Thursday, 7 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆలమూరు సబ్ రిజిస్టార్ పై ఏసీబీ దాడులు* *లంచం తీసుకుంటూ పట్టు పడ్డారు*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా రూ.28వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి.. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యం కు చెందిన ఎకరా 36 సెంట్లు భూమిని తన కుమారుడుకి రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ. 50 వేలు లంచం అడిగారని చివరకు రూ.28 వేలకు ఒప్పుకున్నారని రైతు పిర్యాదు చేయడంతో ఏసీబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అంతేగాక మరో 35 వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్, కార్ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నట్లు ఎసిబీ డి.ఎస్.పి కిషోర్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

గోదావరిలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు

వినాయక నిమజ్జన సమయంలో గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన యువకుడిని అమలాపురం పోలీసులు చాకచక్యంగా రక్షించారు.పేరూరు గ్రామంలోని పల్లపు వీధి (రాజ్యలక్ష్మి గుడి వద్ద) దూడల సత్యమూర్తి కమిటీకి చెందిన వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి పాసర్లపూడి బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి 09:15 ని.ల సమయంలో నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడికుదురు మండలం, పాసర్లపూడి గ్రామంలోని బ్రిడ్జి కింద గోదావరి నదిలో కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు కలసి నిమజ్జనం చేసే సందర్భంలో పేరూరు గ్రామం దూడల వారి వీధికి చెందిన చిలుకూరి చిన సాయి కృష్ణ అనే యువకుడు నీటిలో పడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నదిలో కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నా, మధ్యలో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వి.వి. శ్రీనివాసరావు వెంటనే స్పందించి మత్స్యకారులను సహాయానికి పిలిపించారు. పడవ సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.పోలీసులు అప్రమత్తంగా లేకపోతే యువకుడు గల్లంతయ్యే ప్రమాదం తప్పదని గ్రామస్తులు పేర్కొన్నారు.

తిరుపతి

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అధునాతన అంబులెన్స్

ఈ రోజు శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కు ప్రభుత్వం అధునాతన అంబులెన్స్ ను మంజూరు చేసినది.ఈ అంబులెన్సు ను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు.అంబులెన్సు మంజూరు కి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు చూపిన చొరవ అభినందనీయమని తెలిపిన హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది మరియు కమిటి సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

గణపతి హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కోలా ఆనంద కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి హోమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పాల్గొని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణపతి హోమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.అనంతరం కోలా ఆనంద్,వారి మిత్ర బృందంచే ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు టిడిపి నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రేబిస్ ప్రాణాంతకం.! చికిత్స లేదు…

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి@రేబిస్ ప్రాణాంతకం కుక్క , పిల్లి, కోతి లాంటి జంతువులు కరిచినా చర్మంపై కోసుకొనేట్టు గోకినా వెంటనే వాక్సిన్ వేయించుకోండి . బాగా లోతుగా కరిస్తే రేబిస్ ఇమ్మ్యూనోగ్లోబిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి . ఎమీ కాదులే అనుకోవద్దు . వ్యాధి లక్షణాలు వచ్చే వరకు వేచి చూడొద్దు . ఒక్క సారి లక్షణాలు కనిపిస్తే మరణం ఖాయం .. అదీ అతి భయంకరమయిన చావు . కరిచిన వెంటనే వాక్సిన్ ఒక్కటే మార్గం . అన్ని వాక్సిన్ లు ఒక్కటి కాదు . రేబిస్ వాక్సిన్ నిజమయిన వాక్సిన్ ..

తిరుపతి

శ్రీ కాళహస్తి లో ట్రాఫిక్ సమస్య

శ్రీకాళహస్తిలో నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.బస్టాండ్,ఆలయ పరిసరాలు,ప్రధాన వీధుల్లో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలును పాటించకపోవడం వలన రద్దీ అధికమౌతున్నది.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యతో పాదచారులు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్

*CBI పెండింగ్ కేసులు ఎన్నంటే*..?

