Saturday, 9 May 2026

Blog

ఖమ్మం

రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం బీజేపీ శ్రేణులు ఆదివారం నాడు స్థానిక పేవిలియన్కాం మైదానం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగినది కోటేశ్వరరావు మాట్లాడుతు బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు . నిరసన ర్యాలీ చేసి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సన్నే ఉదయ్ ప్రతాప్, అల్లిక అంజయ్య సుదర్శన్ధ మిశ్రా నియాకుల వెంకట నారాయణ, శ్రీమతి పమ్మి అనిత, శ్రీమతి మణి, శ్రీమతి దార్ల మల్లీశ్వరి, శ్రీమతి విజయరెడ్డి, గుత్త వెంకటేశ్వర్లు, కొణతం లక్ష్మి నారాయణ, వీరేలి రాజేష్, గడీల నరేష్ కుమిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ అంతర్జాతీయ

ఉగ్రవాదానికి క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్న పాకిస్థాన్… దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

జమ్ముకశ్మీర్‌లో క్రిప్టోకరెన్సీ ద్వారా ఉగ్ర నిధుల బదిలీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) దాడుల్లో బయటపడిన నెట్‌వర్క్ హవాలా స్థానంలో అజ్ఞాతంగా నిధులు పంపుతున్న పాకిస్థాన్ అధికారికంగానే క్రిప్టో కౌన్సిల్ ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం టెర్రర్ ఫండింగ్‌కు కొత్త టెక్నాలజీ.. భారత ఏజెన్సీలకు పెనుసవాల్ ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్న పాకిస్థాన్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్ సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటివరకు హవాలా, నార్కోటిక్స్, నకిలీ కరెన్సీ వంటి పాత పద్ధతులపై ఆధారపడిన పాక్, ఇప్పుడు వాటిని పక్కనపెట్టి క్రిప్టోకరెన్సీ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నిధులు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత నెలలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) జరిపిన దాడుల్లో ఈ డిజిటల్ కుట్ర బట్టబయలైంది. దేశంలో ఉగ్రవాదానికి క్రిప్టో నిధులు అందుతున్నట్లు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి. గత నెలలో ఎస్ఐఏ నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో, సరిహద్దుల నుంచి కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు క్రిప్టోకరెన్సీ రూపంలో నిధులు అందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. “దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటంలో మా నిబద్ధతకు ఈ సోదాలే నిదర్శనం” అని ఎస్ఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సాధారణంగా హవాలా వంటి మార్గాల్లో నిధులు పంపినప్పుడు, దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక దశలో నిధుల జాడ (మనీ ట్రయల్) దొరికేది. ఈ ఆధారాలతోనే గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌కు సంబంధం ఉందని భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి. కశ్మీర్‌లో వేర్పాటువాదుల వెన్ను విరవడంలో వారి నిధుల మార్గాలను అడ్డుకోవడం కీలక పాత్ర పోషించింది. అయితే క్రిప్టో లావాదేవీలు చాలావరకు అజ్ఞాతంగా జరుగుతాయి. పంపినవారు, అందుకున్నవారి వివరాలు సులభంగా గుర్తించలేం. దీంతో దర్యాప్తు సంస్థలకు నిధుల మూలాలను కనిపెట్టడం పెనుసవాల్‌గా మారింది. ఈ ఏడాది మార్చి 2025లో పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా “పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్” ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్న “వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్” అనే క్రిప్టో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ బాహ్య ప్రపంచానికి చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉగ్ర నిధులను సులభతరం చేసే కుట్ర దాగి ఉందని భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, సామాజిక మాధ్యమాలు, వర్చువల్ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కూడా తన నివేదికలో హెచ్చరించింది. 2019లో హమాస్ ఉగ్రవాద సంస్థ తొలిసారిగా క్రిప్టో ద్వారా విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. గత ఏడాది జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడు (2024), పుల్వామా దాడి (2019) వంటి కేసుల దర్యాప్తులోనూ ఉగ్రవాదులు క్రిప్టో వ్యాలెట్లు, చైనీస్ యాప్‌లు, డార్క్‌నెట్‌ను వాడుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది.

తిరుపతి

సెప్టెంబర్ 2 న శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 న శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీ నందు గల రోటరీ క్లబ్ నందు ఉ.9:00గం” నుండి సా.3:00గం ల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది,కావున ఆయన అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు,జన సైనికులు, కూటమి నాయకులు,మరియు సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు అవుతారని కోరుతున్నామని జనసేన నాయకులు పేట బ్రదర్స్ ప్రకటన విడుదల చేసారు.

జాతీయ అంతర్జాతీయ

భారత్ను లక్ష్యంగా చేసుకోండి.. యూరప్ దేశాలను కోరిన వైట్ హౌస్..!

