Saturday, 9 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణేష్ సెంటర్ గణపతికి ఘనంగా పూజలు..

న్యూస్ ఆగస్టు 31 కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి యున్న గణపతికి విద్యార్థినీ విద్యార్థులచే ప్రముఖ పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో విశేషమైన పూజలు నిర్వహించారు.. ముందుగా గ్రంధి నాగబాబు దంపతులచే స్వామివారికి అభిషేకాలు, గరిక పూజ జరిపి, అనంతరం సుమారుగా 100 మంది విద్యార్థిని,విద్యార్థులచే స్వామివారికి వివిధ రకాల పత్రులు, పుష్పములు, పెన్నులతో పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమానికి వ్యాపార ప్రముఖులు వివిధ రకాల ప్రసాదాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.. పూజా కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు దగ్గరుండి పిల్లలచే పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఆశపు బ్రదర్స్,గోకవరపు బ్రదర్స్, కంచు స్తంభం సోనీ, బషీర్, సుతాపల్లి నాగభూషణం, నాగబాబు తదితరులు పిల్లలకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణేష్ సెంటర్ గణపతికి ఘనంగా పూజలు..

న్యూస్ ఆగస్టు 31 కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి యున్న గణపతికి విద్యార్థినీ విద్యార్థులచే ప్రముఖ పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో విశేషమైన పూజలు నిర్వహించారు.. ముందుగా గ్రంధి నాగబాబు దంపతులచే స్వామివారికి అభిషేకాలు, గరిక పూజ జరిపి, అనంతరం సుమారుగా 100 మంది విద్యార్థిని,విద్యార్థులచే స్వామివారికి వివిధ రకాల పత్రులు, పుష్పములు, పెన్నులతో పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమానికి వ్యాపార ప్రముఖులు వివిధ రకాల ప్రసాదాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.. పూజా కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు దగ్గరుండి పిల్లలచే పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఆశపు బ్రదర్స్,గోకవరపు బ్రదర్స్, కంచు స్తంభం సోనీ, బషీర్, సుతాపల్లి నాగభూషణం, నాగబాబు తదితరులు పిల్లలకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్

రేషన్ దుకాణాల్లో రాగులు, నూనె, కందిపప్పు అందిస్తాం: నాదెండ్ల

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ఆంధ్రప్రదేశ్ రేషన్: రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ దుకాణాల్లో రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు అందిస్తామని చెప్పారు. నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఖమ్మం

వినాయక మండపాలను సందర్శించిన అధ్యక్షులు

ఈరోజు స్థానిక ఖమ్మం 3 టౌన్ ఏరియా లోని 46వ డివిజన్లో సారధి నగర్ ఏరియా నందు సాయి గణేష్ ఉత్సవ కమిటీ 30వ గణపతి నవరాత్రి ఉత్సవముల సందర్బంగా కమిటీ సభ్యులు మరియు ఖమ్మం మూడవ పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు గోనెల. శివ కుమార్ ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమం లొ పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరావు మూడవ పట్టణ అధ్యక్షులు దార్ల. మల్లేశ్వరి శంకరగౌడ్ , బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్ జిల్లా కార్యదర్శి దర్శన్ మిశ్రాగారు, బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి RVS యాదవ్ గారు,పాల్గొనటం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలియజేసిన కొట్టాయపల్లి సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు..!

వింజమూరు :పున్నమి,న్యూస్ ప్రతినిధి నాగరాజు,, ఆగస్టు 31://// ఉదయగిరి మండలం కొట్టాయపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా గడ్డం వెంకటేశ్వర్లు గారు నూతనంగా ఎంపికయ్యారు. ఆ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం నాడు వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట సొసైటీ డైరెక్టర్లు గా ఎంపికైన బొజ్జ నరసింహులు గారు, నల్లిపోగు రాజా గారు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @జీమెయిల్ పాస్వర్డ్: జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది. 250 కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ(బ్రీచ్) అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది జూన్ ప్రథమార్థంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది. ముందుగా అనుకున్నదానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది. ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారని, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని, లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్

రేబిస్‌.. లక్షణాలతో నాలుగేళ్ల బాలుడు మృతి.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ స్థానికుల వివరాల ప్రకారం… బీర్‌పూర్‌కు చెందిన ఇంద్రాల శిరీష, చంద్రయ్యల మూడో కుమారుడు రక్షిత్‌(4)పై నెల క్రితం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడ్డాడు. దీంతో కుక్క కరిచినట్లు గమనించని తల్లిదండ్రులు.. గాయాలకు మాత్రమే చికిత్స చేయించారు. ఈ క్రమంలోనే రెండు, మూడు రోజులుగా బాలుడు తీవ్ర జ్వరంతోపాటు నీటిని చూస్తే భయపడటం, నాలుకను బయటకు తీస్తుండటంతో జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.

