Sunday, 10 May 2026

Blog

సక్సెస్ స్టోరీస్

కన్న తల్లిదండ్రుల కడుపు కోతలు! ఇది చిత్రం కాదు రియల్ గా జరుగుతున్న స్టోరీలు…

పిల్లల్లో సెల్ ఫోన్ వ్యసనం హత్యలకు దారితీసే ప్రమాదాలు, కారణాలు. సహస్ర హత్య కేసే సాక్ష్యం. స్పందనే ఈ కథ. ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు మారాం చేయకుండా ఉండాలంటే అనే ఉద్దేశంతో, తినడం లేదని, ఏడుస్తున్నారని… వారి చేతికి ఫోన్లు అప్పగిస్తున్నారు. కానీ ఇది భవిష్యత్తులో వాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూల కారణం ఎవరు.? పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవ్వడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే. బిజీ లైఫ్ స్టైల్స్ కారణంగా పిల్లలకు సరైన సమయం కేటాయించాలి అన్న బాధ్యతను బావిలో పడవేసి, తమ కొడుకులకు కూతుళ్లకు ఫోన్ ఇచ్చి తమ పని చూసుకుంటున్నారు. పిల్లలు మారాం చేసినప్పుడు ఫోన్ ఇవ్వడం, తినడం కోసం ఫోన్ అవసరం అనుకోవడం తల్లిదండ్రుల్లో పెరిగిన అభ్యాసం. అయినప్పటికీ, ఈ అలవాటు వ్యసనంగా మారిపోతూ, పిల్లల్లో ఆందోళన, నిరాశ, ఆగ్రహం పెరగడానికి దారితీస్తుంది. సెల్ ఫోను కారణంగా వచ్చే ప్రమాదాలు: శారీరక సమస్యలు, కంటి చూపు తగ్గడం, వెన్ను సంబంధిత సమస్యలు, ఒబెసిటీ, మానసిక సమస్యలు, డిప్రెషన్, ఒత్తిడి, అగ్రెషన్, సోషల్ ఐసోలేషన్, చదువుపై దుష్ప్రభావం, సోషలైజేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. హత్య, ఆత్మహత్యలకు దారితీసే గంభీర పరిస్థితులు వయసు పెరిగే కొద్దీ వీడియోలు, ఆటలు, పోర్న్, బెట్టింగ్, బుల్లీయింగ్ వంటి డిజిటల్ డేంజర్ వల్ల పిల్లలు నేరాలకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మార్చుకోవాల్సిన తల్లిదండ్రుల బాధ్యత.! పిల్లలకు ఫోన్ల ఉద్దేశపూర్వక వినియోగం గురించి చెప్పాలి,డిజిటల్ ఎక్స్పోజర్ టైం తగ్గించాలి, వారితో సమయం గడపాలి, ఆటలకి ప్రోత్సహించాలి, ఇంట్లో చిన్న పనుల్లో భాగం చేయాలి, తల్లిదండ్రులు స్వయంగా ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. లేకపోతే పిల్లల్ని కన్నందుకు అనేక బాధల్ని చవిచూడాల్సి వస్తుంది. పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకూడదని సామాజిక ఉద్యమానికి తెర తీయాలి. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే కారకులు.! కానీ 90% కారకులు తల్లిదండ్రులే..! అది ఎలాగో తెలుసుకుందాం…. పిల్లల్ని గారాబం మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు.! ఇప్పుటి తరం 70% పిల్లలు..తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు.మంచి నీళ్ళు, పాలు,కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవమంటే లేవరు.గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర్మంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకూడదని సామాజిక ఉద్యమానికి తెర తీయాలి. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు. హత్య జరిగిన రోజే.. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి.! వర్తన చూసి ప్రశ్నిస్తే.. దబాయించిన బాలుడు క్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు చూసి తప్పటడుగులు.ఎవరైనా తోటి పిల్లల వస్తువులపై మనసు పడితే తనకూ కొనివ్వాలని తల్లిదండ్రులను పోరుపెడతారు..అతను మాత్రం ఇంట్లోకి చొరబడి ఎలా కొట్టేయాలో ప్లాన్‌ రాసుకున్నాడు. పిల్లలు తప్పు చేస్తూ దొరికిపోతే భయంతో పారిపోతారు.. అతను మాత్రం హత్య వరకూ వెళ్లాడు. ఇలాంటి నేరం చేస్తే ఎవరైనా భయపడిపోతారు.. అతను మాత్రం ఏ జంకూ లేకుండా ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించాడు. పక్కింట్లో బాలికను చంపేసి కూడా బాధపడని అతడు.. అదేరోజు తన పెంపుడు కుందేలు చనిపోతే మాత్రం దిగాలు పడ్డాడు. అనుమానంతో ప్రశ్నించిన తల్లినీ మాయమాటలతో బురిడీ కొట్టించాడు. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడు పదో తరగతి విద్యార్థి ప్రవర్తన ఇది. విచారణలో అతడు వెల్లడించిన విషయాలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ అవినాశ్‌ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు. కళ్లు మూసుకొని కత్తితో పొడిచి. సెలవు రోజుల్లో గల్లీలో పిల్లలందరూ కలిసి క్రికెట్‌ ఆడేవారు. కొన్ని రోజుల క్రితం సహస్ర తమ్ముడి బ్యాట్‌ నచ్చిన నిందితుడు తానొకసారి ఆడి ఇస్తానని అడగ్గా.. అతడు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా దాన్ని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. వారి అపార్ట్‌మెంట్ల మధ్య కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉండటంతో రెండుసార్లు గోడదూకి వెళ్లి పరిశీలించాడు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లినా తలుపులు తీసి లోపలకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించాడు. ఓటీటీలో క్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్‌లో సీఐడీ సీరియల్స్‌ చూసిన అనుభవంతో దొంగతనానికి పథకం రాసుకున్నాడు. ఎవరైనా అడ్డొస్తే భయపెట్టాలని వంటగదిలోని కత్తి తీసుకొని బయలుదేరాడు.