Thursday, 7 May 2026

Blog

తెలంగాణ

భారీ వర్షాలు, వరద నష్టాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన :ముఖ్యమంత్రి

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం (సెప్టెంబర్ 1) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి భారీ వర్షాలు,వరద నష్టాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రోడ్లు తెగిపోవడం లో లెవల్ కాజ్ వే, కల్వర్టుల డ్యామేజ్ ఇరిగేషన్ కి సంబంధించి మైనర్, మేజర్ ప్రాజెక్టులకి చెరువు కట్టలకి చేయాల్సిన మరమ్మత్తులు సంబంధించిన వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ శాఖలకి సంబంధించిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో హాజరైన వివిధ శాఖల మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆధికారులు, పలు సూచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్

సదరం సర్టిఫికేట్స్ పునఃపరిశీలన తాత్కాలికంగా నిలుపుదల

5 లక్షల మంది సర్టిఫికేట్స్ పునఃపరిశీలన పూర్తి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నోటీసులు జారీ వద్దు. సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ దివ్యాంగుల కేటగిరీ పింఛన్ దారులలో అనర్హులగుర్తింపునకు చేపట్టిన సదరం (వైకల్య నిర్ధారణ) పునఃపరిశీలనను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇప్పటికే అనర్హులుగా తేలి, అప్పీలు చేసుకున్న వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 7.38 లక్షల మంది దివ్యాంగ పింఛనుదారులుండగా ఇప్పటివరకు 5 లక్షల మంది ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన పూర్తయింది. ఇంకా 1.38 లక్షల మందికి వైకల్య పరీక్షలు చేయించాల్సి ఉంది. 8 నెలలుగా చేపట్టిన తనిఖీలో దాదాపు 1.35 లక్షల మంది అనర్హులుగా తేలారు. వీరిలో అర్హులుంటే అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. తాము అర్హులమేనంటూ 95 శాతం మంది ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారు. వీరికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పటికే కొనసాగుతున్న పునఃపరిశీలనను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తదుపరి ఆదేశాలొచ్చే వరకూ కొత్తగా నోటీసులు ఇవ్వొద్దని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి.

ఆంధ్రప్రదేశ్

పవన్‌ పుట్టినరోజు సందర్బంగా… అడుగడుగునా సామాన్యుడి పక్షం సీయం చంద్రబాబు

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవన్‌.. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. మాటకు కట్టుబడే తత్వం.. జన సైన్యానికి ధైర్యం. రాజకీయాల్లో విలువలకు పట్టం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు. పవన్‌ తన అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనతో నిండు నూరేళ్లూ వర్థిల్లాలి’ అని ఆకాక్షించారు. వెండితెరపై పవర్‌ స్టార్‌గా అలరించి.. రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారని మంత్రి లోకేశ్‌ కొనియాడారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏసీబీ కి చిక్కిన అవినీతి సబ్ రిజిస్టర్.. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ఆలమూరు.. ఆలమూరు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న కోన విమల సరోజినీ కుమారి ఏసిబి చిక్కింది.. బుడుగువానిలంక గ్రామాల చెందిన గంటి సుబ్రహ్మణ్యం చెందిన ఎకరం 30 సెంట్లు భూమి గిఫ్ట్ లీడ్ కోసం లంచం డిమాండ్.. రిజిస్ట్రేషన్ నిమిత్తం 50,000 డిమాండ్ చేయగా28 వేల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం.. ఏసిబి అధికారులను ఆశ్రయించిన రైతు గంటి సుబ్రహ్మణ్యం.. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు… గతంలో సర్పవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసిన నిర్మల సరోజినీ కుమారి.. సర్పవరం సబ్ రిజిస్టర్ పనిచేస్తున్న నిర్మలసరోజినీ కుమారిని ఏసీబీ పట్టుకున్నారు.. మళ్లీ రెండోసారి నిర్మల సరోజినీ కుమారి ఆలమూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎసిబికి రెండవసారి చిక్కారు.. గత నుండి అవినీతి అధికారినిగా చలామణి అవుతున్న సబ్ రిజిస్టర్ నిర్మల సరోజినీకుమారి.. ఏ పని చేయాలన్న లంచం ఉంటేనే ఫైల్ పై సంతకం చేస్తారంటూ ఆవిడపై ఆరోపణలు.. ఎలాంటి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్…

జాతీయ అంతర్జాతీయ

అఫ్గానిస్థాన్లో భూకంప మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పటివరకు 800 మంది చనిపోయారని

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @అఫ్గానిస్థాన్లో భూకంపం: 2500 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భూకంప బాధితులకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రజలకు హెల్ప్ చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించింది.

