Saturday, 9 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కలిగిరిలో ఘనంగా నిర్వహించారు..////

కలిగిరి,పున్నమి న్యూస్ : ప్రతినిధి, నాగరాజు : ///// కలిగిరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బద్దినేని శివ, కృష్ణoశెట్టి దిలీప్ కుమార్ ,కోసూరి సురేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారుకార్యక్రమాన్ని ముందుగా కలిగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 73 యూనిట్లు రక్తం సేకరించినట్లు నోవా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ బావిశెట్టి కిషోర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న 73 మంది సభ్యులకు ఆర్గనైజేషన్ సభ్యులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద స్థాయిలో 73 యూనిట్లు రక్తం సేకరించడం చిన్న విషయం కాదని ఇన్ని యూనిట్లు రావడం ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోసూరి సునీల్, దాసరి గణేష్, బత్తల శ్రీనివాసులు, పొన్నం నాగేశ్వరరావు, దువ్వూరి ఏడుకొండలు, కర్రాగణేష్, గుంటగాని వినోద్ కుమార్, మరియు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సినిమా

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అసుర సంహారం

తనికెళ్ల భరణి, మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అసుర సంహారం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆసక్తిగా సాగే కథాంశంతో దర్శకుడు శ్రీ కిషోర్ శ్రీకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, మస్తాన్ రావు, గూడూరు నజీర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కి కెమెరామెన్ బాలు, ఎడిటింగ్ సెల్వ, పాటలు ప్రవీణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిధున ప్రియ, నిర్మాత సాయి శభరీష్ బోయల్ల, కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వం.. కిషోర్ శ్రీ కృష్ణ.

ఆంధ్రప్రదేశ్

ముగ్గురు నామినేటెడ్ పోస్టుల ఛైర్మన్లకు క్యాబినెట్ హోదా

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ రాష్ట్ర ప్రభుత్వం 3 నామినేటెడ్ పోస్టుల ఛైర్మన్లకు క్యాబినెట్ హోదా కల్పించింది: ▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ – డా. రాయపాటి శైలజా ▪️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ చైర్మన్ – కె.ఎస్. జవహర్ ▪️ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ – ఆళపాటి సురేష్.

విశాఖపట్నం

ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిన కండక్టర్

– ఫ్రీ భోజనం కోసం ఎక్కడ పడితే అక్కడే బస్సు నిలుపుదల – ప్రశ్నించిన ప్రయాణికుడిపై దుర్భాషలు – దొమ్మేరు రాజు గారి హోటల్ తో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కు – మధురవాడ ఆర్టీసీ డిపో అధికారుల నిర్వాహకం అనకాపల్లి : నిత్యం ఎంతో మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ… అందరి మన్ననలు పొందుతున్న ఆర్టీసీ వ్యవస్థ కొందరు కండక్టర్, డ్రైవర్ల నోటి దురుసుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మధురవాడ డిపోకు చెందిన AP09 4723 నెంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తుంది. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భోజన సమయం కావడంతో కండెక్టర్ని భోజనం చేయడం కోసం బస్సు ఎక్కడైనా ఆపమని సుమారు మధ్యాహ్నం 2 గంటలకు అడగగా… బస్సు ఎక్కడపడితే అక్కడ ఆపడం కుదరదని మా డిపోకు సంబంధించి అనకాపల్లి దాటిన తరువాత జాతీయ రహదారి పై దొమ్మేరు రాజు గారి హోటల్ మన డిపో మేనేజర్ గారిది ఉందని, అక్కడ భోజనం చేయడం కోసం బస్సు ఆపడం జరుగుతుందన్నాడు. అక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉంటుందని ఆ కండక్టర్, డ్రైవర్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. తీరా అక్కడ బస్సు ఆగాక అక్కడ వాతావరణం ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఉందని, ఇంకెక్కడైనా మంచి హోటల్ దగ్గర ఆపమని మహిళా ప్రయాణికులు డ్రైవర్ని అడిగితే ఇష్టం ఉంటే ఇక్కడ తినండి… లేకుంటే మానేయండి.. బస్సు ఇంకెక్కడా ఆపడం కుదరదని మీకు చేతనైంది చేసుకోమని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడని మహిళా ప్రయాణికులు వాపోయారు. కనీసం సౌచాలయాలు కూడా లేవని, అవి ఉన్న చోట ఆపమని అడిగితే ఆమాత్రం అగలేరా అని మహిళా ప్రయాణికులతో వ్యంగ్యంగా కండక్టర్ మాట్లాడటం చాలా బాధించిందన్నారు. ఒక ప్రక్క కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంటే ఆర్టీసీలో మాత్రం చులకనగా చూస్తున్నారని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆ సమయంలో డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్, డిపో మేనేజర్ పై అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటువంటి చర్యలు పునరావృత్తం అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ లకు సరైన బుద్ధి మా మహిళలే చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకినాడ

స్వయం ఉపాధి అవకాశాలపై ఉచిత శిక్షణ

పిఠాపురం : జిల్లాలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం ద్వారా పిఠాపురం బొజ్జావారి తోటలో సెప్టెంబర్ 8 సోమవారం నుండి ఉచితంగా 30 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం ఇంచార్జ్ వి.ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ వరల్డ్ బ్యాంకు సౌజన్యంతో త్రెర్జ్ ఐటీ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని, స్వయం ఉపాధి అవకాశాలు మరియు ప్రాజెక్టు తయారీ విధానం, మార్కెట్ అవగాహన, పరిశ్రమ ఏర్పాటు, ఆన్లైన్ బిజినెస్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ లోన్ పై సమాచారంతో పాటు శిక్షణ ఇస్తున్నారని, శిక్షణ అనంతరం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ లభిస్తుందన్నారు. ఈ ఉచిత శిక్షణలో పాల్గొనదలిచిన వారు 18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన వారు మరియు ఆసక్తి కలిగిన వారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, కుల ధృవీకరణ పత్రం, విద్యా అర్హత ధ్రువ పత్రం తీసుకొని పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ని సంప్రదించగలరని, మరిన్ని వివరములకు 9951447776, 9182293256 ఈ మొబైల్ నెంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ అవకాశం పిఠాపురం నియోజకవర్గ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

సాహితీ

రచయిత పరిచయం – (డాక్టర్ బద్రి. పీర్ కుమార్ రచయిత, నటులు – కందుకూరి విశిష్ఠ పురస్కార గ్రహీత.)

పేరు బద్రి. పీర్ కుమార్ విద్యార్హతలు ఎం.ఏ., పిహెచ్డి. వేదాయపాలెం నెల్లూరులో నివాసం ఉంటూ గత 25 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తూనే వివిధ నాటికలు (ధృతరాష్ట్ర కౌగిలి, అంకురం, కడదాకా, మాతృ వందనం, బదనిక, నాన్న బంగారం, మొదలైనవి), జెమిని, మాటీవీ, సప్తగిరి ఛానల్ (దూరదర్శన్), ఈటీవీ2 లలో సీరియల్స్, సినిమాలలో (తధాస్తు, నవోదయం, ఆకాంక్ష, కాశినాయన చరిత్ర, ఆశయం, వన ప్రేమికులు, పచ్చతోరణం, కరువు సీమలో కాంతిరేఖలు, ఫ్యాక్షన్ ఫ్యాక్షన్, ప్రేమఖైదీ, చెల్లి, మైండ్ గేమ్, బ్లైండ్ గర్ల్, వేట, అగ్ని, వసంతసేన, చిత్రగుప్తుడి భూలోక టూర్, అసుర సంహారం మొదలైనవి). సుమారు 10 టేలి ఫిలిమ్స్, 5 సీరియల్స్, 6 సినిమాలలో నటించి ప్రస్తుతము నటిస్తూ ఉన్నారు. వృత్తి అధ్యాపకుడు ప్రవృత్తి నటన ఈ రెండింటికి న్యాయం చేస్తూ అభ్యుదయ పాటలు నాటికలు రాస్తూ ఉంటారు. ఈమధ్య తెలుగులో జాతీయ జెండాపై రాసిన గేయం “జండా జండా భారత జెండా” చాలామందిని ఆకట్టుకుంది. ఇటీవల నాటక రంగానికి అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటక రంగానికి అందించే కందుకూరి విశిష్ట పురస్కారం2025, తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పొందడం విశేషం. “ఫ్యాక్షన్ వద్దు పీస్ ముద్దు”, “మృగం మారింది”. “యజ్ఞం”, “లక్ష్యం” మొదలైన కళాశాల నాటికలు రచించి యూనివర్సిటీ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఇటీవల రాసిన “వంశవృక్షం” గుంటూరులో ప్రదర్శించి ప్రేక్షకాదరణ పొందడం జరిగింది. కేవలం రచన కాకుండా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే సినిమాలలో కూడా నటిస్తూ ఉంటానని తెలియజేశారు డాక్టర్ పీర్ కుమార్.

