Saturday, 9 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏసీబీ కి చిక్కిన అవినీతి సబ్ రిజిస్టర్.. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ఆలమూరు.. ఆలమూరు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న కోన విమల సరోజినీ కుమారి ఏసిబి చిక్కింది.. బుడుగువానిలంక గ్రామాల చెందిన గంటి సుబ్రహ్మణ్యం చెందిన ఎకరం 30 సెంట్లు భూమి గిఫ్ట్ లీడ్ కోసం లంచం డిమాండ్.. రిజిస్ట్రేషన్ నిమిత్తం 50,000 డిమాండ్ చేయగా28 వేల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం.. ఏసిబి అధికారులను ఆశ్రయించిన రైతు గంటి సుబ్రహ్మణ్యం.. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు… గతంలో సర్పవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసిన నిర్మల సరోజినీ కుమారి.. సర్పవరం సబ్ రిజిస్టర్ పనిచేస్తున్న నిర్మలసరోజినీ కుమారిని ఏసీబీ పట్టుకున్నారు.. మళ్లీ రెండోసారి నిర్మల సరోజినీ కుమారి ఆలమూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎసిబికి రెండవసారి చిక్కారు.. గత నుండి అవినీతి అధికారినిగా చలామణి అవుతున్న సబ్ రిజిస్టర్ నిర్మల సరోజినీకుమారి.. ఏ పని చేయాలన్న లంచం ఉంటేనే ఫైల్ పై సంతకం చేస్తారంటూ ఆవిడపై ఆరోపణలు.. ఎలాంటి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్…

జాతీయ అంతర్జాతీయ

అఫ్గానిస్థాన్లో భూకంప మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పటివరకు 800 మంది చనిపోయారని

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @అఫ్గానిస్థాన్లో భూకంపం: 2500 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భూకంప బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రజలకు హెల్ప్ చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించింది.

ఆంధ్రప్రదేశ్

నేడు విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారి టైమ్ లాజిస్టిక్స్ సదస్సు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి@అమరావతి విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. నేడు మద్యాహ్నం 2.30 గంటలకు విశాఖలోని నోవోటెల్ హోటల్ లో ఈ సదస్సుకు హాజరవుతారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలాగే మారి టైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్ , ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో సీఎం సంభాషించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్ పాల్గోనున్న సీఎం ఏపీ మారి టైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. అలాగే ఎయిర్ కార్గో ఫోరమ్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి జీఎఫ్ఎస్టీ ఉపాధ్యక్షుడు ఎస్.పి.టక్కర్, ఏపీ మారి టైమ్ బోర్డు అధికారులు, లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

జాతీయ అంతర్జాతీయ

మోదీ-పుతిన్ దోస్తీ… చైనా సోషల్ మీడియాలో ఇదే టాప్ ట్రెండింగ్

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @మోదీ-పుతిన్ దోస్తీ: ఎస్‌సీఓ సదస్సులో మోదీ, పుతిన్‌ల స్నేహంపై చైనాలో జోరుగా చర్చ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచిన ఇద్దరు నేతల సాన్నిహిత్యం ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వేచి చూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశానికి ఒకే కారులో ప్రయాణించిన ఇరు దేశాధినేతలు వీబో, బైడులో “పుతిన్ కారులో మోదీ” టాప్ సెర్చ్ టియాంజిన్ డిక్లరేషన్‌తో ముగిసిన 25వ ఎస్‌సీఓ సదస్సు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహబంధమే చైనాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సోమవారం చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన అంశాలే టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. చైనాలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ‘వీబో’లో సోమవారం ఉదయం “పుతిన్ కారులో మోదీ ప్రయాణం” అనే అంశం నంబర్ వన్ ట్రెండింగ్‌గా నిలిచింది. అదేవిధంగా, దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘బైడు’లో “మోదీ-పుతిన్ ఆలింగనం చేసుకుని, చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నారు” అనే అంశం కోసం నెటిజన్లు ఎక్కువగా వెతికారు. ఎస్‌సీఓ సదస్సు ప్రాంగణం నుంచి ద్వైపాక్షిక సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రధాని మోదీ కోసం పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వేచి చూశారని, ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో కలిసి ప్రయాణించారని వార్తలు వెలువడటంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉన్న “ప్రత్యేక స్నేహానికి” నిదర్శనమని చైనా సోషల్ మీడియా యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) తరహాలో పనిచేసే వీబో, చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ బైడులలో మోదీ-పుతిన్‌ల బంధంపై ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపారు. ఇదిలా ఉండగా, టియాంజిన్‌లో జరిగిన 25వ ఎస్‌సీఓ దేశాధినేతల మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ, తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలతో చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు, చైనా ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సదస్సులో ప్రసంగించిన మోదీ, భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు స్తంభాలపై భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సమష్టి పోరాటం, స్టార్టప్‌లు, యువత, సాంస్కృతిక మార్పిడికి మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సు ముగింపులో “టియాంజిన్ డిక్లరేషన్”ను ఆమోదించారు. ఎస్‌సీఓ తదుపరి అధ్యక్ష బాధ్యతలను కిర్గిజ్‌స్థాన్ స్వీకరించింది.