ఆంధ్రప్రదేశ్

కులం, మతం కాదు! నిజమైన అభివృద్ధికి విద్య, జ్ఞానం చాలా అవసరం,

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @కులం, మతం కాదు: పూర్వీకులను చూసి వాళ్లు ఏ మతం వారు, ఏ కులం వారు అని చెప్పడం అసాధ్యం. అప్పటి సమాజంలో అలాంటి విభజనలు లేవు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, హరిజనుడు, గిరిజనుడు, ముస్లిం, క్రైస్తవుడు, సిక్కు, జైనుడు, బౌద్ధుడు… ఇవన్నీ ఆధునిక సమాజంలో వచ్చిన భావనలు. ఈ చిత్రంలో ఉన్నవారు కేవలం మానవులు మాత్రమే. వారిలో మంచి, చెడు, తెలివిగలవారు, తక్కువ తెలివిగలవారు, ధైర్యవంతులు, భయస్తులు వంటి వ్యక్తిగత లక్షణాలు మాత్రమే ఉండి ఉంటాయి, కానీ మతాలు, కులాలు మాత్రం కాదు. విద్య, కులం, మతం మీరు చెప్పినట్లుగా, మనిషి చంద్రుడిని, అంగారకుడిని చేరుకోవడానికి కారణం చదువు, జ్ఞానం మాత్రమే. అక్కడికి వెళ్ళడానికి ఏ మతం, ఏ కులం ఉపయోగపడలేదు. ఎందుకంటే సైన్స్, టెక్నాలజీకి కులం, మతం అనేవి ఉండవు. అవి కేవలం మన మేధస్సు, కృషి ఆధారంగా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. మనిషి చంద్రుడిని, అంగారకుడిని చేరుకోవడానికి విద్య, జ్ఞానం మాత్రమే కారణం. మీరు చెప్పింది నిజం. ఈ గొప్ప విజయాలు మనిషి మేధస్సు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యాయి. ఇక్కడ కులం, మతం అనేవి ఏమాత్రం పాత్ర పోషించలేదు. సైన్స్, టెక్నాలజీ అభివృద్ధికి ఏ కులం, మతం అడ్డుకాదు, సహాయం చేయదు. అవి కేవలం మన కృషి, ఆలోచనల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా, ఏ కులం, మతం వారైనా సైన్స్, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. దీనికి జాతి, మత, కుల భేదాలు అవసరం లేదు. విద్య అనేది మనిషి ఆలోచనలను, సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. అది సమాజంలో ఒకరినొకరు గౌరవించుకోవడానికి, కలిసి పని చేయడానికి సహాయపడుతుంది. నిజమైన అభివృద్ధికి విద్య, జ్ఞానం చాలా అవసరం, అవి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము.

ఖమ్మం

బై బై గణేశా

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ నందు గల స్రవంతి కిరాణా షాపు, లోటస్ బోటిక్ ఉదయ్ బోటిక్ నందు ఏర్పాటు చేసిన గణ నాధులు గత మూడు రోజు లుగా పూజలు అందుకొని ఆదివారం నాడు నిమజ్జనం కీ బయలు దేరి వెళ్లారు. జై బోలో గణేష్ మహా రాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా, బై బై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ, భక్తుల కోలాటల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్రవంతి కిరాణా భద్రయ్య, లోటస్ బోటిక్ రాజశేఖర్ రెడ్డి, ఉదయ్ బోటిక్ ఉదయ్ మరియు ఆయా షాపు ల సిబ్బంది కార్పొరేటర్ అభ్యర్థి ని శ్రీమతి ధనియాకుల శ్రీ లత, లింగ రాజు, రాములు సంపత్ దుర్గా రావు. గిరి, నాగేశ్వరావ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సినిమా

బాలయ్య ‘అఖండ-2’ సినిమాకి భారీ ధర…

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ సినిమా : బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న ‘అఖండ-2’ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. జియో హాస్టార్ సంస్థ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.