కానీ, ఇంట్లో ఎవరూ ఉండరనకుంటే సహస్ర కనిపించడంతో కాసేపు ఆలోచించాడు. ఆమె టీవీ చూస్తుండటంతో గుట్టుగా వెళ్లి బ్యాట్‌ తీసుకొని బయలుదేరాడు. ఈలోపు బాలిక గమనించి దొంగదొంగ అంటూ కేకలు వేస్తూ.. ఇంటి గుమ్మం వద్ద అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగింది. మీ డాడీకి చెబుతానంటూ బెదిరించింది. దీంతో భయపడిన బాలుడు కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. మెడపై తీవ్రగాయం కావటంతో బాలిక నిర్జీవంగా పడిపోయింది. తరువాత బాలుడు కత్తిని అక్కడే నీళ్లతో కడుక్కొని, బ్యాట్‌ తీసుకొని తన ఇంటికి వచ్చాడు. ఇంత చిన్న వయసులోనే కరుడుగట్టిన అంతకుడిగా మారిపోయాడు, మీ పిల్లలు కూడా ఇలా మారకుండా ఉండాలంటే మీరే మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులారా గమనించండి మేల్కొనండి జాగ్రత్త పడండి మీ పిల్లల్ని మీరు రక్షించుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదం మీ కడుపు నుండే పుట్టింది అవుతుంది. ఇక కొందరు ఆడ పిల్లల ప్రవర్తన మహా డేంజర్ గా ఉంది. కొందరు ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు.20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు.బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు.వారిస్తే వెర్రి పనులు. దీంతో తల్లిదండ్రులు మదనతో ఏం చెప్పలేకపోవడం గమనర్హం.మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,కానీ కారణం మనమే..ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం. గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. సోమరి పోతుల్లా తయారు కావడానికి తల్లిదండ్రులే కారణం.! వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి. కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.మరికొంతమంది సోమరిపోతుల్లా తయారు అవుతున్నారు. పెద్దలు కనిపిస్తే నమస్కరించే పద్ధతులు కూడా కొన్ని ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గుడ్, బయటి ఫుడ్, మీకు అనారోగ్యం, హాస్పిటల్లో బెడ్, ప్రస్తుత ఈ కాలంలో 50% నేటి యువత బయటి ఫుడ్ కు అలవాటు పడి, బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు. దీనివల్ల వారి మానసిక రుగ్మతలు పెరిగిపోయి వారు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల శారీరక మానసిక సంఘటనలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా యువతలో మార్పులు రావడం చూసి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు అయ్యో నా బాబు నా కూతురు ఇలా అయిపోతుంది ఏమిటి.? అని అయోమయానికి గురవుతున్నారు. దీంతో వారికి గారాబం చేస్తున్నారు మా తల్లిదండ్రులు అనే ఒక వీక్ పాయింట్ వారికి అర్థం కావడం వల్ల వారు మరింతగా బయటి ఫుడ్డుకు అలవాటు పడి వారి జీవితాన్ని వారే సర్వనాశనం చేసుకుంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల్లో కలుగుతున్న ఈ విపత్తును తుంచి వేయకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు వస్తున్నారంటే పిల్లలకు ఒక పండగ వాతావరణం కనిపించేది. మారుతున్న ఈ కాలంలో ఆ బంధాలు తెగిపోయాయి, నాడు పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాజా తాజాగా పళ్ళు ఫలాలు కూరగాయలు ఆకుకూరలు ఎన్నో లభించేవి అవి తిన్నవారు ఆయురారోగ్యాలతో ఉండడంతో పాటు మనిషి మనుగడ జీవితం శాంతం భద్రం మనం ఎలా చదవాలి ఎలా ఎదగాలి అని ఒక నైపుణ్యత పిల్లల్లో సుస్థిర స్థానం ఇమిడిపోయి ఉండేది, కాలం మారిపోయింది దీంతో..కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్.చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. దీంతో మానసిక ఎదుగుదల క్షీణించిపోయి ఎంత చదివినా కానీ వారి మెదడుకు ఎక్కక దీనితో పాటు సెల్ ఫోన్లు వాడడంతో వారు ఎంత చదివినా గాని వారి దృష్టి అంతా మొబైల్ లోనే ఉండడం వల్ల వాళ్ళు చదువుకోలేక పోవడం క్రైమ్ మద్యం అంబార్ గుట్కా గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అనుక్షణం వీరు తల్లిదండ్రులు నిఘా పెట్టి అరికట్టకపోతే

