Thursday, 7 May 2026

Blog

హైదరాబాద్

BRS నుండి కవిత బహిష్కరణ

పున్నమి ప్రతి నిధి. భారత రాష్ట్ర సమితి నుండి శ్రీమతి కలవకుంట్ల కవిత ని బహిష్కరణ చేస్తూన్నట్లు మాజీ ముఖ్య మంత్రి కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు తెలిపారు. పార్టీ కీ వ్యతిరేకముగా వ్యాఖ్యలు ఎవరు చేసిన సహించేది లేదని కన్న కూతురు ని కూడా బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు

గూడూరు

చీకటి.. వెలుగును మరవద్దో.. టిడిపి నేతల బుడ్డ బెదిరింపులకు బయపడేదే లేదు __ సాయిప్రసాద్ రెడ్డి

చీకటి.. వెలుగును మరవద్దో..*టిడిపి నాయకుల బుడ్డ బెదిరింపులకు బయబడేదే లేదు..అన్నీకి సిద్ధపడే రాజకీయాలు చేస్తున్నాం *కోటలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో టిడిపి నేతలను సున్నితంగా హెచ్చరించిన వైకాపా యువజన నాయకులు చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

సీతారామపురం సెప్టెంబర్(పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సీతారామపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్, ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు భోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేకు ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా చేసుకొని రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా ప్రజలకే అంకితమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత రాజ్యాధికార పదవులను అందుకొని రాష్ట్ర పురోగతి అభివృద్ధి పై తన మార్కును చూపెడతారన్నారు. రాష్ట్ర దేశ క్రియాశీలక రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రత్యేకమైనదన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి జన సైనికుడు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకుడు భోగినేని కాశీరత్తయ్య (గాంధీ), సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్(రాజా), క్లస్టర్ ఇంచార్జ్ వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు యువత మండల నాయకుడు పసుపులేటి వికాస్ బాబు(విక్కి), సాగునీటి సంఘం అధ్యక్షుడు నీలి రత్తయ్య ,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, కూటమి నాయకులు హరికృష్ణ,తోట మనోజ్, తోట ఏడుకొండలు, కొత్త జగదీష్, తోట నవీన్, ఓబుల్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ కి నివాళి

శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ 16 వ వర్ధంతి సందర్భంగా,శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,పట్టణ యువత అధ్యక్షులు ఆంటోని,మండల యువత అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం నందు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అరుణ్, శంకర్ ,మహేష్,నాగరాజు ,అరవింద్,దేవా,సారధి,షాన్ మైకేల్,తదితరులు పాల్గొన్నారు.

గూడూరు

గూడలి లో అభివృద్ధి ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘన నివాళులు

స్సార్సీపీ నాయకుడు వేమా రెడ్డి షనీల్ రెడ్డి మాట్లాడుతూ ……………… రైతు సంక్షేమానికి మార్గదర్శిగా ఆరోగ్యశ్రీ జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అనీ కొనియాడారు. గూడలి ఉపసర్పంచ్ పల్లెమల్లు విజయసారధి రెడ్డి మాట్లాడుతూ: ………………………. YSR అంటే ఆరోగ్యశ్రీ YSR అంటే 108 YSR అంటే ఉచిత కరెంటు YSR అంటే ORR YSR అంటే ఉచిత విద్య YSR అంటే ఫీజు రియంబర్స్మెంట్ YSR అంటే అభివృద్ధి YSR అంటే సంక్షేమం. కారణజన్ముడు ఆధునిక భగీరథుడు మనసున్న మారాజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కు కృష్ణారెడ్డి గూడలి ఐదో వార్డ్ నెంబర్ ముచ్చకాల వెంకటకృష్ణయ్య కటికల సత్యనారాయణ మాలేపాటి జనార్దన్ రెడ్డి కాటికాల ఉదయకుమార్ ఆములూరు నాగార్జున పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి వేడుకలు మంగళవారం సీతారామపురం లో మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు ఆధ్వర్యంలో యువత భారీగా పాల్గొని వైయస్సార్ వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. సీతారామపురం బస్టాండ్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంచిపెట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ,108 అంబులెన్స్ , రైతులకు ఉచిత కరెంటు, జల యజ్ఞం వంటి పథకాలతో పేద ప్రజలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరయ్యాడని అయితే ఆయన అకాల మరణం యావత్ రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని, ఆయన ప్రజల గుండెల్లో అమరుడై నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం బిట్ – 1 ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజు, మాజీ వైస్ ఎంపీపీ రామిశెట్టి తిరుపతయ్య, అయ్యవారిపల్లి సర్పంచ్ చింతన బోయిన దుర్గయ్య, వైఎస్ఆర్సిపి మండల ప్రధాన కార్యదర్శి బాలినేని మాబయ్య, వైసీపీ నాయకులు పొట్టి రామచంద్రయ్య, ధనార్జన్, సరస్వతి నారాయణ రాజు, పాలగిరి నవీన్, ఏనుగుల రూపేష్, ఆరేళ్ల కాశి యాదవ్, కలివెల సతీష్, జైపాల్, మంకెన సురేంద్ర, గిరి, కటారి శ్రీనివాసులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

