Sunday, 10 May 2026

Blog

హైదరాబాద్

వివిధ సెట్ లు (Icet, Edcet, Law cet etc) లకి సంభందించిన ప్రవేశల్లో ఎలాంటి బేషరత్తు గా ప్రవేశాలు కలిపించాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్

పున్నమి ప్రతినిధి 👉ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతి పత్రం అందచేత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి నేడు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ “రాష్ట్ర వ్యాప్తంగా వివిధ CET’s (ICET, EdCET, LAWCET etc) కి సంబంధించిన ప్రవేశాలు జరుగుతున్న ఈ తరుణంలో చాలా కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఫీ రియింబర్స్మెంట్ బకాయిలను సాకుగా చూపి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇవ్వాలంటే మొత్తం ఫీజు విద్యార్థులే కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని అన్నారు.విద్యార్థులు వారు పూర్వం చదివిన కళాశాలల నుండి custodian సర్టిఫికెట్ తీసుకొచ్చినప్పటికి కూడా అడ్మిషన్ పొందిన ప్రస్తుత కళాశాలలు వాటిని అంగీకరించట్లేదనీ,ఈ కారణాల వల్ల అడ్మిషన్ వచ్చిన విద్యార్థులు మనోవేదనకు గురి అవుతున్నారన్నారు.కష్టపడి చదివి ర్యాంక్ సాధించిన ఇలాంటి కారణాల వల్ల అడ్మిషన్ పొందలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారనీ,ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ప్రభుత్వం సకాలంలో ఫీ రియింబర్స్మెంట్ చెల్లించకపోవడమే అని అన్నారు.ప్రభుత్వ తప్పులకు విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,కావున ఛైర్మన్ గారు ఎలాంటి షరతులు లేకుండా అడ్మిషన్స్ చేసుకోవాలని కళాశాలలను,యూనివర్సిటీలను ఆదేశించాలని,ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గసభ్యులు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు దృహన్,విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల 4న ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ..

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ అమరావతి: వచ్చే నెల 4న ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ.. వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలో అప్పనపల్లి లో 70 రకాల స్వీట్లతో ప్రదర్శన

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను అప్పనపల్లి గ్రామంలో సెలబ్రేట్ చేశారు. 70 రకాల స్వీట్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. 70వ నంబరుతో పాటు మెగాస్టార్ అంటూ 70 రకాల సీట్లతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు. వీధి సత్తిబాబు, తులా ఆది, ఉమా, తులా యేసు అప్పనపల్లి చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టిన రోజు ఊహించని సరికొత్త రీతిగా జరిపించారు. ఈ వేడుకను వేలాది మంది తిలకించారు.

ఖమ్మం

*_Health Services: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!_*

పున్నమి Daily న్యూస్ ఖమ్మం Telangana Aarogyasri: కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులో సరైనా ఫెసిలిటిస్ లేని కారణంగా.. చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాలంటే ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పేదలకు, మధ్య తరగతి ప్రజలకు.. ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఉన్న ఆరోగ్రశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 అర్థరాత్రి నుండి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో.. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే. బకాయిల చెల్లింపు గురించి జనవరిలో ప్రభుత్వ హామీ ఇచ్చినప్పటికీ.. అది మాత్రం అమల్లోకి రాలేదు. ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రులపై ఆర్థికభారం పడుతుందని.. అందుకే సమస్య పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(TANHA)తెలిపింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు టీఏఎన్‌హెచ్‌ఏ లేఖ రాసింది. ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్‌కు కూడా ఈ నిలిపివేత వర్తించనుందని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నట్లుగా తెలుస్తోంది. బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ జాప్యంతో చిన్న చిన్న హాస్పిటల్స్ మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్. 4 నుండి 5 నెలల్లో బకాయిలు చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చింది. ప్యాకేజీలు కూడా సవరిస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పిందని.. కానీ 6 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మరి ఇంకా కొంచెం టైమ్ ఉంది కాబట్టి.. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్చలు జరపడమో.. లేదా బకాయిలు చెల్లించడమూ చేస్తుందో లేదో చూడాలి.

ఖమ్మం

ఖమ్మం నగరం లో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సమావేశం

పున్నమి Daily న్యూస్ ప్రతినిథి:ఖమ్మం T.Ravinder ఖమ్మం నగరం లో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సమావేశం *ఆగస్ట్ 27గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 6 నిమార్జనం – వినోద్ లాహోటి,అధ్యక్షులు* ఖమ్మం నగరం లో స్తంభాద్రి ఉత్సావ కమిటీ సమావేశం అధ్యక్షులు వినోద్ లాహోటి గారి అధ్యక్షతన ఉత్సావ కమిటీ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది,అధ్యకులు వినోద్ లాహోటి ప్రధానకార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి మాట్లాడుతు ఈ సంవత్సరం ఖమ్మం నగరం లో గణేష్ ఉత్సవాలు *ఆగస్ట్ 27వ తేదీ బుధవారం గణేష్ చతుర్థి పండుగ , సెప్టెంబరు 6వ తేదీ శనివారం నిమర్జన కార్యక్రమం* నిర్వహించుకోవాలని,పర్యావరణ పరి రక్షణ లో భాగం గా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ గణేష్ చతుర్థి జరుపుకోవాలని , మంటప నిర్వాహకులు అందరు తమ గణేష్ మంటపాల వద్ద సూచి శుభ్రత పాటిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగ కూడా చుసుకోవాలని,మంటపం ఎదురుగా కాషాయ ధ్వజం ఏర్పాటు చేయాలని సూచించారు, త్వరలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ జిల్లా కలెక్టర్ గారిని పోలీస్ కమిషనర్ గారిని కలిసి ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరం లాగానే ఇచ్చే సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని కోరుతాం అని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో గెంటేల విద్యాసాగర్ గారు,*వేల్పుల సుధాకర్ *,అల్లిక అంజయ్య ,ఈశ్వర ప్రగడ రామారావు, శ్రీ హరి ,పిల్లల మర్రి వెంకట్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

