Thursday, 7 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

పరుగులు తీస్తున్న భారత ఆర్థికవ్యవస్థ!

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికంలో దేశ GDP వృద్ధిరేటు 7.8% సేవా, వ్యవసాయ & పరిశ్రమ రంగాల్లో గణనీయమైన వృద్ధి మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు, దూరదృష్టి విధానాల ఫలితం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక శక్తి భారతదేశం

ఆంధ్రప్రదేశ్

పొగాకు రైతన్నకు చంద్రన్న భరోసా!

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ ₹54.88 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి 4,040 మంది రైతులకు లబ్ధి 4 జిల్లాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు పంట చేతికొచ్చినా ధర రావక బాధలో ఉన్న రైతన్నకు, చంద్రన్న గారి ఆర్థిక అండ తీరని తోడు. రైతన్న చైతన్యం కోసం – చంద్రన్న సాయం అపారమైనది!

తెలంగాణ

జాతీయ కుటుంబ ప్రయోజనం నిరంతరం కొనసాగే ప్రక్రియ : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆసరా పెన్షన్ లాంటివి వస్తున్నప్పటికి ఈపథకానికి అర్హులని తెలిపారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. మంగళవారం(సెప్టెంబర్ 2) ఆమె నల్గొండ జిల్లా గుండ్లపల్లి ( డిండి) ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్లపై సమీక్షించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా మౌలిక వసతులు, ఓటర్లు, మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై తహసిల్దార్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులన్నింటిని విచారణ చేసి త్వరితగతిన ఆర్డీవోకు పంపించాలని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి వంటగదిని, డైనింగ్, పరిసరాలను తరగతి గదులను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడుతూ వివిధ కూరగాయలు, ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజనం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ పథకం కింద సరైన దరఖాస్తులు రానందున నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా డ్రైవ్ లా నిర్వహించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

అన్నమయ్య

పవన్ కళ్యాణ్ జయంతి వేడుకల్లో చిట్వేలి యువత రక్తదానం

చిట్వేలి సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల భాగంగా చిట్వేలి మండలంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొనిమంగళవారం రక్తదానం చేశారు. ప్రత్యేకంగా కస్తూరి సురేష్ రక్తదానం చేసి సమాజ సేవలో ఒక మంచి ఉదాహరణగా నిలిచారు. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, ఇది పవిత్రమైన సేవ అని ఆయన పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం, సమాజానికి ఎంతో అవసరమైన కార్యక్రమమని తెలిపారు.జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల ద్వారానే పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి జీవదానం అందుతుందని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.స్థానిక ప్రజలు కూడా ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాలతో మిళితం చేయడం ద్వారా మరింత అర్థవంతంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ

కవిత కొత్త పార్టీ ఖాయం… పేరేంటి అంటే?

పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. భారత రాష్ట్ర సమితికి పోటీగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరిట ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కవిత బీసీ రిజర్వేషన్లపై బలంగా తన గలాన్ని వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సొంత పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థులను దించితే… బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పనితీరు మార్చుకోవాలని వైద్య సిబ్బందిని హెచ్చరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు పున్నమి న్యూస్ : సెప్టెంబర్ 2 ://// దుత్తలూరు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను, గదులను పరిశీలించారు. పరిశుభ్రత లేనందున సిబ్బందిని హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని లేదంటే పలాయనం చెందాల్సి వస్తుందన్నారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగారు. ఆసుపత్రిలో బీపీని చెకప్ చేయించుకున్నారు. సిబ్బంది తీరు మెరుగుపరచుకోవాలన్నారు. అనారోగ్యంతో వచ్చే వారిని గౌరవప్రదంగా గౌరవించి వారికి మంచి వైద్యం అందించి తగిన మందులు ఇచ్చి పంపించాలన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం పనిచేయాలని తెలియజేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పమన్నారు.ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల నాయకులు, వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

జనసేన మండల పార్టీ అధ్యక్షుడు బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో, ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు..!

ముఖ్య అతిథులుగా పాల్గొన్న, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ సృజన..! వింజమూరు: పున్నమి న్యూస్ సెప్టెంబర్ 2 :///// జనసేన పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వింజమూరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, వింజమూరు సర్పంచ్ నల్లగొండ్ల సృజన హాజరయ్యారు. పుట్టినరోజు కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు ఒకరికొకరు తినిపించుకున్నారు.పంచాయతీ సిబ్బందికి, ప్లాస్టిక్ బుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజల కోసం పుట్టిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల శ్రేయస్సు కొరకు పుట్టిన పార్టీ జనసేన అన్నారు. ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఉదయగిరి నియోజకవర్గం కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుచుకుంటానన్నారు. ఇలాంటి పుట్టినరోజు లు పవన్ కళ్యాణ్ ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రియల్ హీరో ప్రజా సేవకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజా నాయకుడని ప్రజల పక్షాన ఉండే నేత అని, కూటమి ప్రభుత్వ పాలనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమ వారధిగా, గ్రామ అభివృద్ధి ప్రదాతగా, నిలిచిన నేత అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, గున్నం శ్రీనివాసులు రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రామారావు, జనసేన ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, కూరగాయలు రాజా, వెలుగోటి సురేష్,వెంకీ, గవ్వల కిషోర్ జమీర్, పవన్ కళ్యాణ్, సురేష్, పండు, మనోజ్, తదితరులు ఉన్నారు.

తిరుపతి

వై ఎస్ ఆర్ కి ఘన నివాళి

శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిసిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కామి వెంకటేశ్వర్లు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష పాల్గొన్నారు

తిరుపతి

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్య మంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత,మన అందరి జనహృదయ నేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు జనసేన నాయకులు కొట్టె సాయి,గరికపాటి చంద్ర,విజయ్ కుమార్,మాధవ,మహేష్,కుమార్,చిరంజీవి,లీల,వారి మిత్రబృందం నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమాల నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు.అనంతరం జన సైనికుల ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం ప్రారంభించారు.

తిరుపతి

శ్రీ విఘ్నేశ్వరుని మహా హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు

వినాయక చవితి పర్వదినాల శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తరాజి శరవణ కుమార్ ఆధ్వర్యంలో కొండమీట్టలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని మహా హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు తదితరులు. ముందుగా విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్నా ,కంటా ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్,జీవీకే రెడ్డి,పెరుమాళ్ చౌదరి,బాల గౌడ్,బాలు,యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.