“ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది”
నెల్లూరు రూరల్, తేది: 07.05.2026:
టిడిపిలో కీలక పదవుల్లో ఉన్న ముస్లిం నాయకులు తమ సమాజానికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సిపి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ విమర్శించారు. గురువారం వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులు సరైన వారికి అందలేదని, హజ్ యాత్ర ఏర్పాట్లు కూడా దారుణంగా జరిగాయని ఆరోపించారు. యువగళంలో ఇచ్చిన ఇస్లామిక్ బ్యాంక్ హామీ అమలు కాలేదని, విద్యా దీవెన, దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాలపై ముస్లింలు ఎదురుచూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు అన్ని విధాల న్యాయం జరిగిందని తెలిపారు.

ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది
“ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది” నెల్లూరు రూరల్, తేది: 07.05.2026: టిడిపిలో కీలక పదవుల్లో ఉన్న ముస్లిం నాయకులు తమ సమాజానికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సిపి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ విమర్శించారు. గురువారం వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులు సరైన వారికి అందలేదని, హజ్ యాత్ర ఏర్పాట్లు కూడా దారుణంగా జరిగాయని ఆరోపించారు. యువగళంలో ఇచ్చిన ఇస్లామిక్ బ్యాంక్ హామీ అమలు కాలేదని, విద్యా దీవెన, దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాలపై ముస్లింలు ఎదురుచూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు అన్ని విధాల న్యాయం జరిగిందని తెలిపారు.

