Thursday, 7 May 2026

Blog

హైదరాబాద్

కవిత కి బీజేపీ లో చోటు లేదు. రామ చంద్రరావు వ్యాఖ్య

పున్నమి ప్రతి నిధి భారత రాష్ట్ర సమితి నుండి శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ని బహిష్కరణ చేసిన నేపథ్యంలో ఆమెకి బీజేపీ లో స్థానం ఉండదు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు అన్నారు. ఆమె చేసిన పలు వ్యాఖ్యలే దీనికి కారణం అని అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

*ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు…* పొదలకూరు పట్టణం బస్ స్టాండ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్దంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గేట్ సెంటర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పెషేంట్లకు బ్రేడ్లు, పండ్లు, పంపిణి చేశారు. జోహార్ వైఎస్సార్ అంటూ మహా నేత మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రమణా రెడ్డి, వైయస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ మరణం లేని వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా దేశానికి స్వతంత్రం వచ్చాక విద్య ,వైద్యం, సేద్యం తదితర రంగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పరిపాలించిన మొట్టమొదటి యోధుడిని వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో చుశామన్నారు..నేడు ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఈ భగీరధుని రూపం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబెర్ షేక్. అంజాద్, గంగవరపు. వేణు గోపాల్ రెడ్డి, దాదిబత్తిన. భాస్కర్ రెడ్డి, అకులూరు. హేమంత్ కుమార్, పముజుల. శంకర్, మందారపు. జనార్దన్, షేక్. ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

కులమాతాలకతీతంగా అన్నదాన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కిసాన్ యూత్ వినాయక మండపం దగ్గర యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి ఆధ్వర్యంలో అన్న అన్నప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. డిసిపి అక్షాంష్ యాదవ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా . హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా గత 15 సంవత్సరాల నుంచి గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని పెట్టి పర్యావరణ కాపాడే విధంగా చేస్తున్నారని అదేవిధంగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ లో 350 విగ్రహాలు పెట్టారని ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం వినాయకునికి ప్రత్యేక ఇష్టమని అన్నారు . ఐదో తారీకు వినాయకుని నిమర్జనాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల బందోబస్తు చేశామని తెలిపారు దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు కలెక్టర్.ఈ కార్యక్రమం లొ మందుల సామెల్ కుమారుడు మందుల సూర్య గారు మున్సిపల్ కమిషనర్. పట్టణ సీఐ గారు. రాజేష్. చందా మహేందర్. గంగ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా సికె దిన్నె ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి లోకేష్ పనితీరును పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని వెల్లడి ఈసారి విద్యార్థులతోపాటు తనకు కూడా పరీక్షేనన్న మంత్రి లోకేష్ విద్యార్థులను కన్నబిడ్డల్లా భావించి నాణ్యమైన విద్య అందించాలని సూచన సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ కమలాపురం: దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులకు 13 ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని పంపిస్తారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్ తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్ లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తారు. మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంటు నీటినే వంటకు ఉపయోగిస్తారు. ఆర్ఓ ప్లాంటు, ఆహార పంపిణీ వాహనాలను కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం శుచి,రుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించగలమని సిబ్బంది తెలిపారు. డిసెంబర్ కల్లా కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని స్మార్ట్ కిచెన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ ను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడ సరుకుల నాణ్యత, భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. సికె దిన్నె స్కూలు స్మార్ట్ కిచెన్ పనితీరునుబట్టి దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులతో మంత్రి లోకేష్ భేటీ ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థినుల తరగతి గదిని పరిశీలించిన లోకేష్, వారితో భేటీ అయ్యారు. గత ఏడాది కాలంగా తాము చేపట్టిన సంస్కరణలు ఎలా ఉన్నాయని విద్యార్థులను వాకబు చేసి, వారి నుంచి సలహాలు స్వీకరించారు. విద్యార్థినులు మాట్లాడుతూ… సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ విధానం అమలుచేయడం వల్ల తమకు మోతబరువు తగ్గిందని తెలిపారు. క్లాస్ లీడర్ జాస్మిన్ మాట్లాడుతూ… సన్నబియ్యం ఇస్తుండటం వల్ల మధ్యాహ్న భోజనం గతంకంటే ఇప్పుడు రుచిగా బాగుంటుందని చెప్పింది. తమ స్కూలులో కంప్యూటర్ ల్యాబ్స్, కొత్త బెంచిలు ఏర్పాటుచేయాలని, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచాలని కోరగా, సాధ్యమైనంత త్వరగా వాటిని కల్పిస్తామని మంత్రి తెలిపారు. లోకేష్ ముఖచిత్రంతో తాను వేసిన డ్రాయింగ్ ను ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మంత్రికి బహుకరించింది. ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న యూనిఫామ్స్, బ్యాగ్స్ నాణ్యతపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. గతంకంటే ఇప్పుడు బాగున్నాయని, బ్యాగుల సైజ్ కొంచెం పెంచాలని విద్యార్థినులు సూచించారు. ఇంటర్నల్ ఎసెస్ మెంట్ కోసం కొత్తగా ఇస్తున్న బుక్ లెట్స్ బాగున్నాయని తెలిపారు. సోషల్ స్టడీస్ లో నాలుగు బుక్స్ ఉన్నాయని, వాటిని రెండింటికీ కుదించాలని కోరారు. ఇంగ్లీషు టెక్స్ట్ బుక్, సప్లిమెంట్ కలిపి ఒకే బుక్ గా ఇస్తే బాగుంటుందని చెప్పారు. తమకు ఆర్ఓ తాగునీటిని అందించాలని కోరగా, మంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ కన్నా సిలబస్ పూర్తవుతుంది, మీరంతా కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలి, ఈసారి మీకు మాత్రమే కాదు, నాకు కూడా పరీక్షేనని అన్నారు. విద్యార్థి గంగిరెడ్డికి లోకేష్ అభినందన సికె దిన్నె స్కూలు తరగతి గదులను సందర్శించినపుడు గంగిరెడ్డి గణేష్ రెడ్డి అనే పదోతరగతి విద్యార్థికి చెందిన నోట్ బుక్ ను చూసిన లోకేష్… చేతిరాత చాలా బాగుందంటూ ప్యత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత స్కూలు ప్రధానోపాధ్యాయుని శోభారాణితో మంత్రి లోకేష్ సమావేశమై విద్యాప్రమాణాల మెరుగుదలకు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ… ఎసెస్ మెంట్ బుక్స్ వల్ల విద్యార్థులు రివిజన్ చేసుకోవడానికి బాగుంది, అయితే ఆ పుస్తకాలన్నీ టీచర్లు ఇంటికి తీసుకెళ్లి దిద్దడం కష్టంగా ఉందని అంటూ సైజు తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత ఏడాదికాలంగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం, పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నాం, ఒక్క పిటిఎం తప్ప మరేఇతర విద్యేతర భారాన్ని టీచర్లపై మోపడంలేదు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా భావించి వారికి మెరుగైన విద్యనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి సబిత, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, ఎమ్మెల్యేలు పుత్తా చైతన్య రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డివారి మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎలూరు

