Sunday, 10 May 2026

Blog

ఖమ్మం

ఖమ్మం లో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీ వివాదస్పదం

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) 👉 బిజెపి నేత గల్లా సత్య నారాయణ పిర్యాదు తో స్పందించి న కేంద్ర హోం శాఖ 👉సమగ్ర విచారణ కి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ 👉 మైనర్ విద్యార్థుల తో ర్యాలీ చేయించడం పట్ల అభ్యంతరాలు పాల స్తీనా కి అనుకూలముగా ఆగష్టు 7 వ తేదీ నాడు ఖమ్మం నగరము లో నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదం అయింది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ లు, హార్వెస్ట్, న్యూవేర విద్యాసంస్థల కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ లో ప్రధాని మోదీ వ్యతిరేకం గా నినాదాలు పాలస్తీనా కి అనుకూల నినాదాలు చెయ్యడము తొ పాటు ఎన్ సిసి ఎన్ ఎస్ ఎస్ వాలం టీర్లు పాల్గొనడం మైనర్ విద్యార్థుల తొ ర్యాలి చేయించడం పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి పిర్యాదు చెయ్యడం జరిగింది. వెంటనే స్పందించి న బండి సంజయ్ సమగ్ర విచారణ కి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకి ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని ఈ సం దర్భముగా గల్లా సత్య నారాయణ అన్నారు

ఖమ్మం

తెలంగాణ బంద్.. ఖమ్మం లో పాక్షికం

ఖమ్మం పున్నమి ప్రతినిధి రాజస్థాన్, గుజరాత్ మార్వాడి లో తెలంగాణ ప్రజల మీద చేస్తున్న దాడులకి నిరసన గా ఉస్మానియా జేఏసీ నేడు తెలంగాణ బంద్ కి పిలపు నిచ్చిన నేపథ్యంలో బంద్ ప్రభావము ఖమ్మం లో నామమాత్రము గానే ఉంది. విద్యా సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ఆర్టీసీ బస్సు లు యధావిధిగా పనిచేసాయి.

ఖమ్మం

ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి :సి ఐ కరుణాకర్

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరము లో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అని ఖమ్మం వన్ టౌన్ సి ఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి, మట్ట దుర్గ ప్రసాద్ రెడ్డి లతో పాటు వివిధ పార్టీలా నాయకులు హాజరైయ్యారు

ఖమ్మం

ఘనంగా P. S. R జన్మదిన వేడుకలు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం బిజెపి టూ టౌన్ ఉపాధ్యక్షులు పాసం శ్రీనువాసు రెడ్డి జన్మదిన వేడుకలు అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో టి భద్రం, భూక్యా శ్యాం సుందర్ నాయక్, పోతుల చంద్ర శేఖర్డీ,కొండ శ్యాం, బెల్లం రాధ కృష్ణ, గజ్జల శ్రీనివాస్, దాసరి మధు, దాసరి వీర భద్రం పాల్గొన్నారు. ( రిటైర్డ్ సి ఐ )

జాతీయ అంతర్జాతీయ

తమిళనాడు అంతటా ఉన్న 234 నియోజకవర్గాలకు నేను అభ్యర్థిని! తమిళ హీరో విజయ్.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ నన్ను చూసే ఓటేయండి – తమిళ హీరో విజయ్ నినాదం తమిళ హీరో విజయ్ .. రాజకీయాల్లోనూ హీరోయిజమే చూపించాలని డిసైడయ్యారు. దానికి తగ్గట్లుగా ఆయన చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధురై జిల్లాలోని పరపతిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఓ ప్రకటన చేశారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నానని చెప్పి..అన్నీ తన పేర్లనే ప్రకటించుకున్నారు. అంటే.. అన్ని చోట్లా తమిళనాడు అంతటా ఉన్న 234 నియోజకవర్గాలకు నేను అభ్యర్థిని. అలా ఆలోచించి, మీరందరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు. కొంత మంది నటుల మాదిరిగా మార్కెట్ పోయాక రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను అన్నింటికి సిద్ధంగా ఉన్నానని తాను ఎంత చేసినా ప్రజల కృతజ్ఞతా రుణం నేను తీర్చుకోలేనన్నారు. నా పని ప్రజల కోసం పనిచేయడమని చెప్పుకున్నారు. తన పార్టీ విజయం ఓ చారిత్రక నిర్ణయంగా విజయ్ చెప్పుకొచ్చారు. 1967లో డీఎంకే, 1977లో అన్నాడీఎంకేలతో ఎలా మార్పు వచ్చిందో 2026 అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీవీకే అలాంటి మార్పు తెస్తుందన్నారు. ఈ సభలో విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని తేల్చారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా.. బీజేపీని భావజాల శత్రువుగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ డీఎంకేతోనే ఉంటుందని.. పీఎంకే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని.. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్దూ ప్రజాదరణ కోల్పోయిందన్నారు. గతంలో నిర్వహించిన సభలో తననే సీఎం అభ్యర్థిగా విజయ్ ప్రకటించుకున్నారు. ఇప్పుడు అన్ని చోట్లా తానే అభ్యర్థిగా చూడాలని పిలుపునిచ్చారు. చూస్తూంటే.. వ్యక్తిపూజ రాజకీయాలు తమిళనాడుకు సరిపోతాయి కాబట్టి.. విజయ్ కూడా అదే ఇమేజ్ తో .. ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

సక్సెస్ స్టోరీస్

మన తరాల తర్వాత! తరువాతి తరాల పరిస్థితి ఏమిటి.?

