Thursday, 7 May 2026

Blog

E-పేపర్

“రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ చేతుల మీదుగా వరాహి కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం

పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లి కట్ట ఆవరణలో శ్రీ వరాహి కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కటికం నవీన్ కుమార్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రిబ్బన్ కటింగ్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన ఆహార కేంద్రాలు ఏర్పడటం ఆనందకరం. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇలాంటి ప్రయత్నాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి” అని అన్నారు. ఆయన స్థానిక వ్యాపారవేత్తలు ముందుకు రావాలని, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

E-పేపర్

“రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ చేతుల మీదుగా వరాహి కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం

పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లి కట్ట ఆవరణలో శ్రీ వరాహి కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కటికం నవీన్ కుమార్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రిబ్బన్ కటింగ్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన ఆహార కేంద్రాలు ఏర్పడటం ఆనందకరం. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇలాంటి ప్రయత్నాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి” అని అన్నారు. ఆయన స్థానిక వ్యాపారవేత్తలు ముందుకు రావాలని, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అన్నమయ్య

బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర అమలు చేయాలని సబ్ కలెక్టర్‌కి వినతి

రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులకు కలెక్టర్ నిర్ణయించిన ధరను అమలు చేయాలని ఏపీ రైతు సంఘం, సీఐటియు నాయకులు సబ్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం దళారులు బొప్పాయి ధరను ఐదు రూపాయలకు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కలెక్టర్ నిర్ణయించిన రూ.10 ధరతో కొనుగోలు చేయాలని, గిట్టుబాటు కావాలంటే రూ.15 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దళారుల దోపిడీని అరికట్టేందుకు లైసెన్స్ విధానం పునరుద్ధరించాలని, ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌. చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్, రైతు సంఘ నాయకులు ఆదినారాయణ, ఈశ్వరయ్య, వెంకటరమణ, హరిచరణ్ చౌదరి, సుబ్రహ్మణ్యం నాయుడు, శివకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర అమలు చేయాలని రైతు సంఘాల డిమాండ్

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని కోడూరు, చిట్వేల్, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి పంటకు ధర కిలోకు 16 రూపాయల నుండి 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ జోక్యంతో పది రూపాయల కనీస ధర నిర్ణయించినప్పటికీ వ్యాపారులు దాన్ని అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 50 శాతం పంట పొలాల్లో మిగిలి ఉందని, కనీసం పెట్టుబడి అయినా రాబట్టాలంటే కలెక్టర్ నిర్ణయించిన ధర తప్పనిసరిగా అమలు కావాలని సిఐటియు, రైతు సంఘ నాయకులు సబ్ కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. బొప్పాయికి గిట్టుబాటు ధరగా 15 రూపాయలు నిర్ణయించి ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని, దళారుల వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, నాయకులు ఆదినారాయణ, రవికుమార్, ఈశ్వరయ్య, కందుల సుబ్రహ్మణ్యం,శివకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

గుత్తి వారి పల్లి బాధితులను పరామర్శించిన శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి లో కలుషిత నీరు త్రాగడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,పంచాయతీ అధికారులను వెంటనే గుత్తి వారి పల్లె నందు పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి వ్యవస్థలను మెరుగుపరచాలని అలానే ఆర్వో ప్లాంట్ వాటర్ ను పరీక్ష చేసి దానికి ప్రత్యామ్నాయ త్రాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తిరుపతి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డయేరియా విలయతాండవం.మాజీ ఎమ్మెల్యే

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లెలో విచ్చలవిడిగా డయేరియా కేసులు నమోదు నమోదు అవడంతో వ్యాధిగ్రస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వలనే గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పారిశుద్ధ్య లోపంతోనే డయేరియా వ్యాప్తి చెందిదన్నారు.భాదితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆయన అన్నారు.

విశాఖపట్నం

గాజుల వంతెన – విశాఖకు కొత్త అందం

*పున్నమి స్టాప్ రిపోర్టర్ – యామల రామమూర్తి ;* విశాఖపట్నం పర్యాటకానికి కిరీటం వంటిది కైలాసగిరి. ఈ పర్వతంపై నిర్మించిన గాజుల వంతెన (గ్లాస్ బ్రిడ్జి) ఇటీవలే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొద్ది కాలం క్రితం ప్రారంభించిన ఈ వంతెన పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. **వంతెన నిర్మాణం, ప్రత్యేకతలు:** * **స్థానం:** ఈ వంతెన కైలాసగిరిపై, వ్యూ పాయింట్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచే నగరంలోని బీచ్ రోడ్డు మరియు విశాఖ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలు కనబడతాయి. * **నిర్మాణం:** ఈ బ్రిడ్జిని 380 మీటర్ల ఎత్తులో సుమారు రూ. 38.5 కోట్లతో నిర్మించారు. ఈ వంతెన 120 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఉంది. గట్టి గాజుతో చేసిన ఈ వంతెనపై ఒకేసారి 300 మంది నిలబడవచ్చు. * **భద్రత:** ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఇది చాలా సురక్షితమైనది మరియు బరువును తట్టుకోగలదు. పర్యాటకులు ఎటువంటి భయం లేకుండా దీనిపై నడిచి, నగర అందాలను ఆస్వాదించవచ్చు. * **ఆకర్షణ:** గాజుల వంతెనపై నిలబడి చూస్తే, కింద లోతైన లోయలు, దట్టమైన అడవులు, విశాఖపట్నం తీరం అద్భుతంగా కనిపిస్తాయి. సాయంత్రం వేళల్లో ఇక్కడ నుంచి సూర్యాస్తమయాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ బ్రిడ్జి విశాఖపట్నం పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే, పర్యాటకులు ఇటువంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడకుండా, అందమైన ప్రదేశాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాము.

