Sunday, 10 May 2026

Blog

అన్నమయ్య

ఈ నెల 24న భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన కార్యక్రమం జరుగనుంది.

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వెల్ మండలంలోని కంవనముద్రం, కందులవారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఈ నెల 24న భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాదం ఏర్పాట్లు ఉన్నాయని నిర్వాహకులు వివరించారు.

అన్నమయ్య

చిట్వేల్ పరిధిలో అంబేద్కర్ సర్కిల్ వీధిలైట్లు మసకబారిన పరిస్థితి

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వేల్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వీధి లైట్లు అనేక రోజులుగా వెలగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి సమయంలో చీకటితో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని నివాసులు హెచ్చరిస్తున్నారు. స్థానికులు వెంటనే వీధి లైట్లు మరమ్మతు చేసి వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

అన్నమయ్య

బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షే లక్ష్యం – అన్నమయ్య జిల్లా ఎస్పీ

రాయచోటి, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి) జిల్లాలో బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్ సమావేశ మందిరంలో కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ – కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని పెండింగ్ సమన్లు, వారెంట్లు తక్షణమే అమలు జరగేలా చర్యలు తీసుకోవాలని కొత్త బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి కోర్టు కానిస్టేబుల్ తన స్టేషన్‌కు సంబంధించిన కేసులపై పూర్తి అవగాహనతో వ్యవహరించి, సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నేరస్థలంలో ఫోటోలు, వీడియో రికార్డింగ్ కోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఆధునిక ట్యాబ్‌లను ఎస్పీ గారు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎ. ఆదినారాయణ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ యం. తులసిరామ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి. రాజా రమేష్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి. మధు, ఎస్ఐ జి. రవికుమార్, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

అన్నమయ్య

దళారుల వ్యవస్థ రద్దు చేయాలి – రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి

అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం: రైతు సదస్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి, బొప్పాయి రైతులకు కనీసం రూ.15 గిట్టుబాటు ధర ఇవ్వాలని, దళారుల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సూటు పేరుతో రైతులను మోసం చేసే దళారులపై చర్యలు తీసుకోవాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సబ్సిడీ ద్వారా అందించడంతో పాటు ఉచిత పంట బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎలూరు

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దని ఏలూరు జిల్లా ఆర్టిసి రవాణా అధికారి షేక్. షబ్నం సూచించారు. శుక్రవారం ఆగిరిపల్లి లోని ఆర్టీసీ బస్టాండ్ లోని వసతులను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లోని మరుగుదొడ్లను, త్రాగునీటిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ త్వరలో ఆగిరిపల్లి బస్టాండ్ లో ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆగిరిపల్లి నుండి హైదరాబాద్ కు బస్సును ఏర్పాటు చేశామని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. నూజివీడు డిపోలో 88 బస్సులకు గాను 44 బస్సులను స్త్రీ శక్తి పథకానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. నూజివీడు డిపో పరిధిలో ఇప్పటివరకు 60,826 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఆమెతోపాటు నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు.

ఎలూరు

ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు

ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు ఆగిరిపల్లి: శ్రావణమాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని మండలంలో పలు ఆలయాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తోటపల్లి లో వేంచేసి ఉన్న దుగ్గిరాల బాలరామ తల్లిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆగిరిపల్లి లోని కనకదుర్గ దేవి ఆలయంలో అమ్మవారిని ఆలయ అర్చకులు దేవులపల్లి శ్రీనివాసమూర్తి ప్రత్యేకంగా అలంకరించారు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పాల పొంగళ్ళు సమర్పించారు.

E-పేపర్

శ్రీ కొత్తూరు సుబ్బరాయునిలో చివరి శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.

పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో శ్రావణ మాసం ఆఖరు శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల నారాయణ శర్మ, కంపమల్ల సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రాతఃకాల పూజలు, గందం అభిషేక పూజలు, రుద్రాభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మధ్యాహ్నకాల మహా నివేదన సమయంలో స్వామివారికి సర్ప సూక్తంతో సుగంధ ద్రవ్యాలతో, పంచామృత అభిషేకం, మహా రుద్రాభిషేకం, మహా నైవేద్యం, మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు క్రిష్ణయ్య స్వామి, శివ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఆదివారం నెరవాటి పాలి క్లినిక్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణ.

