రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శనివారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రైతులతో కలిసి బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం రైతులు, బీజేపీ నాయకులు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మంథని విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం కేవలం ఏడు గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందించలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు సాగునీటి అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సునీల్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. రైతులకు వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మరింత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొండపాక సత్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, నియోజకవర్గ కో-కన్వీనర్ నంపెళ్లి రమేష్, మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్, కొయ్యడ సతీష్, పగే రంజిత్, కొండ్రు లక్ష్మణ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్క సదానందం, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, మట్ట శంకర్, దుర్గం తిరుపతి, మల్లారపు అరుణ్, చిలువేరు సతీష్, మల్లారెడ్డి, కోడారి దేవేందర్, ఎల్లవేణి సమ్మయ్య, సేనవేన సునీల్, పత్తి మహేందర్‌రెడ్డి, విశ్వతేజ, సామల అశోక్, ఎడ్ల సాగర్, భానుప్రకాశ్, తొట్ల రాజు, శంకర్, కసిపేట సాంబయ్య, మణుగు కొమురయ్య, విష్ణు, ప్రకాష్, గురువేష్, హేమంత్, సాయి, స్వరూప, రాజశేఖర్, ఆనంద్‌తో పాటు పలువురు రైతులు రమేష్, శ్రీనివాస్, రాజు, ఓదెలు, వెంకటేష్, రామూర్తి, సమ్మయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

