Saturday, 9 May 2026

Blog

సక్సెస్ స్టోరీస్

కులం మానసిక ఆరోగ్యంపై ప్రమాదకర ప్రభావం చూపుతోంది

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ “నేను అప్పుడు 6వ తరగతి. నన్ను స్కూల్ నుంచి మాకు దగ్గర్లోనే ఉండే టౌన్‌‌లో జరుగుతున్న పెయింటింగ్ కాంపిటీషన్‌కి తీసుకెళ్లారు. అందులో నేను గెలిచాను” “కానీ, కొంతమంది ఉపాధ్యాయులు ‘ఎవర్రా.. ఆ కాలనీకి చెందిన అమ్మాయిని ఎంపిక చేసింది అంటూ జడ్జిలను నిందించారు’, దీంతో వారు నన్ను పక్కనబెట్టి వాళ్ల పట్టణానికే చెందిన మరో విద్యార్థికి బహుమతి ఇచ్చారు.” తిరునెల్వేలికి చెందిన గ్రాడ్యుయేట్ దర్శిని (పేరు మార్చాం) ఈ విషయం బీబీసీతో చెప్పారు. తనకు ఎదురైన ఆ ఘటన తర్వాత డ్రాయింగ్ వేయడం, పోటీలలో పాల్గొనడం పూర్తిగా మానేశానని ఆమె చెప్పారు. “కుల మనస్తత్వం ఒక సామాజిక మానసిక వ్యాధి. ఇది చాలా మంది ప్రతిభను దెబ్బతీసింది. ఆ మనస్తత్వం ఉన్నవారికి మానసిక చికిత్స చాలా అవసరం.” భారతీయ సమాజంలో కుల నిర్మాణం, విద్య, ఆర్థిక వ్యవస్థ, జీవన నాణ్యత గురించి అనేక కోణాలపై విస్తృతంగా చర్చ జరిగింది. మానసికంగా, “కులం ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతోంది. కానీ, దాని గురించి చాలా అరుదుగా మాట్లాడతారు” అని అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది, సామాజిక కార్యకర్త సూరజ్ యెంగ్టే అంటున్నారు. కుల హింస: భారతదేశంలో కొనసాగుతున్న కథ తమిళనాడులోని రెండు వేర్వేరు ప్రాంతాలు తిరునల్వేలి, కడలూరులలో ఇటీవల కులం పేరుతో ఇద్దరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులను హత్య చేసిన కేసులు సంచలనం సృష్టించాయి. దేశంలో పరువు హత్యలే కాకుండా కుల ఆధారిత హింసాత్మక దాడులు కూడా పునరావృత్తం అవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2020 నుంచి 2022 వరకు మూడు సంవత్సరాలలో, భారత్‌లో 1,366 కుల ఘర్షణలు జరిగాయి. ముఖ్యంగా 2022లో ఒక్క తమిళనాడులోనే 75 కుల ఘర్షణల కేసులు నమోదయ్యాయి. వీరిలో 110 మంది బాధితులుగా ఉన్నారు. ఆ మూడేళ్లలో భారత్ అంతటా షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 1,58,773 నమోదయ్యాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 41,228 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 4,412 కేసులు నమోదయ్యాయి. పరువు హత్యలు, కుల ఆధారిత హింస, దైనందిన జీవితంలో నిశ్శబ్దంగా పాటించే వివక్ష వరకూ.. ప్రతీదీ దళిత ప్రజలను మానసికంగా తీవ్ర ప్రభావితం చేస్తోంది ‘ మానసికంగా కుంగిపోయాం, కానీ ఏం చేయగలం?’ కుల ఆధారిత హింస, వివక్ష మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి తమిళనాడులోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది మధ్య వయస్కులైన మహిళలతో బీబీసీ మాట్లాడింది. చాలా సంవత్సరాలుగా తీవ్ర నిరాశతో బాధపడుతున్నట్టు దాదాపు అందరూ అంగీకరించారు. అదే సమయంలో, కుల వివక్ష మానసిక ప్రభావాలను తమ ‘తలరాత’గా భావిస్తున్నామని, ఎందుకంటే తాము దానిని రోజువారీ జీవితంలో తరతరాలుగా చూశామని చాలామంది చెప్పారు. దాని ప్రభావాలను అనుభవిస్తున్నప్పటికీ, కొంతమందికి ఎక్కడ, ఎలా చికిత్స పొందాలో తెలియదు. వారిలో ఒకరు తేన్ముడియానూర్ గ్రామానికి చెందిన చంద్ర (పేరు మార్చాం). తిరువణ్ణామలై జిల్లాలోని తేన్ముడియానూర్ గ్రామంలో ఉన్న 80 ఏళ్లనాటి మరియమ్మన్ ఆలయంలోకి అధికారుల జోక్యంతో 2023 జనవరిలో దళితులు ప్రవేశించారు. ఇది నచ్చని ఇతర కులాల వారు మరో గుడి కట్టుకున్నారు. ఇది తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని దళిత వర్గానికి చెందిన చంద్ర బీబీసీతో చెప్పారు. గ్రామంలో కులం విషయంలో అంత దురభిమాన వైఖరి ఉందని అన్నారు. దేవాలయాల్లోకి వెళ్లేటప్పుడు మాత్రమే