Saturday, 9 May 2026

Blog

హైదరాబాద్

బీజేపీ లో చేరిక

పున్నమి ప్రతినిధి తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకులభరణం కృష్ణ మోహన్ సోమవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు సమక్షంలో హైదరాబాద్బీ బీజేపీ రాష్ట్ర కార్యలయం లో బిజేపీ లో చేరారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ ముఖ్య అతిధి గా జరిగిన సమావేశం లో బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు

అన్నమయ్య

ఓబులవారిపల్లె: ‘వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పట్టించుకోలేదని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వెంకటయ్య అన్నారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేట అగ్రహారంలో ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..1972లో ఎస్టీ జాబితాలో ఉన్న వడ్డెరలను బీసీ-ఏలోకి మార్చారని అన్నారు.

అన్నమయ్య

కురబలకోట: పెన్షన్ డబ్బులతో సచివాలయ లైన్ మెన్ పరార్

వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వం అందజేసే పింఛన్ డబ్బులతో ఉద్యోగి పరారైన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకొంది. కురబలకోట ఎంపీడీఓ గంగయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంగళ్లుకు చెందిన వెంకటేష్.. కురబలకోట మండలం తెట్టు సచివాలయంలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ భరోసా సామజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తెట్టు దళితవాడను వెంకటేష్ కు అప్పగించారు. మొత్తం 80మందికి పైగా లబ్ధిదారులకు రూ.4.90లక్షల సోమవారం ఉదయం పంపిణీ చేయాల్సి ఉండగా ఆ డబ్బు తీసుకొన్న వెంకటేష్ పంపిణీ చేయకుండా పరారైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని ఈ విషయం పై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల పంపిణీ వేళ, చివరి నిమిషంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు!

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (సోమవారం) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజులుగా అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారిని గుర్తించి నోటీసులు ఇచ్చిన విషయం రాజకీయంగా వివాదాస్పదం అయింది. వీరికి పెన్షన్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం అధికారులకు స్పష్టత ఇచ్చింది. నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ పెన్షన్లు ప్రతీ నెలా తరహా లోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం కింద సెప్టెంబరు ఒకటో తేదీన 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.2746.52 కోట్ల నిధులు గ్రామ, వార్డ్‌ సచివాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. అలాగే, పేదల సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. మండలంలోని బోయనపల్లెలో స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం దోబీఘాట్‌లో రజకులతో మాటాడి వారికి పలు పథకాలు అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లెలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు.

ఆంధ్రప్రదేశ్

ఆ వాహ‌నాల‌కు పన్ను చెల్లించ‌క్క‌ర్లేదు: సుప్రీంకోర్టు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ ఏపీ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ చట్టం-1963 కింద మోటారు వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ర‌హ‌దారుల్లో వాహనం నడపకుండా.. ప్రైవేట్‌ స్థలాలకు పరిమితమైతే సదరు వాహనాల‌కు పన్ను చెల్లించనక్కర్లేదని పేర్కొంది. ఏపీలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కట్టిన రూ. 22,71,700 పన్నును ఆ సంస్థ‌కు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

క్రైమ్

CBI పెండింగ్ కేసులు ఎన్నంటే

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ కేంద్ర దర్యాప్తు సంస్థ( CBI) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం గమనార్హం. విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి: 15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేత చంద్రబాబు హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన సీయం చంద్రబాబు నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ – నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకు చంద్రబాబు రూపకల్పన రాష్ట్రవ్యాప్తంగా 63.61 లక్షల మందికి పింఛన్ల పంపిణీ సీయం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో సుమారు 42వేలకోట్లు పింఛన్లు అందించిన సీయం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్

కరజాడలో వినాయక చవితి అన్నసమారాధన

శ్రీకాకుళం రూరల్ మండలంలోని సింగుపురం పంచాయతీ కరజాడ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామ దేవాలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారి అనంత్ శర్మ మాట్లాడుతూ — “ప్రతీ ఏటా అన్నప్రసాద పంపిణీ నిర్వహిస్తూ గణపతి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో మరింత ఘనంగా నిర్వహించగలిగాము” అని పేర్కొన్నారు.కరజాడ గ్రామస్థులు మాత్రమే కాకుండా మండల పరిధిలోని పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. గణనాథుడి ఆశీస్సులు అందుకున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

హైదరాబాద్

బాలయ్య కీ శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ

నందమూరి బాలకృష్ణ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో 50ఏళ్లుగా హీరోగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో లండన్‌కు చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బాలకృష్ణ కీ శుభాకాంక్షలు తెలియజేసారు.

సక్సెస్ స్టోరీస్

దేశంలో అత్యధిక భూమి ఎవరి వద్ద ఉందో తెలుసా ? వామ్మో.. ఇన్ని ఎకరాలా !

