Wednesday, 29 April 2026
  • Home  
  • నోటీసులు లేకుండా షాపులు ఖాళీ చేయించడం అన్యాయం-బియ్యపు మధుసూదన్ రెడ్డి
- తిరుపతి

నోటీసులు లేకుండా షాపులు ఖాళీ చేయించడం అన్యాయం-బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం సమీపంలోని పురపాలక కాంప్లెక్స్ దుకాణాలను నోటీసులు ఇవ్వకుండానే ఖాళీ చేయించడాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బుధవారం ఆయన బాధితులతో కలిసి కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వంటి కష్టకాలంలోనూ అద్దెలు క్రమం తప్పకుండా చెల్లించిన పేదల పట్ల మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరించడం అన్యాయమని మండిపడ్డారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీ భేదాలు లేకుండా అద్దెలను పునరుద్ధరించి పేదలను ఆదుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా, 33 శాతం అద్దె పెంపుతో ప్రస్తుత కిరాయిదారులకే గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే పేరు చెప్పి షాపులకు తాళాలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే ఒక రాజకీయ నాయకుడిని కలవాలని చెప్పడం విచిత్రంగా ఉందని, దీనిపై ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పగడాల రాజు, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్, కంట ఉదయ్ కుమార్, వల్లం గోపి, టైలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.