పున్నమి ప్రతి నిధి కేంద్ర దర్యాప్తు సంస్థ( CBI) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం గమనార్హం. విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది

క్రైమ్

మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @మీపై కేసు: చైనా ముఠాలు కంబోడియా, లావోస్, మయన్మార్లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ప్రాంతంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ)లతో కూడిన ‘సిమ్బాక్స్’ సెటప్లను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ఈ సెటప్ ల ద్వారా లోకల్ కాల్స్ గా మార్చుతూ.. సీబీఐ, ఈడీ, ముంబయి పోలీస్ తదితర దర్యాప్తు సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నట్లు.. మీపై కేసు నమోదైనట్లు, డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరిస్తున్నాయి. చర్యలు తీసుకోకుండా ఉండాలంటే.. వెంటనే రూ. లక్షలు పంపండి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. పెట్టుబడులపై అధిక లాభాల పేరుతోనూ సైబర్ మోసగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మోసాలన్నీ విదేశాల నుంచే జరుగుతున్నాయి. ఇలా మీ సెల్ ఫోన్ కు భారత్ నంబర్ తోనే అంతర్జాతీయ కాల్స్ వస్తుంటే.. అవి ముమ్మాటికీ సైబర్ నేరస్థుల పనేనని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) స్పష్టం చేస్తోంది. అలాంటప్పుడు వెంటనే ‘రిక్విన్ (రిపోర్ట్ ఇన్ కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్)’కు ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎలా గుర్తించాలి..? గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే ఫోన్ కాల్ సెల్ ఫోన్ స్క్రీన్ పై ‘అన్ నోన్ నంబర్’ అని కనిపిస్తుంది. లేదా +91తో ప్రారంభమై అదనంగా పదంకెల నంబర్ ఉంటుంది. దీనిపై www.sancharsaathi.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి ‘సిటిజెన్ సెంట్రిక్ సర్వీసెస్’లోని ‘రిక్విన్’ ఆప్షన్ను ఎంచుకొని వివరాలు నమోదు చేయొచ్చు. 1963/1800110420 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీవోటీ స్పష్టం చేస్తోంది.

నాగర్‌కర్నూల్

యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి యూరి అందించడంలో విఫలం చెందిందని దీని పట్ల రాష్ట్రంలోని బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు సోమవారం మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించాల్సిన యూరియాను కేటాయించకుండా తక్కువ మోదాలో యూరియా కేటాయించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రోజువారీగా సహకార కార్యాలయం ముందు బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు అనేక ఆంక్షలు పెడుతూ రెండు ఎకరాల పైన ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని రెండెకరాలకు తక్కువగా ఉన్న రైతులకు యూరియా అందించడం లేదని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు యూరియా మరియు నానో లిక్విడ్ కు సబ్సిడీ ద్వారా 900 రూపాయలు అయితే బయట కేవలం ఒక బస్తా యూరియాకు 1500 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు ప్రభుత్వం యూరియా కొరత చూపించడంతో బ్లాక్ మార్కెట్లో విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయం చేయడం కూడా రైతులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కొంపల్లి అశోక్ మండల నాయకులు చంద్రశేఖర్ పరశురాం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Featured విద్య విజ్ఞానం హెల్త్ టిప్స్

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి

మొత్తం ఆహారాలను నొక్కి చెప్పండి: ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు మరియు లీన్ ప్రొటీన్‌ల వంటి మొత్తం ఆహారాలను ఎంచుకోండి. ఉప్పు మరియు చక్కెరను పరిమితం చేయండి: అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది, అధిక చక్కెర ఊబకాయం మరియు దంత క్షయంతో ముడిపడి ఉంటుంది. కొవ్వు తీసుకోవడంపై శ్రద్ధ వహించండి: చేపలు, అవకాడోలు మరియు గింజలలో కనిపించే అసంతృప్త కొవ్వులకు, కాల్చిన మరియు వేయించిన ఆహారాలలో కనిపించే సంతృప్త మరియు ట్రాన్స్-కొవ్వులకు ప్రాధాన్యత ఇవ్వండి. భాగాన్ని నియంత్రించండి: చిన్న ప్లేట్లను ఉపయోగించండి మరియు అతిగా తినకుండా ఉండటానికి మీ శరీరంలోని ఆకలి సంకేతాలను వినండి. రెస్టారెంట్లలో సగం భోజనాన్ని ఇంటికి తీసుకురావడాన్ని పరిగణించండి. రకరకాల రంగుల కూరగాయలు తినండి: వివిధ రంగుల కూరగాయలు వివిధ రకాల పోషకాలను అందిస్తాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.