Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నల్లా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రమణ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్లా చారిటబుల్ ట్రస్ట్ అధినేత నల్లా పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేకు కట్ చేయించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఆయన రానున్న రోజుల్లో ఇంకా అత్యున్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

విద్య విజ్ఞానం

ఉపాధి / ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహితులకు సిసిఆర్ చేయూత.

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ మీరు సమర్పించే వివరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశం కల్పించడం కోసం చిరు ప్రయత్నం… ఆసక్తి వున్న ఔత్సాహితులు అందరూ కూడా ఈ క్రింది గూగుల్ ఫామ్ ను ఫిల్ చేసి, సబ్మిట్ చేయగలరు: ఉపాధి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ తోటి స్నేహితులు /బంధువులు / పరిచయస్తులకు ఈ లింక్ ను షేర్ చేయగలరు అని మనవి.. Google Form: https://docs.google.com/forms/d/1rKNFK5BmtqHnrKZVGfUI7rjB0Ij873V_OgA6zlxDu6I/

హైదరాబాద్

భాగ్యనగర గణేష్ నిమజ్జనం కార్యక్రమం కి అమిత్ షా రాక

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమం కి కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు భాగ్య నగర గణేష్ ఉత్సవ సమితి అయన కి ఆహ్వానం పంపినది.

హైదరాబాద్

భాగ్యనగర గణేష్ నిమజ్జనం కార్యక్రమం కి అమిత్ షా రాక

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమం కి కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు భాగ్య నగర గణేష్ ఉత్సవ సమితి అయన కి ఆహ్వానం పంపినది.

హైదరాబాద్

భాగ్యనగర గణేష్ నిమజ్జనం కార్యక్రమం కి అమిత్ షా రాక

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమం కి కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు భాగ్య నగర గణేష్ ఉత్సవ సమితి అయన కి ఆహ్వానం పంపినది.

జాతీయ అంతర్జాతీయ

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం, మణిపూర్‌లను సందర్శించే అవకాశం ఉంది. మిజోరం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని తన పర్యటనను మిజోరంలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన 51.38 కి.మీ. పొడవైన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కేంద్రం చేపట్టిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో కీలక అడుగు. ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని చేపట్టింది. ఈ రైల్వే లైన్ ఐజ్వాల్‌ను అస్సాంలోని సిల్చార్ ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది.

సినిమా

బిగ్‌బాస్‌-9 షో సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @బిగ్‌బాస్‌-9: కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్‌-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్‌బాస్‌ సెప్టెంబర్‌ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.

E-పేపర్

ఘనంగా జన సేనాని జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి. జిల్లా వ్యాప్తంగా జన సేన అది నేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు వంద కోట్ల జరిమానా

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న కన్నడ నటి రన్యారావు రూ.102 కోట్లకు పైగా జరిమానా విధిస్తూ డీఆర్ఐ నోటీసులు జైల్లోనే నటికి నోటీసులు అందజేసిన అధికారులు. నలుగురు నిందితులపై మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ. జరిమానా చెల్లించకపోతే ఆస్తుల జప్తు అని హెచ్చరిక. సెప్టెంబర్ 11కు కర్ణాటక హైకోర్టులో తదుపరి విచారణ. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భారీ షాక్ ఇచ్చింది. ఆమెకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న రన్యారావుకు అధికారులు ఈ నోటీసులను జైల్లోనే అందజేశారు. ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నలుగురిపైనా కలిపి మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా జరిమానా చెల్లించని పక్షంలో ఆమె ఆస్తులను జప్తు చేస్తామని కూడా నోటీసులో స్పష్టంగా హెచ్చరించారు. దీంతో ఈ కేసు మరోసారి కన్నడ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.3 కిలోల బంగారంతో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలు శిక్ష పడింది. ఇదిలా ఉండగా, విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

హైదరాబాద్

కవిత కి స్థానం లేదు. తేల్చి చెప్పిన కాంగ్రెస్, బీజేపీ.

పున్నమి ప్రతినిధి నేడు భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత ని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లో ప్రధాన పార్టీలు అయినా బీజేపీ కాంగ్రెస్ తమ పార్టీ ల లోకి కవిత కి స్థానము లేదని తేల్చి చెప్పారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.