Saturday, 9 May 2026

Blog

అన్నమయ్య

పెనగలూరు మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం

పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి పంచాయతీలో ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ, మదన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్ పంపిణీకి సచివాలయం సిబ్బంది సహకారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు నరసింహ, మదన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ప్రతి అర్హత కలిగిన వారికి సమయానికి అందేలా చూడాలని కోరారు. పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పింఛన్లు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పింఛన్లు పొందారు.

భక్తి

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @దసరా వేడుకలు: మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు ఆంధ్రప్రదేశ్ : విజయవాడలో దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.

ఆంధ్రప్రదేశ్

185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి తాళం.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @తపాలా శాఖ కీలక నిర్ణయం: భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్స్ లను ఈ రోజు అనగా సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది. ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయి. తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఈ రోజుల్లో వాట్సాప్, ఇమెయిల్ వంటి సాంకేతికత కారణంగా పోస్టు బాక్స్ వినియోగం తగ్గిపోయింది.

ఆంధ్రప్రదేశ్

గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ప్రమాదాలపై సియం చంద్రబాబు విచారం

వేరు వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న సియం. సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సిఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి జరిగింది. గణేష్ విగ్రహ ఊరేగింపులో ట్రాక్టర్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు మృతి ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాల పాలయ్యారు. ఎంతో సంతోషంగా వేడుక జరుపుకుంటున్న వారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంపై సిఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అదే విధంగా అల్లూరి సీతా రామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్ లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదంలో మరో ఇద్దరు మృతిపైనా ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వివరించారు. వారికి అందుతున్న వైద్య సాయంపై సిఎం ఆరా తీశారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలకు సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Blog

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు – నాగేంద్రప్ప, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు

1జనవరి 2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి, 2024 వ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం అమలు చేసింది. ఈ విధానం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 01.09.2004 నుండి కొత్తగా ప్రభుత్వ సర్వీసులో చేరిన వారికి ఆంధ్ర ప్రదేశ్ రివైజెడ్ పెన్షన్ రూల్స్ 1980 ని సవరిస్తూ ప్రభుత్వ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఈ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. అప్పటి ఏకచక్రాదిపత్యం గల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోవడం చేత దాదాపు దశాబ్ద కాలం తరువాత రామాంజనేయులు 2015 వ సంవత్సరం లో సిపిఎస్ అంతం మా పంతం అంటూ ఏర్పడిన ఏపీ సిపిఎస్ఈఏ సంఘం గా 581 /2015 ద్వారా సంఘం రిజిస్టర్ కాబడి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వలన దేశ చరిత్రలోనే పదవి విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించిన సంఘంగా ఉద్యోగుల మన్ననలు పొంది, నేడు ఏపీ సీపీఎస్ఈఏ సంఘం గౌరవ అధ్యక్షులుగా రామాంజనేయులు, అధ్యక్ష, కార్యదర్శులుగా బాజీ పఠాన్, కరిమి రాజేశ్వరరావు కొనసాగుతూ, కా కె ఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో ఏర్పడిన ఐక్య వేదిక లో భాగమై సిపిఎస్ పూర్తి గా రద్దు కై పోరాటం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయులకు వజ్రాయుధం అయింది. జనవరి 1 2004 కు ముందు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నూతన పెన్షన్ విధానంలోకి అనివార్యంగా వచ్చిన సందర్భంగా వారు కోర్టులను ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కోర్ట్ తీర్పులను సూచిస్తూ, వివిధ ప్రాతినిధ్యాలు, నిర్ణయాల దృష్ట్యా డిసెంబర్ 31, 2003 కి ముందు ఎంపికై జనవరి, 1 2004 తరువాత నియామకమైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారము పాత పెన్షన్ అప్షన్ ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు భారత దేశంలో మెమో 57 ప్రకారం భారతీయ రైలు, తపాలా, సెంట్రల్ బెటాలియన్ దళం, తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సుమారు 16 రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పాత పెన్షన్ అమలుకు నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కేం ద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2023లో గత రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ ను పునరుద్దరించిన విషయం తెలిసిందే. అత్యున్నత హోదాలో ఉన్న అధికారులకు ఒక న్యాయం, దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం సరైన విధానం కాదు అని ఆంధ్ర ప్రదేశ్వరభుత్వ ఉద్యోగుల సంఘం భావిస్తుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం 2022 లో ఉద్యోగ సమస్యలపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం తేది 01.09.2004 ముందు గా వెలువడిన నోటిఫికేషన్ తరువాత నియమకమైన వారికి పాత పెన్షన్ విదానాన్ని పునరుద్దరించడానికి అంగీకరించింది. అలాగే 2024 ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించడానికి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ నియమక ప్రక్రియ, నిబందనలకు సంబందించి సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నవంబరు 7 2023 న కిలక తీర్పు వెల్లడించింది. నియామకాల సమయంలో నియమాలను మరచిపోకూడదని, ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు నొక్కి చెప్పింది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14 కు అనుగుణంగా ఉండాలని, వివక్షకు తావు ఉండకూడదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా సెప్టెంబర్, 1 2004 కు ముందు నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలను 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ప్రభుత్వం వారంలో సిపిఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి కూడా మొండి చెయ్యి చూపించింది. అంతే కాకుండా సిపిఎస్ కాదు మెరుగైన జిపిఎస్ విధానం అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్య పెట్టింది. ప్రస్తుతము కుటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో నే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి, అందరికి అమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం అని మేనిఫెస్టో లో హామీ ఇవ్వడం జరిగింది. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు నెలల కాలం గడిచిన, సమస్యల పట్ల సాచివేత ధోరణితోనే ఉంది. ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగం ఉన్న భారత దేశంలో ప్రజా సేవకులు అనే నిర్వచనం కిందికి వచ్చే ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఒకే రకమైన పెన్షన్ విధానం ఉండాలి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో భారత దేశ ఉప రాష్ట్రపతిగా కొనసాగి గత నెల అనగా జూలై మాసంలో ఉప రాష్ట్రపతి పదవికి అనారోగ్య కారణాలు చూపి రాజీనామా చేసిన జగదీప్ ధన్ ఖడ్ గారికి రాజస్థాన్ రాష్ట్రం మాజీ శాసన సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మరియు మాజీ ఉప రాష్ట్రపతిగా మొత్తం మూడు రకాల పెన్షన్లు మరియు మాజీ ఉప రాష్ట్రపతి హోదాలో ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి . కానీ 30 సంవత్సరాల సర్వీసు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. కావున, ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించి రాష్ట్రంలో ఉన్న సుమారు 11,000 మంది ఉద్యోగాలు, ఉపాధ్యాయులకు కేంధ్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారము పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అదే విధముగా సిపిఎస్ ను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి పాత పెన్షన్ విధాన్ని పునరుద్దరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల తరుపున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.