నంద్యాల గాంధీ చౌక్ సమీపంలో ఉన్న నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ,ఆదివారం నెరవాటి పాలి క్లినిక్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,పాలి క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ వినోద్, డాక్టర్ సుమన్,రమేష్, హరినాథ్ , నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్ శిబిరం వివరాలు శుక్రవారం ప్రకటించారు. ఈ వైద్య శిబిరంలో స్త్రీ వ్యాధులు మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఫాతిమా, ఎముకలు, కీళ్ల నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్,చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పబ్బతి దివ్య తేజ, దంత వైద్యులు డాక్టర్ పద్మ ప్రియాంక, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నటరాజ్ వైద్య సేవలు అందిస్తారు. ఎముకల సాంద్రత, పటుత్వాన్ని సూచించే బి.ఎం.డి. పరీక్ష అవసరమైన వారికి ఉచితంగా నిర్వహిస్తారు. అవసరమైన ఇతర పరీక్షలు కూడా నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలను కోరారు.ఉచిత మెగా వైద్య శిబిరం కరపత్రాలు విడుదల చేస్తున్న డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ వినోద్, డాక్టర్ సుమన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్.

E-పేపర్

తెలుగు గంగ కార్యాలయంలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

తెలుగు గంగ కార్యాలయంలో రండి… టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం నాగేంద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు, శుక్రవారం నిర్వహించిన రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనదని, ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశ ద్రోహుల భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ ని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే సానుకూలంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వారు వారి పిల్లలకు వివాహాధి కార్యక్రమాలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి సత్వరం ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు మార్గాన్ని ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు గంగ కార్యాలయం ఉప పర్యవేక్షక ఇంజనీరు జవహర్ రెడ్డి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ నరసింహ రెడ్డి, కోటేశ్వర రావు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. విజయలక్ష్మి, సిటీ అధ్యక్షులు సత్యం, ఉపాధ్యక్షులు చెంచమ్మ, యన్ యం ఆర్. టైమ్ స్కేల్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్, వేణుగోపాల్ రెడ్డి, ప్రతినిధులు, ఇతర ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కొత్త బార్ పాలసీలో అప్లికేషన్ ఫీజు రీఫండ్ పై మరింత స్పష్టత

నాలుగు దరఖాస్తులు రాకున్నా, లాటరీ జరగకున్నా ఫీజు వాపస్ ఎక్సైజ్ కమీషనర్ నిషాంత్ కుమార్ ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ కొత్త బార్ పాలసీ 2025–28 కింద ఏదైనా బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకపోవడం వల్ల లాటరీ జరగకపోతే, అభ్యర్థులు చెల్లించిన అప్లికేషన్ ఫీజు తిరిగి చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ , ప్రొహిబిషన్ కమీషనర్ నిషాంత్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త పాలసీ ప్రకారం ఓపెన్ కేటగిరీలో 840 బార్లు, రిజర్వ్ కేటగిరీ (గీతకులాలు)లో 84 బార్లు లాటరీ ద్వారా కేటాయించబడతాయి. ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలి అనే నిబంధన ఉంది. ఒకవేళ లేకపోతే నాలుగు దరఖాస్తులు రాకపోతే లాటరీ నిర్వహణ జరగదని, దాని తేదీ పొడిగిస్తారని గతంలో విడుదల చేసిన రూల్స్‌ పేర్కొన్నాయి. అయితే అప్లికేషన్ ఫీజు (రూ. 5 లక్షలు) రీఫండ్ అవుతుందా లేదా అన్న విషయంలో అభ్యర్థుల్లో అనుమానాలు వచ్చాయి. మరోవైపు ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ఈ అంశంపై సూచనలు కోరారు. దీనిపై నిషాంత్ కుమార్ స్పష్టత ఇస్తూ, “నాలుగు దరఖాస్తులు రాకపోవడం వల్ల డ్రా జరగకపోతే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు తప్పనిసరిగా తిరిగి ఇవ్వబడుతుదన్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి, మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసేలా చూడాలని కమీషనర్ ఆదేశించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.