Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు apdascac.ap.gov.in 3 చేసుకోవాలని సూచించారు.

ఖమ్మం

డివిజన్ సమస్య ల పరిష్కారం కి కృషి చేస్తాను: రుద్ర గాని మాధవ

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం నగరం లోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కి కూత వేటు దూరం లో గల 57 వ డివిజన్ లో బిజెపి 57 వ డివిజన్ ఇంచార్జి రుద్ర గాని మాధవ శుక్రవారం పర్యటించారు. డివిజన్ లోని ప్రజలు సమస్య లని అయన దృష్టికి తీసుకోని వచ్చారు. ప్రధానంగా 👉 డ్రైనేజీ లేక పోవడం, 👉వాటర్ లీకేజ్ లు 👉చెత్త ఎత్తి వేసే వారు రాక పోవడం 👉రోడ్లు సరిగ్గా లేకపోవడం ప్రధాన సమస్య లు అని 57 వ డివిజన్ ప్రజలు తెలియజేసారు. గత వారం రోజులు గా కురిసిన వర్షాలకి డివిజన్ లో ని ప్రభుత్వ పాఠశాల నందు నీరు నిలిచి దోమలు Shan వస్తుంటే బ్లీచించిగ్ చల్లించి మాధవ్ తన సేవ హృదయం ని చాటుకున్నాడు. ఈ సందర్భముగా మాధవ మాట్లాడుతు 57 వ డివిజన్ లో సమస్య ల పరిష్కారం కొరకు తాను కృషి చేస్తాను అని అన్నారు. కళ్లి బొల్లి మాటల తో ప్రజలని మోసం చేసే పాలకులకి బుద్ది చెప్పాలి అని బిజెపి అభ్యర్థి కి అవకాశం ఇవ్వాలి అని మాధవ 57 వ డివిజన్ ప్రజలని కోరారు

ఆంధ్రప్రదేశ్

పెట్రోల్, డీజిల్ ధరల భారం ప్రజలపై పడనివ్వం: కేంద్రమంత్రి

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ ప్రజలకు అందుబాటు ధరల్లో ఇంధనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో వినియోగదారులకు ఊరట కల్పించాం ఇథనాల్ మిశ్రమంతో రైతులకు రూ.1.25 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ ఇంధన భద్రతకు చర్యలు దేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటు ధరల్లో ఇంధనాన్ని అందించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని ఆయన గురువారం పార్లమెంటుకు తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ఆ భారం వినియోగదారులపై పడకుండా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. ఇందులో భాగంగా 2021 నవంబర్, 2022 మే నెలల్లో రెండు విడతలుగా పెట్రోల్‌పై లీటరుకు రూ.13, డీజిల్‌పై రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు గుర్తుచేశారు. దీనికి తోడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు మరింత ఊరటనిచ్చాయని తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) కూడా 2024 మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2022 జూన్‌లో బ్యారెల్‌కు 116 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరినా, దేశంలో ధరలను నియంత్రించగలిగామని మంత్రి తెలిపారు. 2021 నవంబర్‌లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.110.04 ఉండగా, ఇప్పుడు అది రూ.94.77కు, డీజిల్ ధర రూ.98.42 నుంచి రూ.87.67కు తగ్గిందని అన్నారు. 2025 ఏప్రిల్‌లో ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచినప్పటికీ, ఆ భారాన్ని చమురు సంస్థలే భరించాయని, వినియోగదారులపై మోపలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంధన భద్రత కోసం ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతోందని హర్దీప్ పురి అన్నారు. దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం ద్వారా 2014-15 నుంచి ఈ ఏడాది జులై వరకు రైతులకు రూ.1,25,000 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని, దీనివల్ల రూ.1,44,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని వివరించారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ఐదు నెలల ముందే (జూన్ 2022లో) సాధించామని, 2025 జులై నాటికి ఈ మిశ్రమం 19.93 శాతానికి చేరిందని ఆయన వెల్లడించారు.