ఖమ్మం

స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

బస్సు ఢీకొని భార్య మృతి – రక్తస్రావంలో విలవిల్లాడిన భర్త గాయపడిన బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఖమ్మం, ఆగస్టు 31: ఒక క్షణం ఆలస్యం, ఒక వాహన నిర్లక్ష్యం – ఒక చిన్న కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచింది. ఆదివారం సాయంత్రం రంగనాధపాలెం మండలం వెంకటాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం భయంకర దృశ్యాలకు వేదిక అయింది. ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి టూవీలర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. అయితే వెనకనుంచి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కుటుంబం జీవితాలు క్షణాల్లో మారిపోయాయి. బస్సు టైరుకింద కొట్టుకుపోయిన లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రక్తపు మడుగు లో విలవిల్లాడుతూ పడిన వెంకటేశ్వర్లు, కళ్లముందే శ్వాస ఆపేసిన తన భార్యను చూసి వేదనతో కేకలు వేస్తూ కన్నీటి భరితంలో మునిగిపోయారు. ఆ దృశ్యం చూసిన ప్రత్యక్ష సాక్షులు సైతం క్షణం మాటరాలేక స్థబ్ధులయ్యారు. ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఘటనను గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వాహనం ఆపి గాయపడిన వెంకటేశ్వర్లను సాంత్వనపరచారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, 108 అంబులెన్స్‌కు కాల్ చేసి, గాయపడిన బాధితుడిని తనే స్వయంగా ఆసుపత్రికి చేర్చారు. రక్తంతో తడిసిన ఆయనకు ప్రథమ చికిత్స అందేలా క్షణక్షణం పర్యవేక్షిస్తూ, ధైర్యం చెప్పడం మానవీయతకు నిదర్శనమైంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. “ఒకరి నిర్లక్ష్యం వల్ల అమాయక కుటుంబాలు ఎన్ని ప్రాణాలు కోల్పోవాలి?” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెల్త్ టిప్స్

