పున్నమి ప్రతినిధి , తిరుచానూరు. జులై 23
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మైసూర్ మహారాణి హెచ్.హెచ్. ప్రమోదాదేవి వడియార్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మైసూర్ మహారాణికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.