కాకుండా, దైనందిన జీవితంలోనూ అనేక రకాల వివక్ష, హింసను ఎదుర్కొన్నానని చంద్ర చెప్పారు. పిల్లలను కూడా వారి కుల నేపథ్యం ఆధారంగా గుర్తిస్తారని, చాలా ఏళ్లుగా తాను రోజూ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నా. కానీ, నేనేం చేయగలను? దీనికి ఏదైనా చికిత్స ఉందా? అది ఎక్కడ పొందగలను?” అనేది చంద్ర ప్రశ్న. ఇది చంద్ర పరిస్థితి మాత్రమే కాదు, దేశమంతటా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది మహిళల పరిస్థితి అని దళితుల కోసం బ్లూ డాన్ అనే మానసిక కౌన్సెలింగ్ సంస్థ నిర్వహిస్తున్న దివ్య కందుకూర్ అంటున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో.. “మహిళలు నీళ్ల కోసం కుళాయిల దగ్గరకు వచ్చినప్పుడు పుకార్లు చెప్పుకుంటుంటారని అంటారు. కానీ, అక్కడే వారు తమ బాధలను బయటపెట్టుకోగలుగుతారు, అది వారి భర్తల చేతుల్లో గృహ హింస అయినా లేదా వారి పిల్లలు పాఠశాలలో ఎదుర్కొంటున్న వివక్ష అయినా.” అంతే కాకుండా, అధికారికంగా కౌన్సెలింగ్ లేదా చికిత్స ఇంకా గ్రామీణ మహిళలకు, ముఖ్యంగా దళితులకు చేరలేదని దివ్య అంటున్నారు. తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న దళితులు ప్రజల మానసిక ఆరోగ్యంపై సామాజిక వివక్ష ప్రభావాలు లెక్కలేనన్ని రూపాలు తీసుకుంటాయని అమెరికాలోని హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో గ్లోబల్ హెల్త్ అండ్ పాపులేషన్ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ పటేల్ చెప్పారు. భారతీయ సమాజంలో ఉన్న అసమానతల కారణంగా దళిత సమాజాలు ఇలాంటి ప్రభావాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు. పిల్లలు పెరిగే సామాజిక వాతావరణం వారి అభివృద్ధి, దీర్ఘకాలిక ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని ప్రొఫెసర్ విక్రమ్ పటేల్ అంటున్నారు. భారతదేశంలో పేదరికంలో నివసిస్తున్న 100 మందిలో 3.9 మంది నిరాశతో బాధపడుతున్నారని కూడా ఆయన అధ్యయనంలో తేలింది. 2019-21 సంవత్సరానికి 5వ జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రకారం, భారత్‌లో “71 శాతం షెడ్యూల్డ్ తెగలు, 49 శాతం షెడ్యూల్డ్ కుల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన, పేదరికం, తీవ్ర పేదరికంలో ఉన్నాయి.” దీని ప్రకారం, నిరాశతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారేనని అర్థం చేసుకోవచ్చు. అయితే, కులం ఆధారంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ప్రభావాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. విద్యార్థులపై ప్రభావం ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేస్తున్న వామపక్ష విద్యార్థి నాయకుడు, కేరళకు చెందిన కె.ఎస్. రాందాస్‌ను దుష్ప్రవర్తన కారణంగా ఏప్రిల్ 2024లో రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. మేలో, సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్‌ను తగ్గించి, చదువును తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది. విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి కుల ఆధారిత వైఖరులు, వివక్ష విస్తృతంగా ఉన్నాయని, ఫలితంగా విద్యార్థులు నిరాశకు గురవుతున్నారని ఆయన బీబీసీతో చెప్పారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కులం ఒక ప్రధాన కారణమని ఆయన అన్నారు. “ప్రభుత్వాన్ని విమర్శించినందుకు, నిరసనల్లో పాల్గొన్నందుకు నాపై ఈ చర్య తీసుకున్నారు” అని రాందాస్ అన్నారు. “ఆ సమయంలో, రిజర్వేషన్లను ఇప్పటికే విమర్శిస్తున్న హిందూ కులాల విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో ‘నేను ఇంకా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు?’ వంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు షేర్ అవడాన్ని నేను చూశాను” అని రాందాస్ చెప్పారు. ఈ అనుభవాలు తీవ్ర నిరాశకు గురిచేశాయని, తాను, తన కుటుంబం ఇప్పటికీ దాని కోసం మానసిక చికిత్స పొందుతున్నామని ఆయన అన్నారు. “విద్యా సంస్థలలో నిశ్శబ్దంగా ఇలాంటి వివక్షను అనుభవిస్తున్న విద్యార్థుల పరిస్థితిని ఊహించుకోండి” అని రాందాస్ అన్నారు. దీని గురించి రాందాస్ మాత్రమే కాదు, చెన్నైలోని కిల్పాక్ ప్రభుత్వ సైకియాట్రికాలేజ్ ప్రొఫెసర్ కూడా మాట్లాడారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. “ఇప్పుడు, కళాశాలల్లో రిజర్వేషన్ శాతాన్ని బెంచ్‌మార్క్‌గా ఉపయోగించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను గుర్తించే ప్రమాదకరధోరణి కొనసాగుతోంది” అని ఆయన అన్నారు. ” ఇలాంటి వైఖరులు, వివక్ష విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై ఆధారపడిన విద్యార్థుల గుర్తింపును దోచుకుంటాయి” అని సూరజ్ యెంగ్టే అన్నారు. అంతేకాకుండా, కుల సమస్యల ప్రభావాలు చికిత్సతో ముగియవని ఆయన అంటున్నారు. ”ఇప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను కులంతో గుర్తించడం కొనసాగుతోంది. అందువల్ల, అన్ని రూపాల్లో వివక్ష అనేది రోజువారీ సంఘటన.” “దీని బారిన పడిన వ్యక్తి మానసిక చికిత్స పొందినప్పటికీ, అతను లేదా ఆమె తిరిగి అదే సమాజంలోకి వెళ్తారు. అప్పుడు వారు మళ్లీ అదే వివక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఒక చైన్ రియాక్షన్” అని ఆయన చెప్పారు. మానసిక చికిత్సలో కులాన్ని ఎందుకు విస్మరిస్తారు? డాక్టర్ విక్రమ్ పటేల్ చెప్పినట్టుగా, సమాజంలో కులం ఆధారంగా జరిగే అనేక రకాల వివక్ష, హింస వల్ల నిరాశ, ఆందోళన, ఒత్తిడి సహా చాలా రకాల హాని కలుగుతుంది. యువతరం, ముఖ్యంగా పిల్లల ఆత్మవిశ్వాసానికి ఇది హాని కలిగిస్తుందని, ఇది చాలామంది తమపై తాము నమ్మకం కోల్పోయేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కులం ప్రజలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతున్నప్పటికీ, మానసిక ఆరోగ్య నిపుణులందరికీ కుల నిర్మాణం, ఈ సమస్యల గురించి అవగాహన లేదని దివ్య కందుకూర్ అంటున్నారు. కుల సమస్యలపై అవగాహన ఉన్న మానసిక ఆరోగ్య నిపుణుల కొరత పెరుగుతోందని మానసిక వైద్యురాలు రాధిక మురుగేశన్ అన్నారు. ఆమె పెరియార్ మానసిక చికిత్సపై ఒక పుస్తకం రాశారు “మనం మనస్తత్వ శాస్త్రవేత్తలతో కులం గురించి మాట్లాడితే, వాళ్లు దాన్ని పట్టించుకోరు.” “మనస్తత్వశాస్త్ర పాఠ్యాంశాలు పాశ్చాత్య నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిని మరింత వ్యక్తిగత, సమగ్రమైన విధానాన్ని అందించడానికి అనుగుణంగా మార్చుకోవాలి” అని డాక్టర్ రాధిక అంటున్నారు. ఎందుకంటే, “మానసిక ఆరోగ్య సంరక్షణలో కులతత్వాన్ని విస్మరించడం అంటే, దళితులు తరతరాలుగా మోస్తున్న మానసిక గాయాలను పూర్తిగా విస్మరించడమే” అని ఆమె అభిప్రాయపడ్డారు. కుల ఆధారిత మానసిక చికిత్స అవసరం “పాశ్చాత్య విద్యా వ్యవస్థ తరహాలో ఉన్న మనస్తత్వశాస్త్ర పాఠ్యాంశాల్లో కుల ఆధారిత చికిత్సా విధానాన్ని విస్మరించారు” అని తమిళనాడులో పనిచేస్తున్న మిలిర్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రీతి షణ్ముగప్రియ అన్నారు. కుల ఆధారిత వివక్ష, హింస వల్ల ఏర్పడే సామాజిక-మానసిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రజలకు మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడం, కులాన్ని తిరస్కరించడంపై యువతకు అవగాహన కలిగించడం లక్ష్యంగా ‘మిలిర్’ సంస్థ తమిళనాడులో పనిచేస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకులు, సైకో థెరపిస్ట్ ప్రీతి, అంబేడ్కర్ భావాలను అనుసరించే స్త్రీవాద పరిశోధకురాలు అశ్విని

