Sunday, 10 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

ఆదాయపు పన్ను చట్టం-2025ను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఆదాయపు పన్ను చట్టం-1961ని ఇది భర్తీ చేయనుంది. ఆదాయపు పన్ను చట్టం-2025 వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే, 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది. ‘ఆదాయపు పన్ను చట్టం-2025 రాష్ట్రపతి ఆమోదం పొందింది. సరళమైన, పారదర్శకమైన, అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇది తీసుకురానుంది’ అని ఆదాయపు పన్ను విభాగం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది. ఆదాయపు పన్ను-2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంటు ఆమోదించింది. సంక్లిష్టమైన పన్ను చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు సరళమైన భాషలో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అనవసర నిబంధనలనూ తొలగించింది. 1961 నాటి చట్టంలోని 819 సెక్షన్ల సంఖ్యను 536కు, 47 అధ్యాయాలను 23కు తగ్గించింది. పదాల సంఖ్యా 5.12 లక్షల నుంచి 2.6 లక్షలకు తగ్గింది. స్పష్టత పెంచేందుకు కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలూ ఇందులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్లమెంట్ కమిటీల పరిశీలకుల నియామకం

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పార్లమెంట్ కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులుగా పార్టీ నియమించింది. 24 తేదీ సమావేశం జరిగే పార్లమెంట్ లు అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచలిపట్నం, విజయవాడ, గుంటూరు. నరసరావుపేట. ఒంగోలు. 25 తేదీన మీటింగ్ జరిగే పార్లమెంట్ లు అరకు. కాకినాడ. అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప. హిందూపూర్. 26 తేదీన మీటింగ్ జరిగే పార్లమెంట్ లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం….

ఆంధ్రప్రదేశ్

తప్పులకు అస్కారం లేకుండా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

రైతులకు ఇచ్చేముందు మరోసారి పూర్తి స్థాయి పరిశీలన ఇప్పటికీ వెంటాడుతున్న గత ప్రభుత్వ పాపాలు పంపిణీకి సిద్దంగా 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ అమరావతి: గత ముఖ్యమంత్రి ఫోటోల పిచ్చితో తన బొమ్మను ముద్రించుకున్న పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎటువంటి తప్పులకు అస్కారం లేకుండా పకడ్బందీగా సమాచారాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించి ప్రింట్ చేయిస్తున్నట్లు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంపుల శాఖా మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని, ఇంతవరకు తప్పులతో ఒక్క పాస్ పుస్తకం కూడా ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లోని రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ఇందు కోసం 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలపై అపోహలు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో 50 శాతం పుస్తకాల్లో తప్పుల తడకలే ఉన్నాయంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వం కాలంలో హాడావిడిగా చేసిన రీ సర్వే కారణంగా చాలా తప్పులు దొర్లాయని, వారిచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల్లోనూ ఆ తప్పులు ఉన్నాయని చెప్పారు. అయితే వీటిని సరి చేసేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ సర్వే జరిగిన 6688 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా 2 లక్షల 79 వేల అర్జీలు వచ్చాయని, వాటన్నంటినీ వంద శాతం పరిష్కరించామని చెప్పారు. అంతే కాక ఆ తర్వాత 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, వాటిల్లో వచ్చిన లక్షా 85 వేల అర్జీలను వంద శాతం పరిష్కరించామని చెప్పారు. వీటి తర్వాత ఇంకా తమ భూముల వివరాలకు సంబంధించి, పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులకు సంబంధించి ఎవరైనా భూ యజమానులు ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు నాలుగు నెలల సమయాన్ని కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో రైతులు, భూ యజమానుల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి రికార్డులను లైవ్ వెబ్ ల్యాండ్ లో సరి చేసినట్లు చెప్పారు. ఆ లైవ్ వెబ్ ల్యాండ్ లో ఉన్న డేటానే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో ముద్రించినట్లు చెప్పారు. ముద్రణ అయిన తర్వాత కూడా మరలా జాయింట్ కలెక్టర్ కార్యాయలం స్థాయిలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాలు లైవ్ వెబల్యాండ్ డేటా ప్రకారం ఉన్నాయో లేవో క్షుణ్ణంగా పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ పక్రియ తుది దశలో ఉందన్నారు. రైతులకు ఎటువంటి ఆందోళన వద్దు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి కొత్త పాస్ పుస్తకాలు ముద్రించి ఇస్తామన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత కూడా వాటిల్లో ఏవైనా మార్పులు కావాలని భూ యజమానులు కోరుకుంటే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి ఉచితంగా చేసి పెడతామని, కొత్త పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. జాయింట్ ఎల్పీఎమ్ ల సబ్ డివిజన్ కు సంబంధించి ఇప్పటికే లక్షకు పైగా అభ్యర్ధనలను ఎటువంటి ఫీజు తీసుకోకుండా పరిష్కరించినట్లు చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకంపై ఫోటో సక్రమంగా ఉందా లేదా అనే విషయాన్ని పంపిణీకి ముందుగానే గుర్తించి జాయింట్ కలెక్టర్లు కొత్త ఫోటోను ముద్రించి ఇస్తారని చెప్పారు. పేర్లు, జెండర్ తప్పులు ఉంటే వాటిని కూడా ముందుగానే సరి చేస్తున్నామని, పట్టాదారు పాస్ పుస్తకం అందిన తర్వాత రైతులు ప్రభుత్వానికి అభ్యర్దించినా వాటి మార్పులు ఉంటాయని చెప్పారు. రుణాలు పొందేందుకు రైతులకు ఎటువంటి ఆటంకం లేదు రైతులు రుణాలు పొందేందుకు పట్టాదారు పాస్ పుస్తకంతో పని లేదని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి బ్యాంకర్ కు లైవ్ వెబ్ ల్యాండ్ లోన్ చార్జ్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందని, దాని ద్వారా మాత్రమే రుణాలు ఇస్తారని, అందులో నిజమైన భూ యజమాని ఎవరో తెలిసి పోతుందని, రుణాలు పొందేందుకు పట్టాదారు పాస్ బుక్ లతో పని లేదని చెప్పారు. కౌలు రైతుల పేర్లు పట్టాదారు పాస్ పుస్తకాల్లో యజమానులుగా ప్రింట్ అయ్యానని అనడం అర్దం లేదని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై యజమాని పేరు 1బి(ఆర్వోర్) మాస్టర్ నుండి ప్రింట్ అవుతుందని, ఆర్వోరోలో కైలుదారుల పేర్లు ఉండవని, కాబట్టి వారి పేర్లు పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించే అవకాశమే లేదన్నారు. రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