ఆంధ్రప్రదేశ్

నేడు విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారి టైమ్ లాజిస్టిక్స్ సదస్సు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి@అమరావతి విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. నేడు మద్యాహ్నం 2.30 గంటలకు విశాఖలోని నోవోటెల్ హోటల్ లో ఈ సదస్సుకు హాజరవుతారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలాగే మారి టైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్ , ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో సీఎం సంభాషించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్ పాల్గోనున్న సీఎం ఏపీ మారి టైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. అలాగే ఎయిర్ కార్గో ఫోరమ్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి జీఎఫ్ఎస్టీ ఉపాధ్యక్షుడు ఎస్.పి.టక్కర్, ఏపీ మారి టైమ్ బోర్డు అధికారులు, లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

జాతీయ అంతర్జాతీయ

మోదీ-పుతిన్ దోస్తీ… చైనా సోషల్ మీడియాలో ఇదే టాప్ ట్రెండింగ్

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @మోదీ-పుతిన్ దోస్తీ: ఎస్‌సీఓ సదస్సులో మోదీ, పుతిన్‌ల స్నేహంపై చైనాలో జోరుగా చర్చ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచిన ఇద్దరు నేతల సాన్నిహిత్యం ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వేచి చూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశానికి ఒకే కారులో ప్రయాణించిన ఇరు దేశాధినేతలు వీబో, బైడులో “పుతిన్ కారులో మోదీ” టాప్ సెర్చ్ టియాంజిన్ డిక్లరేషన్‌తో ముగిసిన 25వ ఎస్‌సీఓ సదస్సు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహబంధమే చైనాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సోమవారం చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన అంశాలే టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. చైనాలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ‘వీబో’లో సోమవారం ఉదయం “పుతిన్ కారులో మోదీ ప్రయాణం” అనే అంశం నంబర్ వన్ ట్రెండింగ్‌గా నిలిచింది. అదేవిధంగా, దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘బైడు’లో “మోదీ-పుతిన్ ఆలింగనం చేసుకుని, చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నారు” అనే అంశం కోసం నెటిజన్లు ఎక్కువగా వెతికారు. ఎస్‌సీఓ సదస్సు ప్రాంగణం నుంచి ద్వైపాక్షిక సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రధాని మోదీ కోసం పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వేచి చూశారని, ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో కలిసి ప్రయాణించారని వార్తలు వెలువడటంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉన్న “ప్రత్యేక స్నేహానికి” నిదర్శనమని చైనా సోషల్ మీడియా యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) తరహాలో పనిచేసే వీబో, చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ బైడులలో మోదీ-పుతిన్‌ల బంధంపై ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపారు. ఇదిలా ఉండగా, టియాంజిన్‌లో జరిగిన 25వ ఎస్‌సీఓ దేశాధినేతల మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ, తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలతో చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు, చైనా ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సదస్సులో ప్రసంగించిన మోదీ, భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు స్తంభాలపై భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సమష్టి పోరాటం, స్టార్టప్‌లు, యువత, సాంస్కృతిక మార్పిడికి మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సు ముగింపులో “టియాంజిన్ డిక్లరేషన్”ను ఆమోదించారు. ఎస్‌సీఓ తదుపరి అధ్యక్ష బాధ్యతలను కిర్గిజ్‌స్థాన్ స్వీకరించింది.

ఆంధ్రప్రదేశ్

గర్భంలో శిశువు బరువు.. నెలా నెలా పెరుగుదల ఎలా ఉండాలో తెలుసా…?

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @గర్భంలో శిశువు బరువు : గర్భధారణ సమయంలో శిశువు బరువు నెలా నెలా ఎలా పెరుగుతుందో వైద్య నిపుణులు వివరించారు. మొదటి నెలలో 0.1-1 గ్రాము, రెండో నెలలో 1-14 గ్రాములు, మూడో నెలలో 14-45 గ్రాములు, నాలుగో నెలలో 45-200 గ్రాములు, ఐదో నెలలో 200-500 గ్రాములు, ఆరో నెలలో 500-900 గ్రాములు, ఏడో నెలలో 900 గ్రాములు- 1.6 కిలోలు, ఎనిమిదో నెలలో 1.6-2.5 కిలోలు, తొమ్మిదో నెలలో 2.5-3.8 కిలోల బరువు శిశువు ఉండాలని తెలిపారు. ఈ బరువులో స్వల్ప మార్పులు ఉండవచ్చని వారు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఆరుగురు ప్రొఫెస‌ర్ల‌కు ఏడీఎంఇలుగా ప‌దోన్న‌తి