భక్తి

వినాయక విగ్రహాల ఏర్పాటులో గాజువాకకు ప్రత్యేక స్థానం… లక్ష చీరలతో గణనాధుడు

లక్ష చీరలతో గణనాధుడు ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ గాజువాకలో వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చాలా ప్రత్యేకమైన, వినూత్నమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటంలో గాజువాకకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎత్తైన 117అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత కూడా గాజువాకకే దక్కింది. అయితే ఈ సారి కూడా గాజువాకలో లకా గ్రౌండ్స్ లో శ్రీ సుందర వస్త్ర మహా గణేష పేరుతో ఈసారి లక్ష చీరలతో 90 అడుగుల గణనాథుడిని గణేశ నవరాత్రి వేడుకలకు సిద్ధం చేశారు. ఈ గణనాథుడిని రూపొందించడానికి ముంబై, చెన్నై, సూరత్ తదితర ప్రాంతాల నుండి చీరలను సేకరించారు. అయితే ఈసారి గణేశ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడిని రెండు మూడు రకాల ఆహార పదార్థాలతో తయారు చేయాలని భావించినా, ఆ తర్వాత ఆహార పదార్థాలు పాడైపోతాయి అన్న ఆలోచనతో చీరలతో గణనాధుని తయారు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా లక్ష చీరలతో చాలా చక్కని అందమైన 90 అడుగుల గణనాథుడిని రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్న జగన్! అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం!

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యం గా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతుతో కొత్త లెక్కలు మొదలయ్యాయి. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ జగన్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. మాజీ సీఎం జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకైక ప్రతిపక్షl పార్టీగా ఉన్న తమకు సభలో ప్రతిపక్ష హోదా కోసం జగన్ డిమాండ్ చేసారు. అందులో భాగంగా సభకు హాజరు కావటం లేదు. జగన్ తో పాటుగా వైసీపీ సభ్యులు సభకు గైర్హాజరవుతున్నారు. కాగా, వర్షాకాల శాసనసభ సమావేశాలను సెప్టెంబరు 17 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై సెప్టెంబరు 4న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా, ఈ సమావేశాలకు జగన్ హాజరు కావాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావటంతో.. హామీల అమలు తో పాటుగా పాలనా పరమైన అంశాలను సభలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభకు హాజరు కాకపోవటం ద్వారా వస్తున్న విమర్శలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో అమరావతి విషయంలో జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. తన మూడు రాజధానుల నిర్ణయానికి ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవటం తో తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి పైన ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా.. నిర్మాణంలో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. రెండో విడత భూ సమీకరణ పైన ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. లిక్కర్ కేసులో అరెస్ట్ ల అంశంలోనూ సభలో మాట్లాడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో, జగన్ సభకు హాజరు అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