మరుపురాని మహానేత వైఎస్ఆర్

మరుపురాని మహానేత వైయస్సార్ ఆగిరిపల్లి: పున్నమి మరుపురాని మహానేత వైయస్సార్ అని ఆగిరిపల్లి మండల వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు ఉన్నారు. మంగళవారం దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆగిరిపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు ఆయన మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. రాజన్న ఆశయాలు మళ్లీ కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు మాట్లాడుతూ వైయస్సార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎరువులు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. జెడ్పిటిసి సభ్యులు పిన్ని బోయిన వీరబాబు మాట్లాడుతూ వైయస్సార్ మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తామంతా ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం కనసానపల్లి నెక్కలం గొల్లగూడెం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జెడ్పిటిసి సభ్యులు పిన్ని బోయిన వీరబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూజివీడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుటి. పావన జ్యోతి సుజనా కుమారి, నూజివీడు నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులు ఈలప్రోలు సుబ్బయ్య, నియోజవర్గ గ్రీవెన్స్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాసరావు,, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వాకాసక్కేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మల్లంపల్లి రవి శేఖర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుండ్ల హనుమంతరావు, ఆగిరిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు చిమట శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నక్కనబోయిన శ్రీమన్నారాయణ, నండూరు భాస్కర్ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపీనాథ్, నాగుల్ మీరా, వనమా ఏసు, సర్పంచులు అత్తి మురళి, వేము రాజు, లింగవరపు రమేష్, పల్లగాని జమదగ్ని, యలమర్తి ప్రకాష్, నెరసు రాజేష్, కంబాల ప్రదీప్, షేక్.సుభాని బొబ్బర్ల సురేష్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పిన్నింటిపేట శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కు అరుదైన గౌరవం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి వేడుకలలో భాగంగా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్‌కు చెందిన శ్రీ సత్యసాయి సేవా సమితి – పిన్నింటిపేట ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు పిన్నింటిపేట గ్రామంలో నిర్వహించే కంటి శిబిరాల ద్వారా, విశాఖపట్నం “శంకర్ ఫౌండేషన్” సౌజన్యంతో ఇప్పటి వరకు సుమారు 2000–3000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి సమాజానికి విశేష సేవ అందించారు. ఈ రోజు, శంకర్ ఫౌండేషన్ స్థాపకులు శ్రీ ఆత్మకూరి శంకర్ రావు గారి 94వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో, పిన్నింటిపేట సేవా సమితి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను వక్తలు ఘనంగా ప్రశంసించారు. ఆర్తజనులకు కాంతులు పంచే ఇలాంటి మహోన్నత సేవలో సమితి ముందంజలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన –“ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో మంచి కార్యక్రమాలు మీ సహకారంతో కొనసాగుతాయి” అని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జిల్లాకు జిల్లా పేరు కాకుండా…! సినీ తెరపై కనిపించే డ్రామా హీరోవుల పేర్లుతో ప్లెక్సీలు…

