*రీ-సర్వే, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచన*
(పున్నమి ప్రతినిధి,చిత్తూరు,కార్వేటి నగరం, జూలై 29)
రీ-సర్వే, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్.
బుధవారం
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు ఇస్తూ రీ-సర్వే, రెవెన్యూ అంశాలపై తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రీ-సర్వే పనుల పురోగతి, రెవెన్యూ సంబంధిత సమస్యలు, టీజీఆర్ అంశాలపై అధికారులతో చర్చించి, వాటి సత్వర పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి, రికార్డుల నిర్వహణలో పారదర్శకతతో పాటు వేగవంతమైన సేవలు అందించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం కృష్ణాపురం రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించి పర్యాటక అభివృద్ధి అవకాశాల దృష్ట్యా భూముల గుర్తింపునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కార్వేటినగరం తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ లోకేష్, రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణి, మండల సర్వేయర్ మార్తాండయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నర్సింహులు, గ్రామ సర్వేయర్లు, ఈఆర్‌ఓస్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