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో – అమరజీవి!

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రా అంబేద్కర్‌లా దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించిన సంఘ సంస్కర్త! ఆంధ్రా గాంధీలా స్వాతంత్ర్య పోరాటం చేసిన యోధుడు! మదరాసీల నుండి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహారదీక్ష చేసి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారికి, 58 అడుగుల విగ్రహం, స్మారక కేంద్రం, స్మృతివనం కోసం… ప్రజా రాజధాని అమరావతిలో, లోకేష్ వేసిన మొట్టమొదటి పునాది రాయి ఇది. మన భావితరాలకు గుర్తుంచుకోవాల్సిన అమరజీవి విగ్రహానికి అంతర్జాతీయ స్థాయి అమరావతిలో సముచితమైన గౌరవం. ఇది ఆంధ్రులకు గర్వకారణం

ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ కార్యాలయాల్లో ఆధార్ సేవా కేంద్రాలు

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కీలక నిర్ణయం మేరకు ఆధార్ సీడింగ్ సేవలను గ్రామ స్థాయిలోనే అందించే విధంగా చర్యలు రైతులకు, సామాన్య ప్రజలకు వేగవంతమైన సేవలందించాలన్న లక్ష్యంతో అన్నదాతల కోసం అభివృద్ధికి మరో అడుగు చంద్రన్న పాలనలో ప్రజలకే ప్రాధాన్యం నూతన సేవలతో నూతన ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

క్రైమ్

కోర్టులో ప్రాక్టీస్ చేయని న్యాయవాదులు లైసెన్స్ వదులుకోవాలి.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ ఒడిశా రాష్ట్ర బార్ కౌన్సిల్ కోర్టుల్లో న్యాయవాద వృత్తి చేయకుండా,ఇతర వృత్తుల్లో, వ్యాపారాల్లో లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్న న్యాయవాదులు తమ ప్రాక్టీస్ లైసెన్స్‌ను ఒక నెలలోపు సర్పెండర్ చేయాలని ఒడిశా బార్ కౌన్సిల్ ఆదేశించింది. కొంతమంది న్యాయవాదులు ప్రైవేట్ కంపెనీలు,ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని,అలాగే వ్యాపారాల్లో నేరుగా పాల్గొంటున్నారని, అయినప్పటికీ,తమ దగ్గర న్యాయవాద వృత్తి చేసేందుకు లైసెన్స్ ఉంచుకుంటున్నారని ఒడిశా బార్ కౌన్సిల్ ముందు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ఇలా చేయడం Advocates Act,1961 నిబంధనలకు విరుద్ధమని ఒడిశా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం…. అడ్వకేట్ నేరుగా వ్యాపారం చేయరాదు. అయితే,ఒక వ్యాపార సంస్థలో Sleeping Partner (రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనని భాగస్వామి)గా ఉండవచ్చు కానీ ఆ వ్యాపారం స్వభావం న్యాయవాద వృత్తి గౌరవానికి విరుద్ధంగా ఉండకూడదు. న్యాయవాది ఒక కంపెనీకి డైరెక్టర్ లేదా ఛైర్మన్‌గా ఉండవచ్చు.అయితే,ఎలాంటి ఎగ్జిక్యూటివ్ విధులు (రోజువారీ పాలన/నిర్వహణ పనులు) చేయరాదు. న్యాయవాది Managing Director లేదా Secretaryగా పనిచేయరాదు. న్యాయవాది ఒక పూర్తి సమయ జీతభత్య ఉద్యోగిగా ఎవరైనా వ్యక్తి, కంపెనీ,ఫర్మ్, ప్రభుత్వ సంస్థ,కార్పొరేషన్ వద్ద పనిచేయరాదు.ఒకవేళ అలాంటి ఉద్యోగం స్వీకరిస్తే,వెంటనే సంబంధిత బార్ కౌన్సిల్‌కు తెలియజేయాలి.ఉద్యోగంలో ఉన్నంతకాలం ఆయన న్యాయవాద వృత్తి చేయరాదు. అన్ని జిల్లాల బార్ అసోసియేషన్లకు లేఖలు పంపి, న్యాయవాద వృత్తి చేయని న్యాయవాదులు లైసెన్స్ వదలకపోతే,వారిపై చర్యలు తీసుకోవాలని ఒడిశా బార్ కౌన్సిల్ ఒడిశా రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ లను సూచించింది. లైసెన్స్ వదలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా బార్ కౌన్సిల్ ఆదేశించింది. ఇలాంటి చర్యల్ని మన ఏపీ బార్ కౌన్సిల్ ఎందుకు తీసుకో కూడదు..? అని కొంత మంది న్యాయవాదులు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.