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అభిమానం చూపకుండా! జిల్లా పేరు కాకుండా జిల్లా పేరు వాళ్లకు అనుకూలంగా ఇది “కళ్యాణ్ సీమ” ఎప్పటికి మాదే, “మీరెంత.. మీ స్థాయి ఎంత రోడ్లమీద పండేస్తాం.. కొడకల్లారా” అనే అసభ్యకరమైన పదాలతో కులాలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీ పై వ్రాయించి! మీరెంత.. మీ స్థాయి ఎంత రోడ్లమీద పండేస్తాం.. కొడకల్లారా” అనే పదాలతో భయం బ్రాంతులకు గురి చేసే పదాలు అప్పనపల్లి ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్లెక్సీ రూపంలో పవన్ అభిమానులు సాయి, తేజ, రాజు, ప్రసాద్ ఫోటోలు ప్లెక్సీ పై ముద్రించుకుని అక్కడతో ఆగకుండా… అప్పనపల్లి జిల్లా పేరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా బదులుగా ఇది “కళ్యాణ్ సీమ” ఎప్పటికి మాదే! మాకు అంబేద్కర్ పేరు ఉండకూడదు అనే ఉదేశంతో అప్పనపల్లి ఎస్సీ, ఎస్టీ కులాలకు కులం అనే మనోభావాలు దెబ్బ తీసే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఫ్లాక్స్ మీద ఇలా అగ్రకులలావారు వ్రాయించి అప్పనపల్లి ఎస్సీ, ఎస్టీ కులంవారిని ప్లెక్సీ దగ్గర దురుబాషాలు ఆడటంతో నగరం య.సి మరియు పోలీస్ సిబ్బంది వచ్చి గొడవను సదుమానిగే దిశగా కోరగా ఎస్సీ, ఎస్టీ కులంవారు మాకు రక్షణ కలిపించాలి అని ఎస్సీ, ఎస్టీ కులంవారు నగరం పోలీస్ స్టేషన్ వద్ద పిర్యాదు చేసారు.

హైదరాబాద్

నూతన పార్టీ యోచన లో కవిత

పున్నమి ప్రతి నిధి తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు కుమార్తె కవిత తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు తో తెలంగాణ లో నూతం రాజకీయ పార్టీ ని స్థాపించే ఆలోచన లో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్ కవిత కి తమ పార్టీ లో. చోటు లేదని ప్రకటించినది.

ఖమ్మం

ప్రధాన సమస్యలపై అద్యక్షుల వారితో చాయ్ పే చర్చ

ఖమ్మం రెండో పట్టణం పరిధిలోని 53వ డివిజన్ లో ప్రధాన సమస్యలపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి తో చర్చించడం జరిగింది,, ఈ కార్యక్రమంలో రెండో పట్టణం ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ గౌడ్ ,, కన్నే కంటి కృష్ణాచారి ,, భారతీయ జనతా పార్టీ 53 వ డివిజన్ నాయకులు తొడుపునూరి రవీందర్ ,, పదవ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ జ్యోతుల యుగంధర్ ,, 55వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బోయినపల్లి సురేష్ , జిల్లా నాయకులు. నల్లగట్టు ప్రవీణ్ కుమార్,సుదర్శన్ మిశ్ర గారలుపాల్గొనడం జరిగింది,,

తెలంగాణ

రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నాడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రహదారులు మాత్రమే దెబ్బ తినడం జరిగిందని. అందువల్ల నష్టం అంచనా వివరాలను వెంటనే తయారుచేసి సమర్పించాలని ఆర్ అండ్ బి (ఆర్ &బి) అధికారులను ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.