ఖమ్మం

ప్రజలు జాగ్రత్త గా ఉండాలి.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త గా ఉండాలి అని ఖమ్మం బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ విజ్ఞప్తి చేసారు.

తిరుపతి

రోడ్డు ప్రమాదంలో టీటీడీ ఉద్యోగి మృతి

ఏర్పేడు మండలంలోని రాజుల కండ్రికకు చెందిన పి మునీంద్ర బాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి.ఇవాళ విధులకు వెళుతూ గోవిందవరం సబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న వరాహం(పంది)తపించిబోయి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది

ఆంధ్రప్రదేశ్

గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి@గ్యాస్ సిలిండర్ ధర: ఎల్పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.51.50 తగ్గింపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ధర తగ్గడంతో చిన్నా-పెద్దా వ్యాపారులకు ఖర్చులో కొంత ఉపశమనం లభించనుంది.

ఆంధ్రప్రదేశ్

జగన్ కు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఫోన్… నో చెప్పిన వైసీపీ అధినేత

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ ఉపరాష్ట్రపతి ఎన్నికలు: ఉపరాష్ట్రపతి ఎన్నికలు మద్దతు కోరిన విపక్ష అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఎన్డీయే నాయకులకు ముందే మాట ఇచ్చేశానన్న జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు ఫోన్ చేశారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన జగన్‌ను కోరారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థనకు జగన్ సున్నితంగా బదులిచ్చారు. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించకముందే ఎన్డీయే నాయకులు తనను సంప్రదించారని, వారికి మద్దతు ఇస్తామని మాట ఇచ్చామని జగన్ వివరించారు. ఈ కారణంగా ఇప్పుడు మీకు (సుదర్శన్ రెడ్డికి) మద్దతు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. అయితే, న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి దేశానికి, ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని, ఆయనపై తనకు వ్యక్తిగతంగా అపారమైన గౌరవం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన నిర్ణయాన్ని మరోవిధంగా భావించవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు

ఆంధ్రప్రదేశ్

ఏపీలో అందరికీ ఇళ్లు పథకం.. అర్హతలు ఇవే!

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ అమరావతి : తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సొంత ఇల్లు గానీ, స్థలం గానీ కలిగి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేని ద్వారానూ లబ్ధి పొంది ఉండకూడదు. 5 ఎకరాల లోపు మెట్ట వ్యవసాయ భూమి (లేదా) రెండున్నర ఎకరాల లోపు తరి వ్యవసాయ భూమి (లేదా) రెండూ కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి కలిగి ఉన్నవారు అర్హులు.

