Thursday, 7 May 2026

Blog

కాకినాడ

స్వయం ఉపాధి అవకాశాలపై ఉచిత శిక్షణ

పిఠాపురం : జిల్లాలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం ద్వారా పిఠాపురం బొజ్జావారి తోటలో సెప్టెంబర్ 8 సోమవారం నుండి ఉచితంగా 30 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం ఇంచార్జ్ వి.ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ వరల్డ్ బ్యాంకు సౌజన్యంతో త్రెర్జ్ ఐటీ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని, స్వయం ఉపాధి అవకాశాలు మరియు ప్రాజెక్టు తయారీ విధానం, మార్కెట్ అవగాహన, పరిశ్రమ ఏర్పాటు, ఆన్లైన్ బిజినెస్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ లోన్ పై సమాచారంతో పాటు శిక్షణ ఇస్తున్నారని, శిక్షణ అనంతరం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ లభిస్తుందన్నారు. ఈ ఉచిత శిక్షణలో పాల్గొనదలిచిన వారు 18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన వారు మరియు ఆసక్తి కలిగిన వారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, కుల ధృవీకరణ పత్రం, విద్యా అర్హత ధ్రువ పత్రం తీసుకొని పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ని సంప్రదించగలరని, మరిన్ని వివరములకు 9951447776, 9182293256 ఈ మొబైల్ నెంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ అవకాశం పిఠాపురం నియోజకవర్గ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

సాహితీ

రచయిత పరిచయం – (డాక్టర్ బద్రి. పీర్ కుమార్ రచయిత, నటులు – కందుకూరి విశిష్ఠ పురస్కార గ్రహీత.)

పేరు బద్రి. పీర్ కుమార్ విద్యార్హతలు ఎం.ఏ., పిహెచ్డి. వేదాయపాలెం నెల్లూరులో నివాసం ఉంటూ గత 25 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తూనే వివిధ నాటికలు (ధృతరాష్ట్ర కౌగిలి, అంకురం, కడదాకా, మాతృ వందనం, బదనిక, నాన్న బంగారం, మొదలైనవి), జెమిని, మాటీవీ, సప్తగిరి ఛానల్ (దూరదర్శన్), ఈటీవీ2 లలో సీరియల్స్, సినిమాలలో (తధాస్తు, నవోదయం, ఆకాంక్ష, కాశినాయన చరిత్ర, ఆశయం, వన ప్రేమికులు, పచ్చతోరణం, కరువు సీమలో కాంతిరేఖలు, ఫ్యాక్షన్ ఫ్యాక్షన్, ప్రేమఖైదీ, చెల్లి, మైండ్ గేమ్, బ్లైండ్ గర్ల్, వేట, అగ్ని, వసంతసేన, చిత్రగుప్తుడి భూలోక టూర్, అసుర సంహారం మొదలైనవి). సుమారు 10 టేలి ఫిలిమ్స్, 5 సీరియల్స్, 6 సినిమాలలో నటించి ప్రస్తుతము నటిస్తూ ఉన్నారు. వృత్తి అధ్యాపకుడు ప్రవృత్తి నటన ఈ రెండింటికి న్యాయం చేస్తూ అభ్యుదయ పాటలు నాటికలు రాస్తూ ఉంటారు. ఈమధ్య తెలుగులో జాతీయ జెండాపై రాసిన గేయం “జండా జండా భారత జెండా” చాలామందిని ఆకట్టుకుంది. ఇటీవల నాటక రంగానికి అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటక రంగానికి అందించే కందుకూరి విశిష్ట పురస్కారం2025, తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పొందడం విశేషం. “ఫ్యాక్షన్ వద్దు పీస్ ముద్దు”, “మృగం మారింది”. “యజ్ఞం”, “లక్ష్యం” మొదలైన కళాశాల నాటికలు రచించి యూనివర్సిటీ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఇటీవల రాసిన “వంశవృక్షం” గుంటూరులో ప్రదర్శించి ప్రేక్షకాదరణ పొందడం జరిగింది. కేవలం రచన కాకుండా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే సినిమాలలో కూడా నటిస్తూ ఉంటానని తెలియజేశారు డాక్టర్ పీర్ కుమార్.

తిరుపతి

సుబ్బరామిరెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన తలపా దామోదరం రెడ్డి

వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని నిడిగింటి సుబ్బిరామిరెడ్డి గారి మృతి వార్త నిన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ వీరాభిమాని నిడిగింటి సుబ్బరామిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, పట్టణ యువత అధ్యక్షులు ఆంటోనీ,తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

సోలార్ ని ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలి. ఆపతి వెంకట రామారావ్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ప్రధానమంత్రి సూర్య గారి బిజిలియోజన పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక మోడల్ గ్రామాన్ని ఎంపిక చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం గ్రామంను ఎంపిక చేశారు. ఈరోజు అన్నారు గూడెం గ్రామంలోని పంచాయితీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి గారు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత గారు గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ శ్రీనివాసాచారి గారు – “నేను పుట్టిన అన్నారుగూడెం గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ గ్రామాన్ని సౌర శక్తి ఆధారిత మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోటి రూపాయల అభివృద్ధి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తాం. కేంద్రం ‘సూర్యధర్ బిజిలియోజన’ పథకం కింద రాయితీపై సోలార్ పరికరాలను అందిస్తోంది. కాబట్టి ప్రతి గ్రామస్తుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకుడు ఆపది వెంకట రామారావు, తల్లాడ మండల అభివృద్ధి అధికారి ఏ. సురేష్ బాబు, విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈ, సోలార్ నిపుణులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు రమేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు ఎల్లంకి వెంకటేశ్వర్లు, సుధా వెంకటేశ్వర్లు, ఎలమంచి వెంకటేశ్వర్లు, దుర్గినేని సత్యనారాయణ, సోదరామారావు కొమ్మినేని శ్రీనివాసరావు కొమ్మినేని బాబురావు భవాని కోసూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

