Saturday, 9 May 2026

Blog

అన్నమయ్య

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్న సంజీవయ్యను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ సిపి బిసి నాయకుడు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిన్నసంజీవయ్య ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణం లోని చెక్ పోస్ట్ శివాలయం ప్రాంతంలో నివాసమున్న చిన్న సంజీవయ్య ను సోమవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఆరోగ్యవంతు డవ్వాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

జాతీయ అంతర్జాతీయ

అఫ్గాన్‌లో భూకంపం.. 625 కు చేరిన మృతులు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ అఫ్గాన్‌: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 500కు చేరింది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి

గణపయ్యకు పట్టు వస్త్రాలు*

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున కాణిపాకం వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల మరియు ఆలయ ఈవో,అధికారులు.శ్రీ కాళహస్తీశ్వరాలయం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులకు కాణిపాకం ఆలయ ఈఓ మరియు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అనంతరం వారికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసి, ఎమ్మెల్యే,ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటం,ప్రసాదాలు అందించారు.

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన, డా. జి.శివనారాయణ ….///

నెల్లూరు :పున్నమి,న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 1:/// ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా. జి. శివనారాయణ సోమవారం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు రూపొందించిన సాంకేతిక కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న సేవలు, శిక్షణా కార్యక్రమాలు మరియు విస్తరణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. డైరెక్టర్ గారు మాట్లాడుతూ, “రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఆధునిక సాంకేతికతను సమయానికి అందించడం అత్యవసరం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు ఉపయోగపడేలా మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయాలి. పంటల వైవిధ్యకరణ, విలువ వృద్ధి, మార్కెటింగ్ లింకేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని సూచించారు. అలాగే NFDB ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, శిక్షణార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను విన్నారు. శిక్షణ పొందిన రైతులు, మత్స్యకారులు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి శిక్షణలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సాంకేతికతను నేర్చుకొని మా వృత్తి అభివృద్ధికి వినియోగించుకుంటున్నాం” అని తెలిపారు. తరువాత డైరెక్టర్ గారు కృషి విజ్ఞాన కేంద్రంలోని ప్రదర్శన యూనిట్లను పరిశీలించారు. పంటల విభాగం, పౌల్ట్రీ, మత్స్య పెంపకం, తేనేటీగల పెంపకం, వర్మీ కంపోస్ట్ యూనిట్లు వంటి విభాగాల్లో ఏర్పాటు చేసిన డెమో యూనిట్లను సందర్శించి, “రైతులకు ప్రత్యక్షంగా చూపించడం వలన సాంకేతికతపై అవగాహన పెరుగుతుంది. వీటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలి” అని అన్నారు. ఈ సందర్బంగా ఎస్ సీ ఎస్ పి లబ్ధిదారులకు సికేచర్స్, ఇన్క్యుబేటర్లు, స్ప్రేయర్లు, మరియు ఇతర వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలను స్వీకరించిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, “ఈ పరికరాలు మాకు ఉత్పత్తి పెంపుకు, శ్రమ తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి సహకారం వల్ల గ్రామీణ యువత కూడా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం పొందుతుంది” అని అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ గారు అదనంగా, డిజిటల్ ఎక్స్టెన్షన్ సేవలు, మొబైల్ యాప్‌ల ద్వారా రైతులకు సలహాలు, వాతావరణ సూచనలు, మరియు మార్కెట్ సమాచారం అందించడంపై కూడా చర్చించారు. రైతులు మార్కెట్‌లో మెరుగైన ధరలు పొందేందుకు ఎఫ్ పి ఓ ల (Farmer Producer Organizations) ను బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కేవీక్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, రైతులు, మహిళా సంఘాలు, యువకులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణపతికి” గ్రంధి” వారి గరిక పూజలు..

జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసియున్న వరసిద్ధి వినాయకునికి మండప బ్రహ్మ పెద్దింటి వ్యాసమూర్తి శర్మ (తంబి ) బ్రహ్మత్వంలో ప్రముఖ వ్యాపారస్తులు” గ్రంధి “వారి కుటుంబ సభ్యులచే విశేషమైన అభిషేకాలు, సహస్ర గరిక, వివిధ రకాల పుష్పాలచే పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. భాజపా జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ దంపతులు, గ్రంధి సురేష్ దంపతులు వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధి శివరావు, గ్రంధి నాగేశ్వరరావు, నాగబాబు, ఆశపు సూరిబాబు లతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రేపు అనగా మంగళవారం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం శివ ఆయిల్ ఏజెన్సీస్ వారి ధన సహాయంతో జరుగుతుందని శనివారం స్వామివారి లడ్డూల వేలంపాట, అనంతరం స్వామివారి ఊరేగింపు, నిమజ్జనా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు…

ఆంధ్రప్రదేశ్

ఘనంగా కుడిపూడి చిట్టబ్బాయి జయంతి వేడుకలు

అమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి 77వ జయంతి వేడుకలు సోమవారం అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్టబ్బాయి ప్రజల కోసం పోరాడిన నాయకుడని, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిట్టబ్బాయి అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా కుడిపూడి చిట్టబ్బాయి జయంతి వేడుకలు

అమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి 77వ జయంతి వేడుకలు సోమవారం అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్టబ్బాయి ప్రజల కోసం పోరాడిన నాయకుడని, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిట్టబ్బాయి అభిమానులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి అభివృద్ధి పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే.

ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అనంతరం ప్రజల నుంచి వినతుల స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

ఖమ్మం

✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్

✒️పిల్లల ఆధార్ అప్డేట్ చేయండి: ఉడాయ్ దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీఫ్ భువనేశ్ కుమార్ కోరారు. పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. 5-15 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ తప్పనిసరని పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్ చేయకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాసే, ప్రభుత్వ పథకాలు అందుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

.రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి* *మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికావు* *అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ

** నేతలు ధర్నా* న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు. నేతలు ధర్నా* జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.