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ ఇంటర్నెటెస్క: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీగా సుంకాల భారాన్ని మోపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్లు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమలాగే భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని యూరప్ దేశాలను వైట్హౌస్ కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే.. యూఎస్గానే భారత్పై ద్వితీయ సుంకాలను విధించాలని ట్రంప్ యంత్రాంగం కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని కూడా కోరినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇటీవల ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యాధిపతి తీసుకుంటున్న చర్యలకు కొంతమంది యూరోపియన్ నాయకులు మద్దతు పలికినట్లు తెలస్తోంది. భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై యూరోపియన్ దేశాలు మౌనంగా ఉన్నాయి. సుంకాలు విధించడాన్ని సమర్థించలేదు. అలా అని తప్పుబట్టలేదు. ఈ క్రమంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని ట్రంప్ పరిపాలనాధికారులు కోరడం గమనార్హం. ఇదిలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం వంటి కీలక విషయాలపై ఈ సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కూడా మోదీ సమావేశం కానున్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఆస్ట్రేలియా హై కమిషన్ నుండి మంత్రి నారా లోకేష్ కి ప్రతిష్టాత్మక ఆహ్వానం..!

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ఆస్ట్రేలియా హై కమిషన్: మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం. ప్రత్యేక సందర్శనల కార్యక్రమం లో భాగస్వామ్యం – 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్య, స్కిల్స్, ఆక్వాకల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, లోకేష్ కృషి – ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాప్‌పై మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి..!

జాతీయ అంతర్జాతీయ

సెప్టెంబర్ 7-8న సంపూర్ణ చంద్రగ్రహణం – బ్లడ్ మో అద్భుత దృశ్యం భారత్‌లో కూడా కనిపించనుంది

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ చంద్రగ్రహణం : ఆకాశంలోని అద్భుత ఖగోళ సంఘటనలకు ఆసక్తి కలిగిన వారికి ఇది విశేష శుభవార్త. రాబోయే నెలలో మన కళ్లముందు ఓ అరుదైన, మంత్ర ముగ్ధం చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సందర్భంగా చంద్రుడు సహజంగా కనిపించే వెలుగుతో కాకుండా, ఎర్రటి–నారింజ రంగులో ప్రకాశిస్తాడు. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా “బ్లడ్ మూన్” లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఈ విశేష దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు ఆకాశాన్ని అలరించనుంది. ఈ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లోని ప్రజలకు కూడా ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. వాతావరణం అనుకూలిస్తే, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ రక్త చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువసేపు, ఇంత విస్తృతంగా కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది – చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు? అసలు విషయం ఏమిటంటే, సూర్యుడు–భూమి–చంద్రుడు ఒకే సూటి గీతలో ఉన్నప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ పూర్తిగా చంద్రుడిపై పడుతుంది. అయితే సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వెళ్తూ వంగి చంద్రుడిని చేరుతుంది. ఈ ప్రక్రియలో నీలి కాంతి వాతావరణంలో ఎక్కువగా చెదిరిపోతుంది. ఫలితంగా ఎరుపు, నారింజ రంగు కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడిని తాకుతాయి. అందువల్ల చంద్రుడు ఎర్రటి, నారింజ రంగు వెలుగుతో మెరిసిపోతాడు. ఈ అరుదైన ఆకాశ దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియులు, శాస్త్రవేత్తలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

అధ్యక్షుడు జి న్ పిం గ్ తో ప్రధాని మోదీ భేటీ

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ తియాంజిన్: ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఎస్ సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరిన ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ.. జిన్పింగ్తో సమావేశం అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు. 2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జినిపింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండనుంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణేష్ మండపాల వద్ద భద్రత చర్యలు