నందలూరు మండల కేంద్రం దాసరి గడ్డలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు కువైట్ జనసైనికులు సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి&దాసరి గడ్డ యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుక అంగారంగా వైభవంగా జరిగింది. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా దాసరి గడ్డలలో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం ముందర NDA కూటమి నాయకులతో వందలాది మంది జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని దాసరి గడ్డ నుంచి నందలూరు బస్టాండ్ వరకు ఊరేగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.బస్టాండ్ భారిగా వచ్చిన జనసైనికల సమక్షంలో కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు మాజిజి MPP పల్లె సుబ్రహ్మణ్యం,హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, లక్ష్మి నర్సయ్య,కల్లా మొహన్,మంకు వెంకటేశ్,పోలిశెట్టి శ్రీనివాసులు,మండెం రాము,డాల,టైలర్ శంకర,కృష్ణ,వీరయ్య అచారి,రెడ్డేయ్య,వంశీ,ఈదరపల్లి శీను,గాంధీ,పసుపులేటి చిన్న,రత్నం,కొట్టే హరి,కార్తీక్,కరణం శ్రీధర్,NRI వెంకట్,అరిగె సాయి,భాస్కర్,భారీగా జనసైనికులు,దాసరి గడ్డ యువత పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆది దేవుని సన్నిధిలో ఎస్సై అవినాష్ కి ఆశీర్వచనం..

కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుని మండపంలో జరిగిన ” గ్రంధి” వారి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాట్రేనికోన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. అవినాష్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ, ఫణికాంత్ శాస్త్రి లచే ఆశీర్వచనం జరిపి, ఉత్సవ కమిటీ సభ్యులచే దుస్సాలువా కప్పి, స్వామివారి చిత్రపటంతో సత్కరించడం జరిగింది.. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఎంతో వైభవంగా ఉత్సవాలని జరుపుతున్న కమిటీ వారిని అభినందిస్తూ, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఊరేగింపులలో ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని సాగనంపాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో భాజపా జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ,గ్రంధి సురేష్, ఆశపు సూర్యారావు, నరేష్, లక్ష్మణరావు, శంకరం, నాగబాబు, ఆకేటి శీను, అంకం రాజు, ఆశపు శ్రీను, గోపాలకృష్ణ, విళ్ల శివ, బషీర్, నాగభూషణం, చెరుకు బుజ్జి, శివయ్య,అంకం వెంకటేశ్వరరావు,గోకవరపు బ్రదర్స్ పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి యమ్..పి.పి మోడల్ స్కూల్ లో!

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక మోడల్ స్కూల్ అప్పనపల్లి నందు మండల విద్యాశాఖ అధికారి వారు మోకా వెంకన్న బాబు సందర్శించి విద్యార్థులకు అందించే విద్య నాణ్యతను పర్యవేక్షించి, పాఠశాలల్లో నమోదు చేయబడిన విద్యార్థుల డేటాను సరిచూసుకోవడడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నాం అని హెడ్ మాస్టర్ నైనాల రఘు రామయ్య తోపాటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ , షబ్బీర్ హుస్సేన్ మెరుగైన విద్యను అందిస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

ట్రంప్ రాజీనామా…వైట్ హౌస్ ప్రకటన..హోరెత్తుతున్న సోషల్ మీడియా

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఈ రోజు ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఏ విషయం గురించో మాత్రం ఏం చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలు బయలుదేరాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాని గురించే వైట్ హౌస్ ఈ రోజు ప్రకటించనుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ ఆపోజిట్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ, దానిని సపోర్ట్ చేసేవారు ఎక్కువగా ఈ పోస్ట్ లను పెడుతున్నారు. అయ్యో ఇలా మారిపోయారేంటీ ప్రస్తుతం ట్రంప్ ను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేరని చెబుతున్నారు. ఆయన తల మీద జుట్టు దాదాపుగా ఊడిపోయిందని… బట్టతల క్లియర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ఆయన చేతి మీద ఉన్న నల్ల మచ్చ మరింత పెద్దదిగా కూడా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అసలే ట్రంప్ చాలా రోజులుగా కనిపించడం లేదని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని..ఆయన మరణించారని కూడా కొంత మంది పుకార్లు సృష్టించారు. ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ చూసి కచ్చితంగా ట్రంప్ కు ఏదో అయిందని అంటున్నారు. కానీ ఇంత తొందరగా ఆయనలో మార్పు ఎలా వచ్చిందని…రెండు రోజుల్లోనే అంతలా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతోందో చెప్పాలని అడుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి వైద్య చికిత్స జరుగుతోందని…దానివల్లనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. తీవ్రమైన గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి రోగాలకు చేసే చికిత్సకే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీని మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరోవైపు ట్రంప్ కూడా ఈ పుకార్ల మీద ఏమీ మాట్లాడటం లేదు. కనీసం వాటిని ఖండించడం కూడా లేదు.

జాతీయ అంతర్జాతీయ

కొడంగల్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ వికారాబాద్ జిల్లా కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి మంజూరు చేసింది. 50 MBBS సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో స్థానికత వివాదం తొలగి, అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల సంఖ్య 4,100కి పెరిగింది.

క్రైమ్

ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు షాక్

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఢిల్లీ : ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. వీరి పాత్ర తీవ్రమైందని, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరసనల పిలుపులు దేశ సమగ్రతకు ముప్పు అని పేర్కొంది. మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.