Saturday, 9 May 2026

Blog

ఖమ్మం

నిరసన ర్యాలీ మరియు ధర్నా ని జయ ప్రదం చేయండి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృ మూర్తి ని అసభ్య పదజాలం తో మాట్లాడిన రాహుల్ గాంధీ క్షమపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగే ర్యాలీ మరియు దిష్టి బొమ్మ దహనం ని జయ ప్రదం చేయాలని బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు

ఖమ్మం

పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కీ వినతి పత్రం అందజేసిన బీజేపీ బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరం లో ని 44 వ డివిజన్ లో ని పలు సమస్య ల మీద డివిజన్ ఇంచార్జి పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతి నిధి బృందం కమిషనర్ సునీల్ దత్ కీ వినతి పత్రం అందజేశారు. ఖమ్మం నగరంలోని …. *44 డివిజన్* బస్ డిపో ఎదురుగా ఉన్నటువంటి లెనిన్ నగర్ మసీదు నుండి రోజుకు 5 సార్లు ఎక్కువ శబ్దంతో ప్రార్థన చేయటంతో అక్కడ ఉన్న నివసించే ప్రజలందరూ కలిసి అనేకసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ కమిషనర్ కీ లెటర్ పెట్టినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ 44 డివిజన్ ఇన్చార్జి పాశం శ్రీనివాస రెడ్డి* ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని కలసి 44 డివిజన్ నుండి చార్టెడ్ ఎకౌంటు మురళి కృష్ణ ప్రసాద్ డాక్టర్ వెంకట రామారావు అదే విధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు BJP నాయకులు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిని పర్మిషన్ ఉన్నంతవరకు సౌండ్ పెట్టుకొని అక్కడ ప్రజలకి ఆటంకాలు లేకుండా చూడవలసిందిగా పాశం శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ సునీల్ దత్ ని విజ్ఞప్తి చేయటం జరిగింది

పశ్చిమ గోదావరి

భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజ్ గ్రాండ్ అల్యూమ్ని మీట్

భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజ్ గ్రాండ్ అల్యూమ్ని మీట్ లో గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ వి.ఎస్. రాజు గారు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గారితో కలిసి పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ కళాశాల మాజీ విద్యార్థిగా, అధ్యాపకుడిగా, పాలకవర్గ సభ్యుడిగా ఈ సంస్థతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ చారిత్రాత్మక విద్యాసంస్థ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. డి.ఎన్.ఆర్. కాలేజీ పూర్వ విద్యార్థులు చేసిన సన్మానం నాపై ఉన్న నమ్మకాన్ని, బాధ్యతను మరింతగా పెంచుతుంది అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (బిజెపి వర్మ) పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి

పులపర్తి ప్రశాంత్ గారికి అభినందనలు తెలియజేసిన జనసేన పార్టీ అధ్యక్షులు

విశాఖపట్నం : సెప్టెంబర్ 9వ తేదీ నుండి దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా జనసేన పార్టీ యువ నాయకులు మరియు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి తనయుడు శ్రీ పులపర్తి ప్రశాంత్ గారు ఎన్నికైన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అభినందించారు, అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పదవులు సాధించాలని అన్నారు. అలాగే విశాఖపట్నంలోని రుషికొండలో ఏర్పాటు చేసిన భవనాలను క్రికెట్ కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రామచంద్ర రావు

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు ధీమా వ్యక్తం చేసారు సన్నాహక సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన అయినా పై విధం గా అన్నారు.

అన్నమయ్య

బొప్పాయి ధరలు పడిపోతే మాకు బతుకు లేదు” – పురుగుమందు సీసాలతో రైతుల ఆవేదన

బొప్పాయి ధరలు కిలోకు రూ.5కే పడిపోవడంతో చిట్వేల్ రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ కష్టపడి పండించిన పంటకు ధర రాకపోతే ఆత్మహత్య తప్పదని వీడియోల ద్వారా హెచ్చరిస్తున్నారు.జిల్లా కలెక్టర్ రైతులు, అధికారులు, వ్యాపారులు, దళారులతో సమావేశం నిర్వహించి బొప్పాయిని రూ.10 కన్నా తక్కువకు కొనరాదని ఆదేశించినా, దళారులు పట్టించుకోక రైతులను దోచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ కూడా హెచ్చరించినా పరిస్థితి మారకపోవడంతో రైతుల్లో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతున్నాయి.“మా చెమటను, మా పంటను ఇలా చులకన చేస్తే బ్రతకడం కష్టమే. న్యాయం చేయకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిందే” అని రైతులు విలపిస్తున్నారు. ప్రజలు, స్థానిక సంఘాలు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దళారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Video: https://youtu.be/sBe-fpBU1ns

ఖమ్మం

NCC, NSS ఉన్నత అధికారులకీ పిర్యాదు చేసిన బీజెపి బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం వీధుల్లో జరిగిన అక్రమ ర్యాలీలో NCC & NSS యూనిఫామ్‌ల దుర్వినియోగం జరగడంపై బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఖమ్మం రూల్ ఆఫ్ కమాండింగ్ ఆఫీసర్ ఎస్.కె భద్ర గారికి ఫిర్యాదు అందజేశారు. NCC యూనిఫామ్‌లను దుర్వినియోగం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది! ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ ప్రతాప్ గారు,దేవకీ వాసుదేవ్ రావు గారు,గెంటల విద్యాసాగర్ గారు, అల్లిక అంజయ్య గారు,సుదర్శన్ మిశ్రా నల్లగట్ట ప్రవీణ్ ,ఈదుల వీరభద్రం, నకిరేకంటి వీరభద్రం, గడీల నరేష్, వీరవల్లి రాజేష్, రిగన్, ,పాలెపు రాము మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారూ..

జాతీయ అంతర్జాతీయ

ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ ప్రధాని మోదీ : ఉక్రెయిన్‌ పరిస్థితులను మోదీకి వివరించిన జెలెన్‌స్కీ శాంతి సాధనకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ త్వరితగతిన శాంతి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వనున్న భారత్ ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం పెంపుపై నిర్ణయం

ఆంధ్రప్రదేశ్

విశాఖలో జనసేన బహిరంగ సభ

ఆగస్టు పున్నమి ప్రతినిధి@ విశాఖపట్నం : దశాబ్ధకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయా-పవన్‌. జనసేనతోనేకొనసాగా..ఫలితంగానే రికార్డు విజయం. కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలను-పవన్‌కల్యాణ్‌. కార్యకర్తల మాటలు వినాలనే అందరినీ పిలిచాం. కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు.. జనసేన. దేశమంతా మన పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా. ఇకపై పార్టీని నేనే ఆఫీస్‌ నుంచి మానిటర్‌ చేస్తాను. అధికారంఉన్నా కాంట్రాక్టులు తీసుకోలేదు-పవన్‌కల్యాణ్. ఐడియాలజీ ఉండాలి.. అదే సమయంలో వ్యూహాలుండాలి. మా ఐడియాలజీని చాలామంది అపహాస్యం చేశారు. అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాం. కమ్యూనిజం అని నమ్మిన రష్యా ఏమైంది. సంపూర్ణమైన అవగాహనతోనే అన్నీ మాట్లాడుతున్నాం-పవన్‌.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.