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @భద్రత చర్యలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బి వి కృష్ణా రావు ఐ పి ఎస్ వారి ఆదేశాలు మేరకు కొత్తపేట సబ్ డివిసినల్ పోలీస్ ఆఫీసు ఎస్ మురళి మోహన్ వినాయక చవతి సందర్భంగా గణేష్ మండపాల వద్ద భద్రత చర్యలు మరియు నిమజ్జన సమయం లో పాటించవలసిన నిబందనలు గురించి పలు సూచనలు చేశారు. వర్షాలు మరియు వరదలు కారణంగా చెరువులు, గోదావరి నది ప్రవహాలు ఎక్కువగా ఉన్నందున నిమజ్జన సమయంలో భక్తులు జారి పడే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాలలో ప్రభుత్వ అధికారుల సూచనలు విధిగా పాటించవలెను, నిమజ్జన ప్రదేశాలకు చిన్న పిల్లలు మరియు మహిళలు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలెను. ఉత్సవ కమిటి వారు ముందుగా తీసుకున్న అనుమతుల ప్రకారం, తెలియపర్చిన సమయం ప్రకారం చెప్పిన ప్రదేశాలలో మాత్రమే నిమజ్జనం చేయాలి. పోలీస్ వారికి సమాచారం తెలపకుండా నిమజ్జన ఊరేగింపు ఎట్టి పరిస్థితిలోనూ జరపరాదు. అదేవిధంగా నిమజ్జన ఊరేగింపు ముందు చెప్పిన మార్గము మరియు పోలీస్ వారు నిర్ణయించిన రూటు నందు మాత్రమే వెల్లవలెను. మద్యం గాని మరి ఏవిదమైన మత్తు పానీయాలు గాని సేవించి నిమజ్జన ఊరేగింపు నందు పాల్గొనరాదు, అట్టివారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. నిమజ్జన ఊరేగింపు లో ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు పడకూడదు. సంయమనం పాటించి పోలీస్ వారి సూచనలు సలహాలు తప్పక పాటించవలెను. ఊరేగింపు సమయం లో ట్రాఫిక్ నియంత్రణకు తగిన వలంటీర్లను ఉత్సవ కమిటి నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవలెను. అదేవిధంగా ఉత్సవ కమిటి నిర్వాహకులు మరియు వలంటీర్లు విధిగా గుర్తుంపు కార్ద్ లు ధరించవలెను. వినాయక మండపాల వద్ద మరియు ఊరేగింపులలోను పెద్ద పెద్ద సౌండ్స్ చేసే డి జె సౌండ్స్ సిస్టమ్స్ ఉపయోగించుట నిషేదించడ మైనయిది. ఊరేగింపులో మంచి కండిషన్ లో ఉన్న వాహనాలు మాత్రమే ఉత్సవ కమిటి వారు ఉపయోగించ వలెను. మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించడం, . మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసి నడపడం పూర్తిగా నిషేదించడ మైనయిది. నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల కేబిన్ల పై ఎవరు కూర్చోకుండా ఉత్సవ కమిటి వారు ప్రతికే శ్రద్ధ తీసుకో వలెను. అదేవిధంగా ఎటువంటి అసభ్య మరియు అశ్లీల వేశధారణలు వేయరాదు వినాయక మండపాలు వద్ద విద్యుత్ తీగలు వర్షాలు కారణంగా వేలాడుతూ ఉంటే స్థానిక విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి స్వంత నిర్ణయాలతో మీ ప్రాణాలు ఫణంగా పెట్టవద్దు. సబ్ డివిజన్ లో ఈ వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జన కార్యక్రమాల లో ఎటువంటి అవాంఛనీయ సంగటనలకు తావు లేకుండా ప్రజలు అందరూ ప్రశాంత వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలని సబ్ సబ్ డివిజన్ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి నిబంధనలు అతిక్రమించిన ఎడల పోలీస్ వారు తీసుకును చర్యలకు ఉత్సవ కమిటి సభ్యులు బాధ్యులు అవుతారు మరియు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. ఇట్లు ఎస్ మురళి మోహన్. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కొత్తపేట

అన్నమయ్య

చిట్వేలిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు జోరుగా

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న ఆర్కే కళ్యాణ మండపంలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాస రాజు, అతికారి కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పగడాల వరలక్ష్మి, రాజుగుంట ఎంపీటీసీ నానబాల నాగార్జున, చిట్వేలి మండలం టిడిపి యువ నాయకుడు రాజుగుంట నరసింహ, సర్పంచ్ కారుమంచి సంయుక్త తదితరులు హాజరుకానున్నారని తెలిపారు.జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని మాదాసు నరసింహ కోరారు.

ఆంధ్రప్రదేశ్

కొత్తపేట సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా పాలింగి రవి చంద్ర

కొత్తపేట సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన పాలింగి రవి చంద్ర కు అవకాశం దక్కింది.రవి చంద్ర ను సబ్-డివిజినల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ గా నియమించడం పై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కష్టానికి,పార్టీ పట్ల నిబద్దతకు దక్కిన గౌరవున్నారు.రవి చంద్ర ను కొత్తపేట ఎమ్మెల్యే బండారుసత్యనంద రావు సన్మానించారు. రవిచంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు నన్ను నమ్మి ఎన్నో సంవత్సరాలుగా అయన వెంటే ఉంటూ పార్టీ కష్టకాలంలో అధికారం లేని సమయంలో కూడా పార్టీ కి, ఎమ్మెల్యే కు నిబద్దత కలిగిన నాయకునిగా నన్ను గుర్తించి పార్టీ కి చేసిన సేవలను గుర్తిస్తూ నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతూ ఎమ్మెల్యే అప్పగించిన బాధ్యతను సక్రమంగా వినియోగిస్తానని ఆయన తెలిపారు.నేనెప్పుడు ప్రజల మనిషేనని ప్రజల పక్షానే ఉంటాన్ని ఈసందర్భంగా తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.