జాతీయ అంతర్జాతీయ

చైనా గురించి భయపెట్టే నివేదిక, భారతదేశం ప్రమాదంలో ఉందా?

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ అమెరికా నివేదిక తర్వాత ప్రపంచంలో సంచలనం అమెరికా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ ఆంథోనీ కాటన్ చేసిన ప్రకటన తర్వాత ప్రపంచం పెద్ద షాక్ లో ఉంది. అతను చైనా నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తమ సైన్యానికి 2027 నాటికి తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని నేరుగా ఆదేశాలు ఇచ్చారని ఆయన అన్నారు. ఒకవైపు భారతదేశం మరియు అమెరికా మధ్య సుంకాలపై పెద్ద వివాదం జరుగుతోంది. చైనా భారతదేశంతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే, మరోవైపు చైనా పెద్ద ప్లాన్ లో ఉంది. చైనా తన అణ్వస్త్రాల నిల్వ మరియు సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటోంది, ఇది మొత్తం ప్రపంచానికి ప్రమాదకరం. ఈ ఆయుధాలను భూమి, గాలి మరియు నేరుగా సముద్రం నుండి కూడా ప్రయోగించవచ్చు. బీజింగ్ ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని కొనసాగిస్తామని పదేపదే చెబుతోంది. చైనా ఏ పరిస్థితిలోనూ ముందుగా అణ్వస్త్రాలను ఉపయోగించదు. అంతేకాకుండా, అణ్వస్త్రాలు లేని ఏ దేశంపై కూడా వారు అణ్వస్త్రాలను ఉపయోగించరని కూడా చెప్పారు. అంతేకాకుండా చైనా తమ రక్షణ మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో కొన్ని విషయాలను పేర్కొంది. చైనా నివేదిక ప్రకారం, దాడులకు ప్రతిస్పందించడానికి మొదట అణ్వస్త్రాలను ఉపయోగిస్తామని వ్యూహంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, సైన్యం ఓడిపోతుంటే అణ్వస్త్రాలను ఉపయోగిస్తారని కూడా చెప్పారు. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ ప్రకారం, చైనా ప్రస్తుతం 600 అణ్వస్త్రాలను కలిగి ఉంది మరియు వారు 350 కొత్త క్షిపణి సైలోలు మరియు మొబైల్ లాంచర్ స్థావరాలను నిర్మిస్తున్నారు, ఇది అందరికీ ప్రమాదకరం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి దాదాపు 712 గ్రౌండ్ మిస్సైల్ లాంచర్లు ఉన్నాయని కూడా కొన్ని నివేదికల్లో పేర్కొన్నారు. దీనితో పాటు చైనా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. చైనా, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక సమావేశం జరిగింది మరియు ఈ సమావేశంలో పాకిస్తాన్ మనం ఉగ్రవాదం పట్ల విసిగిపోయామని మరియు భారతదేశం మనల్ని వేధిస్తోందని చెప్పింది. ప్రస్తుతం చైనా అణ్వస్త్రాలను పెంచుకుంటోంది. రోజురోజుకు వాటి సంఖ్య పెరుగుతూ కనిపిస్తోంది. ఇప్పుడు ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. 2027 నాటికి చైనా ఏ దేశాన్ని అయినా నాశనం చేయగలదని కూడా చెబుతున్నారు.