నేడు YSR వర్ధంతి

ఖమ్మం పున్నమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. అయన అభిమానులు అయన చేసిన సంక్షేమ పధకాలని గుర్తు చేసుకుంటున్నారు.

జాతీయ అంతర్జాతీయ

బెడిసి కొట్టిన ట్రంప్‌ టారిఫ్‌ వ్యూహం.. సైలెంట్‌గా షాక్‌ ఇవ్వబోతున్న భారత్‌!

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై విధించిన 50% సుంకాలు ఎగుమతి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సుంకాలు భారత వస్త్రాలు, రసాయనాలు, ఆభరణాలు, ఆక్వా రంగాలపై గణనీయమైన ఒత్తిడిని తెచ్చాయి. అయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సుంకాలపై బహిరంగంగా స్పందించకుండా, నిశ్శబ్దంగా వ్యూహాత్మక చర్చలకు పరిమితమయ్యారు. మోదీ కాళ్లబేరానికి వస్తాడని భావించిన ట్రంప్‌కు భంగాపాటే ఎదురైంది. ఇది భారత దీర్ఘకాలిక వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని గుర్తు చేసింది. భారత్‌ అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో సైలెంట్‌గా అగ్రరాజ్యానికి షాక్‌ ఇవ్వబోతోంది.

ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తోఫోన్ లో మాట్లాడి నదులలో ప్రవాహ పరిస్థితులపై సమాచారం తీసుకున్నారు మంత్రి సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో సోమవారం సాయంత్రం మాట్లాడి వర్షపాతం, నదులలో ప్రవాహ పరిస్థితులపై ఆయన సమాచారం తీసుకున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ప్రభుత్వం జారీ చేసే బులెటిన్లను పాటించాలన్నారు. ముందు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. కాల్వలు, చెరువులపై క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు ప్రత్యేక సూచనలు చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు కలసి వర్షాల ప్రభావాన్ని అంచనా వేసి చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే నివేదించాలని ఆదేశించారు. ఉత్తర కోస్తాలో వచ్చే వారంలో 10–30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు, అలాగే వాతావరణ మార్పుల ప్రభావంతో సెప్టెంబరులో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా మారి విశాఖ పరిసరాల్లో తీరం దాటే అవకాశం 60 శాతమని నిపుణులు చెబుతున్నారని, విపత్తుల నిర్వహణ సంస్థ కూడా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో నేటి మధ్యాహ్నం నుంచి డీఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @అమరావతి: మెగా డీఎస్సీకి సంబంధించిన రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీల నలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్తవారికి, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అభ్యర్థులు, గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు విడుదల చేయనుంది. కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగ ళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనుంది. ఒకవేళ కాల్ లెటర్ల జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు 900 మంది వరకు ఉండనున్నారు. దివ్యాంగ అభ్యర్థులు 120 మంది వరకు ఉండగా.. వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లాల్సి ఉంటుంది. రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్త వారికి మూడో విడతలో కాల్ లెటర్లు జారీ చేస్తారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.