సినిమా

18రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్‌లు షురూ

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఫలించిన చర్చలు 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాల ఆమోదం మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5% మూడో ఏడాది 5% పెంపు-అడిషనల్ లేబర్‌ కమిషనర్ 2 వేలలోపు ఉన్నవాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తింపు 2 వేల నుంచి 5 వేల మధ్య వేతనం ఉంటే.. మొదటి ఏడాది 7.5 శాతం రెండు, మూడో ఏడాదుల్లో 5% చొప్పున పెంపు ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీ -అడిషనల్ లేబర్ కమిషనర్ కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ వర్గాల సభ్యులు నెల రోజుల్లో మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు 9 టు 9 కాల్ షీట్‌కు కార్మికుల అంగీకారం పెద్ద సినిమాలకు సండే పనికి ఒకటిన్నర రోజు పేమెంట్‌ చిన్నసినిమాలకు 2, 4 ఆదివారాల్లో ఒకటిన్నర పేమెంట్

బిజినెస్

ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ ▪️మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట. ▪️ఆరోగ్య, టెర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం. ▪️పెట్టుబడుల తరహా సాధారణ, యులిప్ పాలసీల విషయంలో ‘రిస్క్’ మేరకే మినహాయింపు. ▪️జీఎస్టీలో ఇకపై 2 శ్లాబులే…ప్రస్తుత 4 పన్ను శ్లాబులను 5%, 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే. ▪️జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి. ▪️90% నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ▪️దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు. ▪️దీపావళికల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు. ▪️జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫారసు. ▪️పాలసీల ప్రీమియం 18% తగ్గే చాన్స్.

ఖమ్మం

ప్రజల వద్దకే ఎం ఎల్ ఎ మట్టా

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణము లో స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్టా రాగ మయి ప్రజల వద్దకే ఎమ్మెల్యే అనే కార్యక్రమం లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్ చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..సత్తుపల్లి మున్సిపాలిటీలోని.. 08 మరియు 09 వ వార్డ్ లో పర్యటించడం జరిగింది. ప్రభుత్వ అధికారులతో కలిసి వార్డులలో మార్నింగ్ వాక్ చేస్తూ నేరుగా ప్రజల ఇంటిముందుకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. – సమస్యలను వింటూ..పరిష్కరిస్తూ..అధికారులను సమన్యయం చేస్తూ శ్రీమతి మట్టా రాగమయి మార్నింగ్ వాక్ సాగింది.

ఆంధ్రప్రదేశ్

యానాం లో గ్యాస్ పైప్ లైన్ లీక్… ఎగసిపడిన మంటలు

కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో లీక్ అయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చుట్టు పక్కల గ్రామాలు అయిన సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్ప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఓఎన్జీసీ అధికారులు వెంటనే గ్యాస్ రవాణా నిలుపుదల చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

జాతీయ అంతర్జాతీయ

కుక్కల బెడదపై తీర్పును సవరించిన సుప్రీం

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: వీధి కుక్కల బెడదపై ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. నగరం నంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో మార్పు చేసింది. కేవలం రేబిస్‌ ఉన్న వాటిని షెల్టర్లకు తరలించాలని ఉత్తర్వులిచ్చింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వాటికి బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం! ప్రింటింగ్లోనూ తప్పులే

