Saturday, 9 May 2026

Blog

ఖమ్మం

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. భూక్యా శ్యాం సుందర్ నాయక్ డిమాడ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృ మూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమపణ చెప్పాలి అని ఖమ్మం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ డిమాండ్ చేసారు. ఆదివారం నాడు ఖమ్మం రూరల్ మండలం లో జరిగిన కార్యక్రమం లో అయన మాట్లాడారు.

క్రైమ్

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం!

ఏఏఐకి చెందిన రూ.232 కోట్లను సీనియర్ మేనేజర్ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారన్న అభియోగం ఏఏఐ సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) రాహుల్ విజయ్ ను అరెస్టు చేశామన్న సిబిఐ ఏఏఐ అంతర్గత ఆడిట్ లో వెలుగుచూసిన నిధుల అవకతవకలు ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)లో భారీ నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. ట్రేడింగ్ కార్యకలాపాల కోసం ఏఏఐకు చెందిన రూ.232 కోట్ల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలున్న సీనియర్ మేనేజర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఆర్థిక అకౌంటింగ్ విభాగంలో పని చేస్తున్న రాహుల్ విజయ్ అనే సీనియర్ మేనేజర్ 2019 నుంచి 2023 మధ్యకాలంలో ప్రణాళికాబద్ధంగా నిధులను మళ్లించినట్లు గుర్తించారు. ఏఏఐ ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో నిధుల అవకతవకలు బయటపడిన నేపథ్యంలో, ఒక ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణలో రాహుల్ విజయ్ పాల్పడిన అక్రమాలు వెలుగు చూశాయి. వెంటనే సంస్థ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ రంగంలోకి దిగి జైపూర్‌లోని రాహుల్ విజయ్ అధికారిక కార్యాలయం, నివాస ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఈ సందర్భంగా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర విలువైన ఆధారాలు స్వాధీనం చేసుకుంది. డెహ్రాడూన్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అధికారిక రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటాను తారుమారు చేస్తూ, నిధులను ట్రేడింగ్ ఖాతాలకు మళ్లించారు. బ్యాంక్ లావాదేవీల విశ్లేషణలో దీన్ని స్పష్టంగా గుర్తించాం” అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాహుల్ విజయ్‌ను అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాధన దుర్వినియోగం నేపథ్యంలో కేంద్ర స్థాయిలో ఈ అంశం సంచలనంగా మారింది.

హెల్త్ టిప్స్

ప్రిస్కిప్షన్ స్పష్టంగా రాయాల్సిందే: హైకోర్టు

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ హైకోర్టు స్పష్టం: డాక్టర్ల ప్రిస్కిప్షన్ స్పష్టంగా ఉండాలని పంజాబ్జరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రాథమిక హక్కేనని తెలిపింది. ప్రిస్కిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్లు క్యాపిటల్ లెటర్లలోనే రాయాలని స్పష్టం చేసింది. ఓ రేప్ కేసుకు సంబంధించి మెడికో రిపోర్టులో ఒక్క ముక్క కూడా తనకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వర్గీయ కుడిపూడి చిట్టిబ్బాయి జయంతి రేపే అమలాపురం లో

ఆగస్టు 31పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పి.గన్నవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుడిపూడి చిట్టిబ్బాయి అభిమానులకు ఆహ్వానం రేపు అనగా 1-09-2025 సోమవారం అమలాపురం మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ కుడుపూడి చిట్టబ్బాయి జయంతి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు అమలాపురం హైస్కూల్ సెంటర్లో అమలాపురం నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ డా పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరుగును. కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు గన్నవరపు శ్రీనివాసరావు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ( పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం )

E-పేపర్

ఏడాదిలో వెయ్యి గుండె ఆపరేషన్లుకేరళలో చేజర్ల వాసి అరుదైన అద్భుతం

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్ని ఆపరేషన్లు విజయవంతం నెల్లూరు జిల్లా,చేజర్లకు చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ అల్లం రామ్ నరేష్ అరుదైన అద్భుత విజయం సాధించారు. ఒక ఏడాది కాలంలో వెయ్యి గుండె ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు.అన్ని ఆపరేషన్లు సక్సెస్ కావడం ఒక అద్భుతం. డాక్టర్ రామ్ నరేష్ కేరళలోని కాలికట్ లో ఉన్న శాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ గా పదేళ్లుగా పని చేస్తున్నారు. ఆయన గత ఏడాది కాలంలో చేసిన వెయ్యి గుండె ఆపరేషన్లు విజయవంతం అయ్యాయి. దీంతో శనివారం ఆ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పోస్ట్ యాంజియోప్లాస్టి మీట్ 2025 సభలో డాక్టర్ రామ్ నరేష్ ను ఆ రాష్ట్ర ప్రముఖులు, సహచర వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ సభలో వైద్యశాలలోని డాక్టర్లతోపాటు ఆపరేషన్లు చేయించుకున్న వెయ్యి మంది పాల్గొన్నారు. తమ జీవితాలను కాపాడిన డాక్టర్ రామ్ నరేష్ అల్లంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వారికి మంచి వైద్యం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రాలో కూడా వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. చేజర్లకు చెందిన డాక్టర్ అల్లం రామ్ నరేష్ తన విద్యాభ్యాసాన్ని మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో సాగించారు. ఆయన ఈ విజయం సాధించడం పట్ల ఆయన అభిమానులు, చేజర్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @గోదావరి ఉగ్రరూపం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం ఉదయం 9 గంటలకు గోదావరి ప్రవాహం 48 అడుగులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగాయి. కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. నీటిమట్టం పెరగడంతో భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూరుబాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదతో వీఆరపురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

నిర్మల్

బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు *ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు* హర్షం వ్యక్తం చేశారు.

పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు *ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు* హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణాంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని రకాలుగా సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలన్నీ పరిగణలోకి తీస్కొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఏకగ్రీవంగా బిల్లు చేయడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిల్లు కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, మంత్రి వర్గ ఉప సంఘానికి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిసి వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణ లో నెరవేర బోతున్నాయని ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు… ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి సారధ్యంలో ఈ బిసి రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుబచే అడుగులు పడతాయని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా అమలు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.

ఖమ్మం

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కొండా గోపి డిమాండ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి (చింత కానీ మండలం) 👉🏽ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలనీ తీవ్రంగా ఖండిస్తున్నాం. 👉🏽రాహుల్ గాంధీ క్షమాపణ వెంటనే చెప్పాలి.: కొండా గోపి బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి మాట్లాడుతూ తల్లి ఎవరికైనా తల్లి అని,ఒక తల్లిని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదు,బీహార్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లలో బిహార్‌ ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ వాళ్ళు ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు,మరి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ఓట్ల ద్వారా గెలవలేదా అని బీజేపీ ఆరోపించింది,దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారి అమ్మగారిని విమర్శిస్తూ నోటికి వచ్చిన విధంగా దూషించడం జరిగింది,దీనిపై బీజేపీ నాయకుల స్పందించి చింతకాని మెయిన్ సెంటర్ లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి అని ప్రయత్నిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి బిజెపి నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల తీరును, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు గుగులోత్ నాగేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శిలు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను గారు, చెన్నూరి నాగచారి, ఉపాధ్యక్షలు బక్క సత్యమూర్తి,ch కృష్ణ, యువ మోర్చా మండల అధ్యక్షులు సత్తెనపల్లి గోపి, పులి ప్రవీణ్ సాయి తదితరులు బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం బీజేపీ శ్రేణులు ఆదివారం నాడు స్థానిక పేవిలియన్కాం మైదానం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగినది కోటేశ్వరరావు మాట్లాడుతు బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు . నిరసన ర్యాలీ చేసి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సన్నే ఉదయ్ ప్రతాప్, అల్లిక అంజయ్య సుదర్శన్ధ మిశ్రా నియాకుల వెంకట నారాయణ, శ్రీమతి పమ్మి అనిత, శ్రీమతి మణి, శ్రీమతి దార్ల మల్లీశ్వరి, శ్రీమతి విజయరెడ్డి, గుత్త వెంకటేశ్వర్లు, కొణతం లక్ష్మి నారాయణ, వీరేలి రాజేష్, గడీల నరేష్ కుమిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ అంతర్జాతీయ

ఉగ్రవాదానికి క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్న పాకిస్థాన్… దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

జమ్ముకశ్మీర్‌లో క్రిప్టోకరెన్సీ ద్వారా ఉగ్ర నిధుల బదిలీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) దాడుల్లో బయటపడిన నెట్‌వర్క్ హవాలా స్థానంలో అజ్ఞాతంగా నిధులు పంపుతున్న పాకిస్థాన్ అధికారికంగానే క్రిప్టో కౌన్సిల్ ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం టెర్రర్ ఫండింగ్‌కు కొత్త టెక్నాలజీ.. భారత ఏజెన్సీలకు పెనుసవాల్ ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్న పాకిస్థాన్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్ సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటివరకు హవాలా, నార్కోటిక్స్, నకిలీ కరెన్సీ వంటి పాత పద్ధతులపై ఆధారపడిన పాక్, ఇప్పుడు వాటిని పక్కనపెట్టి క్రిప్టోకరెన్సీ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నిధులు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత నెలలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) జరిపిన దాడుల్లో ఈ డిజిటల్ కుట్ర బట్టబయలైంది. దేశంలో ఉగ్రవాదానికి క్రిప్టో నిధులు అందుతున్నట్లు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి. గత నెలలో ఎస్ఐఏ నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో, సరిహద్దుల నుంచి కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు క్రిప్టోకరెన్సీ రూపంలో నిధులు అందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. “దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటంలో మా నిబద్ధతకు ఈ సోదాలే నిదర్శనం” అని ఎస్ఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సాధారణంగా హవాలా వంటి మార్గాల్లో నిధులు పంపినప్పుడు, దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక దశలో నిధుల జాడ (మనీ ట్రయల్) దొరికేది. ఈ ఆధారాలతోనే గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌కు సంబంధం ఉందని భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి. కశ్మీర్‌లో వేర్పాటువాదుల వెన్ను విరవడంలో వారి నిధుల మార్గాలను అడ్డుకోవడం కీలక పాత్ర పోషించింది. అయితే క్రిప్టో లావాదేవీలు చాలావరకు అజ్ఞాతంగా జరుగుతాయి. పంపినవారు, అందుకున్నవారి వివరాలు సులభంగా గుర్తించలేం. దీంతో దర్యాప్తు సంస్థలకు నిధుల మూలాలను కనిపెట్టడం పెనుసవాల్‌గా మారింది. ఈ ఏడాది మార్చి 2025లో పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా “పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్” ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్న “వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్” అనే క్రిప్టో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ బాహ్య ప్రపంచానికి చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉగ్ర నిధులను సులభతరం చేసే కుట్ర దాగి ఉందని భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, సామాజిక మాధ్యమాలు, వర్చువల్ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కూడా తన నివేదికలో హెచ్చరించింది. 2019లో హమాస్ ఉగ్రవాద సంస్థ తొలిసారిగా క్రిప్టో ద్వారా విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. గత ఏడాది జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడు (2024), పుల్వామా దాడి (2019) వంటి కేసుల దర్యాప్తులోనూ ఉగ్రవాదులు క్రిప్టో వ్యాలెట్లు, చైనీస్ యాప్‌లు, డార్క్‌నెట్‌ను వాడుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.