Sunday, 10 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా అమలాపురం లో

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం లో అమలాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, కళా వెంకట్రావు సోసైటీ చైర్మన్ అల్లాడ శరత్ బాబు లను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వా కప్పి బొకేలు అందజేసిన యాళ్ల గంగాధర్ రామారావు. ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్ ఏడిద శ్రీను, మాజీ కౌన్సిలర్లు దున్నాల దుర్గ, ఆశెట్టి ఆదిబాబు, ది.అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు గోకరకొండ హరిబాబు, టీడీపీ నాయకులు చింతలపూడి సత్తిబాబు, వంట్టెదు బాబు, నార్ని బుజ్జి, పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల దిన్షాబాబు, కుంచె రమేష్, రంకిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ఫ్లాష్సు.. ఫ్లాష్.. ఫ్లాష్.. సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

పున్నమి ప్రతి నిధి సిపిఐ జాతీయ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు సూరవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రి నందు మరణించారు. నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసారు

ఖమ్మం

సత్తుపల్లి నియోజకవర్గం లో పనుల జాతర 2025

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి మండలం – సదాశివుని పాలెం గ్రామంలో – తెలంగాణ రాష్ట్ర పనులు జాతర కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలం, సదాశివుని పాలెం గ్రామం లోని సబ్ స్టేషన్ లో 33/11 KV అదనపు ట్రాన్స్ఫార్మర్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ తో కలిసి శాసన సభ్యురాలు మట్టా రాగమయి ప్రారంభించారు ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసచారి,విద్యుత్ శాఖ DE,విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వ అన్ని శాఖ అధికారులు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ మాజీ చైర్మన్ తోట సుజాల రాణి, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, దొడ్డా శ్రీను,చల్లగుళ్ల కృష్ణ రావు, కమల్ పాషా, ఐ శ్రీను, సదాశివుని పాలెం కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, వినుకొండ కృష్ణ, కల్నేని రాజేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుమారి, సత్తుపల్లి మండలం, పట్టణ, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు,సదాశివుని పాలెం ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

స్మశాన వాటిక కబ్జా

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని అశోక్ నగర్ స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుని,స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి తమకు ఇప్పించాలని గ్రామస్థులు తహసీల్దార్ కి తమ వినతిపత్రాన్ని అందజేశారు. గత అరవై,డెబ్భై సంవత్సరాలనుండి స్మశాన వాటికగా ఉన్న స్థలాన్ని కబ్జాకి యత్నించారని,ప్రశ్నిస్తే తిరిగి తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్న తెలియజేశారు.

తిరుపతి

బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడి గా కోలా ఆనంద్ నియమితులు అయినందున ఆ పార్టీ నాయకులు,అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ భాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మరియు కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు. రాష్ట్రంలో పార్టీ బలోపితానికి అహర్నిశలు కృషి చేస్తానని కోలా ఆనంద్ తెలియజేశారు.

ఖమ్మం

బిజెపి ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గ ప్రకటన ఎప్పుడు..?

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి 👉కేంద్ర ము లో అధికారం ఉన్నది 👉తెలంగాణ లో కూడా అధికారం లోకి రావడం కోసం గట్టిగ ప్రయత్నం చేస్తుంది. 👉 ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థ ల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. స్థానిక సంస్థ ల ఎన్ని కల్లో విజయము సాధించాలి అని కార్యకర్తలల్లో ఉంది. తెలంగాణ లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జిల్లా కార్యవర్గ ప్రకటన చేశారు. కానీ ఖమ్మం జిల్లా లో మాత్రం ఇంత వరకు నూతన జిల్లా కార్యవర్గ ప్రకటన జరగలేదు. దీనికి కారణం.ఏమిటి..? సీనియర్ లకి ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులకి సమన్వయ లోపమా లేదంటే నూతన జిల్లా అధ్యక్షులు ఎవరి మాట వినని సీతయ్య లా ఉండటమ..? ఏది ఎం అయినా ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షులు సీనియర్ లని, పాత కొత్త నాయకులని కలుపుకొని, సామాజిక సమీకరణ లు బేరీజు వేసుకొని ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా నూతన జిల్లా కార్యవర్గ ప్రకటన చెయ్యాలి అని కార్యకర్తలు కోరుకుంటున్నారూ.

అన్నమయ్య

ముద్దాయి అరెస్ట్, బంగారం స్వాధీనం

పుల్లంపేట మండలంలోని పుల్లరెడ్డిపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు దొంగతనం కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తి చరన్ కుమార్ వద్ద నుండి రూ.5 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట రూరల్ సీఐ రమణ రెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్‌ను పుల్లంపేట ఎస్‌ఐ జేవీ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. కడప-తిరుపతి రహదారి రెడ్డిపల్లి క్రాస్ వద్ద పోలీసులు గూఢచారి సమాచారంతో ముద్దాయిని పట్టుకున్నారు. స్థానికంగా పెద్ద దొంగతనం కేసులో విజయవంతమైన ఈ అరెస్ట్‌పై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

E-పేపర్

నందలూరులో చమర్తికి ఘన స్వాగతం.

రాజంపేట Chemical తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరిస్తున్న చమర్తి జగన్మోహన్ రాజుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందలూరు బస్టాండ్ కూడలిలో ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు స్వాగ తం పలికారు ఇందులో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో చమతి జగన్మోహన్ రాజుకి శాలువా కప్పి పూలదండలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతపురం

మా ఉపేంద్ర రెడ్డి అన్న పుట్టినరోజు వేడుకలో వాల్మీకి సంఘం శుభాకాంక్షలు

వాల్మీకి సంఘం, వాల్మీకి సేవాదళ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య సైన్యం ఆధ్వర్యంలో మా ఉపేంద్ర రెడ్డి అన్న పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్యం పుష్ప నారాయణ రెడ్డి (బోడాయిపల్లి), తాడపత్రి టౌన్ ప్రెసిడెంట్ చిన్న ఎస్సీ ఎస్టీ గంగరాజు, అలాగే శివ వాల్మీకి, రామచంద్ర వాల్మీకి, సురేష్ వాల్మీకి, నరేష్ వాల్మీకి, పెద్దరాజు వాల్మీకి, పులి చంద్ర వాల్మీకి, ఆదినారాయణ వాల్మీకి, సీనా వాల్మీకి, నారాయణస్వామి వాల్మీకి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “ఉపేంద్ర రెడ్డి అన్న గారు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.

అన్నమయ్య

ఈ నెల 24న భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన కార్యక్రమం జరుగనుంది.

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వెల్ మండలంలోని కంవనముద్రం, కందులవారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఈ నెల 24న భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాదం ఏర్పాట్లు ఉన్నాయని నిర్వాహకులు వివరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.