యర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కి టిప్పర్లతో తరలిస్తున్న మట్టిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు, పున్నమి న్యూస్ / ప్రతినిధి,ఆగస్టు 22 :/// నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం వింజమూరు యర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కి టిప్పర్లతో గ్రావెల్ ను తరలిస్తున్న ప్రాంతాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇరిగేషన్ ఈ ఈ తో ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. 12 వేల క్యూబిక్ మీటర్ల మట్టికి పర్మిషన్ తీసుకొని తరలిస్తున్నారని, ఇప్పటివరకు ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారని, మిగతాది తరలిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని సుమారు 145 చెరువుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. చెరువులన్నిటికీ అధ్యక్షులను నియమించడం జరిగిందని, వారి పర్యవేక్షణలో చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. చెరువుల లోపల నియంత్రణ లేకుండా, గోతులు తీస్తున్నారని, ఇకపై అలా జరగకుండా క్రమ పద్ధతిగా, చెరువు అభివృద్ధి చెందేలాగా మట్టిని తీసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి గండి లేకుండా, పర్మిషన్ తో అధికారుల పర్యవేక్షణలో మట్టిని తరలించే విధంగా, చర్యల చేపడతామన్నారు. అదేవిధంగా వింజమూరు నుండి నంది గుంట కు వెళ్లే రహదారి పక్కన ఎడమ చేతి వైపు ఉన్న ప్రభుత్వ భూమిలో నుడా లేఅవుట్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చి, తద్వారా వింజమూరు అభివృద్ధికి కృషి చేయాలని ప్రణాళిక చేసామని, ఆ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా జలదంకి మండలంలో భూ వివాదం జరుగుతుందని అక్కడికి వెళ్లి పరిశీలించి, ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. కనుక అందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, కే శ్రీనివాసులు నాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఖమ్మం

బిజెపి నాయకులు అరెస్ట్

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు పిలిపు మేరకు ఛలో హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమం కి హైదరాబాద్ వెళ్తున్న బిజెపి నాయకులని ఖమ్మం పోలీస్ లు అదుపులో కి తీసుకున్నారు. పోలీస్ లు అదుపులో కి తీసుకున్న వారిలో జిల్లా నాయకులు పిల్లల మర్రి వెంకట్ నారాయణ, డీకొండ శ్యాం. వన్ టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ లు ఉన్నారు. బిజెపి కార్యకర్తలు అరెస్ట్ లకి భయపడరు అని నాయకులు అన్నారు.

జాతీయ అంతర్జాతీయ

అంతరిక్షం నుంచి భారత్ కనిపిస్తోందిలా!: టైమ్ లాప్స్ వీడియో షేర్ చేసిన శుభాంశు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ ఇటీవల రోదసి యాత్ర చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అరుదైన స్పేస్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో తెలిపే టైమ్ లాప్స్ వీడియోను ఆయన షేర్ చేశారు. అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) హిందూ మహాసముద్రంపై దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా ప్రయాణించింది. ఆ సమయంలో తాము భారత తూర్పు తీరం మీదుగా పయనించినట్లు శుక్లా వివరించారు. తాను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వర్షాకాలం కావడంతో భారత్పై ఎక్కువగా మబ్బులు ఉన్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ మండలాలకు చేరుకున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫొటో, కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ ఈ-పోస్ మెషీన్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

జనగాం

ZPHS ఏడునూతులలో అభివృద్ధి కార్యక్రమాలు

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు ఈ రోజు ఏడునూతుల గ్రామానికి విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో కొత్త అంగన్వాడి భవనం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, పునాది వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – > “గ్రామాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను. ఏడునూతులలో విద్యార్థుల ఆరోగ్యం, త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే జెడ్పీహెచ్‌ఎస్ ఏడునూతులలో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది” అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్ ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యకయ్య గారు మాట్లాడుతూ – > “మా పాఠశాలలో త్రాగునీటి అవసరాన్ని గుర్తించి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. అలాగే అంగన్వాడి భవనం నిర్మాణాన్ని ప్రారంభించడం మా గ్రామానికి మేలుకలిగించే పనిగా నిలుస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు: కమల్ కుమార్, రాంబాబు, సోమేశ్వర్, భాస్కర్, యాదగిరి, G. రజిత, మమత, M. రజిత, విజయ మరియు తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.