Saturday, 9 May 2026

Blog

తిరుపతి

కౌంటర్లు ఏర్పాట్ల ప్రక్రియ ను పరిశీలించిన ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి,అందులో భాగంగా దేవస్థానం నందు ఉన్న అన్ని కౌంటర్లను ఒకే దగ్గర ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన షెడ్డును అందులో జరుగుతున్న కౌంటర్ల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించి ఆలయ అధికారులకు పలు సూచనలు,సలహాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో IBM క్వాంటం వాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @అమరావతిలో IBM : క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ▪️ఈ క్రమంలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటుచేశారు. ▪️IBM కంపెనీ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ▪️IBM ప్రతి సంవత్సరం 365 గంటల ఉచిత క్వాంటం కంప్యూటింగ్ టైమ్ ను ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లు & ప్రభుత్వ సంస్థలకు అందిస్తుంది. ▪️2000 Sq.ft సౌకర్యవంతమైన స్థలం, విద్యుత్, సెక్యూర్ నెట్వర్క్ ను ప్రభుత్వం కల్పించాలి. ▪️రెంటల్ ఛార్జీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹30 per sq.ft గా నిర్ణయించారు.

భక్తి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు… టైమ్ టూ టైమ్ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @బ్రహ్మోత్సవాలు తిరుమల, 2025 సెప్టెంబర్ 01: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. *వాహన సేవల వివరాలు* : 24/09/2025 – సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. 25/09/2025 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం 26/09/2025 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం 27/09/2025 – ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం 28/09/2025 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహనం 29/09/2025 – ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం 30/09/2025 – ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం 01/10/2025 – ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం 02/10/2025 – ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

ఆంధ్రప్రదేశ్

వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించిన ఆంధ్రప్రదేశ్‌.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ జీఎస్టీ గతేడాది ఆగస్టుతో పోల్చితే 21 శాతం పెరుగుదల నమోదు చేసిన ఏపీ. గతేడాది ఆగస్టులో ఏపీలో రూ.3,298 కోట్ల వసూళ్లు జరిగాయన్న కేంద్రం. ఈ ఆగస్టులో రూ.3,989 కోట్ల వసూళ్లు జరిగాయన్న కేంద్ర ఆర్థికశాఖ. గతేడాదితో పోల్చితే దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయన్న కేంద్ర ఆర్థికశాఖ. దాదాపు 10 శాతం మేర జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలపిన కేంద్ర ఆర్థికశాఖ.. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు పేర్కొన్న కేంద్ర ఆర్థికశాఖ. దేశవ్యాప్తంగా ఆగస్టులో రూ.1,86,315 కోట్ల జీఎస్టీ వసూలయిందన్న కేంద్రం.

పిల్లలకు

నిజమే కదా మరి

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @నిజమే కదా మరి: 1. ఇది గడియారాన్ని తినేసింది 2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది 3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది 4. ఇది పుస్తకాల్ని తినేసింది 5. ఇది రేడియోను మింగేసింది 6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది 7. ఇది కెమెరాను మాయం చేసింది 8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది 9. ఇది ఇరుగుపొరుగుతో దోస్తీ తినేసింది 10. ఇది బంధుత్వాల్ని తినేసింది 11. ఇది మన మెమొరీని తినేసింది 12. థియేటర్ లేదు నాటకం లేదు, టీవీ లేదు, ఆట లేదు, పాట లేదు… ఇదే బ్యాంకు, ఇదే హోటల్, ఇదే కిరాణ షాపు… ఇదే డాక్టర్, ఇదే జ్యోతిష్కుడు… అసలు మార్కెట్ అంటేనే ఇది… బయటికి వెళ్తే కదా… అంతా వర్క్ ఫ్రమ్ ఫోన్… అంతా స్మార్ట్ ఫోన్‌దే రాజ్యం… మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్‌గా మారుతోంది. వేలు ప్రపంచాన్ని, మనిషి జీవితాన్ని శాసిస్తోంది… నోరు మ్యూట్‌లో ఉంది… ఎస్, నిజమే… టచ్‌తోనే జీవితం… కానీ ఎవరూ టచ్‌లో లేరు… నిజమే కదా…

నాగర్‌కర్నూల్

గువ్వల బాలరాజుతో కలిసి ప్రజాసేవా యాత్ర కొనసాగింపు బిజెపి యువ నాయకులు బత్తుల రాము యాదవ్

