Saturday, 9 May 2026

Blog

గూడూరు

ట్రాక్టర్ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కాశీపురం గ్రామం నుండి ట్రాక్టర్ లో వినాయక విగ్రహాని నిమజ్జనం కోసం తూపిలిపాలెం బయలుదేరిన భక్తులు కాశీపురం స్వర్ణముఖి కట్ట మీదుగా ట్రాక్టర్ పోతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కు దారి ఇవ్వడానికి పక్కకు పొగ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కట్ట మీద నుంచి క్రిందకు పడింది ట్రాక్టర్ లో ఉన్న 10 మంది క్షతగాత్రులను వెంటనే వాకాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా వీరికి ప్రధమచికిత్స అందించి ఎక్కువగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్సు ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

నరసన్నపేటలో ఉక్కపోత తర్వాత భారీ వర్షం – రైతులకు ఆనందం

ఉదయం నుంచి నరసన్నపేటలో ఉక్కపోత వాతావరణం స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు వేడి కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల రహదారులు నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షాలు రైతులకు ఉపశమనంగా మారాయి. పొలాల్లో పంటలకు మేలు కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.🌧️ నరసన్నపేట వర్షం ముఖ్యాంశాలు: 1. ఉదయం నుంచి ఉక్కపోత, మధ్యాహ్నం కుండపోత వర్షం 2. లోతట్టు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగిన పరిస్థితి 3. పంటలకు లాభం – రైతుల ఆనందం 4. వర్షం వలన వాతావరణం చల్లగా మారింది. 5. ఈ వర్షం వలన రాబోయే రోజుల్లో పంట దిగుబడులు మెరుగుపడతాయని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ట్రాక్టర్ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కాశీపురం గ్రామం నుండి ట్రాక్టర్ లో వినాయక విగ్రహాని నిమజ్జనం కోసం తూపిలిపాలెం బయలుదేరిన భక్తులు కాశీపురం స్వర్ణముఖి కట్ట మీదుగా ట్రాక్టర్ పోతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కు దారి ఇవ్వడానికి పక్కకు పొగ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కట్ట మీద నుంచి క్రిందకు పడింది ట్రాక్టర్ లో ఉన్న 10 మంది క్షతగాత్రులను వెంటనే వాకాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా వీరికి ప్రధమచికిత్స అందించి ఎక్కువగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్సు ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది

రంగారెడ్డి

తండ్రి ఆటో రివర్స్ చేస్తుండగా.. టైర్ల కిందపడి బాలుడి మృతి

పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, బంతి కోసం బాలుడు తండ్రి గుడ్స్ వాహనం (అశోక లీ ల్యాండ్) చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, మండలం, రామన్నపేట గ్రామానికి చెందిన కల్లెం నరేష్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని లాష్కర్ గూడ రోడ్డులో ఉంటూ గుడ్స్ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం లాష్కర్ గూడ రోడ్డులో ఎస్ బి ఐ బ్యాంక్ ఎదురుగా నరేష్ గుడ్స్ వాహనాన్ని రివర్స్ తీస్తుండగా అతని కుమారుడు కల్లెం రోహిత్ (13 నెలల) బంతితో ఆడుతున్నప్పుడు ఆకస్మాత్తుగా గుడ్స్ వెనుక వైపు ఎడమ టైర్ కిందపడి తలకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని ఉస్మానియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

కాకినాడ

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ.

కాకినాడ : జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ ఉద్యోగ విధులు నిర్వహించి రిటైర్ అయిన ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ మరియు హోమ్ గార్డ్ లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి.బిందుమాధవ్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ సత్కారం చేసి అభినందించారు.ఎన్. సూర్య కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఈ. ఆనంద్ కుమార్, HC 1736, సామర్లకోట పోలీస్ స్టేషన్, బి. మురళి కృష్ణ, హోమ్ గార్డ్-445 గార్లు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది.ఎస్పీ ప్రభుత్వం నుండి రావాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అతి త్వరగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా అధికారిని ఆదేశించడం జరిగింది. ఎన్. సూర్య కుమార్, ఈ. ఆనంద్ కుమార్, బి. మురళి కృష్ణ భవిష్యత్తు జీవితం ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబసబ్యులతో చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎస్. శ్రీనివాస రావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కె. వి. సత్యనారాయణ,ఆర్ఐ ఎఆర్ పోలీస్ సిబ్బంది మరియు ఉద్యోగ విరమణ చేసిన ఎన్. సూర్య కుమార్, ఈ. ఆనంద్ కుమార్, బి. మురళి కృష్ణ వారి కుటుంబ సభ్యులు వున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురు లో రేపు మెగా జాబ్ మేళా

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @మెగా జాబ్ మేళా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మామిడి కుదురు దీప్తి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా జరుగుతుందని దీప్తి విద్యాసంస్థల కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మోళా ప్రారంభమవుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని, వెయ్యి మందికి ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తారన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఔత్సాహికులు తమ బయోడే టాతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలన్నారు. డీఎస్ఈఓ హరిశేషు ఆధ్వర్యం లో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పూణేలో వినాయక చవితి ఉత్సవాలకు అయ్యవారి పల్లి జనసైనికుడికి ప్రత్యేక ఆహ్వానం