కాకినాడ

నేడు కాకినాడ జిల్లాలో సీఎం పర్యటన

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం పర్యటించనున్నారు. పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి, ప్రసంగిస్తారు. సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం పెద్దాపురం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు పైన కసరత్తు ముమ్మరం

క్రిష్ణా జిల్లాకు వంగవీటి పేరు, తిరుపతికి బాలాజీ పేరు, పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు పైన కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా అవసరమైన మార్పుల దిశగా నిర్ణయం చేయనుంది. జిల్లాల వారీగా సబ్ కమిటీలోని మంత్రులు పర్యటనలు చేసి.. తుది నివేదిక సిద్దం చేయనున్నారు. కొత్తగా జిల్లా పేర్ల విషయంలోనూ వినతులు వస్తున్నాయి. అదే విధంగా మండలాల పైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్త జిల్లాలు – మండలాలు ఏర్పాటు… పేర్ల మార్పు పైన సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. ఈ అంశం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తోంది. పలు జిల్లా ల పేర్లు మార్పు పైన వినతులు వస్తున్నాయి. క్రిష్ణా జిల్లాకు వంగవీటి పేరు, తిరుపతికి బాలాజీ పేరు, పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందాయి. ఇక.. రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. కాగా, ప్రస్తతం ఉన్న 26 జిల్లాలు 32కు పెరగనున్నట్లు తెలిసింది. అలాగే పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. ఇక.. రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు జిల్లాల వారీగా పర్యటించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. మూడు బృందాలుగా మంత్రులు జిల్లా పర్యటన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 29 30 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బిసి జనార్దన్ రెడ్డి, అనిత పర్యటించనున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 2న అల్లురి జిల్లాలో పర్యటన ఉంటుంది. ఈ నెల 29 న పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాల్లో మంత్రులు మనోహర్, నారాయణ పర్యటన చేయనున్నారు. 30 న చిత్తూరు, కడప జిల్లాల్లో.. అదే రోజున ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు రామానాయుడు, సత్యకుమార్ పర్యటించున్నారు. గంటూరులో సెప్టెంబర్ 2న పర్యటించనున్న మంత్రివర్గ ఉప సంఘం తమ వద్దకు వచ్చిన అన్ని అభిప్రాయాలు.. సూచనలకు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీని పైన సంక్రాంతి వేళ ప్రభుత్వం కొత్త జిల్లాల పైన నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్

జిల్లాల వారీగా రేషన్ కార్డులు! ఏ జిల్లా కు ఏ ఏ తేదీలలో విడుదల చేనున్నారు.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ప్రకటించినట్లుగానే ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతోంది. తొలిసారి రాష్ట్రంలో రేషన్ కోసం స్మార్ట్ కార్డుల్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రక్రియను సాఫీగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రమంతా ఒకేసారి కాకుండా జిల్లాల వారీగా రేషన్ కార్డుల్ని విడుదల చేయబోతోంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభించబోతున్నారు. అనంతరం ఈ నెల 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే నెల 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చివరిగా వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మిగిలిన బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు దశల్లో రాష్ట్రం మొత్తం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేషన్ కార్డుల జారీలో అంతకంతకూ ఆలస్యం చేస్తూ వచ్చింది. దీనికి కారణం ఈకేవైసీ పూర్తి కాకపోడం, అనర్హుల తొలగింపు వంటి కారణాలున్నాయి. వీటిని సరిచేస్తూ ఇప్పటికి కార్డుల జారీకి సిద్దమవుతోంది. ఈసారి ఈ కార్డుల ద్వారా రేషన్ పక్కదారి పట్టకుండా ఉండటం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఇందులో క్యూ ఆర్ కోడ్ ను నిక్షిప్తం చేస్తోంది. ఈ స్మార్ట్ కార్డుల్ని డూప్లికేట్ చేయడం కానీ, అక్రమాలకు వాడుకోవడం కానీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్డులపై రేషన్ దారుల్లోనూ ఆసక్తి నెలకొంది

