Saturday, 9 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు.

ఈరోజు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వూటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు రాష్ట్ర దేవాంగ ప్రముఖులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు.వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం యువత అధ్యక్షులు పులి రామచంద్ర దర్శన ఏర్పాట్లు చేశారు.ముందుగా వారు భాస్కర పేటలోని చాముండేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించి,భాస్కరపేటలో విజయ గణపతి ఆలయంలో ఈరోజు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు.

తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద చెక్కును అందజేసిన : కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూపొని మహేందర్ కు 60 వేల రూపాయల చెక్కు అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బెల్లి వీరభద్రం, గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు సురేష్ గ్రామ కాంగ్రెస్ నాయకులు నాగయ్య,దాసు, శ్రీను,అరుణ్ కుమార్, విజయ్, ప్రవీణ్, అబ్రహం, ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

యాదాద్రి భువనగిరి

పట్టణ సీఐ రమేష్ గారు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు

*భజరంగ్ వ్యాయామశాల గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమం* యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఈ రోజు భువనగిరి పట్టణం లొ ని గంజ్ భజరంగ్ వ్యాయామశాల గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ సీఐ రమేష్ గారు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తోట శ్రీధర్,గోరింకల శివశంకర్ ,సరగడ కరుణ్ ,రంగ ప్రవీణ్, సరగడ అమర్,ముచ్చల సాయికిరణ్,సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రాము, ప్రకాష్, వెంకటేష్,ఎల్లారెడ్డి, యూత్ సభ్యుల తదితరులు పాల్గొన్నారు

గూడూరు

గూడూరు ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం –

గూడూరు పట్టణం:- ఏరియా హాస్పిటల్ నందు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొని, హాస్పిటల్ నందు పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలని, అలాగే సదరన్ సర్టిఫికెట్ మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, పేదలను ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలిపి, హాస్పిటల్ అభివృద్ధికి కావలసిన తీర్మాణాలు తదితర అంశాలపై చర్చించిన… శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మెన్

ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ విగ్రహాష్కరణ

ఎన్టీఆర్ విగ్రహాష్కరణ విశాఖపట్నం ఆగస్టు29 పున్నమి ప్రతినిధి(వి సతీష్ కుమార్) విశాఖపట్నం జివిఎంసి 90వార్డ్ విమాన్ నగర్, డబుల్ రోడ్ లో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ చేసారు‌. విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్, ప్రభుత్వ విప్ గణబాబులు ముఖ్య అతిథులుగా హాజరయి విమాన్ నగర్ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీ శే నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారకరామరావని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ పి గణబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు అని అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విమాన్ నగర్ అసోసియేషన్ సభ్యులను పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో 90 వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడీ రమణ, టీడీపీ, నాయకులు కార్యకర్తలు మహిళానాయకులు అసోసియేషన్ సబ్యులు పాల్గోన్నారు.

గూడూరు

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. మరొక్కరి గాయాలు.!!

చిట్టమూరు మండల పరిధిలోని తాగేడమ్మ గుడి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో పట్టపు. వెంకయ్య, (20)మృతి చెందగా శ్రీపతి. రాకేష్ (20) తీవ్ర మైన గాయాలతో బయట పడ్డ డు. వివరాలులోకి వెళితే చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామానికి చెందిన వీరు ఇ ద్దరు గత రాత్రి 10గం సమయం లో ఎల్లసిరి నుండి ద్విచక్ర వాహనం ఫై మల్లాం బయలు దేరాగా మార్గంలో మధ్యలో లో నున్న తాగేడమ్మ గుడి సమీపంలో ఈ ఇద్దరు ప్రయాణస్తున్న ద్వి చక్ర వాహనం అదుపు తప్ప డంతో పక్కనే వున్న రాయి ఫై పడివెంకయ్య(20)అక్కడక్కడే మృతి చెందగా మరొక్కడు రాకేష్(20) తీవ్ర మైన గాయాల అయ్యాయి. ఈ సమాచారం తెలుసు కున్నచిట్టమూరు పోలీస్ లు స్ మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించి. గాయపడిన వ్యక్తి ని హాస్పిటల్ తరలించి కేసు నమోదుచేసివిచారణ చేపట్టారు..

