మహానాడు ఏర్పాట్లపై విస్తృత సమీక్ష నిర్వహించిన టీడీపీ నేతలు
మహానాడు ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా రాచర్లపాడు వద్ద గల ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు విజయవంతానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఇఫ్కో సెజ్ సీఈవో పరిశీలించారు. సభ నిర్వహణ, ట్రాఫిక్ డైవర్షన్, రవాణా, పార్కింగ్, తాగునీరు, వసతి తదితర అంశాలపై అధికారులు, నిర్వాహకులతో చర్చించారు. ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

మహానాడు ఏర్పాట్లపై విస్తృత సమీక్ష నిర్వహించిన టీడీపీ నేతలు
మహానాడు ఏర్పాట్లపై విస్తృత సమీక్ష నిర్వహించిన టీడీపీ నేతలు మహానాడు ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా రాచర్లపాడు వద్ద గల ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు విజయవంతానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఇఫ్కో సెజ్ సీఈవో పరిశీలించారు. సభ నిర్వహణ, ట్రాఫిక్ డైవర్షన్, రవాణా, పార్కింగ్, తాగునీరు, వసతి తదితర అంశాలపై అధికారులు, నిర్వాహకులతో చర్చించారు. ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