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ జాయింట్ ఎల్పీఎం నంబర్లతోనే ముద్రణ ఫొటోలు, పేర్లు, విస్తీర్ణంలోనూ తేడాలు రీసర్వే సమస్యలు పరిష్కరించకుండానే.. అచ్చువేయించిన రెవెన్యూశాఖ కొత్తవి ఇచ్చినా.. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే సరిహద్దు రాళ్లనే కాదు, రైతుల పట్టాదారు పాస్పుస్తకాలపైనా నాటి ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మలేసుకున్నారు. హడావుడిగా సర్వే చేయడంతోపాటు విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు ఉన్నా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మను తొలగించి.. రాజముద్రతో కొత్త పాస్పుస్తకాలను త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది రైతులకు సంతోషం కలిగించే అంశమే అయి వాటిలో తప్పులు చూస్తేనే.. ఆందోళన కలుగుతోంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరిదిద్దకుండానే కొత్త పుస్తకాల్ని ప్రింట్ చేయించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా పట్టాదారు పాస్పుస్తకాలు జిల్లాలకు చేరాయి. వాటిని పరిశీలిస్తే 50శాతం తప్పులే ఉన్నట్లు తేలింది. జాయింట్ ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సమస్యలూ ఎక్కువే. ఇద్దరు ముగ్గురు రైతుల పేర్లతో ఐదు, పదెకరాలు నమోదు చేశారు. వాటిని విభజించలేదు. ఇవన్నీ సరిచేసుకోవాలంటే మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. వెబ్ల్యండ్లో తప్పులు… ఏడాదైనా సరిచేయకుండా రీసర్వే సమయంలో వెబ్ల్యండ్లో కుప్పలకొద్దీ తప్పులు నమోదయ్యాయి. విస్తీర్ణాల్లోనూ పెద్దఎత్తున తేడాలొచ్చాయి. ఒక రైతుకు 1.20 ఎకరాలు ఉంటే ఎకరం నమోదు చేశారు. మరో రైతుకు ఎకరం ఉంటే 1.20 ఎకరాలు ఉన్నట్లు రాశారు. సరిచేయాలని అర్జీలు పెట్టుకున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రైతుల పేర్లలోనూ తప్పులు దొర్లాయి. ఇలాంటివి అనేకం ఉన్నా అలాగే ప్రింటింగ్కు ఇచ్చేశారు. చనిపోయిన వారి పేర్లతోనే పట్టాదారు పాస్పుస్తకాలు ప్రింట్ చేశారు. వారసులు వాటిని తీసుకుని మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి కొత్తవి తీసుకోవాలి. మగవారి పేర్లను ఆడవారిగా, ఆడవారి పేర్లను మగవారిగా మార్చేశారు. కొందరి పేర్లు సగమే ముద్రించి వదిలేశారు. ఆధార్, మొబైల్ నంబర్లలో తప్పులు ఉన్నాయి. కొన్నిచోట్ల కౌలు చేసే వారి పేర్లతో పుస్తకాలు తయారు చేశారు. వీటిని ఇలాగే రైతులకు ఇస్తే.. భూములు అమ్ముకోవాలన్నా, రుణం తీసుకోవాలన్నా ఇబ్బందులే. సరి చేయించుకోవాలంటే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ప్రింటింగ్లోనూ తప్పులే రైతుల అంగీకారం తీసుకుంటే.. గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్ల్యండ్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూస్వభావం తదితర వివరాలన్నీ ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు (అంగీకారం) తీసుకున్నాకే వెబ్ల్యండ్లో నమోదు చేశారు. అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్దఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు. ఉన్న పుస్తకంలో మరో రైతు ఫొటో వచ్చింది. పేర్లు మారిపోయాయి. 40వేల పుస్తకాల్లో సమాచారం తప్పుగా ఉంది. 25వేలకు పైగా పట్టాదారు పాస్పుస్తకాల్లో ఫొటోలు తేడాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే 8వేలకు పైగా ఉన్నాయి. పశ్చిమగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వాటిని అలాగే రైతులకు పంపిణీ చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సరిదిద్దే చర్యలు చేపట్టారు. రైతుల అంగీకారం తీసుకుంటే.. గతంలో రెవెన్యూ రికార్డులను వెబ్ల్యండ్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక పత్రం ఇచ్చారు. అందులో భూ యజమానుల పేర్లు, సర్వే నంబరు, సబ్డివిజన్, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది? భూస్వభావం తదితర వివరాలన్నీ ముద్రించారు. తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వాలని కోరారు. పత్రాలపై రైతుల సంతకాలు (అంగీకారం) తీసుకున్నాకే వెబ్ల్యండ్లో నమోదు చేశారు. అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్న రీసర్వే రికార్డులు, సమాచారం ప్రకారమే పట్టాదారు పాస్పుస్తకాలు ముద్రించారు. అందుకే పెద్దఎత్తున తప్పులు దొర్లాయని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

యానాం పరిధిలో…గ్యాస్ పైప్ లైన్ లీక్,

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ యానాం పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు. భయభ్రాంతులకు సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్ప గ్రామాల ప్రజలు.తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిన ఈ సంఘటన. గ్యాస్ రవాణా నిలుపుదల చేయడంతో ఆగిన‌ మంటలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.