Saturday, 9 May 2026

Blog

ఖమ్మం

రేపటి ధర్నా ని జయప్రదం చెయ్యండి : ధనియాకుల పిలుపు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృ మూర్తి మీద రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కీ నిరసన గా రేపు అనగా ఆదివారం జరుగు ధర్నా కార్యక్రమం ని జయప్రదం చేయండి అని బీజేపీ ఖమ్మం రెండవపట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపు నిచ్చారు. స్థానిక R&B అతిధి గృహం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ అనంతరం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనము ఉంటుంది అని ధనియాకుల వెంకట నారాయణ తెలియజేసారు.

సక్సెస్ స్టోరీస్

నాణెం పై తెలుగు భాష.

ఆగస్టు పున్నమి ప్రతినిధి @ నాణెం పై తెలుగు: ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు. ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు. పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం….. ఆంధ్ర రాష్ట్రం…‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు,గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు. అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ జాతీయ భాష అయిన హిందీలోనూ దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం. (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ? అంటూ చురక వేశారు. పటేల్ గారు, గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు. భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.

E-పేపర్

డాక్టర్ పీర్ కుమార్ కు తెలుగు సేవ పురస్కారం

గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సంస్థ సేవ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ లో రెండు రోజులుగా జరుగుతున్న తెలుగు భాషా ఉత్సవాలలో భాగంగా డాక్టర్ పీర్ కుమార్ తెలుగు వెలుగుల వైభవం – కవిత కళాత్మక భవిత అనే అంశంపై చదివిన కవిత పలువురి తెలుగు కవిత అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం ప్రముఖ సాహితీవేత్త కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మాజీ వైస్ ఛాన్స్లర్ అయిన ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు పీర్ కుమార్ ని అభినందించి సన్మానించారు.

బిజినెస్

బంగారం ధరలు మరింత పెరుగుతాయా! నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ బంగారం ధరలు: బంగారం ధరలు రోజురోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. వెండి రేటు కూడా జీవితకాల గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు (ఆగస్టు 30) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1640 పెరిగి రూ.1,04,950 వద్దకు చేరింది. కేజీ వెండి రూ. 1,31,000 వద్ద ఉంది. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే.. ఈ ధరలు చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఈ సంవత్సరం భారతదేశంలో బంగారం ధరలు దాదాపు 32 శాతం పెరిగాయి. పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులకు కొంత భారమైపోయింది. జనవరిలో పది గ్రాముల గోల్డ్ రూ. 80,000 నుంచి ప్రారంభమై.. మార్చి నాటికి రూ.90,000 చేరుకుంది. కాగా ఇప్పుడు ఈ ధరలు లక్ష రూపాయలు దాటేసింది. గ్లోబల్ మార్కెట్లో మే 2025 ప్రారంభంలో బంగారం ధర ఔన్సుకు 3392 డాలర్ల వద్ద ఉండేది. జూన్ మధ్య నాటికి ఇది 3368 డాలర్ల వద్దకు చేరుకుంది. గోల్డ్ రేటు విపరీతంగా పెరగడానికి రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న యూఎస్ డాలర్ విలువ మాత్రమే కాకుండా.. రూపాయి విలువ తగ్గడం కూడా ప్రధాన కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ‘అక్ష కాంబోజ్’ మాట్లాడుతూ.. పండుగ సీజన్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ అనిశ్చితి, బలహీనపడుతున్న డాలర్ ఇండెక్స్ మధ్య పెట్టుబడిదారులు బంగారం వైపు ఆకర్షితులయ్యారు. భారత ఎగుమతులపై అమెరికా విధించిన.. 50 శాతం సుంకాలు కూడా పసిడి డిమాండును మరింత పెంచిందని అన్నారు. ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా. బంగారం ధరలు పెరగడానికి సీజనల్ డిమాండ్ మరో కీలకమైన అంశం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారతదేశంలో పండుగలు.. వివాహాల సీజన్ మొదలైపోయింది. దీనివల్ల కూడా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధర ఎంత పెరిగినా.. బంగారంపై పెట్ట ఎప్పటికి మంచి లాభాలను తెస్తుందనేది మాత్రం వాస్తవం.

