Wednesday, 29 July 2026
  • Home  
  • ఎలమంచిలి CHCకి కొత్త ఊపిరి.. నూతన ఓపీ భవనం, అంబులెన్స్ ప్రారంభం…!
- అనకాపల్లి

ఎలమంచిలి CHCకి కొత్త ఊపిరి.. నూతన ఓపీ భవనం, అంబులెన్స్ ప్రారంభం…!

అనకాపల్లి జిల్లా – జూలై 29 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) ఎలమంచిలి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఎలమంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో మౌలిక వసతులు మరింత బలోపేతమయ్యాయి. టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధుల సహకారంతో నిర్మించిన నూతన ఓపీ అదనపు భవనం, నూతన అంబులెన్స్‌ను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా వైద్య సేవలు అందించేందుకు నూతన అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక సంస్థలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజా సంక్షేమానికి చేయూత అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎలమంచిలి CHC అభివృద్ధికి సహకరించిన టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజన్న శేషగిరిరావు (శేషు), జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా – జూలై 29 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
ఎలమంచిలి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఎలమంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో మౌలిక వసతులు మరింత బలోపేతమయ్యాయి. టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధుల సహకారంతో నిర్మించిన నూతన ఓపీ అదనపు భవనం, నూతన అంబులెన్స్‌ను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా వైద్య సేవలు అందించేందుకు నూతన అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక సంస్థలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజా సంక్షేమానికి చేయూత అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎలమంచిలి CHC అభివృద్ధికి సహకరించిన టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజన్న శేషగిరిరావు (శేషు), జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.