ఆంధ్రప్రదేశ్

గర్భంలో శిశువు బరువు.. నెలా నెలా పెరుగుదల ఎలా ఉండాలో తెలుసా…?

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @గర్భంలో శిశువు బరువు : గర్భధారణ సమయంలో శిశువు బరువు నెలా నెలా ఎలా పెరుగుతుందో వైద్య నిపుణులు వివరించారు. మొదటి నెలలో 0.1-1 గ్రాము, రెండో నెలలో 1-14 గ్రాములు, మూడో నెలలో 14-45 గ్రాములు, నాలుగో నెలలో 45-200 గ్రాములు, ఐదో నెలలో 200-500 గ్రాములు, ఆరో నెలలో 500-900 గ్రాములు, ఏడో నెలలో 900 గ్రాములు- 1.6 కిలోలు, ఎనిమిదో నెలలో 1.6-2.5 కిలోలు, తొమ్మిదో నెలలో 2.5-3.8 కిలోల బరువు శిశువు ఉండాలని తెలిపారు. ఈ బరువులో స్వల్ప మార్పులు ఉండవచ్చని వారు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఆరుగురు ప్రొఫెస‌ర్ల‌కు ఏడీఎంఇలుగా ప‌దోన్న‌తి

ఆరుగురు ప్రొఫెస‌ర్ల‌కు ఏడీఎంఇలుగా ప‌దోన్న‌తి 321 మంది సెకండ‌రీ ఆసుప‌త్రుల వైద్యుల‌కు ప్ర‌మోష‌న్లు గ‌తేడాది కాలంలో 600 మంది ప్ర‌భుత్వ వైద్యుల‌కు ప్ర‌మోష‌న్లు సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ అమరావతి : ఏపీలో ఆగ‌ష్టు 31తో ముగిసిన 2024-25 ప్యానల్ సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ వైద్యుల‌కు వైద్యారోగ్య శాఖ భారీ స్థాయిలో ప‌దోన్న‌తులు క‌ల్పించింది. వివిధ విభాగాల అధీనంలో ప‌నిచేసే దాదాపు 600 మంది వైద్యులు ప్ర‌మోష‌న్లు పొందారు. గ‌త కాలంలో ప‌దోన్న‌తుల విష‌యంలో ఆల‌స్యం జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులొచ్చిన నేప‌థ్యంలో నిర్ణీత స‌మ‌యంలో అర్హులైన వైద్యులంద‌రికీ ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశించ‌డంతో ఈ స్థాయిలో ప‌దోన్న‌తులు జ‌రిగాయ‌ని ఉన్న‌తాధికారులు తెలిపారు. ప్రిన్సిపాళ్లు/ సూప‌రింటెండెంట్లుగా ప‌దోన్న‌తి వివిధ విభాగాల‌కు చెందిన ఆరుగురు సీనియ‌ర్‌ ప్రొఫెస‌ర్ల‌ను ఎడిఎంఇలుగా (అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ) ప్ర‌మోట్ చేయాల‌ని తాజాగా వ‌చ్చిన క‌మిటీ సిఫార‌సుల‌ను మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమోదించారు. వీరు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, బోధానాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లుగా నియ‌మించ‌బ‌డ‌తారు. వీరికి త్వ‌ర‌లో పోస్టింగ్‌లిస్తారు. దీంతో 2024-25 ప్యాన‌ల్ ఇయ‌ర్‌లో మొత్తం 13 మంది సీనియ‌ర్ వైద్యులు ఎడిఎంఇలుగా ప్ర‌మోట‌య్యారు. సెంక‌డ‌రీ వైద్య సేవ‌లందిస్తున్న 321 మందికి ప్ర‌మోష‌న్లు ప్ర‌భుత్వ సెంక‌డ‌రీ ఆసుప‌త్రుల్లో వివిధ స్థాయిల్లో సేవ‌లందిస్తున్న 321 మంది వైద్యుల‌కు శ‌ని, ఆది వారాల్లో ప‌దోన్న‌తులు క‌ల్పించిన‌ట్లు సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి తెలిపారు. వీరిలో…34 మంది సివిల్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టులుగాను, 78 మంది డెప్యుటీ సివిల్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టులుగాను, 109 మంది డిప్యుటీ సివిల్ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గాను ప‌దోన్న‌తి పొందారు. వీరితో పాటు 100 మంది డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు డెప్యుటీ డెంట‌ల్ స‌ర్జ‌న్లుగా ప్ర‌మోట‌య్యారు. డీఎంఇలో కూడా భారీగా ప‌దోన్న‌తులు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, బోధానాసుప‌త్రుల్లో ప‌నిచేసే 217 మంది వైద్యుల‌కు 2024-25లో ప్ర‌మోష‌న్లు క‌ల్పించ‌డం జ‌రిగింది. వీరిలో 13 మంది వైద్యులు ఎడిఎంఇలుగాను, 96 మంది ప్రొఫెస‌ర్లుగాను, మ‌రో 108 మంది అసోసియేట్ ప్రొఫెస‌ర్లుగాను ప్ర‌మోట‌య్యారు. 600 మందికి ప‌దోన్న‌తులు 2024-25 ప్యాన‌ల్ సంవ‌త్స‌రంలో ప్రైమ‌రీ, సెకండరీ, టెరిష‌రీ మ‌రియు ఆయుష్‌ వైద్య సేవ‌లు అందిస్తున్న దాదాపు 600 మంది వైద్యుల‌కు ఆయా విభాగాల్లో ప‌దోన్న‌తులు క‌ల్పించిన‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. నీర్ణీత స‌మ‌యంలో వైద్యుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించ‌డానికి కృషి చేసిన మంత్రిత్వ శాఖ మ‌రియు వివిధ విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌ను మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అభినందించారు.

