Saturday, 9 May 2026
  • Home  
  • మర్రిపాడు సమీపంలో బస్సు బోల్తా డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం.. ఐదుగురికి స్వల్ప గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు సమీపంలో బస్సు బోల్తా డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం.. ఐదుగురికి స్వల్ప గాయాలు

మర్రిపాడు Date 08-5-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) మర్రిపాడు మండలంలోని బాట 565 జాతీయ రహదారిపై నెల్లూరు – కడప సరిహద్దు సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు వెళ్తున్న కార్మికులతో కూడిన బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఆదాని గ్రూప్ సంస్థకు చెందిన ఈ బస్సులో మొత్తం 46 మంది కార్మికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మర్రిపాడు
Date 08-5-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )

మర్రిపాడు మండలంలోని బాట 565 జాతీయ రహదారిపై నెల్లూరు – కడప సరిహద్దు సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు వెళ్తున్న కార్మికులతో కూడిన బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది.
ఆదాని గ్రూప్ సంస్థకు చెందిన ఈ బస్సులో మొత్తం 46 మంది కార్మికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.