Saturday, 9 May 2026

Blog

భక్తి

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ తిరుపతి సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి. సెప్టెంబర్ 4న వామన జయంతి. సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం. సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం. సెప్టెంబర్ 10న బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె) సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య. సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. సెప్టెంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం. సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం. సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

ఆంధ్రప్రదేశ్

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబుకు మూడో స్థానం

మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట ‘ఇండియా టుడే’ స‌ర్వే దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై స‌ర్వే ఈ స‌ర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు ప్ర‌థ‌మ స్థానం మ‌మ‌తా బెన‌ర్జీ, చంద్రబాబుల‌కు వ‌రుస‌గా రెండు, మూడు ర్యాంకులు ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబు మూడో స్థానం ద‌క్కించుకున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై ‘ఇండియా టుడే’ స‌ర్వే నిర్వ‌హించింది. ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ 36 శాతం జ‌నామోదంతో ప్ర‌థ‌మ స్థానంలో నిలిస్తే.. 12.5 శాతంతో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ద్వితీయ‌ స్థానంలో నిలిచారు. అలాగే చంద్ర‌బాబు 7.3 శాతం జ‌నామోదంతో మూడో స్థానంలో ఉన్నారు. బిహార్ సీఎం (4.3 శాతం), త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ (3.8 శాతం) వ‌రుస‌గా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించిన ఇదే స‌ర్వేలో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నారు. ఇక‌, ‘ఇండియా టుడే’ 2001 నుంచి ఏడాదిలో రెండు సార్లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరుపై ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట స‌ర్వే నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుంటోంది.

నిర్మల్

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పాత్రం ఇచ్చిన శ్రీ బోస్లె నారాయణ్ రావు పటేల్*

పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: ముధోల్ తాలూకాలో. మూడు రోజుల నుంచి. భారీగా కురుస్తున్న వర్షాల వలన. రోడ్లు కొట్టుకపోయాయి. భారీగా పంట చేన్లు కొట్టుకపోవడం ఇండ్లు కూలిపోవడం ఆస్థి నష్టం పంట నష్టపోవడం. మరియు బాసర పుణ్యక్షేత్రం లో వర్షపు వల్ల జరిగిన నష్టం మరియు తానూర్ మండలం కుంటాల మండలం బైంసా మండలం మరియు ముధోల్ నియోజకవర్గం లోని ఏడు మండలంలోని అనేక రకాల సమస్యలను ఈరోజు హైదరాబాదులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పత్రం అందించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు ముధోల్ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరు కూడా ఆధర్య పడకూడదని రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటదని శ్రీ నారాయణరావు పటేల్ గారు తెలియజేశారు

హైదరాబాద్

రేపు ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం

పున్నమి ప్రతి నిధి భారత ప్రధాన మంత్రి ప్రతి నెల చివరి ఆదివారం నాడు నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు అనగా ఆదివారం ఉదయం జరగనుంది. దేశ ప్రజలు అందరు ఈ కార్యక్రమం వీక్షించాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.

ఆంధ్రప్రదేశ్

ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా పరసా

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా పరసా సుబ్బారావు (సాక్షి) ఎన్నికయ్యారు. రిపోర్టర్ గా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సుబ్బారావు ఈనాడులో దీర్ఘ కాలంగా పనిచేశారు. ప్రస్తుతం సాక్షి అమలాపురం టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (apuwj) సంఘంలో ఆది నుంచి పనిచేసారు. సెప్టెంబర్ నెల చివరిలో బీహార్ లో జరిగే నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సుబ్బారావు పాల్గొంటారు.

