విశాఖపట్నం,( పున్నమి ప్రతినిధి )సెప్టెంబర్ 8: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6.20 లక్షల పెన్షన్లు అన్యాయంగా తొలగించిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. 26 నెలలుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏడు రోజుల గడువుతో కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ చేపట్టారని బూడి ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయలేదని, నిత్యావసర ధరలు పెరిగాయని విమర్శించారు. కరువు పరిస్థితుల్లో రైతుల రుణాలు మాఫీ చేసి, ఉచిత విత్తనాలు, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు.

6.20 పక్షల పెన్షన్ తొలగించారు 26 నెలలుగా కొత్త పెన్షన్లు సున్నా….బూడి ముత్యాల నాయుడు