వైరల్ జ్వరాలు – నివారణ

తరచుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల తో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మరియు జ్వరాలు వస్తున్నాయి. కొంత మందికి అయితే అవి త్వరగా తగ్గడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. అల్లోపతి మందుల తో రోగాలు తగ్గడం లేదు. ఇందుకు హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని హోమియో వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఇంటిలో కొన్ని రకాల హోమియోపతి మందులు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగ పడతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అవేంటో ఇప్పుడు చూద్దాం 1. ఆర్సెనిక్ ఆల్బ్ 30 C 2. బెల్లాడోన 30 3. నక్స్ వోమికా 30 4. గ్రాఫైట్ 200 5. లైకోపోడియం 200 ఈ మందులు పోటెన్సీ లో తీసుకోవాలి అందరూ సంపూర్ణ ఆరోగ్యం తో పది కాలాల పాటు సంతోషంగా, ఆనందముగా ఉండాలని హోమియోపతి వైద్యులు చెబుతున్నారు. – ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

విద్య విజ్ఞానం

డా. సర్వేపల్లిరాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ అవార్డ్ అందుకున్న డా.ఆకుమళ్ళ నాని

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ చైర్మన్ డా. పి. నాగయ్య మరియు SPLTO సభ్యులు అందరికీ మా హృదయ కృతజ్ఞతలు తెలియజేసిన డా. ఆకుమళ్ళ నాని అనేక మంది పేద విద్యార్ధులకు వారి చదువు నిమిత్తం గత 9 సంవత్సరాలుగా హార్డిక సహాయం అందించి మానవత్వం చాటుకొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన డా. ఆకుమళ్ళ నాని కి డా.సర్వేపల్లిరాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ అవార్డ్ రావడం గర్వంగా ఉందన్న అల్ ఇండియా నాని సేవా థళ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు షాహ్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ & హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉభయ రాష్ట్రాల యం.బి.సి. మరియు గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ రాష్ట్ర సేవారత్న డా. ఆకుమళ్ళ. నాని కి డా. సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ ప్రతిభ అవార్డుని ఈ రోజు లాం గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ప్రముఖులు మాజీ యం.యల్.సి, కె.యస్.లక్ష్మణ్, వై.వి.ఆంజనేయులు చలపతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్,ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్,వి.కన్నా మాస్టర్,ఎ.సి.కాలేజీ ప్రిన్సిపల్ మోజెస్,వై.స్,ప్రిన్సిపల్ లా-కాలేజ్,వై.స్,ప్రిన్సిపల్ రాణి శ్రీ అమృత వర్షిని తదితర ప్రముఖులు చేతులు మీద గా అవార్డు అందుకున్నారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5 న టీచర్స్ – డే శుభ సందర్భంగా ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాల, పాఠశాలల నిర్వహిస్తున్న పెద్దలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, వారికి ప్రభుత్వం తరుపున తగిన గుర్తింపు కల్పించడం లేదని సౌత్రన్ ప్రైవేట్ లెక్చర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించి రాష్ట్ర నలుమూలలా విద్యార్ది,విద్యార్థినులకు సేవల్ని అందించిన ఉపాధ్యాయుల తగిన ప్రాధాన్యత కల్పించి గుర్తింపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది

ఆంధ్రప్రదేశ్

ఆహారంలో నెయ్యి వాడకం మంచిదా.. కాదా ?