చిత్తూరు

*ఒకే ఇంట్లో నలుగురు ఆడ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు

*అక్క చెల్లెళ్లను వరించిన ఉద్యోగాలు* *ఒకే ఇంట్లో నలుగురు ఆడ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు *ఆడ బిడ్డలకు ఆ నలుగురు ఆదర్శం* చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, వేపమాకులపల్లికి చెందిన సీతప్పగారి లేట్ మునివెంకటప్ప, గౌరమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో పెద్దకుమార్తె వీణాకుమారి (2014లో ఉమెన్ పోలీస్), వాణి (2016లో SGT టీచర్), వనజాక్షి (2025 ఉమెన్ పోలీస్), శిరీష (2025 లో SGT టీచర్) లను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి పదేళ్లకు ముందే చనిపోయాడు, తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ పెంచి, పెద్ద చేసి ఉన్నత చదవులు చదివించింది. ఒక తల్లిగా వారిని పోషించడమే అసాధ్యం, ఒకెత్తు అయితే ఆ తల్లి పేరును, వంశ గౌరవాన్ని నిలిపిన నలుగురు కుమార్తెలు (దేవతలు) నిజంగా సరస్వతులే. ఆర్థిక వనరులు లేక కుటుంబ ఇబ్బందులతో ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యంకాని రీతిలో వీరు మనకు మన పిల్లలకు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం. వెయ్యి ఏనుగుల బలం, వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలుగా ఉన్నాయి, ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీస్, మరో ఇద్దరు ఉపాధ్యాయిని లు కావడమే గొప్ప. ఆ విధంగా పెంచి పోషించిన ఆ మాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయికి చేరుకున్న నలుగురు అక్క చెల్లెళ్లకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

చిత్తూరు

*కుల మతాల కు అతీతుడు శ్రీకృష్ణుడు*

త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక వి.కోట కమిటీ ఆధ్వర్యంన శ్రీ కృష్ణుడి ప్రతిమ ను శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు*చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని రామాపురం గ్రామంలో గంగమ్మ గుడి ప్రక్కన వేదిక నిర్మించి* , కొలువు తీర్చి, స్వామికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం జ్ఞాన రీత్యా నిత్య పూజలు , భగవద్గీత శ్లోక పారాయణం చేసి 9 వ రోజు ఆగస్టు 24 న ఆదివారం శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది. రామాపురం గంగమ్మ గుడి ప్రక్కన ఉన్న వేదిక నుండి బయలు దేరి రామాపురం గ్రామం వీధులు మొత్తం తిరిగి మరలాశ్రీకృష్ణ ప్రతిమ కొలువు ఉన్న ప్రాంగణం వేదిక వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పుర వీధులలో అంగరంగ వైభవంగా జరిగింది. ఊరేగింపు, జన్మాష్టమి ఉద్దేశ్యము గురించి ప్రబోధ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ దేవుడే మనిషిగా అవతరించి మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడు అని అంటారని, అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడని, ఆయనను అందరూ దైవంగా గుర్తించాలని, కృష్ణుడు పౌర్ణమి అమావాస్యలకి మధ్య అష్టమి తిథిలో పుట్టి జ్ఞాన అజ్ఞానములకు వారధిగా ఉన్నాడని ప్రజలకు ఈ విషయం తెలియజేసేందుకే ఊరేగింపు కార్యక్రమం చేసేదని వారుతెలిపారు . నేటి ఊరేగింపుతో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి. ఊరేగింపు కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముస్లింలు పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని పల్లకి మో యడంతో రామాపురం మరో బృందావనంలో అయింది. పలువురు పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాధాకృష్ణ, రమేష్, త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వీకోట కమిటీ అధ్యక్షులు అశోక్ బాబు, ఝాన్సీ, రవి, విజయ్, హరి, హేమ తేజ, చరణ్, గౌతమ్ కృష్ణ, ఉదయ్, బంగారు పాల్యం, పలమనేరు, కుప్పం, శివరామపురం ల నుండి ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