అన్నమయ్య

చిట్వేలి మండలం కుమ్మరపల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చిట్వేలి మండలం నగిరిపాడు పంచాయతీ పరిధిలోని కుమ్మరపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. కట్టా శివ తండ్రి కిట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నిమజ్జన వేడుకలో భాగంగా అన్నదానం నిర్వహించగా, గ్రామ పెద్దలు, యువత, పిల్లలు అందరూ సత్కార్యాల్లో భాగమయ్యారు. ఉట్టి కొట్టడం, లడ్డు వేలం పాట వంటి సంప్రదాయ కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లడ్డు వేలం పాటలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హరివిల్లు వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ వినాయక నవరాత్రి వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అన్నమయ్య

చిట్వేలి మండలం కుమ్మరపల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చిట్వేలి మండలం నగిరిపాడు పంచాయతీ పరిధిలోని కుమ్మరపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. కట్టా శివ తండ్రి కిట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నిమజ్జన వేడుకలో భాగంగా అన్నదానం నిర్వహించగా, గ్రామ పెద్దలు, యువత, పిల్లలు అందరూ సత్కార్యాల్లో భాగమయ్యారు. ఉట్టి కొట్టడం, లడ్డు వేలం పాట వంటి సంప్రదాయ కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లడ్డు వేలం పాటలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హరివిల్లు వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ వినాయక నవరాత్రి వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ

గ్రామపంచాయతీ ఎన్నికల దృష్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 (ఆగస్ట్ 30) లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గ్రామపంచాయతీ వార్డుల వారిగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ పై అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28న సంబంధిత ఎంపీడీవోల ద్వారా మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలు,వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించడం జరిగిందని, ఈ ముసాయిదా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలను ఈనెల 28 నుండి 30 వరకు సమర్పించవచ్చని వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 31న పరిశీలించి, పరిష్కరించడం జరుగుతుందని, తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న (శనివారం )ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు అని కలెక్టర్ సూచించారు. తుది ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారి నారాయణ అమిత్ ముసాయిదా వాటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రక్రియను వివరించారు. హాజరైన పార్టీ నాయకులు పలు సూచనలు చేశారు. ముసాయిదా వాటర్ జాబితా కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందుగానే అందించాలని, డబుల్ ఓటర్లను తొలగించాలని, ఏ వార్డులోని ఓటర్లు అదే వార్డులో ఉండేలాగా చూడాలని,ఒక ఇల్లు ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని,అభ్యంతరాల సమర్పణకు తేదీ పొడిగించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులను మార్చాలని కోరారు.

జాతీయ అంతర్జాతీయ

దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం…! పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది!

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్. కొత్త రూల్స్ ప్రకారం.. ఫోటో స్పష్టంగా ఉండాలి, బ్యాగ్రౌండ్‌ తెల్లగా ఉండాలి. ఫోటో సైజ్‌ 630×810 పిక్సెల్స్ ఉండాలి. ఫోటోలో ఫేస్‌ 85 శాతం స్పష్టంగా కనిపించాలి. ఫోటోలో ఎలాంటి హవాభావాలు ఉండకూడదు. ఫోటో మొత్తం ఒకే రకమైన లైటింగ్ ఉండాలి. ఫోటోను ఎడిట్ చేయడం, ఫిల్టర్లు వాడడం చేయకూడదు. కళ్లజోడు ధరించకూడదు. ముఖంపై ఎలాంటి వస్త్రాలు కప్పుకోకూడదు. ముఖంపై ఎలాంటి నీడలు లేదా మెరుపులు ఉండకూడదు. చర్మం రంగు సహజంగా కనిపించాలి. దరఖాస్తుకు సమర్పించే ఫోటో మూడు నెలల కంటే పాతది కాకూడదు. మతపరమైన కారణాల వల్ల తల కప్పుకునే వారికి మినహాయింపు ఉంది. కానీ ముఖంలోని అన్ని భాగాలు (గడ్డం నుండి నుదురు వరకు, ముఖం అంచులు) స్పష్టంగా కనిపించాలి.ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బయోమెట్రిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మార్పులు ప్రధానంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) బయోమెట్రిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. నిబంధనలు పాటించకపోతే పాస్ట్‌పోర్టు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందువల్ల, దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ మార్పులను పాటించాలని దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ సూచించింది. దీనివల్ల పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ వేగవంతం అవడంతో పాటు, భద్రత కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతుంది. కాగా UAEలో దాదాపు 4 లక్షల మంది తెలుగు వాళ్లు ఉన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.