Sunday, 10 May 2026

Blog

యాదాద్రి భువనగిరి

శతాధిక కవి సమ్మేళనానికి వనగంటి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రచయిత, గాయకుడు వనగంటి వెంకటేష్ కు ఈనెల 31 ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే మహాకవి దాశరధి కృష్ణమాచార్య గారి శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మరియు అపూర్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతాధిక కవి సమ్మేళనానికి వనగంటి వెంకటేష్ కు ఆహ్వానం వచ్చింది. కవి సమ్మేళనం లో పాల్గొని కవిత గానం చేసి వివిధ ప్రముఖుల చేత దాశరధి కృష్ణమాచార్య శతజయంతి పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు వనగంటి వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మనిషి ముఖ్యమా? లేక కుక్క ముఖ్యమా? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త సమస్య!!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ వీధికుక్కలేమో మనుషులను కరిచి చంపేస్తున్నాయి! దీంతో కుక్కలను పూర్తిగా జనం మధ్య నుంచి తొలగిద్దామంటే అదీ కుదరదు. అవీ మనలాంటి ప్రాణులే కాబట్టి వాటికీ స్వేచ్ఛ.. బతికే హక్కు ఉంటుంది. మరి మనకు ఎవరు ముఖ్యం మనుషులా.. లేక కుక్కలా!! ముందు ఈ డేటా ఓ సారి చూడండి. రోజుకు 10 వేల మందిని కరిచేస్తున్న కుక్కలు కుక్క కాటుతో దేశంలో గంటకు ఇద్దరు పిల్లల మరణం 2024లో దేశంలో 37.17 లక్షల కుక్క కాట్లు నమోదయ్యాయి. అంటే, రోజుకు సగటున 10,000కుపైగా కాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారత్లో ప్రతీ ఏటా రేబీస్ కారణంతో ఏకంగా 18 వేల నుంచి 20 వేల మంది మరణిస్తున్నారు. బాధితుల్లో పిల్లలే అధికం.

తెలంగాణ

అప్పల ఆంజనేయ స్వామి బండ్ల పండుగకు హాజరైన :ఎమ్మెల్యే

శాలిగౌరారం :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని పెరక కొండారం గ్రామంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ అప్పల ఆంజనేయ స్వామి బండ్ల పండుగ సందర్భంగా గౌరవ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు గారు స్వామి వారిని దర్శించుకొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెరక కొండారం నుండి అడ్లూర్ గ్రామం వరకు రోడ్డును, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారి సహకారంతో వేయిస్థానానని హామీ ఇచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమలో రూ.76.. కాకినాడలో రూ..736 ఈ- పంట నమోదు చేస్తున్న సిబ్బంది

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రీమియం విషయంలో కాకినాడ జిల్లా రైతులపై అదనపు భారం పడుతోంది. విపత్తులతో పంట దెబ్బతింటే రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా అమలు చేస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బీమా ప్రీమియం ఎకరానికు రూ.76 కాగా, కాకినాడ జిల్లాలో మాత్రం రూ.736గా ఉంది. పక్క జిల్లాలో తక్కువ ఉండి, ఇక్కడ ఎక్కువ ఎలా వసూలు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 80 శాతం వరకు కౌలురైతులే ఖరీఫ్లో సాగు చేస్తున్నారు. వీరిపై బీమా భారం పడుతోంది. కోనసీమ జిల్లాలో టాటా కంపెనీ బీమా అమలు చేస్తుండగా, కాకినాడలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికి 25,200 ఎకరాల నమోదు ఖరీఫ్లో 2లక్షల ఎకరాల్లో వరి సాగు మొదలుకాగా, ఇప్పటికి 25,200 ఎకరాలు మాత్రమే పంటల బీమా పోర్టల్లో నమోదైంది. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న రైతులకు ఆటోమేటిక్గా ఆ సంస్థలు ఫసల్ బీమాలో నమోదు చేస్తున్నాయి. రుణం పొందలేని రైతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కౌలురైతుల్లో 50 శాతం మందికి కూడా సీసీఆర్సీ కార్డులు జారీ కాలేదు. వీరిలో అతి తక్కువ మందికి పంట రుణాలు కల్పించారు. వీఏఏ లాగిన్లలో కనిపించని భూమి వివరాలు రుణాలు పొందని రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకుడు(వీఏఏ) పంట సాగుచేస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం ఇస్తేనే కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లో బీమాకు అవకాశం ఉంది. వీఏఏ లాగిన్లలో సదరు భూమి సర్వే నంబర్లు, ఖాతాలు కనిపించడంలేదు. దీంతో చాలా మంది ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులు వెళ్లగా.. సాంకేతిక లోపాలను సరిదిద్దుతూ ఈ నెలాఖరు వరకు బీమా నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులు చొరవ తీసుకుని ప్రీమియం భారం తగ్గేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. కంపెనీల కొటేషన్ ఆధారంగానే.. దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదించగా ప్రీమియం విషయంలో వ్యత్యాసాలు ఆయా బీమా కంపెనీలు కొటేషన్ ఆధారంగా ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా అర్హులందరూ పంట బీమాలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాగు విస్తీర్ణం – 2.10 లక్షలు ఎకరాలు బీమాలో నమోదైన పంట – 25,200 ఎకరాలు బీమా చేయించుకున్న రైతులు 20,821 దాఖలు చేసిన దరఖాస్తులు 34,775 వీటిలో రుణం పొందినివి – 34,058 రుణం పొందనవి – 717

అన్నమయ్య

స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్రలో శ్రమదానం చేసిన అన్నమయ్య పోలీసులు

జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు ప్రకారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి పోలీస్ ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.చెత్త, వ్యర్థాలను తొలగించి శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. గుణపం, పారలతో పిచ్చి మొక్కలు తొలగించి, చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. ప్రజలందరూ తమ ఇళ్ళు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు

అన్నమయ్య

రైల్వేకోడూరు డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

చిట్వేల్ ఆగస్టు { పున్నమి ప్రతినిధి} రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్ గారి అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రా లో భాగంగా అంటువ్యాధులు నివారణ మరియు పరిశుభ్రత అనే అంశం పై మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వాటి వలన వచ్చే నష్టాలను మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు కళాశాల రసాయన శాస్త్ర ఉపన్యాసకుడు శ్రీ.కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వలన కలిగే ఇబ్బందులు మన పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా మనం చూడాలని తెలిపారు.కళాశాల యన్.ఎస్. యస్.ప్రోగ్రామ్ అధికారి శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమము మన పరిసరాల పరిశుభ్రత్త కు ప్రాధన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయడం జరిగింది తర్వాత విద్యార్దులు కళాశాల లో చుట్టుప్రక్కల శుభ్రం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్దులు పాల్గొన్నారు

ఖమ్మం

భారతీయ జనతా పార్టీ పల్లెనిద్ర కార్యక్రమం

ఈరోజు పల్లె నిద్ర కార్యక్రమం చింతకాని మండలంలో జరిగినది రాష్ట్ర పార్టీ సూచన మేరకు జిల్లా పార్టీ ఆదేశానుసారం మండలంలో విస్తృత పర్యటన లో భాగంగా రేపల్లెవాడ గ్రామ రైతులను రైతు కూలీలను పరామర్శించి పెసర పంట పండించిన రైతులు బాధలు వర్ణాతీతం వారు ఒక రైతు ఎనిమిది ఎకరాలు ఏస్తే ఎకరానికి ఎనిమిది బస్తాలు అంటే 8 క్వింటాల్ పెసర పండింది అందులో సగం కూలీలకు సగం రైతుకు అని వారి బాధలు చెప్పుతుంటే ఎంతో బాధ వేసింది మళ్లీ వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు లేవని ఎంతో కన్నీటి పర్యంతం అయ్యారు ఈ పరిస్థితిని ప్రభుత్వాలు తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రబారి మందడపు సుబ్బారావు ముఖ్యఅతిథి మేకల నాగేంద్ర మండల కన్వీనర్ మద్దినేని వెంకటేశ్వరరావు మీ సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్తామని వారికి ధైర్యాన్ని కల్పించడమైనది

ఆంధ్రప్రదేశ్

వినాయకచవితి పండుగ శాంతియుతంగా జరగాలని ఎస్ఐ నవీన్ సూచన

మండల వ్యాప్తంగా జరగబోయే వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని చిట్వెల్ ఎస్‌ఐ నవీన్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఎస్‌ఐ మాట్లాడుతూ పండుగ ఏర్పాట్లలో ప్రతీ కమిటీ ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్, నిమజ్జన ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చూడాలని సూచించారు. వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతులు తప్పనిసరి అని, ఊరేగింపులు శాంతియుతంగా జరిగేలా సహకరించాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎస్‌ఐ, డీజేలు, రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతి లేనని హెచ్చరించారు. పండుగను భక్తి, ఆనందాలతో జరుపుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

వర్షాకాల పరిశుభ్రతపై ఉపాధ్యాయుల అవగాహన – విద్యార్థుల శుభ్రతా కార్యక్రమం, ప్రతిజ్ఞ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం నిర్వహించే “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్‌లో “వర్షాకాల పరిశుభ్రత – Monsoon Hygiene” కాన్సెప్ట్‌తో కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ వర్షాకాలంలో పరిసరాలను పొడిగా ఉంచి దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా వంటి వ్యాధులను నివారించుకోవాలని సూచించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు లక్ష్మీకలావతి, సుహాసిని, శివనారాయణ అపరిశుభ్రమైన నీరు, సరిగా ఉడకని ఆహారం వల్ల వచ్చే పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాఠశాల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టగా, బ్లీచింగ్ పౌడర్ చల్లి ర్యాలీ నిర్వహించారు. చివరగా ఉపాధ్యాయుడు నవీన్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.

పల్నాడు

ఒంగోలులో జరిగే సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలకు తరలివెళ్లిన నాయకులు

సిపిఐ రాష్ట్ర మహాసభకు తరలి వెళ్లిన నాయకులు కారంపూడి,ఆగస్టు 23(పున్నమి ప్రతినిధి). ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలకు మాచర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి సిపిఐ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు కార్మికులు రైతు సంఘం నాయకులు భారీ స్థాయిలో శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు కూలీల సమస్యలు ధరల పెరుగుదల విద్యా ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ బాధ్యత మహాసభలో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం యువతను పార్టీలోకి పెద్ద ఎత్తున తీసుకురావడం వంటి అంశాలను గురించి మాట్లాడుతామన్నారు మహాసభకు వెళ్ళిన వారిలో కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా, సహాయ కార్యదర్శి మేకపోతు చినుకోటిరెడ్డి దుర్గి మండల కార్యదర్శి కాల శివయ్య, మాచల పట్టణ కార్యదర్శి మిద్దె పోగు బాబురావు, రెంటచింతల మండల కార్యదర్శి కేతావత్తు రంగనాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు రంగస్వామి శ్రీపతి సత్యనారాయణ నాగసుబ్బయ్య వెంకటాచారి బ్రహ్మచారి పార్వతయ్య, గాలం శ్రీనివాసరావు వెళ్లారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.