జిల్లావ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు
SPSR నెల్లూరు జిల్లా పోలీసు, తేది: 09.05.2026: జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి అక్రమ కార్యకలాపాల నివారణకు చర్యలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు
జిల్లావ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు SPSR నెల్లూరు జిల్లా పోలీసు, తేది: 09.05.2026: జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి అక్రమ కార్యకలాపాల నివారణకు చర్యలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు.