తిరుపతి

ఆధ్యాత్మిక తిరుపతి మహా నగరంలో ప్రాత హ్ కాల సంకీర్తన లు

తిరుపతి, తిరుచానూరు లో ప్రాత కాల సంకీర్తన లతో పుణ్య, పర్య దినాలలో ఆధ్యాత్మిక వెల్లి విరుస్తుంది… ఈ కార్యాక్రమం లో తిరుపతి భజన బృందాలు, కోలాటం, డప్పులు, వాద్యా, తప్పేట్లు తాళలా తో ఉదయం 5గంటల నుండి 7గంటల వరకు తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా వున్న శ్రీ ప్రసన్న భక్తంజనేయస్వామి గుడి నుండి బయలుదేరి.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మీదుగా , పచ్చిమ మాడ వీధి, గాంధీ రోడ్, సున్నప వీధి, బండ్ల వీధి, శ్రీ. గోవింద రాజస్వామి తెరు వీధి లలో సంకీర్తన,కోలాట, భజనలతో లతో శ్రీ గోవిందా రాజస్వామి దేవాలయ దర్శనం తో ముగుస్తున్నది.. ఈ కార్యా క్రమం ను రాయలసీమ రంగస్థలి కళాకారులబృంద సభ్యులు శ్రీ గుండాల గోపినాథ్ రెడ్డి, అత్తూరు వాసు దేవరెడ్డి, మేకల గంగయ్య, పొన్నాల జేజి రెడ్డి, నృత్య, గాన కళాకారులూ శ్రీ మునెప్పగారి మునినాద రెడ్డి, సుశీల, వాసు, తొందమనాటి సుబ్రహ్మణ్యం, శారదా, సుజాత, టాగూర్, సుజిత్, సుదర్శన్, శ్రీమన్నారాయణ, వరదారెడ్డి, సుధా, చిత్రపు మోహన్రావు, పాల్గొన్నారు

తిరుపతి

ఆధ్యాత్మిక తిరుపతి మహా నగరంలో ప్రాత హ్ కాల సంకీర్తన లు

తిరుపతి, తిరుచానూరు లో ప్రాత కాల సంకీర్తన లతో పుణ్య, పర్య దినాలలో ఆధ్యాత్మిక వెల్లి విరుస్తుంది… ఈ కార్యాక్రమం లో తిరుపతి భజన బృందాలు, కోలాటం, డప్పులు, వాద్యా, తప్పేట్లు తాళలా తో ఉదయం 5గంటల నుండి 7గంటల వరకు తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా వున్న శ్రీ ప్రసన్న భక్తంజనేయస్వామి గుడి నుండి బయలుదేరి.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మీదుగా , పచ్చిమ మాడ వీధి, గాంధీ రోడ్, సున్నప వీధి, బండ్ల వీధి, శ్రీ. గోవింద రాజస్వామి తెరు వీధి లలో సంకీర్తన,కోలాట, భజనలతో లతో శ్రీ గోవిందా రాజస్వామి దేవాలయ దర్శనం తో ముగుస్తున్నది.. ఈ కార్యా క్రమం ను రాయలసీమ రంగస్థలి కళాకారులబృంద సభ్యులు శ్రీ గుండాల గోపినాథ్ రెడ్డి, అత్తూరు వాసు దేవరెడ్డి, మేకల గంగయ్య, పొన్నాల జేజి రెడ్డి, నృత్య, గాన కళాకారులూ శ్రీ మునెప్పగారి మునినాద రెడ్డి, సుశీల, వాసు, తొందమనాటి సుబ్రహ్మణ్యం, శారదా, సుజాత, టాగూర్, సుజిత్, సుదర్శన్, శ్రీమన్నారాయణ, వరదారెడ్డి, సుధా, చిత్రపు మోహన్రావు, పాల్గొన్నారు

E-పేపర్

రాజంపేట టిడిపి ఇన్చార్జికి ఘన సన్మానం

– ఘనంగా సన్మానించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్దవటం ఆగస్టు 22 అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమింపబడ్డ నేపథ్యంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం జగన్మోహన్ రాజుకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రాజు అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో టిడిపి అధిష్టానం ఆయన సేవలను గుర్తించి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని రామయ్య కొనియాడారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.