంక్రీమెంట్.
2014లో సీఎం చంద్రబాబు హయంలో 43 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత చంద్రబాబుదే…
కాకాణి గోవర్ధన్ రెడ్డి లోకేష్ పట్ల అనుచితంగా మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..
లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఉన్నత విద్యావంతుడు ఐటీ శాఖలో తన బ్రాండ్ ని చూపిస్తున్న నాయకుడు..
కాకాణి కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు…
పేదల భూములు కాజేసి కొవ్వెక్కిన కాకాణికి లోకేష్ విమర్శించే అర్హత లేదు..
కాకాణి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జాగ్రత్త అంటూ హెచ్చరించిన సోమిరెడ్డి..