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీకి చెందిన జనసేన నాయకుడు తులబందుల సురేష్ ను పూణే లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. పూణేవాసులు జనసేన నేత తులబందుల సురేష్ కు శాలువా కప్పి సత్కరించారు. వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా తులబందల సురేష్ మాట్లాడుతూ పుట్టిన ఊరికే కాకుండా పూణేలో కూడా జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నానని గుర్తించిన పూణేవాసులు ప్రత్యేకంగా తనను పిలిచి పూజలు చేయించడం సంతోషంగా ఉందన్నారు. సొంత ఊరు సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి కూడా జనసేన జిల్లా రాష్ట్రస్థాయి నాయకుల సూచనలు ఆదేశాల మేరకు తన వంతు ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నానని భవిష్యత్తులో కూడా అయ్యవారిపల్లి పంచాయతీ అభివృద్ధికి మరిన్ని పనులను చేస్తానన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆ వర్గాలకు గట్టి హెచ్చరిక.. 30 రోజుల్లో రిజిస్టర్ అవ్వకపోతే భారీ జరిమానాలు, వ్యాపారంపై నిషేధం!

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ స్థిరాస్తి వ్యాపారం (రియల్ ఎస్టేట్ బిజినెస్) లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, ఏపీ రెరా (ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ)లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు ఈ నిబంధనను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హక్కులను కాపాడటానికి, మోసాలను అరికట్టడానికి రెరా (RERA – Real Estate Regulation and Development Act, 2016) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, స్థిరాస్తి వ్యాపారంలో పాల్గొనే ప్రతీ ఏజెంట్ లేదా సంస్థ తప్పనిసరిగా రెరాలో నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా, ఏజెంట్ల వివరాలు, ప్రాజెక్టుల సమాచారం, లావాదేవీల పారదర్శకత పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వేలాది మంది ఏజెంట్లు ఉన్నప్పటికీ, కేవలం 248 మంది మాత్రమే తమ వివరాలను నమోదు చేసుకున్నారని ఏపీ రెరా ఛైర్మన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏజెంట్లకు 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు ఇచ్చింది. ఈ గడువులోగా నమోదు చేసుకోకపోతే, భారీ జరిమానాలు, వ్యాపార కార్యకలాపాలపై నిషేధం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో క్రమశిక్షణను తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది స్థిరాస్తి వ్యాపారం అనేది ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన పెట్టుబడి. అనేకమంది తమ జీవితకాల సంపాదనను ఇల్లు లేదా స్థలం కొనుగోలుకు వెచ్చిస్తారు. కాబట్టి ఈ లావాదేవీల్లో మోసాలు జరగకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఏపీ రెరా అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ, రెరా అనుమతులు లేని ఏజెంట్ల ద్వారా ఇళ్లు, స్థలాలు కొనవద్దని సూచించారు. ఎందుకంటే, రెరా చట్టం ప్రకారం రిజిస్టర్ కాని ఏజెంట్ల ద్వారా జరిగే లావాదేవీలకు రెరా చట్టం వర్తించదు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే, చట్టపరంగా రక్షణ లభించదు. అందుకే, ప్రజలు ఏజెంట్ల రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఏమైనా సందేహాలుంటే రెరా హెల్ప్‌లైన్ నెంబర్ 63049 06011 ను సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అందుబాటులో ఉంటుంది. ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు, ప్రాజెక్టుల నమోదు విషయంలో కూడా సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సరైన సమాచారం ఇవ్వని కారణంగా దాదాపు 682 ప్రాజెక్టులు రెరా వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల దరఖాస్తుదారులు 30 రోజుల్లోగా అవసరమైన సమాచారాన్ని అందించి, తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజానికి, రెరా రిజిస్ట్రేషన్ అనేది అందరికీ మంచిది. ఏజెంట్లకు, డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఒకే విధంగా ఇది ప్రయోజనకరం. రిజిస్ట్రేషన్ ద్వారా చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. మోసాలు, అనవసర వివాదాలు తగ్గుతాయి. మార్కెట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘాలు కూడా తమ పరిధిలోని ఏజెంట్లు రెరాలో నమోదు అయ్యారో లేదో పర్యవేక్షించడం చాలా ముఖ్యం. మొత్తంగా, రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయతను పెంచి, వినియోగదారులకు భద్రత కల్పించడానికి కృషి చేస్తోంది.

హైదరాబాద్

బీజేపీ లో చేరిక

పున్నమి ప్రతినిధి తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకులభరణం కృష్ణ మోహన్ సోమవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు సమక్షంలో హైదరాబాద్బీ బీజేపీ రాష్ట్ర కార్యలయం లో బిజేపీ లో చేరారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ ముఖ్య అతిధి గా జరిగిన సమావేశం లో బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు

అన్నమయ్య

ఓబులవారిపల్లె: ‘వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పట్టించుకోలేదని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వెంకటయ్య అన్నారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేట అగ్రహారంలో ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..1972లో ఎస్టీ జాబితాలో ఉన్న వడ్డెరలను బీసీ-ఏలోకి మార్చారని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.