జాతీయ అంతర్జాతీయ

వామ్మో ఇది విన్నారా…..ప్రజల సొమ్ము అంటే అంత తేలిక… 25 కేజీల బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్ బెట్టింగ్.. మంచిర్యాల బ్యాంకు మేనేజర్, క్యాషియర్ నిర్వాకం!

మంచిర్యాల చెన్నూరు ఎస్‌బీఐలో ఘటన ఖాతాదారులకు చెందిన 25 కిలోల బంగారం స్వాహా బ్యాంకు మేనేజర్, క్యాషియర్, సిబ్బందే సూత్రధారులు క్రికెట్ బెట్టింగ్ కోసం బంగారాన్ని వేరేచోట తాకట్టు పెట్టిన నిందితులు మొత్తం 47 మందిపై కేసు నమోదు, 15 కిలోల బంగారం రికవరీ సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ఎస్‌బీఐలో ఘటన: బ్యాంకు ఆడిటింగ్‌లో వెలుగు చూసిన భారీ కుంభకోణం కంచే చేను మేసిన చందంగా, ప్రజలు ఎంతో నమ్మకంతో దాచుకున్న బంగారానికే బ్యాంకు సిబ్బంది కన్నం వేశారు. ఖాతాదారుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని, వారి గోల్డ్ లోన్ ఖాతాల నుంచి ఏకంగా 25 కిలోల బంగారాన్ని దొంగిలించి, ఆ సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో వెలుగుచూసింది. ఈ భారీ మోసంలో బ్యాంకు మేనేజర్, క్యాషియర్లే ప్రధాన సూత్రధారులు కావడం కలకలం రేపుతోంది. చెన్నూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) బ్రాంచిలో ఈ కుంభకోణం జరిగింది. ఇక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్‌కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉంది. ఈ బెట్టింగ్‌లలో సుమారు రూ. 40 లక్షలు పోగొట్టుకోవడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అడ్డదారి తొక్కాడు. బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి ఖాతాదారుల బంగారాన్ని కొట్టేయడానికి పథకం రచించాడు. గతేడాది అక్టోబర్ నుంచి వీరు తమ ప్రణాళికను అమలు చేశారు. బ్యాంకులోని 402 మంది ఖాతాదారుల గోల్డ్ లోన్ ప్యాకెట్ల నుంచి కొద్దికొద్దిగా 25.17 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. ఈ బంగారాన్ని కొన్ని ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పనిచేస్తున్న ధీరజ్, రాజశేఖర్, కిషన్‌లకు అప్పగించారు. వారు ఆ బంగారాన్ని తమ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. వచ్చిన డబ్బులోంచి కమీషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని రవీందర్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఈ డబ్బును రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు, ఈ సొమ్మంతా విదేశాలకు మళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇటీవల బ్యాంకులో జరిగిన ఆడిటింగ్ అధికారుల తనిఖీల్లో ఈ భారీ గోల్డ్ లోన్ స్కామ్ బట్టబయలైంది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన అధికారులు, వెంటనే బ్యాంకు రీజినల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు క్యాషియర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం స్కామ్ గుట్టు రట్టయింది. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మీడియాకు వెల్లడించారు. బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగులు, బినామీలతో కలిపి మొత్తం 47 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటివరకు 15.23 కిలోల బంగారం, రూ. 1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు.

జాతీయ అంతర్జాతీయ

ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాకు తగ్గిన భారతీయులు

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ అమెరికాకు తగ్గిన భారతీయులు : ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాకు తగ్గిన భారతీయులు అమెరికాలో పర్యటించే భారతీయుల సంఖ్య 2001 తర్వాత తొలిసారి తగ్గింది. 2024 జూన్‌లో 2.3 లక్షల మంది వెళ్లగా, 2025 జూన్‌లో 2.1 లక్షలకు పడిపోయింది. అంటే, 8% తగ్గుదల. జులైలో కూడా 5.5% తగ్గింది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ & టూరిజం ఆఫీస్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ట్రంప్ అమెరికా వీసా రుసుములను పెంచడం, ఇంటర్వ్యూ నిబంధనలను కఠినతరం చేయడం అని అధికారులు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి: మోదీ

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ ప్రధాని మోదీ: ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్‌ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్‌సీవో సభ్యులుగా భారత్‌ కీలక భూమిక పోషిస్తోంది. భారత్‌ అభివృద్ధిలో ఎస్‌సీవో దేశాలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నా. సభ్య దేశాలన్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.