ఆరుగురు ప్రొఫెస‌ర్ల‌కు ఏడీఎంఇలుగా ప‌దోన్న‌తి 321 మంది సెకండ‌రీ ఆసుప‌త్రుల వైద్యుల‌కు ప్ర‌మోష‌న్లు గ‌తేడాది కాలంలో 600 మంది ప్ర‌భుత్వ వైద్యుల‌కు ప్ర‌మోష‌న్లు సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ అమరావతి : ఏపీలో ఆగ‌ష్టు 31తో ముగిసిన 2024-25 ప్యానల్ సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ వైద్యుల‌కు వైద్యారోగ్య శాఖ భారీ స్థాయిలో ప‌దోన్న‌తులు క‌ల్పించింది. వివిధ విభాగాల అధీనంలో ప‌నిచేసే దాదాపు 600 మంది వైద్యులు ప్ర‌మోష‌న్లు పొందారు. గ‌త కాలంలో ప‌దోన్న‌తుల విష‌యంలో ఆల‌స్యం జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులొచ్చిన నేప‌థ్యంలో నిర్ణీత స‌మ‌యంలో అర్హులైన వైద్యులంద‌రికీ ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశించ‌డంతో ఈ స్థాయిలో ప‌దోన్న‌తులు జ‌రిగాయ‌ని ఉన్న‌తాధికారులు తెలిపారు. ప్రిన్సిపాళ్లు/ సూప‌రింటెండెంట్లుగా ప‌దోన్న‌తి వివిధ విభాగాల‌కు చెందిన ఆరుగురు సీనియ‌ర్‌ ప్రొఫెస‌ర్ల‌ను ఎడిఎంఇలుగా (అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ) ప్ర‌మోట్ చేయాల‌ని తాజాగా వ‌చ్చిన క‌మిటీ సిఫార‌సుల‌ను మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమోదించారు. వీరు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, బోధానాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లుగా నియ‌మించ‌బ‌డ‌తారు. వీరికి త్వ‌ర‌లో పోస్టింగ్‌లిస్తారు. దీంతో 2024-25 ప్యాన‌ల్ ఇయ‌ర్‌లో మొత్తం 13 మంది సీనియ‌ర్ వైద్యులు ఎడిఎంఇలుగా ప్ర‌మోట‌య్యారు. సెంక‌డ‌రీ వైద్య సేవ‌లందిస్తున్న 321 మందికి ప్ర‌మోష‌న్లు ప్ర‌భుత్వ సెంక‌డ‌రీ ఆసుప‌త్రుల్లో వివిధ స్థాయిల్లో సేవ‌లందిస్తున్న 321 మంది వైద్యుల‌కు శ‌ని, ఆది వారాల్లో ప‌దోన్న‌తులు క‌ల్పించిన‌ట్లు సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి తెలిపారు. వీరిలో…34 మంది సివిల్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టులుగాను, 78 మంది డెప్యుటీ సివిల్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టులుగాను, 109 మంది డిప్యుటీ సివిల్ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గాను ప‌దోన్న‌తి పొందారు. వీరితో పాటు 100 మంది డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు డెప్యుటీ డెంట‌ల్ స‌ర్జ‌న్లుగా ప్ర‌మోట‌య్యారు. డీఎంఇలో కూడా భారీగా ప‌దోన్న‌తులు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, బోధానాసుప‌త్రుల్లో ప‌నిచేసే 217 మంది వైద్యుల‌కు 2024-25లో ప్ర‌మోష‌న్లు క‌ల్పించ‌డం జ‌రిగింది. వీరిలో 13 మంది వైద్యులు ఎడిఎంఇలుగాను, 96 మంది ప్రొఫెస‌ర్లుగాను, మ‌రో 108 మంది అసోసియేట్ ప్రొఫెస‌ర్లుగాను ప్ర‌మోట‌య్యారు. 600 మందికి ప‌దోన్న‌తులు 2024-25 ప్యాన‌ల్ సంవ‌త్స‌రంలో ప్రైమ‌రీ, సెకండరీ, టెరిష‌రీ మ‌రియు ఆయుష్‌ వైద్య సేవ‌లు అందిస్తున్న దాదాపు 600 మంది వైద్యుల‌కు ఆయా విభాగాల్లో ప‌దోన్న‌తులు క‌ల్పించిన‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. నీర్ణీత స‌మ‌యంలో వైద్యుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించ‌డానికి కృషి చేసిన మంత్రిత్వ శాఖ మ‌రియు వివిధ విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌ను మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.