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @నెయ్యి వాడకం: నెయ్యి అనేది ముఖ్యమైన దినుసు అని సిధ్ధుల మాట. దాని ఔషధ గుణాలను ఈ రోజు ఉన్న పరిజ్ఞానం కంటే ఎంతో ముందు పరిశోధించారు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన నెయ్యిని ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలు బాగా కాచినేని,చల్లారక కాస్త పెరుగు తోడు పెడితే ఆరు ఎనిమిది గంటలలో పెరుగు తయారౌతుంది. ఈ పెరుగులో కాసిని నీళ్లు పోసి కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. దాన్ని ఒక గిన్నెలో వేసి కాస్తే అది కరుగుతుంది. అందులో ములగాకు కాస్త వేస్తే చక్కగా పొంగుతుంది. చక్కటి సువాసన వస్తుంది. పూర్తిగా కరిగాక, దింపి వడకట్టి జాగ్రత్త చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే నెయ్యి ఎక్కువ కాలం పాడుగాకుండా ఉంటుంది. ఈ నెయ్యిలో ఔషధ గుణాలుఉన్నాయి. రెండు వేల సంవత్సరాలు ముందే సిద్ధ ఆయుర్వేద చికిత్సలో నెయ్యి విరివిగా ఉపయోగించేవారు. ఔషధ గుణాలు కలిగిన అణువుల గోడలు పారదర్శకంగా ఉండడం వలన ఔషధాల తయారీలో నెయ్యి ఎక్కువగా వాడేవారు. ఔషధం చెడిపోకుండా నెయ్యి ఒక ప్రిజర్వేటివ్ గా పని చేస్తుంది. నెయ్యి ఒక రసాయనం అని ఆయుర్వేదం చెబుతుంది. పూర్తి శరీర ఆరోగ్యాన్నిచ్చే గుణాలు నెయ్యిలో ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా నెయ్యి సిధ్ధ ఆయుర్వేద వైద్యులకు ఒక మంచి నేస్తంగా, తయారైన మందులను చెడిపోకుండా ఉండేందుకు బాగా సహాయకారిగా ఉంటుంది. ఒక గరిటెడు నెయ్యిలో 14 గ్రాముల కొవ్వు శక్తి ఉంటుంది. జీర్ణ శక్తిని పెంపొందించే జఠరాగ్నిని నియంత్రించడం చేస్తుంది. మ్యూకస్ మెంమ్బ్రేన్ ను బల పరుస్తుంది. నెయ్యిలో ఉప్పు, లాక్టోజ్ వంటివి లేవు. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ (పాల పదార్థాలు పడక పోవడం) ఉన్న వారు నెయ్యి వాడుకోవచ్చు. కాన్సర్, వైరస్ అనారోగ్యాలు కూడా నెయ్యితో కంట్రోల్ చేయవచ్చు. నెయ్యిలో CLA – Conjulated Linoleic Acid ఉంది. ఇది ఊబ కాయం తగ్గిస్తుంది. అలాగే ఒమేగా 3 ఆమ్లాలు నెయ్యిలో విరివిగా ఉన్నాయి. ఇది మెదడుకు చాలా మంచిది. నెయ్యిలో Saturated fat – 65% Mono – unsaturated fat – 32% Linoleic – unsaturated fat -3% ఇన్ని విలువలు ఉన్న నెయ్యిని ఏ రకంగా వాడుకోవచ్చో తెలుసుకుందాం. నెయ్యి కరిగించి, మజ్జిగ చిలికి వాడాలని సామెత”. అంటే, నెయ్యిని కరిగించి, వేడి అన్నంలో కలుపుకుని తినాలి. దాని వలన దేహానికి చలువ చేస్తుంది. దోశను నూనె బదులుగానెయ్యితో కాల్చండి. నేతితో పత్యం కూడా చేయవచ్చు. మలబద్ధకం, వాతం, కఫంతో పాటు అనేక ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీరానికి కాంతిని ఇస్తుంది. కంటి నరాలు బల పడి కంటి చూపు బలపడుతుంది/మెరుగు పడుతుంది. శరీర పటుత్వం పెరుగుతుంది. కొందరు ఎప్పుడూ అలసటతో శరీరంలో శక్తి లేకుండా ఉంటారు. కాస్త దూరం నడిచినా ఆయాసపడి పోతారు. వెంటనే కాళ్ళ నొప్పితో కూలబడిపోతారు. ఇటువంటి వారికి మధ్యాహ్నం భోజనంలో నెయ్యి వేసుకొని తింటే మంచిది. విపరీతంగా ఉపవాసాలు ఉండే వారు, సమయానికి భోజనం చేయని వారూ జీర్ణ వ్యవస్థలో ఉండే ఆమ్లాలతో అల్సర్ బారినపడి బాధ పడుతూ ఉంటారు. నోటి పూతతో బాధ పడేవాళ్ళు, ఎక్కువగా కారం తినే వాళ్ళు, ఆల్కహాల్ తాగే వారు, మత్తు మందులకు అలవాటు పడ్డవాళ్ళు, ఒత్తిడి గలవారు, ఇలాంటి వారందరికీ కడుపులో అల్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటి అన్నింటికీ నెయ్యి వాడకం ఎంతో మేలు చేస్తుంది.

ఖమ్మం

ఖమ్మం మున్నేరు వరద కీ ఏడాది..

ఖమ్మం పున్నమి ప్రతినిధి సరిగ్గా ఏడాది క్రితం ఖమ్మం నాగరాణ్ణి మున్నేరు ముంచేసింది. ఆ సంఘటన ని తలుచుకుంటే నే ఆ ప్రాంత వాసులు హడలి పోతున్నారు. ఎంతో జన, ధన నష్టం జరిగినది. నిద్రలేకుండా బిక్కు బిక్కు అంటూ గడిపిన రాత్రులు ఇప్పటికి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరము కుడా భారీ వర్షాలు ఉన్న ఇక్కడ వర్షం ఉన్నప్పుడు పై నుండి నీరు రాకపోవడం. పై నుండి నీరు వచ్చేటప్పుడు ఇక్కడ వర్షం లేకపోవడం వల్ల భారీ ప్రమాదమె తప్పింది అని ప్రజలు భావిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.