చిత్తూరు

డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయునికి సన్మానం

రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో జరిపిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల పోటీ పరీక్షలో ప్రతిరోజు గ్రంథాలయానికి విచ్చేసి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదువుకొని జీవశాస్త్రం ఉపాధ్యాయుడుగా జిల్లాలో 19వ ర్యాంకును సాధించిన రంగనాథను పలమనేరు గ్రంథాలయ అధికారి హేమ కుమార్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ గ్రంథాలయానికి రావటం వల్ల అనేకరకాల పోటీ పరీక్షల సంబంధించినటువంటి పుస్తకాలను చదివి ఈ పోటీ పరీక్షకు సంసిద్ధమయ్యాను. కావున ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ యువత గ్రంథాలయం ఉపయోగించుకుంటే విజయం మనదే అని తెలిపాడు. ఈ కార్యక్రమంలో శ్రీపురం సీతారామయ్య తులసి నాదం నాయుడు విజయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి యుగంధర్ ఉమాపతి నాయుడు గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

చిత్తూరు

*కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన*

పలమనేరు లయన్స్ క్లబ్ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ , P.E.S. వైద్య కళాశాల – కుప్పం వారి ఆధ్వర్యములో కీ॥శే॥ కె. రామమూర్తి (స్వతంత్ర సమరయోధులు) వారి జ్ఞాపకార్థం వారి భార్య కె.ఆర్. జయలక్ష్మమ్మ సహకారముతో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక లయన్స్ క్లబ్లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్దఎత్తున వృద్ధులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరం 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆపరేషన్‌ కోసం 15 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.కంటి ఆపరేషన్లకు ఎంపికైనవారిని ఆపరేషన్ల కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె.ఆర్. జయశంకర్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిదంగా లయన్స్ సేవ కేంద్రంలో నిర్వహించె ప్రతి వైద్య శిబిరాలను సద్వినియోగం చేయించుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శృతి, సల్మా, లైన్స్ క్లబ్ కార్యదర్శి డా॥ మహమూద్, ఉపాధ్యక్షులు పళని,కోశాధికారి పుగలేంది, శ్రీపురం సీతారామయ్య, చంద్రయ్య శెట్టి, నరేంద్ర, గడ్డం శివ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ — ఎమ్మార్వో మురళి

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) నేడు చేజర్ల మండల వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు ఎమ్మార్వో మురళి తెలిపారు. ఈ రేషన్ కార్డ్ పైన ప్రభుత్వ అధికారిక చిహ్నం మరియు కుటుంబ పెద్ద ఫోటో ఉంటుందని మరియు కుటుంబ సభ్యుల వివరాలు, లింగము, ఏ రేషన్ షాపు, ఎక్కడ సరుకులు తీసుకుంటున్నది,ఈకెవైసీ లాంటి మొత్తం వివరాలన్నీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ఈ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

తిరుపతి

అద్వానంగా రోడ్లు పట్టించుకోని అధికారులు

శ్రీకాళహస్తి వెంకటగిరి మార్గ మధ్యలో గ్రామానికి వెళ్లే మార్గ మధ్య తారు రోడ్డు సంగతి దేవుడెరుగు.గుంతలకు కనీసం మట్టి పోసే దిక్కు లేదా యే. ఏ.యం పుత్తూరు వయా దొమ్మరపాలెం రోడ్లు అద్వాన్నంగా మారాయని ఇంతకు మునుపు అనేక పర్యాయాలు అధికారులకు చెప్పిన పత్రికలలో ప్రచురించిన ఎవ్వరు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. రానున్నది వర్షాకాలమని ఈ మార్గంలో గుంతలు ఉన్న రోడ్లలో వర్షపు నీళ్లు నిలవడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముఖ్యంగా రాత్రిళ్ళు గుంతలు కనిపించక ఇబ్బందిగా ఉందని రోడ్లు బాగు చేయించి మా సమస్యను పరిష్కరించాలని పాలకులను,అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

తిరుపతి

కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో రేపు అనగా 25/8/25 సోమవారం ఉదయం 9:00 గంటలకు అక్కుర్తి గ్రామపంచాయతీ నందు నూతన రేషన్ కార్డ్ పంపిణీ జరుగును.కావున ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాలుగొని నూతన రేషన్ కార్డులు ప్రతి లభ్యదారునికి అందజేయవలసిందిగా కోరుచున్నామని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు అక్షింతలు క్రిష్ణ యాదవ్ ప్రకటన విడుదల చేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.