సినిమా

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” గా వస్తున్నాడు.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ సినిమా: గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్. స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన పవర్ స్టార్ లుక్. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

E-పేపర్

చంద్రన్న @30 – మూడు దశాబ్దాల సేవ, సంస్కరణల పయనం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్

చంద్రన్న @30 – మూడు దశాబ్దాల సేవ, సంస్కరణల పయనం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ — “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి సిఎం‌గా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేక సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక గర్వకారణమని ఆయన పాలనలో రాష్ట్రానికి దిశా నిర్ధేశం జరిగి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది పడింది.ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం, సంక్షేమ పథకాల విస్తరణ, ఐటీ విప్లవానికి శ్రీకారం, విద్యా–వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం వంటి 30 కీలక పథకాల ద్వారా చంద్రన్న గారు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. ‘జన్మభూమి, దీపం, డ్వాక్రా, ఆదరణ, అన్నా క్యాంటీన్, రైతులకు ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక సాగు, నదుల అనుసంధానం, రియల్ టైం గవర్నెన్స్, అమరావతి రాజధాని’ వంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు ఆయన ముందుచూపుకు నిదర్శనం. నేటి యువతకు, రాబోయే తరాలకు చంద్రన్న ఒక ప్రేరణాస్ఫూర్తి. ఆయన నాయకత్వం వల్లే తెలుగుదేశం పార్టీ పేదల నుంచి మేధావుల వరకు అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుందని రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ, ఆచరణలో పెట్టే నాయకుడిగా చంద్రబాబు నిలిచారు. ఆయన 30 ఏళ్ల ప్రజాసేవకు, రాష్ట్ర అభివృద్ధి పయనానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను” అని నవీన్ తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆలమూరు సబ్ రిజిస్టార్ పై ఏసీబీ దాడులు* *లంచం తీసుకుంటూ పట్టు పడ్డారు*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా రూ.28వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి.. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యం కు చెందిన ఎకరా 36 సెంట్లు భూమిని తన కుమారుడుకి రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ. 50 వేలు లంచం అడిగారని చివరకు రూ.28 వేలకు ఒప్పుకున్నారని రైతు పిర్యాదు చేయడంతో ఏసీబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అంతేగాక మరో 35 వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్, కార్ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నట్లు ఎసిబీ డి.ఎస్.పి కిషోర్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

గోదావరిలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు

వినాయక నిమజ్జన సమయంలో గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన యువకుడిని అమలాపురం పోలీసులు చాకచక్యంగా రక్షించారు.పేరూరు గ్రామంలోని పల్లపు వీధి (రాజ్యలక్ష్మి గుడి వద్ద) దూడల సత్యమూర్తి కమిటీకి చెందిన వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి పాసర్లపూడి బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి 09:15 ని.ల సమయంలో నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడికుదురు మండలం, పాసర్లపూడి గ్రామంలోని బ్రిడ్జి కింద గోదావరి నదిలో కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు కలసి నిమజ్జనం చేసే సందర్భంలో పేరూరు గ్రామం దూడల వారి వీధికి చెందిన చిలుకూరి చిన సాయి కృష్ణ అనే యువకుడు నీటిలో పడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నదిలో కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నా, మధ్యలో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వి.వి. శ్రీనివాసరావు వెంటనే స్పందించి మత్స్యకారులను సహాయానికి పిలిపించారు. పడవ సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.పోలీసులు అప్రమత్తంగా లేకపోతే యువకుడు గల్లంతయ్యే ప్రమాదం తప్పదని గ్రామస్తులు పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.