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ శతాబ్దాలుగా భూమి అధికారం, గౌరవం, జీవనానికి చిహ్నంగా ఉంది. యుద్ధాల నుండి నాగరికతల వరకు, మనిషి జీవితంలో ప్రతిదీ భూమిపైనే నిర్మించారు. వ్యవసాయం, ఇళ్ళు, పాఠశాలలు, పరిశ్రమలు, దేవాలయాలు అన్నీ భూమి మీదే ఉన్నాయి. శతాబ్దాలుగా భూమి అధికారం, గౌరవం, జీవనానికి చిహ్నంగా ఉంది. యుద్ధాల నుండి నాగరికతల వరకు, మనిషి జీవితంలో ప్రతిదీ భూమిపైనే నిర్మించారు. వ్యవసాయం, ఇళ్ళు, పాఠశాలలు, పరిశ్రమలు, దేవాలయాలు అన్నీ భూమి మీదే ఉన్నాయి. భారతదేశం 32,87,590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ భూమిని ఎవరు కలిగి ఉన్నారు అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అధికారికంగా భారతదేశంలో అతిపెద్ద భూ యజమాని భారత ప్రభుత్వం. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా కాథలిక్ చర్చి, దాని తర్వాత వక్ఫ్ బోర్డు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఫిబ్రవరి 2021లో అప్‌డేట్ చేసిన ప్రభుత్వ భూ సమాచార వ్యవస్థ (GLIS) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 15,531 చదరపు కిలోమీటర్ల భూమిని కలిగి ఉంది. ఇది ఖతార్, జమైకా, లెబనాన్ వంటి దేశాల కంటే పెద్దది. ఈ భూమి ఎక్కువగా రక్షణ (2,580 చదరపు కిలోమీటర్లు), బొగ్గు (2,580 చదరపు కిలోమీటర్లు), విద్యుత్ (1,806 చదరపు కిలోమీటర్లు), భారీ పరిశ్రమల (1,209 చదరపు కిలోమీటర్లు) శాఖల ఆధీనంలో ఉంది. భారతదేశ భూ సంపద మౌలిక సదుపాయాలు, శక్తి, రక్షణతో ముడిపడి ఉందని ఇది చూపిస్తుంది. కాథలిక్ చర్చి ప్రభుత్వం తర్వాత, కాథలిక్ చర్చి భారతదేశంలో రెండవ అతిపెద్ద భూ యజమాని. దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల హెక్టార్ల (17.2 కోట్ల ఎకరాలు) భూమి దాని ఆధీనంలో ఉంది. ఈ భూమిపై చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలు ఉన్నాయి. వీటి విలువ లక్షల కోట్లు. ఈ భూమిలో ఎక్కువ భాగం బ్రిటిష్ పాలనలో సంపాదించింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున భూములను ఇచ్చింది లేదా లీజుకు ఇచ్చింది. 1927 నాటి ఇండియన్ చర్చ్ యాక్ట్ ఈ భూముల హక్కును చట్టబద్ధం చేసింది. చర్చి భూములపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. అన్ని భూములు సరైన పద్ధతిలో పొందారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఆధ్వర్యంలో చర్చి 2,457 ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, 240 మెడికల్ నర్సింగ్ కళాశాలలు, 28 సాధారణ డిగ్రీ కళాశాలలు, 5 ఇంజనీరింగ్ కళాశాలలు, 3,765 సెకండరీ పాఠశాలలు, 7,319 ప్రాథమిక పాఠశాలలు, 3,187 నర్సరీలను నడుపుతోంది. దీనివల్ల చర్చి భారతదేశ విద్య ఆరోగ్య రంగాలలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వక్ఫ్ బోర్డు మూడవ అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డు. ఇది 1954 వక్ఫ్ చట్టం ప్రకారం ఏర్పాటైన ఒక సంస్థ. ఇది మసీదులు, మదర్సాలు, శ్మశానాలు, ఇతర ఇస్లామిక్ విరాళాలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 6 లక్షలకు పైగా ఆస్తులు దీని ఆధీనంలో ఉన్నట్లు అంచనా. ఈ భూములలో ఎక్కువ భాగం గత శతాబ్దాలలో ముస్లిం రాజుల కాలం నాటివి. ప్రభుత్వ భూమి కాకుండా, చర్చి, వక్ఫ్ బోర్డులకు చెందిన మొత్తం భూమికి సంబంధించి అధికారికంగా ధృవీకరించిన రికార్డులు లేవు. ఎక్కువ అంకెలు కేవలం అంచనాలు, సర్వేల ఆధారంగానే ఉన్నాయి. అయితే భారతదేశంలో అతిపెద్ద భూ యజమానులు ప్రభుత్వం మాత్రమే కాదు, మత సంస్థలు కూడా అని స్పష్టంగా తెలుస్తుంది. వాటి ప్రభావం మతం కంటే ఎక్కువగా ఉంటుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.