తిరుపతి

సుబ్బరామిరెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన తలపా దామోదరం రెడ్డి

వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని నిడిగింటి సుబ్బిరామిరెడ్డి గారి మృతి వార్త నిన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ వీరాభిమాని నిడిగింటి సుబ్బరామిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, పట్టణ యువత అధ్యక్షులు ఆంటోనీ,తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

సోలార్ ని ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలి. ఆపతి వెంకట రామారావ్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ప్రధానమంత్రి సూర్య గారి బిజిలియోజన పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక మోడల్ గ్రామాన్ని ఎంపిక చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం గ్రామంను ఎంపిక చేశారు. ఈరోజు అన్నారు గూడెం గ్రామంలోని పంచాయితీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి గారు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత గారు గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ శ్రీనివాసాచారి గారు – “నేను పుట్టిన అన్నారుగూడెం గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ గ్రామాన్ని సౌర శక్తి ఆధారిత మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోటి రూపాయల అభివృద్ధి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తాం. కేంద్రం ‘సూర్యధర్ బిజిలియోజన’ పథకం కింద రాయితీపై సోలార్ పరికరాలను అందిస్తోంది. కాబట్టి ప్రతి గ్రామస్తుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకుడు ఆపది వెంకట రామారావు, తల్లాడ మండల అభివృద్ధి అధికారి ఏ. సురేష్ బాబు, విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈ, సోలార్ నిపుణులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు రమేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు ఎల్లంకి వెంకటేశ్వర్లు, సుధా వెంకటేశ్వర్లు, ఎలమంచి వెంకటేశ్వర్లు, దుర్గినేని సత్యనారాయణ, సోదరామారావు కొమ్మినేని శ్రీనివాసరావు కొమ్మినేని బాబురావు భవాని కోసూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

నందలూరు మండల కేంద్రం దాసరి గడ్డలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు కువైట్ జనసైనికులు సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి&దాసరి గడ్డ యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుక అంగారంగా వైభవంగా జరిగింది. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా దాసరి గడ్డలలో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం ముందర NDA కూటమి నాయకులతో వందలాది మంది జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని దాసరి గడ్డ నుంచి నందలూరు బస్టాండ్ వరకు ఊరేగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.బస్టాండ్ భారిగా వచ్చిన జనసైనికల సమక్షంలో కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు మాజిజి MPP పల్లె సుబ్రహ్మణ్యం,హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, లక్ష్మి నర్సయ్య,కల్లా మొహన్,మంకు వెంకటేశ్,పోలిశెట్టి శ్రీనివాసులు,మండెం రాము,డాల,టైలర్ శంకర,కృష్ణ,వీరయ్య అచారి,రెడ్డేయ్య,వంశీ,ఈదరపల్లి శీను,గాంధీ,పసుపులేటి చిన్న,రత్నం,కొట్టే హరి,కార్తీక్,కరణం శ్రీధర్,NRI వెంకట్,అరిగె సాయి,భాస్కర్,భారీగా జనసైనికులు,దాసరి గడ్డ యువత పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆది దేవుని సన్నిధిలో ఎస్సై అవినాష్ కి ఆశీర్వచనం..

కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుని మండపంలో జరిగిన ” గ్రంధి” వారి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాట్రేనికోన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. అవినాష్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ, ఫణికాంత్ శాస్త్రి లచే ఆశీర్వచనం జరిపి, ఉత్సవ కమిటీ సభ్యులచే దుస్సాలువా కప్పి, స్వామివారి చిత్రపటంతో సత్కరించడం జరిగింది.. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఎంతో వైభవంగా ఉత్సవాలని జరుపుతున్న కమిటీ వారిని అభినందిస్తూ, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఊరేగింపులలో ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని సాగనంపాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో భాజపా జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ,గ్రంధి సురేష్, ఆశపు సూర్యారావు, నరేష్, లక్ష్మణరావు, శంకరం, నాగబాబు, ఆకేటి శీను, అంకం రాజు, ఆశపు శ్రీను, గోపాలకృష్ణ, విళ్ల శివ, బషీర్, నాగభూషణం, చెరుకు బుజ్జి, శివయ్య,అంకం వెంకటేశ్వరరావు,గోకవరపు బ్రదర్స్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.