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి తమ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తామని బీజేపీ బల్మూర్ మండల యువ నేత బత్తుల రాము యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు గువ్వల బాలరాజును అవకాశవాది అని విమర్శిస్తున్నప్పటికీ, ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఏకైక ఉద్దేశ్యం ప్రజలకు సేవ చేయడమేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు విద్యార్థి నాయకుడిగా పనిచేయకపోయినా, వ్యాపారం చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ధ్యేయంతో బీఆర్ఎస్లో చేరిన విషయాన్ని రాము యాదవ్ గుర్తుచేశారు. ఆ తరువాత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, దేశం మరియు తెలంగాణ అభ్యున్నతికి కృషి చేయాలన్న దృఢసంకల్పంతో బీజేపీలో చేరారని తెలిపారు. తాము కూడా సాధారణ కార్యకర్తలుగా గువ్వల బాలరాజుతో కలిసి బీజేపీ మార్గదర్శకత్వంలో, పార్టీ పెద్దల సూచనలతో, దేశం, తెలంగాణ రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తామని రాము యాదవ్ ప్రకటించారు. బీజేపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఆకర్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గతంలో “గరీబీ హటావో” నినాదం ఇచ్చి, చివరికి దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలు అనుసరించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఎలాంటి పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేశారో, అదే తపన మరియు త్యాగం దేశ రక్షణ కోసం కూడా అవసరమని రాము యాదవ్ పిలుపునిచ్చారు. బీజేపీ బల్మూర్ మండల యువ నేతగా, గువ్వల బాలరాజుతో కలిసి ప్రజల సమస్యలు వింటూ,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, అభివృద్ధి సేవలతో ప్రజల విశ్వాసం నిలబెట్టుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

విద్య విజ్ఞానం

సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం : పదోన్నతికి సంబంధించిన సమాచారం పదోన్నతిలో TET తప్పనిసరి. TET ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు మాత్రమే పదోన్నతి పొందగలరు. పదోన్నతిలో టెట్ తప్పనిసరి, టెట్ లేకుండా పదోన్నతి లేదు.. సుప్రీంకోర్టు. అయితే, పదోన్నతులు పొంది, 5 సంవత్సరాల సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారు మినహాయింపు పొందిన వారికి మరియు ఇతరులు 2 సంవత్సరాలలో TET ఉత్తీర్ణులు కావాలి. TET పరీక్ష రాయడానికి ఇష్టపడని వారు తమ ఉద్యోగాలను వదులుకోవచ్చు.. సుప్రీంకోర్టు

E-పేపర్

కంకర తోలారు – రోడ్డు మరిచారు

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు నుంచి చేజర్ల మండలం వెళ్లే రోడ్డు మార్గం పడమటి కండ్రిక వద్ద రోడ్డు కుంగిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో భారత మహాసేన పార్టీ నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. తరువాత రోజు అధికారులు హుటాహుటిన కంకరతో మరమ్మత్తు పనులు ప్రారంభించినప్పటికీ,దాదాపు 20 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు.వేసిన కంకర అలాగే ఉండి, దానిపై తారు వెయ్యలేదు. పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు చేపట్టలేదు. దీంతో నిన్న రాత్రి ద్విచక్ర వాహనదారుడు జారి పడిన సంఘటన కూడా జరిగింది.వాహనదారులు మళ్లీ ప్రమాదాల బారిన పడుతున్నారు.ఈ పరిస్థితిని గమనించి అధికారులు తక్షణమే శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు,ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

సింహాద్రి అప్పన్న ఉద్యోగుల చేతివాటం.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం (సింహాచలం) : హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు ఉద్యోగులు. ఒకరు పర్మినెంట్‌ ఉద్యోగి రమణ.. మరొకరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పంచదార్ల సురేష్‌. హుండీలో రూ.50 వేలు దొంగిలించిన ఉద్యోగులు. గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ పరిపాలన విభాగ AEO రమణమూర్తి. పర్మినెంట్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన ఈవో త్రినాథరావు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని విధుల నుంచి తొలగించే దిశగా చర్యలు.

అన్నమయ్య

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్న సంజీవయ్యను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ సిపి బిసి నాయకుడు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిన్నసంజీవయ్య ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణం లోని చెక్ పోస్ట్ శివాలయం ప్రాంతంలో నివాసమున్న చిన్న సంజీవయ్య ను సోమవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఆరోగ్యవంతు డవ్వాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.