హైదరాబాద్

తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ విద్య

వనస్థలిపురంలో, శివసింధూ హైస్కూల్, ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాల చైర్మన్ ప్రశాంత్ లక్కరాజు పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు: వనస్థలిపురం, శివసింధూ హైస్కూల్, తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడమే తమ పాఠశాల లక్ష్యమని శివసింధూ హైస్కూల్ యజమాన్యం, చైర్మన్ ప్రశాంత్ లక్కరాజు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రైమరీ విద్యతో ఆరంభించి అంచలంచెలుగా హై స్కూల్‌ స్టాయికి ఎదిగిందన్నారు. హైదరాబాద్, వనస్థలిపురం, విజయపూరి కాలని, లో శివసింధూ హైస్కూల్ విద్యార్థులను ఆకర్షించి నంబర్‌ వన్‌ పాఠశాలగా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడలు, సంగీతం, డాన్స్‌, భగవద్గీత, దసరా, ఉగాది, దీపావళి, బోనాల పండుగ, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ లాంటి పండుగలను కూడా భారతదేశ గౌరవించదగ్గ విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరాటి శిక్షణ ఇస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని సాయంత్ర వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. హైస్కూల్‌ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ ప్రతి సంవత్సరమూ 10వ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. జిల్లా, మండల స్థాయిలో మొదటి, రెండో స్థానం సాధిస్తున్నారన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శివ సింధూ హైస్కూల్ విద్యార్థులు విద్యార్థినిలు విజయదుందుభి మోగించారని తెలిపారు. ప్రథమ స్థానం ఫాతిమా జాహోర, ద్వితీయ స్థానం అమనగంటి అక్షిత, పదో తరగతిలో ప్రతి ఒక్కరు 100% విజయం సాధించారని తెలిపారు, వారి విజయానికి శివసింధూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీచర్స్, కృషి ఎంతో ఉందన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్

అప్పసముద్రం ఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆవేదన..!

క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని, డాక్టర్లకు సూచన..! పున్నమిన్యూస్ ఆత్మకూరు ఆగస్టు 30 //// ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం అప్పసముద్రం లో వినాయకుని నిమజ్జనం రోజున శుక్రవారం జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వినాయకుని నిమజ్జనం లో చోటు చేసుకున్న సంఘటన ఎమ్మెల్యేని కలిసి వేసింది. బాణా సంచాలు పేలి తొమ్మిది మంది చిన్నారుకు ఒళ్ళు కాలి క్షతగాత్రులుగా మారారు. వారి బాధ వర్ణనాతీతం. వారిని చూసి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తీవ్ర ఆవేదన చెందారు. వింజమూరులోని షఫీ హాస్పిటల్ లో ముగ్గురు చికిత్స పొందు చుండగా మరో ఆరు మంది ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆత్మకూరులో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే నెల్లూరుకు పంపించాలని వైద్య ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి వింజమూర్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి వైద్య ఖర్చుల నిమిత్తం, ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30,000 ఆర్థిక సహాయం అందజేశారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు.

తిరుపతి

ఎన్టీఆర్ నగర్ విజయ గణపతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పట్టణం లోని ఎన్టీఆర్ నగర్ శ్రీ శ్రీ విజయ గణపతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పిల్లలుచే సంప్రదాయ భరతనాట్యం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రమణ,ఆకుల గురుమూర్తి, మధు,రమేష్,మురగయ్య,మురళి,సుధాకర్,వంశీ,మునస్వామి,మిథున్,ధనుష్, గురు,మోహన్ కృష్ణ,వినోద్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

ఖమ్మం పున్నమి ప్రతినిధి 👉🏽ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమ్మని తిట్టడం నీ తీవ్రంగా ఖండిస్తున్నాం 👉🏽రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం. అని బీజేపీ దమ్మపేట మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వారావ్ అన్నారు. అయన మాట్లాడుతూ తల్లి ఎవరికైనా తల్లి అని,ఒక ఆడ తల్లిని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదు,బీహార్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లలో బిహార్‌ ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ వాళ్ళు ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు,మరి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ఓట్ల ద్వారా గెలవలేదా అని బీజేపీ ఆరోపించింది,దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మోడీ మాతృ మూర్తి నివిమర్శిస్తూ నోటి కి వచ్చిన విధంగా పచ్చి బూతులు తిడుతూ మాట్లాడటం జరిగింది,దీనిపై బీజేపీ నాయకుల స్పందించి దమ్మపేటలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి అని ప్రయత్నిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి బిజెపి నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది,ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాజమండ్రి జిల్లా కోర్టులో ఈ-సేవా కేంద్రం ప్రారంభం

రాజమండ్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ-సేవా కేంద్రాన్ని శనివారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పౌరులు కోర్టు సంబంధిత సేవలను సులభంగా పొందేందుకు ఈ-సేవా కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక వనరులను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయసేవలు అందుతాయని పేర్కొన్నారు. అలాగే న్యాయవాదులు తమ వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ కేంద్రం తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 9వ అదనపు జిల్లా జడ్జి ఎం. మాధురి గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభమైన ఈ కొత్త కేంద్రం ద్వారా న్యాయ సేవల వినియోగం మరింత విస్తరించి, ప్రజలకు సమయం, శ్రమ ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.