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం.

పున్నమి ప్రతినిధి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల దృష్ట్యా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారి అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఎన్నికల సన్నాహక సమావేశం యూసుఫ్ గూడాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ. కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిజెపి మానిటరింగ్ కమిటీ సభ్యులు.. మెదక్ ఎంపీ శ్రీ. రఘునందన్ రావు గారు, అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే శ్రీ. పాయల్ శంకర్ గారు, మాజీ ఎంపీ శ్రీ.గరికపాటి మోహన్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ. చింతల రామచంద్రా రెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షులు, శ్రీ డా. ఎన్త. గౌతమ్ రావు గారు, జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు, తదితర రాష్ట్ర – జిల్లా స్థాయి నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సినిమా

మిరాయ్ అంటే అర్థం తెలుసా.. అసలు కథ ఇదే

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ సినిమా : యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ట్రైలర్ తో విపరీతమైన అంచనాలు పెంచేసింది ఈ సినిమా. ఇందులోని వీఎఫ్ ఎక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, స్క్రీన్ ప్లే అంతా డిఫరెంట్ గా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ గురించి ఆన్ లైన్ లో ఎక్కువగా వెతుకుతున్నారు. అసలు మిరాయ్ అంటే అర్థం ఏంటా అని ఆరా తీస్తున్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదం. మిరాయ్ అంటే ‘భవిష్యత్తు కోసం ఆశ’ అని అర్థం. ఈ సినిమా కథకు తగ్గట్టే ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. అశోకుని కాలంలో జరిగిన కళింగయుద్ధంలో దొరికిన రహస్యం ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్. మనిషిని దేవుడిని చేసే తొమ్మిది గ్రంథాల రహస్యం.. దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే గ్రహణం.. ఆపడానికి పుట్టిన జననం అని ఇప్పటికే ట్రైలర్ లో కథను పరిచయం చేశారు. అంటే ఆ రహస్యాన్ని చేధించడానికి విలన్ అయిన మంచు మనోజ్ ప్రయత్నిస్తే.. అతన్ని అడ్డుకోవడానికి హీరో తేజసజ్జా ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే సినిమాలోని కథ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇందులో తేజసజ్జ స్పెషల్ పవర్స్ ఎలా తెచ్చుకున్నాడనేది కూడా చూపించబోతున్నారు. పురాణాల ఆధారంగానే దీన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇందులో రామాయణం కూడా టచ్ చేశారంట. పురాణాల్లోని కొన్ని అంశాలను సినిమాలోని సీన్స్ కు లింక్ చేస్తూ షూట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నడుమ పురాణాలకు సినిమా కథలకు లింక్ పెడుతున్న విషయం తెలిసిందే. మరి మిరాయ్ ట్రైలర్ రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లు హనుమాన్ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది.

ఖమ్మం

వినతి పత్రం సమర్పణ

నాగులవంచ రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు N రామచంద్రరావు గారిని కలిసిన బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి. ఈ రోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సమస్యలుపై రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీసులో కలిసి మెమోరడం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లాలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు లైట్లు, ఫుట్ వర్ బ్రిడ్జి సమస్యలపై వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి రైల్వే వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చింతకాని బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి తో పాటు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు గారు, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావు గౌడ్ గారు, అమరనేని విజయ్, ch నాగులు, వెంకటనారాయణ,పరుశురాము తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు కీ వినతి పత్రం సమర్పించిన కొండా గోపి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి 👉🏽నాగులవంచ రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు N రామచంద్రరావు గారిని కలిసిన బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సమస్యలపై రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ని తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీసులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బల్లలు, నీటి సదుపాయం, ఫుట్ బాత్ సమస్యలపై వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి రైల్వే వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. అని కొండా గోపి తెలియజేశారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు గారు, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావు గౌడ్ గారు, అమరనేని విజయ్, ch నాగులు, ధనియాకుల వెంకటనారాయణ,పరుశురాము తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.