Thursday, 7 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ హిమాలయాల్లో ప్రమాద సంకేతాలు మోగుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని 432 హిమనదీయ సరస్సులు (గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నాయి. వీటి వల్ల ఆకస్మిక వరదల ముప్పు ఉందని హెచ్చరించింది. 2011తో పోలిస్తే సరస్సుల విస్తీర్ణం 30% పెరిగిందని, తీవ్రమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించింది

ఆంధ్రప్రదేశ్

డీఎస్సీలో భర్తీకాని…700 పోస్టులు!

దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ నేడు, రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 03పున్నమి ప్రతినిధి @అమరావతి : మెగా డీఎ స్సీలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి పరిస్థితి కనిపి కనిపిస్తోంది! ఇప్పటివరకూ జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. కాగా.. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి, సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభి స్తారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన పోస్టులను తర్వాత డీఎ స్సీలో భర్తీ చేస్తారు. కాగా.. కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు.

సినిమా

మిరాయ్ స్టోరీ ఇదే.. ఆసక్తిగా “తేజా సజ్జా” వ్యాఖ్యలు

సెప్టెంబర్ 03పున్నమి ప్రతినిధి @ సినిమా హనుమాన్‌ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి. మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రియ, రితికనాయక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్‌ ఘట్టంనేని తెరకెక్కించారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చైన్నెకి వెళ్లిన నటుడు తేజా సజ్జా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చిత్రాలను మాత్రమే థియేటర్‌లో చూడాలనిపిస్తుందని, అలాంటి వాటిలో మిరాయి చేరుతుందని అన్నారు.

హైదరాబాద్

హైదరాబాద్ కి అమిత్ షా రాక దాదాపు గా ఖారారు

పున్నమి ప్రతినిధి ఈ నెల 6 వ తేదీ భాగ్యనగర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం లో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి హైదరాబాద్ రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా పర్యటన దాదాపు గా ఖరారు అయినట్లు సమాచారం. 2 చోట్ల గణ నాధులకి స్వాగత కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది.

క్రైమ్

చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం సుగాలి ప్రీతి కేసు..సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం 2017 ఆగస్టు 18వ తేదీన రాష్ట్రంలో సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

ఆంధ్రప్రదేశ్

కొత్త రేషన్ కార్డుల పంపిణి సమాచారం

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ప్రజల ఇంటి వద్దకే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది. మీ రేషన్ కార్డు కోసం ఎవరిని సంప్రదించాలో మీ రేషన్ షాప్ నెంబర్కు మ్యాప్ చేయబడిన సచివాలయం ఉద్యోగి వివరాల కొరకు ఈ లింక్ క్లిక్ చేసి 1. మీ జిల్లా 2. మీ మండలం 3. మీ సచివాలయం 4. మీ రేషన్ షాప్ ఐడి తో మీ షాప్ నెంబర్ సెలెక్ట్ చేయండి అప్పుడు రేషన్ షాప్ కి ట్యాగ్ చేయబడిన ఉద్యోగ వివరాలు కనపడతాయి. https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/FPShopsReport

క్రైమ్

రాష్ట్రపతి కోరిన అంశాలపై రాజ్యాంగ నిబంధనలను మాత్రమే వివరిస్తాం

బిల్లుల ఆమోదం వివాద వ్యాజ్యంలో సుప్రీంకోర్టు వెల్లడి సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో తనకు, గవర్నర్లకు న్యాయస్థానం కాల వ్యవధి నిర్ణయించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివరణ కోరిన అంశాలకుగాను రాజ్యాంగ నిబంధనలు ఏమి చెబుతున్నాయో వాటిని మాత్రమే వివరిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. విడి విడి కేసుల వివరాల్లోకి వెళ్లబోమని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌ సభ్యులుగా ఉన్నారు. బిల్లుల ఆమోద వివాద వ్యాజ్యంపై ఆరో రోజున తమిళనాడు తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి, పశ్చిమ బెంగాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించరాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను వారు తోసిపుచ్చారు. పాలనాపరమైన అంశాల్లో కేంద్ర మంత్రి వర్గం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి, రాష్ట్ర క్యాబినెట్‌ సూచనల మేరకు గవర్నరు నడుచుకోవాల్సి ఉంటుందని, వారు తమకు తాముగా స్వీయ నిర్ణయాలు తీసుకోలేరని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారికి విచక్షణాధికారాలు ఉంటాయని తెలిపారు. రాజ్యాంగ అధికరణం 200లో పేర్కొన్నట్లుగా తమ వద్దకు వచ్చిన బిల్లులను ఆమోదించడం, లేదా పునఃపరిశీలనకు పంపించడం, లేదా తిరస్కరించడమో చేయాలన్నారు. గవర్నర్లు అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపి ఉంచవచ్చని, నిరవధికంగా మాత్రం ఆపివేయరాదని వాదించారు. బుధవారం కూడా ఈ కేసు విచారణ కొనసాగనుంది.

జాతీయ అంతర్జాతీయ

రోజు కూలీలనూ బ్యాంకు సేవల పరిధిలోకి తేవాలి: రాష్ట్రపతి..!!

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ జ్యోతివెలిగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, మంత్రి గీతాజీవన్‌ తదితరులు రోజు కూలీలనూ బ్యాంకు సేవల పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. చెన్నైలో మంగళవారం జరిగిన సిటీ యూనియన్‌ బ్యాంకు 120వ వ్యవస్థాపక వేడుకలను రాష్ట్రపతి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్‌ రంగం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సకాలంలో రుణాలు అందించి వ్యవసాయం రంగం లాభదాయకంగా ఉండేందుకు దోహదపడాలని తెలిపారు. అంకుర సంస్థల నుంచి స్మార్ట్‌సిటీల వరకు పలు మార్గాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు బ్యాంకులు సహకరించవచ్చని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.8 శాతానికి పెరిగిందన్నారు. ప్రైవేటు బ్యాంకుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీ.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి : ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీ. 432 ఓపెన్‌ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్‌ కేటగిరీ బార్లు. సెప్టెంబర్‌ 14 వరకు దరఖాస్తులకు ఆహ్వానం. సెప్టెంబర్‌ 15న ఉదయం 8 గంటలకు లక్కీడ్రా నిర్వహణ.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు. సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగినది. https://gsws-nbm.ap.gov.in/BM/workfromhome ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను. తర్వాత మెయిల్ id ఎంటర్ చేయవలెను.(Mail OTP తప్పనిసరి కాదు) ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను. ముఖ్య గమనిక 10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.