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ తరాల గాయం (Generational Trauma) అర్థం: ఒక తరం యొక్క అపరిష్కృత గాయం (యుద్ధం, దారిద్ర్యం, అణచివేత వంటివి) తరువాతి తరానికి సంక్రమించి, వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పదవి మత్తులో ప్రజాస్వామ్యం! ప్రచారం మత్తులో రాజకీయం! ఉచితాల మత్తులో జనం! మాదకద్రవ్యాల మత్తులో యువజనం! లంచాల మత్తులో ఉద్యోగం! ర్యాంకుల మత్తులో విద్యావిధానం! విత్తం మత్తులో వైద్యం! *లాభాల మత్తులో వ్యాపారం! పురస్కారాల మత్తులో పాండిత్యం! గ్రాఫిక్స్ మత్తులో సినీరంగం! మొబైల్ గేమ్ ల మత్తులో బాల్యం! పబ్ మత్తులో యువతరం! అంతర్జాలం మత్తులో అందరం! సంపాదన మత్తులో స్వార్ధజనం! అట్టహాసం మత్తులో వివాహం! మోసాల మత్తులో వాణిజ్యం! వాయిదాల మత్తులో వ్యాజ్యం! మామూళ్లు మత్తులో రౌడీయిజం! మతం మత్తులో మానవత్వం! లైకుల మత్తులో సాంఘిక మాధ్యమం! టి ఆర్ పి మత్తులో మీడియా! సర్క్యులేషన్ మత్తులో పత్రికలు! నోటు మత్తులో ఓటు హక్కు! మత్తులో జోగుతున్న జగతి ! మనిషికెక్కడిది జాగృతి ! మనుగడకెక్కడిది ప్రగతి ! మందగిస్తున్న పురోగతి! ఇది నేటి దుస్థితి! మొత్తం ప్రపంచాన్ని! మత్తు ఆవరించింది! నేడు అవినీతి మత్తులో! కుల మతాల మత్తులో! మొత్తం దేశం అంతా! ఊగుతున్నది, ఇది రేపటి తరాల దురదృష్టం! మనతరం ఎలాగోలా లాగిస్తాం కాని, మన తరువాతి! తరాల పరిస్థితి ఏమిటి అంటే శూన్యం…..? తరువాతి తరాలు ఆందోళన, మాంద్యం లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడవచ్చు. తరాల గాయాన్ని అర్థం చేసుకుని, దాన్ని అధిగమించే వ్యూహాలను నేర్చుకోవడం, మరియు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేయడం వంటివి తరువాతి తరాల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కాబట్టి, మన తరువాత వచ్చే తరాల పరిస్థితి, గత తరాల నుండి మనం ఏమి వదిలి వెళతాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది – అది గాయమా లేక సంపదా.

ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు! అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దుకాదు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. గత ప్రభుత్వంలో నకిలీ దివ్యాంగ సర్టిఫికేట్లతో దందా. పెన్షన్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్టు, అన్నివిధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి… ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది పెన్షన్ పొందుతున్నట్టు పరిశీలనలో తేలిందని తెలిపారు. అనర్హులైన పెన్లన్లు ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి నిర్ధారించినట్టు వెల్లడించారు. అయితే నకిలీ పెన్షన్లను మాత్రమే తొలిగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారుకు పెన్షన్ రద్దు కాకూడదని సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పెన్షన్లు యధావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని సీఎం చెప్పారు.

జాతీయ అంతర్జాతీయ

అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ భారత్ US చేస్తున్న దుష్ప్రచారానికి విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కోలో కౌంటర్ ఇచ్చారు. ‘రష్యన్ ఆయిల్ బిగ్గెస్ట్ బయ్యర్స్ ఇండియా కాదు చైనా. రష్యా నుంచి LNGని యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటోంది. 2022 తర్వాత భారత్ కాదు.. సౌత్లోని కొన్ని దేశాలు రష్యాతో వాణిజ్యం పెంచుకున్నాయి. మేం US ఆయిల్ కూడా కొంటాం. వరల్డ్ ఎనర్జీ మార్కెట్ని భారత్ సమతుల్య పరుస్తోందన్న US.. ఇప్పుడు తప్పుబడుతోంది’ అని పేర్కొన్నారు.

క్రైమ్

ఈ-సిగరెట్లు అక్రమ రవాణా గ్యాంగ్ అరెస్ట్

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఈ-సిగరెట్లు, విదేశీ సిగరెట్లు రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 6,800 సిగరెట్ల బాక్స్లు, 360 ఈ-సిగరెట్లు, హోండా యాక్టివా, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సప్లయర్గా ముంబైకి చెందిన అబ్దుల్లా శెట్టిని గుర్తించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏఎంసి వైస్ డైరెక్టర్ ని సన్మానించి బిజెపి నాయకులు

న్యూస్ కాట్రేని కోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ సూరిబాబు నియమించిన సందర్భంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు కాట్రేనికోన మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ కోటా సత్య ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు సత్కరించడమైనది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.